shivaram reddy
-
కమ్యూనిస్ట్ నాయకుడు శివరామిరెడ్డికి తీవ్ర అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు నర్రెడ్డి శివరామిరెడ్డి గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను సోమాజీగుడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉండి శివరామిరెడ్డి చికిత్స పొందుతున్నారు. వైఎస్సార్ జిల్లా గడ్డం వారి పల్లెలో పుట్టిన నర్రెడ్డి శివరామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఒకరు. 1957లో కమలాపురం-పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా నర్రెడ్డి శివరామిరెడ్డి పనిచేశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. గతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు. -
కేశవ్.. నీటి రాజకీయాలు మానుకో...
అనంతపురం, ఉరవకొండ రూరల్: ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ నీటి రాజకీయాలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్సీ చీఫ్‌విప్, వైఎస్సార్సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు వై.శివరాంరెడ్డి హితవు పలికారు. కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి చెరువులకు, కుంటలకు నీళ్లిచ్చి రైతులను మభ్యపెట్టడం కాకుండా చేతనైతే జీబీసీ, హెచ్ఎల్సీ ఆయకట్టు రైతులకు సాగునీరు ఇప్పించాలన్నారు. మండల పరిధిలోని జీరోబైజీరో హెడ్ వద్ద జీబీసీ కెనాల్‌ను శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ప్రణయ్కుమార్రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడారు. కెనాల్లో నీటిప్రవాహం తగ్గడం వల్ల వ్యవసాయానికి వచ్చే 300 క్యూసెక్కుల నీటివాటాను సక్రమంగా ఇవ్వకపోవడంతో చివరి ఆయకట్టు రైతులకు నీరు అందలేదన్నారు. మిరప, పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చేసి జీబీసీ షట్టర్లను ఎత్తి ఎక్కువ నీరు విడుదల చేయడం జరిగిందన్నారు. అనంతరం వారు విడపనకల్, ఉరవకొండకు సంబంధించిన ఆయకట్టు రైతుల సమక్షంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. శివరాంరెడ్డి మాట్లాడుతూ ముందే ఉరవకొండ, విడపనకల్ మండలాలకు సంబంధించిన చివరి ఆయకట్టు భూములకు నీటిని తప్పనిసరిగా విడుదల చేయాలన్నారు. డిసెంబర్ 15వ తేదీ తర్వాత నీటి విడుదలను నిలిపేస్తే పంటలు ఎండిపోయే పరిస్తితి ఉన్నందున ఆ తర్వాత కూడా కనీసం 20 రోజులు అదనంగా నీరు విడుదల చేసేందుకు అధికారులు అనుమతి ఇవ్వాలని కోరారు. నాలుగేళ్ల నుంచి చెరువులకు నీరివ్వని పాలకులు నాలుగైదు నెలల్లో ఎన్నికలున్నందున దొంగ ఆర్భాటాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేశవ్ దొంగ ప్రచారాలు మాని ప్రజలకు పనికి వచ్చే పనులు చేయాలన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఉరవకొండలో పేదల ఇళ్లపట్టాల కోసం 88 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తే వాటిని ఇంతవరకు పేదలకు పంచకుండా రాజకీయంగా అడ్డుపడుగున్నారని విమర్శించారు. ఆ స్థలాన్ని అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు ఒక్కొక్కరు 5 సెంట్ల చొప్పున ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా అధికారపార్టీ నాయకులు రాజకీయాలు మాని ప్రజలకు సేవచేయాలని, లేదంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎర్రిస్వామిరెడ్డి, గోపాల్‌రెడ్డి, దాదు, బసవరాజు, నిరంజన్, ఓబన్న, గోవిందు, వెంకటేశులు, అనుమప్ప, హఫీజ్, ఈడిగప్రసాద్, సత్యన్న, ఓబుళేసు, ఎర్రిస్వామి, రఘు, యువజన విభాగం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సురేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో దొర్నిపాడు ఆర్ఐ, వీఆర్ఓ
దొర్నిపాడు : లంచం తీసుకుంటూ దొర్నిపాడు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, దొర్నిపాడు వీఆర్ఓ పుల్లారెడ్డి శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కర్నూలు ఏసీబీ డీఎస్పీ మహబూబ్‌బాష తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దొర్నిపాడులోని పయిడాల సుబ్బారెడ్డి కుమారుడు శివరామిరెడ్డి 925-1 సర్వే నెంబర్లో 5.30 ఎకరాలు మెట్టపొలం సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 1994లో 2 ఎకరాల పొలం తన భార్య పి.కళావతి పేరిట రిజిష్టర్ చేయించాడు.10 సంవత్సరాల తర్వాత పాస్‌బుక్‌లు, టైటిల్‌డీడ్స్ కోసం అప్పటి వీఆర్ఓ వెంకటస్వామి(ప్రస్తుతం ఆర్ఐ), వీఆర్ఓ పుల్లారెడ్డిని అడగడంతో కొంతకాలంగా రూ.5 వేలు ఇస్తేనే పట్టాదారుపాస్‌బుక్‌లు. టైటిల్‌డీడ్స్ ఇస్తామని చెప్పారు. డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పుకున్నప్పటికి కనికరించకుండా తిప్పుకోవడంతో చివరకు రూ2000కు ఒప్పందం చేసుకున్నారు. విసుగు చెందిన శివరామిరెడ్డి చివరకు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఏసీబీ అధికారులు వల పన్నారు. తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా సర్కిల్ఇన్స్పెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డితో కలిసి టీకొట్టు వద్ద మాటువేశారు. రైతు శివరామిరెడ్డి డబ్బు తెచ్చి ఆర్ఐను సంప్రదించగా వీఆర్ఓ పుల్లారెడ్డికి ఇవ్వాలని సూచించడంతో రైతు వెంటనే వీఆర్ఓ పుల్లారెడ్డికి అందిస్తుండగా వెంటనే ఏసీబీ అధికారులు అప్రమతమై లంచం తీసుకుంటున్న వీఆర్ఓను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆర్ఐ వెంకటస్వామి కార్యాలయం వెనుకవైపు నుండి పారిపోయాడు. పరారీలో వున్న ఆర్ఐతోపాటు వీఆర్ఓపై కేసు నమోదు చేసిన ట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు.