![YSRCP MP Margani Bharat Comments On TDP MPs - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/28/margani-bharat.jpg.webp?itok=gmLi1EuN)
సాక్షి, ఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాట్లాడే స్థాయి టీడీపీ ఎంపీలకు లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. సోమవారం ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మీడియా సమావేశంలో మాట్లాడారు. మార్గాని భరత్ మాట్లాడుతూ, సీఎంపై అవాకులు చవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు.
చదవండి: సంక్షేమ స్ఫూర్తి.. పంజాబ్‌లోనూ ఏపీ తరహా పథకం..
‘‘నవరత్నాల పథకాలతో ప్రజలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఫలాలను టీడీపీ ఓర్చుకోలేకపోతోంది. టీడీపీది నవరంధ్రాల నవ రోదనలు. లక్షా 75 వేల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు చేశాం. వాడవాడలా బెల్టు షాపులు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని’’ మార్గాని భరత్ దుయ్యబట్టారు. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోరుకోవడం లేదా?. ముఖ్యమంత్రిపై దుర్బాషలాడడం మానుకోవాలని హితవు పలికారు. వైఎస్ జగన్ పాలనలో ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని.. సంక్షేమ పథకాల వల్లే ఇది సాధ్యమని ఎంపీ మార్గాని భరత్ అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ ఎంపీలు పక్కనపెట్టారు: ఎంపీ గోరంట్ల మాధవ్
గత ఎన్నికలో టీడీపీకి చావు తప్పి కన్ను లొట్ట పోయిందని.. ముగ్గురు టీడీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టారని వైఎస్సార్‌సీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ధ్వజమెత్తారు. చచ్చిన పార్టీని బతికించుకోవడానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎంపీలను మాతో కలిసి రమ్మంటే రాలేదు. ఓటుకు నోటు కేసులో పరారై విజయవాడకు వెళ్లిపోయారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని చెప్పిన నీచుడు చంద్రబాబు అని గోరంట్ల మాధవ్ నిప్పులు చెరిగారు.
టీడీపీ ఎంపీలు ఏనాడూ కేంద్రంతో పోరాడలేదు: ఎంపీ బెల్లాన
టీడీపీ ఎంపీలు ఏనాడూ కేంద్రంతో పోరాడి రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయలేదని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మండిపడ్డారు. విశాఖ పాలన రాజధానిగా వస్తే ఉత్తరాంధ్ర బాగుపడుతుందని చంద్రశేఖర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment