ముంబై: గడ్జిరోలి జిల్లాలోని గిరిజనుల జీవితాల్లో చీకట్లు నింపొద్దంటూ రాష్ట్ర హోంమంత్రి ఆర్‌ఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలను శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే సమర్థించారు. హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు గిరిజనుల మనోభావాలను ప్రతిబింబించేలా ఉన్నాయంటూ కొనియాడారు. డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ కుతంత్రాలకు లొంగిపోకుండా ఆర్‌ఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఆయనలోని నిజాయతీని చాటాయని శుక్రవారం శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’లో ప్రచురితమైన సంపాదకీయంలో ఉద్ధవ్ పేర్కొన్నారు.
అప్పుడప్పుడూ తప్పుడు వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో ఇరుక్కుంటాడనే పేరు పాటిల్‌కు ఉందని, అయితే గిరిజనులకు విద్యుత్ కనెక్షన్‌ను తొలగించే విషయంలో పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఆయనలోని సమస్య తీవ్రతను తెలియజెప్పాయన్నారు. గడ్చిరోలి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో బిల్లు చెల్లించనివారి విద్యుత్ కనెక్షన్‌ను తొలగించాలంటూ విద్యుత్‌శాఖ మంత్రి అజిత్‌పవార్ చేసిన వ్యాఖ్యలను ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో పాటిల్ తప్పుబట్టిన విషయం తెలిసిందే.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన గిరిజన గ్రామాల్లో విద్యుత్ కనెక్షన్లను తొలగించడంవల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని, విద్యుత్ కనెక్షన్ల తొలగించడం నుంచి గిరిజనులను మినహాయించాలని అజిత్‌ను కోరారు. దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు కేంద్రం ఓవైపు ఏర్పాట్లు చేస్తుంటే రాష్ట్రంలో ఇలా బిల్లుల పేరుతో కనెక ్షన్లను తొలగించడం సరికాదన్నారు. ఈ విషయంలో పాటిల్ వాదనతో ఉద్ధవ్ ఏకీభవించారు. అయితే కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారని, ప్రజల సమస్యలను అపహాస్యం చేశారని ఉద్ధవ్ విమర్శించారు. ప్రజలను అపహాస్యం చేస్తున్న ఎన్సీపీ నేతలు కూడా భవిష్యత్తులో నవ్వులపాలు కాక తప్పదని జోస్యం చెప్పారు. కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులను ఎగవేస్తున్న వారి ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
మీరూ నవ్వులపాలవుతారు!
Published Sat, Nov 2 2013 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM
Advertisement
Advertisement