న్యూఢిల్లీ: స్వాతంత్య్రం వచి్చన నాటినుంచి 2014 దాకా మన దేశం నానా రకాల మానసిక అడ్డంకులతో సతమతమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి నిజమైన, ఊహాత్మక, అతిశయోక్తులతో కూడిన అన్ని అడ్డంకులనూ అధిగమించాం. అద్భుతమైన, అభివృద్ధి చెందిన, ప్రగతిశీల భారతానికి తిరుగులేని రీతిలో బలమైన పునాదులు వేశాం‘ అని ప్రకటించారు.
అందుకే 2024 సాధారణ ఎన్నికల్లో ప్రజలు కూడా అన్ని అడ్డంకులనూ కూలదోసి బీజేపీకే మద్దతిస్తారని ధీమా వెలిబుచ్చారు. ఫలితాలు కూడా అన్ని అడ్డంకులనూ దాటుకుని వస్తాయన్నారు. నిజానికి కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతమే మన దేశం పాలిట నిజమైన అడ్డంకులుగా నిలిచాయన్నారు. వాటిని కూలదోయడంతో సామాన్యుడు సాధికారత సాధించాడని ప్రధాని చెప్పారు. శనివారం ఆయన హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్‌లో మాట్లాడారు.
2047లో సమిట్ థీమ్ ’భారత్ అభివృద్ధి చెందింది: ఇప్పుడేంటి?’ అని ఉండబోతోందని చమత్కరించారు. ‘జమ్మూ కశీ్మర్లో ఆరి్టకల్ 370ని రద్దు చేస్తే ఆకాశం విరిగి పడుతుందనేలా కొందరు లేనిపోని భయాందోళనలు కలిగించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ చర్యతో కశీ్మర్లో ఉగ్రవాదం అంతమవుతోంది. పర్యాటకం బ్రహా్మండంగా పెరుగుతోంది‘ అని మోదీ చెప్పారు.
‘అప్పట్లో కశీ్మర్లో ఉగ్రదాడులు జరిగినప్పుడల్లా భారత్ అంతర్జాతీయ సమాజం మద్దతు కోసం చూసేది. కానీ, అప్పట్లో సరిహద్దుల ఆవలి నుంచి నిత్యం ఆ దాడులను ప్రేరేపించినవారు ఇప్పుడు సాయం కోసం అంతర్జాతీయ సమాజం కేసి చూడాల్సిన పరిస్థితులు వచ్చాయి‘ అంటూ పాకిస్తాన్‌కు మోదీ చురకలు వేశారు. మంచి రాజకీయాలు మంచి ఆర్థిక విధానాలు కలిసి సాగగలవని తాము రుజువు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment