
యశోద ఆస్పత్రిలో భాగ్యమ్మ మృతదేహం వద్ద సెల్యూట్ చేస్తున్న సెక్యూరిటీ వింగ్, వైద్యులు, సిబ్బంది
జనగామ: తను చనిపోతూ అవయవదానంతో పలువురికి పునర్జన్మ ఇచ్చింది భాగ్యమ్మ. ఆ కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని హర్షిస్తూ ఆస్పత్రి సిబ్బంది అందరూ సెల్యూట్ చేశారు. జనగామ మండలం పెంబర్తికి చెందిన చల్ల భాగ్యమ్మ (48) తండ్రి అంత్యక్రియల నిమిత్తం ఈనెల 19న తన కుమారుడితో కలిసి బైక్‌పై యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రేణిగుంటకు బయల్దేరింది. మార్గమధ్యలో కొలనుపాక వద్దకు రాగానే హైబీపీతో భాగ్యమ్మ కిందపడిపోయింది. తలకు గాయమై అపస్మారక స్థితికి చేరగా ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లగా..చికిత్స పొందుతూ శనివారం ఆమె మృతిచెందింది. కుటుంబ సభ్యుల అనుమతి మేరకు అవయవాలను ఆస్పత్రి నిర్వాహకులు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment