సాక్షి, హైదరాబాద్: సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు నర్రెడ్డి శివరామిరెడ్డి గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను సోమాజీగుడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉండి శివరామిరెడ్డి చికిత్స పొందుతున్నారు. వైఎస్సార్ జిల్లా గడ్డం వారి పల్లెలో పుట్టిన నర్రెడ్డి శివరామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఒకరు. 1957లో కమలాపురం-పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా నర్రెడ్డి శివరామిరెడ్డి పనిచేశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. గతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment