హైదరాబాద్: తన మనవడికి తల్లిపాలు ఇవ్వకుండా అల్లుడు అడ్డుపడుతున్నాడని చంద్రకళ అనే బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు (మంగళవారం) బాలల హక్కుల సంఘంను ఆశ్రయించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అమెరికాలోని వర్జీనియాలో చంద్రకళ కూతురు శిరీష ఉంటోంది. ఆమెకు ఐదు నెలల బాబు ఉన్నాడు. అయితే, పుట్టినప్పటి నుంచీ బిడ్డకు తల్లిపాలు ఇవ్వకుండా అల్లుడు కీర్తిసాయిరెడ్డి అడ్డుకుంటున్నాడు. ఈ విషయంపై అతని తల్లి కూడా తల్లిపాలు బిడ్డకు ఇవ్వొద్దంటూ స్కైప్ ద్వారా మాట్లాడి చెప్పింది.
తన కూతురు శిరీషను వేధిస్తున్న ఆమె భర్త కీర్తిసాయిరెడ్డిపై చర్యలు తీసుకుని, తన మనవడికి తల్లిపాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దీనిపై బాలల హక్కుల సంఘం తరఫున అచ్యుతరావు మాట్లాడుతూ.. ఈ విషయంపై ఇప్పటికే అమెరికా కాన్సులేట్లతో మాట్లాడామన్నారు. వేధింపులకు పాల్పడుతున్న కీర్తిసాయిరెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలని కోరినట్లు తెలిపారు.
తల్లి పాలు ఇవ్వకుండా ఐదు నెలలుగా..!
Published Tue, Jan 17 2017 9:02 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM
Advertisement