విజ్ఞాన ప్రదర్శనలో ఎంపీ కపిల్ పాటిల్
భివండీ, న్యూస్‌లైన్: ప్రపంచానికి ఏదైన కొత్తదనాన్ని ఇవ్వాలనే దృఢ సంకల్పంతో విద్యార్థులు ప్రయోగాలు చేయాలని, అప్పుడే దేశం పురోగతి చెందుతుందని భివండీ ఎంపీ కపిల్ పాటిల్ అన్నారు. పంచాయితీ సమితి భివండీ శిక్షణ్ విభాగం ఆధ్వర్యంలో పద్మశాలి ఇంగ్లిష్ మీడియం స్కూల్, జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన విజ్ఞాన ప్రదర్శన 2014-15 ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ ప్రదర్శన మంగళవారం కూడా ఉంటుంది.
ఇందులో భివండీ తాలూకా పరిధిలో ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులు పాల్గొని బయో గ్యాస్ ప్రాజెక్టు, సౌర విద్యుత్, పర్యావరణ పరిరక్షణ, మద్యపాన నిషేధం,వాననీటి సంరక్షణ తదితర అంశాలను ప్రదర్శించారు. ప్రదర్శనలను తిలకించిన ఎంపీ కపిల్ పాటిల్, ఎమ్మెల్యేలు రుపేష్ మాత్రే, మహేశ్ చౌగులే, రామనాథ్ మోరే, భివండీ మేయర్ తుషార్ చౌదరి తదితరులు విద్యార్థులను ప్రశంసించారు.
ఉత్తమ విజ్ఞాన ప్రదర్శన చేపట్టిన విద్యార్థులకు మంగళవారం సాయంత్రం బహుమతులు అందజేయనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను తెలుగు శిక్షణ్ సంస్థ ట్రస్టీలు భైరి రామస్వామి, అధ్యక్షులు గుండ్ల శంకర్, చైర్మన్ డాక్టర్ పాము మనోహర్, కళ్యాణపు భూమేష్ తదితరులు పర్యవేక్షించారు.
కొత్త ప్రయోగాలతోనే పురోగతి
Published Mon, Dec 29 2014 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM
Advertisement