
మేడ్చల్ రూరల్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ శుక్రవారం భేటీ అయ్యారు. మేడ్చల్ మండలం పూడూర్ గ్రామ పరిధిలోని ఈటల నివాసానికి మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో వచ్చిన రాములు నాయక్ గంటన్నరకు పైగా ఆయనతో సమావేశం అయ్యారు.
అనంతరం 3 గంటలకు ఈటల బయటకు వచ్చి కార్యకర్తల సమావేశంలో పాల్గొనగా.. రాములు నాయక్ సాయంత్రం 4 గంటలకు వెళ్లిపోయారు.