ప్రమాదాల నివారణ అందరి బాధ్యత | accidents controlling is our responsbility | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణ అందరి బాధ్యత

Published Mon, Aug 1 2016 11:37 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ప్రమాదాల నివారణ అందరి బాధ్యత - Sakshi

ప్రమాదాల నివారణ అందరి బాధ్యత

  • ఎస్పీ విక్రజిత్‌ దుగ్గల్‌
  • ఆర్టీసీలో ప్రమాద రహిత వారోత్సవాల ముగింపు
  • ఉత్తమ డ్రైవర్లకు సత్కారం
  • ఆదిలాబాద్‌ కల్చరల్‌ : ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని, ఇందుకు సమష్టిగా MSషి చేయాలని ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ప్రమాదరహిత వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై ప్రసంగించారు. ఉత్తమ డ్రైవర్లుగా ఎంపికైన వారు భవిష్యత్తులో వచ్చే కొత్త డ్రైవర్లకు ఆదర్శంగా నిలవాలని, వారి అనుభవాలను వారికి బోధించాలని చెప్పారు. దీంతో అది ప్రమాదాల నివారణకు దోహదపడుతుందనివివరించారు. ప్రమాదాల జరిగినప్పుడు నిజనిర్ధారణ చేసి బాధ్యులను మాత్రమే శిక్షిస్తామన్నారు. ప్రమాదాల జరిగినప్పుడు వాటిని నివారించాలంటే ప్రభుత్వ శాఖలు అన్నీ కలిసి MSషి చేస్తేనే సాధ్యపడుతుందని తెలిపారు. ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా నిబంధనలు పాటించి, ట్రాఫిక్‌ ఆంక్షలకు అనుగుణంగా ఉంటే వాటితో మేలు జరుగుతుందన్నారు. ఆర్టీసీకి పోలీస్‌ శాఖ నుంచి అండదండలు ఉంటాయని పేర్కొన్నారు. బస్‌భవన్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ నిబంధనలు పాటిస్తూ ఆర్టీసీ డ్రైవర్లు వాహనాలను నడపాలని, సెల్‌ఫోన్‌లు వాడుతూ, నిర్లక్ష్యంగా నడపడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటాయని వివరించారు. ఏకాగ్రతతో వాహనాలను నడిపి, ఆర్టీసీపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింతగా బలపర్చాలన్నారు. ఉత్తమ డ్రైవర్లకు గుర్తింపు ఉంటుందని చెప్పారు. అనంతరం ‘డ్రైవరన్నా.. జాగ్రత్త’ అనే నినాదంతో తయారు చేయించిన ఫ్లెక్సీలను ఆవిష్కరించారు. ఎంవీఐ శ్రీనివాస్, ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ విజయ్‌కుమార్, డిప్యూటీ సీటీఎం శరత్‌ప్రసాద్, డిప్యూటీ సీఎంఈ మధుసూదన్, ఆదిలాబాద్‌ డీఎం సాయన్న తదితరులు పాల్గొన్నారు.
    ఉత్తమ డ్రైవర్లు వీరే..
    రాష్ట్రస్థాయిలో ఉత్తమ డ్రైవర్‌గా ఎంపికైన ఎండీ రఫీని సత్కరించారు. వీరితో పాటు డివిజన్‌ స్థాయిలో పలుమార్లు అవార్డులు అందుకున్న ఉత్తమ డ్రైవర్లను సత్కరించారు.
    రీజినల్‌ స్థాయిలో..
    ప్రథమ ఉత్తమ డ్రైవర్‌గా మంచిర్యాల డిపోకు చెందిన ఎండీ ఇక్బాల్‌ అహ్మద్, ద్వితీయ ఉత్తమ డ్రైవర్‌గా నిర్మల్‌ డిపోకు చెందిన ఎన్‌.గంగాధర్, ™lతీయ ఉత్తమ డ్రైవర్‌గా మంచిర్యాలకు చెందిన ఎండీ.ఇంతియాజుద్దీన్‌ ఎంపికయ్యారు.
    డిపోల స్థాయిలో...
    ఆదిలాబాద్‌ డిపో పరిధిలో ప్రథమ, ద్వితీయ, ™lతీయ స్థానాలకు కె.వి.స్వామి, ఆర్‌.చంద్రు, ఎంఏ రషీద్, ఆసిఫాబాద్‌ పరిధిలో ఎండీ.గౌస్, ఎస్‌కె.మహెబూబ్, కలీమ్, భైంసా పరిధిలో ఎ.వాహబ్, ఎంఏ.జబ్బర్, మహబూబ్‌ఖాన్‌ు, మంచిర్యాల పరిధిలో ఎల్‌ఆర్‌.రెడ్డి, వి.మహేందర్, ఎండీ.కర్నల్, నిర్మల్‌ పరిధిలో ఏజీ.రాజం, ఎస్‌.ముజాహిద్, ఎన్‌.రాజన్న, ఉట్నూర్‌ పరిధిలో జీజీ.సింగ్, సాధిక్‌అలీ, కె.సాహెబ్‌రావు ఉత్తమ డ్రైవర్లుగా ఎంపికయ్యారు. ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్, ఎంవీఐ శ్రీనివాస్, విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ జేడీ వెంకట్‌రావు, ఆర్‌ఎం విజయ్‌కుమార్‌లు వీరిని శాలువా, ప్రశంస పత్రాలతో సత్కరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement