
న్యూఢిల్లీ: తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. సోమవారం సభ్యులంతా తప్పనిసరిగా సభకు హాజరుకావాలని సూచించింది. వాయిదాపడేదాకా సభలోనే ఉండాలని పేర్కొంది.
కీలకమైన ఢిల్లీ బిల్లుపై సోమవారం రాజ్యసభలో చర్చ, ఓటింగ్ జరిగే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ తన సభ్యులకు విప్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్‌మెంట్) బిల్లు–2023’ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.