Delhi Ordinance Bill In Rajya Sabha Updates - Sakshi
Sakshi News home page

రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లు.. వైఎస్సార్‌సీపీ మద్దతు.. ఆప్‌ తానాషాహీ పార్టీ

Published Mon, Aug 7 2023 2:20 PM | Last Updated on Mon, Aug 7 2023 9:35 PM

Delhi Ordinance Bill In Rajya Sabha Updates - Sakshi

Delhi Ordinance Bill LIVE

► ఢిల్లీ ఆర్డినెన్స్‌బిల్లుకు రాజ్యసభ సభ్యులు, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గగోయ్‌ పూర్తి మద్దతు ప్రకటించారు. 


ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లుపై రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. ‘ఇండియా కూటమి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ తానా షాహీ పార్టీ. ఢిల్లీ ఒక్క ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందింది కాదు.. దేశ ప్రజలకు చెందింది.ఈ బిల్లుకు వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తోంది. రాజ్యాంగానికి లోబడే బిల్లు.. అందుకే మద్దతు తెలిపాం’ అని అన్నారు.

► రాష్ట్ర అధికారాలను లాక్కోవడమే ఈ బిల్లు ఉద్దేశం. వాజ్‌పేయి, అద్వానీ ఆశయాలకు వ్యతిరేకంగా ఉంది ఈ బిల్లు: ఆప్‌

► బిల్లు రాజ్యాంగ విరుద్ధం.. ఫెడరల్‌ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంది: కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ సింఘ్వీ

సాక్షి, ఢిల్లీ: వివాదాస్పదమైన ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లు ఇవాళ(సోమవారం, ఆగష్టు7) పెద్దల సభకు చేరింది. రాజ్యసభలో ఈ బిల్లను  ప్రవేశపెట్టారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. వెంటనే కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ సింఘ్వీ బిల్లుపై చర్చను ప్రారంభించారు.

ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర సర్కారు మే 19న తెచ్చిన ఈ ఆర్డినెన్స్‌ బిల్లు.. లోక్‌సభలో విపక్షాల నినాదాల నడుమ పాస్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్యసభలో కీలకం కానుంది. రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 110 మంది ఎంపీలే ఉన్నారు. కాంగ్రెస్‌సహా అన్ని విపక్ష పార్టీలు కలుపుకుని 128 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో.. పెద్దల సభలో బిల్లును ఎలాగైనా ఓడించాలనే ధీమాతో విపక్ష ఇండియా కూటమి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement