‘సోషల్ మీడియా దుర్వినియోగంపై చర్యలు’ | actions on social media websites | Sakshi
Sakshi News home page

‘సోషల్ మీడియా దుర్వినియోగంపై చర్యలు’

Published Mon, Jun 9 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

‘సోషల్ మీడియా  దుర్వినియోగంపై చర్యలు’

‘సోషల్ మీడియా దుర్వినియోగంపై చర్యలు’

ముంబై: సామాజిక వెబ్‌సైట్లలో అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి ఆర్‌ఆర్ పాటిల్ హెచ్చరించారు. కేవలం అప్‌లోడ్ చేసినవారిపై మాత్రమే కాకుండా వాటిని లైక్ చేసినవారిపై, షేర్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పుణేలోని హడప్సర్‌లో సాఫ్ట్‌వర్ ఇంజనీర్ మొహసిన్ హత్యకేసు నేపథ్యంలో పాటిల్ ఈ హెచ్చరికలు చేశారు.
 
సోషల్ మీడియాను ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఉపయోగిస్తున్నారని, మంచికి ఉపయోగపడాల్సిన దానిని ఇలా దుర్వినియోగం చేస్తే ఊరుకునేదిలేదన్నారు. మొబైల్ ఫోన్‌ను దుర్వినియోగం చేసినా కూడా సదరు ఫోన్ యజమానిపై చర్యలు తప్పవన్నారు. ఇందుకు ఏవైనా చట్టాలు అవసరమైతే వాటిని రూపొందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement