షికాగో సెక్స్‌రాకెట్‌ .. ఎవరీ ABCDE? | Chicago sex racket : Affidavit out in social media   | Sakshi
Sakshi News home page

షికాగో సెక్స్‌రాకెట్‌ .. ఎవరీ ఏబీసీడీఈ?

Published Thu, Jun 21 2018 2:39 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

Chicago sex rocket : Affidavit out in social media   - Sakshi

చికాగో : తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించిన షికాగో సెక్స్‌ రాకెట్‌ కేసు రోజుకో కొత్తమలుపు తిరుగుతోంది. అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యురిటీ సాగిస్తున్న దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి అమెరికా పోలీసులు స్థానిక కోర్టులో దాఖలు చేసిన 40 పేజీల అఫిడవిట్‌ వెలుగులోకి వచ్చింది. ఆ అఫిడవిట్ పరిశీలిస్తే కోసు దర్యాప్తు పురోగతి, ఏ కోణంలో సాగుతోందన్న విషయం అవగతమవుతోంది. ప్రస్తుతం ఆ అఫిడవిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హల్‌ చల్‌ చేస్తోంది. ఈ సెక్స్ రాకెట్ లో భాగమైన కొందరి పేర్లు సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. ఆ అఫిడవిట్‌లో అమెరికా దర్యాప్తు అధికారులు పేర్కొన్న ఏ, బీ, సీ, డీ, ఈ ఎవరై ఉంటారని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. వీరితో పాటూ మొత్తం బాధిత 10 మంది హీరోయిన్ల జాబితా కూడా వైరల్‌ అవుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఈ రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.


                        అమెరికా పోలీసులు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌

సెక్స్‌ రాకెట్‌ డైరీలో ఏపీ మంత్రి ?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌కు సన్నిహితుడు, తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా(తానా) ప్రెసిడెంట్‌ వేమన సతీష్‌ను అమెరికా పోలీసులు పలుమార్లు విచారించారు. వేమన సతీష్ తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలకంగానే ఉంటారు. ఈ విషయంలో తానాకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా వినిపించాయి. అంతేకాకుండా సెక్స్ రాకెట్‌కు సంబంధించి వెలుగు చూసిన డైరీలో ప్రస్తుతం ఏపీలో అత్యంత కీలక శాఖను నిర్వహిస్తున్న మంత్రి పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఎంపీ పేరు కూడా అందులో ఉన్నట్టు సమాచారం. తీగలాగితే డొంకంత కదులుతున్నట్లు పలువురు రాజకీయ నాయకుల పేర్లు ఈ జాబితాలో ఉండటంతో అమెరికా తెలుగు సంఘాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.

అసోసియేషన్ల పేరుతో వీసాలు..
డబ్బు ఎరగా చూపి సినీతారలతో వ్యభిచారం చేయిస్తున్న కిషన్‌ మోదుగుమూడి, చంద్రకళ అనే భారతీయ దంపతులను అక్కడి షికాగో ఫెడరల్‌ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఇప్పటివరకూ పలువురు నటీమణుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. నిందితుల మొబైల్ ఫోన్ సంభాషణల విశ్లేషణ కొనసాగుతున్న నేపథ్యంలో మరింత మంది బాధితుల పేర్లు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారతీయ అసోసియేషన్ల కార్యాక్రమాల్లో పాల్గొనడానికంటూ సినీ తారలకు వీసాలు ఇప్పించి అమెరికాకు రప్పిస్తారని పోలీసుల విచారణలో తేలింది.

విచారణ జరిగిందిలా..
గత ఏడాది నవంబర్‌ 20న ఓ హీరోయిన్‌ ఢిల్లీ నుంచి షికాగో వెళ్లింది. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ కాలిఫోర్నియా నవంబర్‌18న ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆమె పాల్గొనాలి. కానీ ఆమె రెండు రోజులు ఆసల్యంగా వచ్చి కాలిఫోర్నియా బదులు చికాగోకు వెళ్లింది. దీంతో అనుమానంతో వచ్చి అధికారులు విచారించారు. తను మరో కార్యక్రమానికి హాజరయ్యానని ఆమె బదులిచ్చారు. ఏ ఈవెంట్‌లో పాల్గొన్నారని ప్రశ్నించగా నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పుకొచ్చింది. కానీ పోలీసుల విచారణలో ఆమె సంబంధిత ఈవెంట్‌లో పాల్గొనలేదని తేలింది. దాంతో ఆ నటిని అమెరికాకు రప్పించిన వ్యక్తి గురించి ఆరా తీశారు. ఆ వ్యక్తి పేరు రాజు అని ఉంది. అతని గురించి విచారించగా కిషన్‌ అనే వ్యక్తే రాజు అనే మారుపేరుతో ఆమెను రప్పించాడని తేలింది. దీంతో ఆ నటి వీసాను రద్దు చేశారు. అలాగే మరో నలుగురి నటీమణులను కూడా విచారించారు. వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులను విచారించిన అధికారులు గత కొన్ని సంవత్సరాలుగా ఆయా సంఘాల కార్యక్రమాలకు హాజరైన వారి వివరాలను మన దేశంలోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయాల నుంచి తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు టాప్ హీరోయిన్లకు ఈ వ్యభిచార రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన కిషన్, ఆయన భార్య చంద్రకళ వద్ద ఈ హీరోయిన్లతో సంభాషణలు జరిపినట్లు ఆధారాలున్నాయని చెపుతున్నారు.

విచారణకు సహకరిస్తాం : సతీష్‌ వేమన
సినీతారల వ్యభిచారం కేసుకు అమెరికాలోని తెలుగు సంఘాల ఆర్గనైజర్లతో సంబంధాలున్నాయని వస్తున్న వార్తలపై తానా ప్రెసిడెంట్‌ సతీష్‌ వేమన స్పందించారు. నిందితులతో తానాకు ఎలాంటి సంబంధంలేదని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో నిందితులు డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి, నఖిలీ ఆహ్వాన పత్రికలు సృష్టించినట్టు తెలుస్తోందన్నారు. కొన్నింటిలో తానా పేరును వాడి, అక్రమ మార్గాల్లో అమెరికా వీసా పొందారన్నారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యురిటీ(డీహెచ్‌ఎస్‌) ఈ కేసు విచారణ ముమ్మరం చేసిందని, వారికి తానా పూర్తిగా సహకరిస్తున్నట్టు వెల్లడించారు. నిందితులు తానా పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించిన తీరును వారికి వివరించినట్టు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement