
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన ఏషియన్ పవర్ లిఫ్టర్ చంద్రకళకు విశాఖపట్నానికి చెందిన గ్లాండ్ ఫార్మా సంస్థ మంగళవారం రూ.2 లక్షల ఆర్థికసాయం అందించింది. విజయవాడలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చంద్రకళ ఇప్పటివరకు మూడు ఏషియన్ గేమ్స్‌లో ఏడు పతకాలు సాధించింది.
జూన్‌లో కోయంబత్తూర్‌లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో చాంపియన్‌గా నిలిచిన ఆమె డిసెంబర్‌లో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆమెకు గ్లాండ్ ఫార్మా తరఫున సీనియర్ మేనేజర్ కె.గణేష్‌కుమార్ రూ.2 లక్షల చెక్కును రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ తనకు ఆర్థికసాయం అందజేసిన గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ యజమాని కెప్టెన్ రఘురామ్‌కి కృతజ్ఞతలు తెలిపారు.