hindustan times
-
మన సమస్యకు మనమే పరిష్కర్తలం!
అరుదుగానైనా సరే, తలలు కూలుతున్న శబ్దం మధురంగా వినిపిస్తుంది. మలయాళ చలనచిత్ర పరిశ్రమలో మహిళలపై ప్రబలంగా జరుగుతున్న లైంగిక, ఇతర వేధింపులపై సంచలన నివేదిక విస్ఫోటనం తర్వాత మొదటి వేటు నటుడు సిద్ధిక్, నిర్మాత రంజిత్‌లపై పడింది. సిద్ధిక్‌పై లైంగికదాడి అభియోగాలు మోపారు. ఇకపోతే సీపీఎం ఎమ్మెల్యే, నటుడు ముఖేష్ అరెస్టు నుండి తప్పించుకోవడానికి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.కొందరు దీనిని మలయాళ చిత్రపరిశ్రమలో ‘మీ టూ’ ఉద్యమంగా అభి వర్ణిస్తున్నారు. కచ్చితంగా, మాలీవుడ్‌లో మహిళల పని పరిస్థితులపై జస్టిస్ కె.హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత నెలకొన్న సంఘటనలు పరిశ్రమ నియంత్రణను దాటిపోయాయి. 2019 డిసెంబరు నుండి నివేదికను తొక్కిపట్టి ఉంచిన పినరయి విజయన్ ప్రభుత్వం కూడా ఈ నివేదిక పేర్కొన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని ప్రకటించింది.కోల్‌కతాలో ట్రెయినీ డాక్టర్ ఘోర హత్యాచారంపై చెలరేగుతున్న ఆగ్రహ జ్వాలలకు ప్రతిస్పందనగా కొచ్చిలో రణగొణధ్వనులు వినిపిస్తున్నప్పుడు మనం ఒక పెను మార్పు మలుపులో ఉన్నాము. బద్లాపూర్(మహారాష్ట్ర)లో ప్రజల ఆగ్రహం బాంబే హైకోర్టు విచారణకు దారితీసినప్పుడు, అబ్బాయిల లింగపరమైన సున్నితత్వంతో సహా కొన్ని సూచనలు చేయమని హైకోర్టు ఒక కమిటీని కోరింది.ఇదంతా స్వాగతించదగినదే. అయితే ఇదంతా మనం ఇంతకు ముందే విన్నాం. 2018లో, భారత దేశంలో మీ టూ ఉద్యమం సమయంలో, లైంగిక దాడి ఆరోపణలు తగ్గుముఖం పట్టడంతో మనం ఒక అవకాశాన్ని కోల్పోయాము అని ఉద్యమకారులు అంటారు. ఎందుకంటే ఆరోపణలకు సంబంధించి పెద్ద్ద పేర్లు ఎన్నడూ బయటపడలేదు. దానికి తోడుగా,లైంగిక దాడి గురించి మాట్లాడిన వారిపై క్రిమినల్ పరువు నష్టం దావాలు తీవ్ర ప్రభావం చూపాయి.2013లో, మగవారి మనస్తత్వాలను మార్చే పనిపై గట్టిగా కృషి చేయకుండా, కఠినమైన చట్టాన్ని ఆమోదించడం ఒక్కటే సమస్యను పరిష్కరిస్తుందని భావించిన ప్పుడు మనం మళ్లీ పోరాటాన్ని కోల్పోయాము. ఇప్పుడు మనకు మరో అవకాశం వచ్చింది. కానీ తరువాత ఏమి జరుగుతుందనేది ‘మన’పైనే ఆధార పడి ఉంటుంది. లైంగిక ఆరోపణలకు గురైన వారి సినిమాలను ప్రేక్షకుల్లోని ‘మన’వారే విమర్శనారహి తంగా ఆబగా చూస్తున్నారు. నిశ్శబ్దాన్ని బద్దలుగొట్టి నోరెత్తే వారిని ట్రోల్ చేసి బెదిరించేవారు కూడా సోషల్ మీడియాలోని ’మన’వారే. శక్తిమంతులకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసే మహిళలను చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలో ఉన్న ‘మన’వారు కష్టపెడుతున్నారు. చలనచిత్ర విడుదలకు సంబంధించి సమయానుకూలంగా పీఆర్–ఆధారిత సమాచారాన్ని అందజేసే మీడియాలోని ‘మన’వారు జర్నలిజానికి సంబంధించిన క్లిష్టమైన ప్రశ్నలు వేటినీ అడగరు.మాట్లాడేవారు ఒంటరిగా లేరని తెలిసేలా, నిజం చెప్పే భారం మహిళలపై మాత్రమే పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ‘మన’పైనే ఉంది. అలాగే మహిళ లను లైంగికంగా వేటాడేవారిని జాతీయ చర్చల నుండి, బాక్సాఫీస్ నుండి, సాహిత్య వేడుకల నుండి మాత్రమే కాకుండా మన డ్రాయింగ్ రూముల్లో చర్చల నుండి కూడా దూరంగా ఉంచాలి. కోల్‌కతాలోని వైద్యులకు ఆగ్రహించే హక్కు ఉంది. అయితే నిరసనలు రాజకీయ రంగు పులు ముకున్నాయి. లైంగికదాడి చేసిన వారిని నెలాఖరులోగా ఉరిశిక్ష విధించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చేసిన ప్రకటనలు పరిష్కా రాన్ని కనుగొనే లక్ష్యంతో కాకుండా, ప్రజల ఆగ్రహాన్ని చల్లబర్చడం కోసమే చేసినట్లున్నాయి.తెగులు లేదా కుళ్లు అనేది వ్యవస్థాగతంగా ఉన్నప్పుడు, దానికి పరిష్కారం అనేది ‘ఇక్కడో రాజీనామా’, ‘అక్కడో కమిటీ ఏర్పాటు’ వంటి రూపాల్లో పాక్షికంగా, అవ్యవస్థీకృతంగా ఉండకూడదు. లైంగిక వేధింపులకు మనం ప్రత్యేకమైన, భిన్నమైన నేరాలుగా ప్రతిస్పందించడం మానేయాలి. మహిళలకు వ్యతిరేకంగా అసమానమైన శక్తి కొనసాగిస్తున్న విస్తృత దాడుల్లో భాగంగా వీటిని చూడాలి.మనకు అసమానతలపై పోరాడే ఉద్యమం అవసరం: బహిరంగ ప్రదేశాల్లో, పార్లమెంటులో, పోలీసు స్టేషన్లలో, పని ప్రదేశాల్లో, న్యాయవ్యవస్థలో ఎక్కువ మంది మహిళలు భాగం కావలసి ఉంది. సోదరీమణులు, కుమార్తెలుగా మాత్రమే ఉండిపోకుండా, మనం సమాన పౌరులం అనే ఆలోచనను సాధారణీకరించాల్సి ఉంది. మనకు ప్రస్తుతం ఒక అవకాశం ఉంది. దానిని స్వాధీనం చేసుకోవడం మనపైనే ఉంది. వ్యాసకర్త జెండర్ అంశాల రచయిత(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
Hindustan Times Leadership Summit: కోర్టు తీర్పులను చట్టసభలు పక్కన పెట్టజాలవు
న్యూఢిల్లీ: కోర్టు తీర్పుల విషయంలో చట్టసభలు ఏం చేయగలవు, ఏం చేయలేవనే విషయంలో స్పష్టమైన విభజన రేఖ ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘‘తీర్పులు ఏమైనా చట్టపరమైన లోపాలను ఎత్తి చూపితే వాటిని సవరించేందుకు, సరిచేసేందుకు చట్టసభలు కొత్త చట్టాలను చేయవచ్చు. అంతే తప్ప తీర్పులు తప్పనే అభిప్రాయంతో వాటిని నేరుగా, పూర్తిగా పక్కన పెట్టేయజాలవు’’ అని స్పష్టం చేశారు. శనివారం ఇక్కడ హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. పలు అంశాలపై తీర్పులిచ్చేటప్పుడు ప్రభుత్వ విభాగాల మాదిరిగా వాటిపై సమాజం ఎలా స్పందిస్తుందని న్యాయమూర్తులు ఆలోచించరన్నారు. వారు రాజ్యాంగ నైతికతకు కట్టుబడి పని చేస్తారే తప్ప ప్రజల నైతికతకు కాదని చెప్పారు. మన దేశంలో జడ్జిలకు ఎన్నిక జరగదన్నది లోపం కాదని, మన వ్యవస్థ తాలూకు బలమని సీజేఐ అన్నారు. ‘‘మన సుప్రీంకోర్టు ప్రజల కోర్టు. అమెరికా సుప్రీంకోర్టు ఏటా పరిష్కరించే కేసుల సంఖ్య కేవలం 80. కానీ మన సుప్రీంకోర్టు ఈ ఏడాది ఇప్పటికే ఏకంగా 72 వేల కేసులను పరిష్కరించింది. ప్రజలకు చేరువయే లక్ష్యంతో సుప్రీంకోర్టు తీర్పులను భారతీయ భాషల్లోకి అనువదింపజేస్తున్నాం. అలా ఇప్పటిదాకా 31 వేల తీర్పులను అనువదించారు’’ అని చెప్పారు. -
Hindustan Times Leadership Summit: మళ్లీ జనం మద్దతు మాకే
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం వచి్చన నాటినుంచి 2014 దాకా మన దేశం నానా రకాల మానసిక అడ్డంకులతో సతమతమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి నిజమైన, ఊహాత్మక, అతిశయోక్తులతో కూడిన అన్ని అడ్డంకులనూ అధిగమించాం. అద్భుతమైన, అభివృద్ధి చెందిన, ప్రగతిశీల భారతానికి తిరుగులేని రీతిలో బలమైన పునాదులు వేశాం‘ అని ప్రకటించారు. అందుకే 2024 సాధారణ ఎన్నికల్లో ప్రజలు కూడా అన్ని అడ్డంకులనూ కూలదోసి బీజేపీకే మద్దతిస్తారని ధీమా వెలిబుచ్చారు. ఫలితాలు కూడా అన్ని అడ్డంకులనూ దాటుకుని వస్తాయన్నారు. నిజానికి కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతమే మన దేశం పాలిట నిజమైన అడ్డంకులుగా నిలిచాయన్నారు. వాటిని కూలదోయడంతో సామాన్యుడు సాధికారత సాధించాడని ప్రధాని చెప్పారు. శనివారం ఆయన హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్‌లో మాట్లాడారు. 2047లో సమిట్ థీమ్ ’భారత్ అభివృద్ధి చెందింది: ఇప్పుడేంటి?’ అని ఉండబోతోందని చమత్కరించారు. ‘జమ్మూ కశీ్మర్లో ఆరి్టకల్ 370ని రద్దు చేస్తే ఆకాశం విరిగి పడుతుందనేలా కొందరు లేనిపోని భయాందోళనలు కలిగించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ చర్యతో కశీ్మర్లో ఉగ్రవాదం అంతమవుతోంది. పర్యాటకం బ్రహా్మండంగా పెరుగుతోంది‘ అని మోదీ చెప్పారు. ‘అప్పట్లో కశీ్మర్లో ఉగ్రదాడులు జరిగినప్పుడల్లా భారత్ అంతర్జాతీయ సమాజం మద్దతు కోసం చూసేది. కానీ, అప్పట్లో సరిహద్దుల ఆవలి నుంచి నిత్యం ఆ దాడులను ప్రేరేపించినవారు ఇప్పుడు సాయం కోసం అంతర్జాతీయ సమాజం కేసి చూడాల్సిన పరిస్థితులు వచ్చాయి‘ అంటూ పాకిస్తాన్‌కు మోదీ చురకలు వేశారు. మంచి రాజకీయాలు మంచి ఆర్థిక విధానాలు కలిసి సాగగలవని తాము రుజువు చేశామన్నారు. -
ఇండో–పసిఫిక్ ప్రపంచ మథనం
ఈ నెల మనం వరుసగా కొన్ని ప్రపంచస్థాయి సదస్సులను చూడబోతున్నాం. జీ7; దక్షిణ పసిఫిక్ దేశాలతో భారత్, అమెరికా సమావేశాలు వంటివి వీటిలో ముఖ్యమైనవి. ఈ క్రమంలో కొత్త పొత్తులు, భౌగోళిక రాజకీయ పోటీ, ప్రపంచ సమస్యలను పరిష్కరించడం కోసం పథకాల వంటివి చోటు చేసుకోనున్నాయి. జీ7 సభ్యదేశాలన్నింటితో సహకారం పెరుగుతున్న సమయంలో, 2019 నుంచి అతిథిగా హాజరవుతున్న భారత్... తాజాగా జీ7 దేశాల సదస్సులో పాల్గొననుంది. క్వాడ్‌లో అమెరికా, జపాన్ లతో; ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ (టీటీసీ) ద్వారా యూరోపియన్ యూనియన్ తో; బ్రిటన్, కెనడాలతో భారత్ ముందస్తు వాణిజ్య చర్చలు జరుపుతోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్ అంత ర్జాతీయ కార్యకలాపాలు, విస్తృతార్థంలో అంత ర్జాతీయ వ్యవస్థ మారుతున్న స్వభావాన్ని పట్టి చూపే పలు నాయకుల సదస్సులకు ఈ నెల సాక్షీభూతం కానుంది. మొత్తంగా అవి కొంత కాలంగా వ్యక్తమవుతున్న కొన్ని ధోరణుల కలయికను సూచిస్తాయి. వాణిజ్య, ఆర్థిక పరస్పర ఆధారిత విధానాలు, చైనా అంతర్జాతీయ పాత్ర, భారత్ అంతర్జాతీయ భాగస్వామ్యాల సాపేక్ష ప్రాధాన్యత, ప్రపంచ ప్రధాన రాజకీయ లోపాలు వంటివన్నీ నిర్మాణాత్మక మార్పులకు లోనయ్యాయి. అయితే, ఈ పరిణామాలు నిర్దిష్ట వ్యాఖ్యాతలతో పొసగడం లేదు. అవేమిటంటే, తప్పుడు సమానత్వా లకు అతుక్కు పోతున్న భారతీయులు. న్యూఢిల్లీతో సంబంధాలను క్రమం తప్పకుండా చిన్నచూపు చూస్తున్న అమెరికన్లు, బ్రస్సెల్స్,సింగపూర్, న్యూయార్క్ వంటి ప్రాంతాల్లోని వ్యక్తులు లేదా సంస్థలు గత ఆర్థిక, రాజకీయ క్రమాన్ని తిరిగి పొందాలని కోరుకోవడం వంటివి. ఈ వారం హిరోషిమాలో జరగనున్న జి7 దేశాల సమావేశంలో, ప్రపంచంలోనే అతిపెద్ద అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలకు చెందిన నాయకులు సమావేశం కానున్నారు. 1970ల నుంచి వీరు వార్షిక ప్రాతిపదికన సమావేశమవుతూ వస్తున్నారు. జి7 అజెండాలో, నేటికీ కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం ప్రధానాంశంగా ఉంటుంది, ఈ గ్రూప్ దేశాలు రష్యాపై ఆంక్షలతోపాటు ఉక్రెయిన్ ప్రభుత్వం వెనుక నిలబడటం తెలిసిందే. అయితే అమెరికా, కెనడాలను మినహాయిస్తే తక్కిన దేశాలు సాపేక్ష ఆర్థిక పతనం దశలో ఉంటున్నాయి. అమెరికా యేతర జి–7 సభ్యదేశాల సామూహిక స్థూల దేశీయోత్పత్తి 1992లో ఉన్న 52 శాతం నుంచి నేటికి 23 శాతానికి పడిపోయింది. ఒక ఉమ్మడి శక్తిగా, జీ7 ఐక్యత ఈరోజు మరింత విలువైనదైనా, వాటి బలం తక్కువగా ఉంటోంది. జీ7 సభ్యదేశాలన్నింటితో సహకారం పెరుగుతున్న సమయంలో, 2019 నుంచి అతిథిగా హాజరవుతున్న భారత్... తాజాగా జీ7 దేశాల సదస్సులో పాల్గొననుంది. క్వాడ్‌లో అమెరికా, జపాన్ తో, ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ (టీటీసీ) ద్వారా యూరోపియన్ యూనియన్ తో, బ్రిటన్, కెనడాలతో భారత్ ముందస్తు వాణిజ్య చర్చలు జరుపుతోంది. సంక్లిష్టభరితమైన జనాభా, స్థూల ఆర్థికపరమైన సంధికాలంలో భారత అభివృద్ధిని, ఆర్థిక భద్రతా లక్ష్యాలను వేగవంతం చేయడం కోసం ఈ యంత్రాంగాలను ప్రభావితం చేయడం ప్రధానమైన అంశంగానే ఉంటుంది. అదే సమయంలో ఉక్రెయిన్ యుద్ధం, భారత్ జీ20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలోనూ, అభివృద్ధి చెందిన ప్రపంచం నుంచి స్పల్ప మార్పులనే గమనిస్తున్న భారత్‌కు జాతీయ, అంతర్జాతీయ సమస్య లను లేవనెత్తే అవకాశాన్ని జీ7 సదస్సు కల్పిస్తోంది. ఈ సమస్యలు ఏమిటంటే, ఇంధన, ఆహార భద్రత; సరఫరా మార్గాల స్థితిస్థాపకత, వాతావరణం; ఆర్థిక, స్వావలంబన అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థల సంస్కరణ, రుణ స్థిరత్వం వంటివి. కాగా, అమెరికా వడ్డీరేట్లు అధికంగా ఉడటం, డిజిటల్ కరెన్సీలు, చెల్లింపుల్లో ఆవిష్కరణలు, నిలకడ లేని వాణిజ్య అసమతుల్యతలు, అంతర్జాతీయ ఆంక్షలు వంటివి రానున్న సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చుట్టుముట్ట నున్నాయి. హిరోషిమా సదస్సును దాటి చూస్తే, భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లు దక్షిణ పసిఫిక్ దేశాల నాయకులతో సమావేశాల కోసం పాపువా న్యూ గినియాను సంద ర్శిస్తారని భావిస్తున్నారు. వాటి చిన్న సైజు, చిన్నచిన్న దీవుల్లోని జనాభా కారణంగా దక్షిణ పసిఫిక్ ప్రాంతాన్ని తరచుగా చిన్నచూపు చూస్తూ వచ్చారు. కానీ ప్రపంచ భూ ఉపరితలంలో ఈ ప్రాంతం ఆరింట ఒక వంతును కలిగి ఉంది. తైవాన్ , అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలపై ప్రభావం చూపే విషయంలో చైనా పోటీ పడటాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రాంతం కూడా భౌగోళిక రాజకీయ హాట్ స్పాట్‌గా మారుతోంది. పైగా వాతావరణ సంక్షోభం, నిలకడైన రుణ విధానాలు, మత్స్య, ఖనిజ వనరులు వంటివాటికి ఈ ప్రాంతం కీలకమైనది. భారత్ విషయానికి వస్తే, ఫోరమ్ ఆన్ ఇండియా పసిఫిక్ ఐలాండ్ కో–ఆపరేషన్ (ఎఫ్ఐపీఐసీ) ద్వారా 2014–2017లో ప్రారంభమైన మహమ్మారి సంబంధిత విరామం – వ్యాప్తి తర్వాత పోర్ట్ మోర్స్బీలో జరుగనున్న సదస్సు ఒక సహజమైన కొనసాగింపు. ఈ సంవత్సరాల్లో భారత ప్రధాని ఫిజీలో 14 దక్షిణ పసిఫిక్ ప్రాంత నాయకులను కలిశారు. వారందరికీ జైపూర్‌లో ఆతిథ్యమిచ్చారు. భారతీయ అభివృద్ధి, సహాయ పథకాలను ప్రదర్శించడానికి అది ఒక అవకాశం అవుతుంది. ఫిజీ, పాపువా న్యూ గినియాలలో రుజువైనట్లే, గ్లోబల్ సౌత్‌ని ప్రభావితం చేస్తున్న కొన్ని ఉమ్మడి సవాళ్లకు ప్రస్తుత భారతీయ ప్రతిపాదనలు పరిష్కారాలు కావచ్చు. అదే సమయంలో, అమెరికా భూభాగం కాని ఒక దక్షిణ పసిఫిక్ దేశానికి బైడెన్ ప్రయాణం ఆశ్చర్యకరంగా అమెరికా అధ్యక్షుడి ప్రథమ సందర్శన కానుంది. పైగా, ఒక ముఖ్యమైన ప్రాంతంపై వాషింగ్టన్ చాలాకాలం తర్వాత దృష్టి పెట్టినట్లవుతుంది. చివరగా, ఆస్ట్రేలియాలో క్వాడ్ సదస్సుకు ఈ నెల సాక్షీభూతం కానుంది. గ్రూప్ లీడర్లు మూడోసారి వ్యక్తిగతంగా కలవనున్నారు. అమెరికా అధ్యక్షుడు వార్షిక ప్రాతిపదికన హాజరయ్యే కొన్ని అంత ర్జాతీయ గ్రూప్ సమావేశాలు ఏవంటే, జీ7, జీ20, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కో ఆపరేషన్, ఈస్ట్ ఆసియా సదస్సు, ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు. ఈ చిన్న జాబితాలో క్వాడ్ కొత్త చేరిక అన్నమాట. 2021లో అధ్యక్ష స్థాయి సమావేశంగా మొదటిసారి ఉనికిలోకి వచ్చిన క్వాడ్, మూడు కార్యాచరణ బృందాలను ఏర్పర్చింది. కానీ ఇప్పుడు దీని కార్యకలాపాలు 25 కార్యాచరణ బృందాలకు విస్తరించాయి. వీటిలో కొన్ని, క్వాడ్ ఫెలోషిప్స్ వంటి కొన్ని ఫలితాలను ఇప్పటికే ప్రదర్శించాయి. మరి కొన్ని సముద్రజలాల సమస్యలు, సైబర్ సెక్యూరిటీ, అంతర్జాతీయ రుణం వంటి అంశాల్లో సన్నిహిత సహకారానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కొన్ని కార్యాచరణ బృందాలు ఇప్పటికీ చాలా అస్థిరంగా ఉంటున్నాయి. ఇకపోతే సరఫరా చైన్లు, సంక్లిష్ట టెక్నాలజీలు వంటి ఇతర అంశాల్లో సభ్యదేశాల మధ్య ద్వైపాక్షిక ప్రయత్నాలను ముందుకు తీసుకుపోవడానికి క్వాడ్ ఒక యంత్రాంగాన్ని ఏర్పర్చింది. వీటిలో అమెరికా, భారత్‌లతో ముడి పడి ఉన్న జాతీయ భద్రతా సలహాదారు నేతృత్వంలోని టెక్నాలజీ సంభాషణ, ఐసీఈటీ వంటివి ఉన్నాయి లేదా, ఇండో–పసిఫిక్ ఎకన మిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈపీ), మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ (టిపి– ఎమ్‌డిఎ) వంటి అంశాలపై దేశాల విస్తృత సమితిని తీసు కొచ్చాయి. ఇవి, మరికొన్ని ప్రయత్నాలు సిడ్నీలో జరగనున్న సదస్సు నాటికి కొంత ప్రగతిని చవి చూస్తాయి కూడా. (అయితే అమెరికా అంతర్గత వ్యవహారాల వల్ల జో బైడెన్ ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకోవ డంతో క్వాడ్ సమావేశం ఆఖరు నిమిషంలో వాయిదా పడింది). ఇక ఈ నెలలో జరగనున్న ఇండో–పసిఫిక్ అత్యున్నత సమావేశం సారాంశాన్ని చూస్తే, అంతర్జాతీయ వ్యవస్థలో కొన్ని కీలకమైన ప్రకంపనలను అవి ఎత్తిచూపనున్నాయి. ఈ ధోరణులను అభినందించే విషయంలో అనేక ప్రముఖ అంతర్జాతీయ వ్యాఖ్యాతలు ఘర్షించ వచ్చు. కానీ ఆర్థిక సంబంధాల నూతన పోకడలు, కొత్త రంగాలు, భౌగోళిక–రాజకీయ పోటీ రూపాలు, ఈ సమస్యలను ఎదుర్కోవడా నికి కొత్త యంత్రాంగాలు సీదాసాదాగా రూపుదిద్దుకుంటున్నాయి. ధ్రువ జైశంకర్ వ్యాసకర్త కార్యనిర్వాహక డైరెక్టర్, ఓఆర్ఎఫ్, అమెరికా (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో...) -
న్యాయవ్యవస్థలో పురుషాధిక్యత
న్యూఢిల్లీ: భారతీయ న్యాయవ్యవస్థలో తొలినుంచీ పురుషాధిక్యత వేళ్లూనుకొని ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో న్యాయ వృత్తి ఫ్యూడల్, పితృస్వామ్య తరహాతో, మహిళలను సముచిత వాటా కల్పించని స్వభావంతో కూడుకున్నదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. మహిళలు, సమాజంలోని అణగారిన వర్గాల వారు న్యాయపాలికలోకి మరింత పెద్ద సంఖ్యలో ప్రవేశించాలని అభిప్రాయపడ్డారు. అందుకు వీలుగా మొత్తం న్యాయ వ్యవస్థను మరింత ప్రజాస్వామ్యయుతంగా, ప్రతిభాధారితంగా మార్చాల్సిన అవసరం చాలా ఉందంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థకు మానవ వనరులను అందించేందుకు మనకు ఒక నిర్ధారిత వ్యవస్థ ఉంది. దాని నిర్మాణం ఇప్పటికీ ఫ్యూడల్, పితృస్వామ్య పోకడలతోనే నిండి ఉందన్నది వాస్తవం. పురుషాధిక్యత మన న్యాయవ్యవస్థ స్వరూపంలోనే గూడుకట్టుకుపోయింది. సీనియర్ లాయర్లున్న ఏ చాంబర్లోకి వెళ్లినా అక్కడ మొత్తం పురుషులే కనిపిస్తారు. మార్పు అక్కడి నుంచే రావాలి. మహిళలు, అణగారిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులకు ఆ చాంబర్లలో చోటు దక్కాలి. అప్పుడు గానీ న్యాయపాలికలో వారి సంఖ్య పెరగదు! మహిళా న్యాయవాదులు, న్యాయమూర్తుల ద్వారానే భవిష్యత్తులో మెరుగైన న్యాయవ్యవస్థను నిర్మించుకోగలం’’ అన్నారు. ‘‘నేడు న్యాయవ్యవస్థ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. వాటిలో మొట్టమొదటిది, అతి ముఖ్యమైనది సుప్రీంకోర్టుపై ప్రజలు పెట్టుకున్న ఆశలు. ఎందుకంటే ప్రతి సామాజిక, న్యాయపరమైన అంశమూ, రాజకీయ అంశమూ సుప్రీంకోర్టు న్యాయ పరిధిలోకి వచ్చేవే’’ అని చెప్పారు. న్యాయమూర్తులకు ఆ నేర్పుండాలి చట్టం అణచివేతకు సాధనంగా కాక న్యాయమందించే సాధనంగా ఉండాలని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఆ బాధ్యత పాలకులదే తప్ప న్యాయమూర్తులది కాదని స్పష్టం చేశారు. ‘‘మాపై ప్రజలకు ఎన్నో ఆశలు, అంచనాలున్నాయి. కానీ కోర్టుల పరిమితులను కూడా అర్థం చేసుకోవాలి. ‘‘చట్టాలు, న్యాయం కొన్నిసార్లు ఒకే సరళరేఖపై వెళ్లకపోవచ్చు. కానీ చట్టాలున్నది అంతిమంగా న్యాయ వితరణకే. వాటిని అణచివేతకు దుర్వినియోగం చేయొద్దు’ అని సీజేఐ అన్నారు. ‘‘దీర్ఘకాలంలో న్యాయవ్యవస్థను నిలబెట్టేది దయా భావన, సహానుభూతితో ప్రజల వేదనను పోగొట్టగలిగిన సామర్థ్యం మాత్రమే. ఎవరూ పట్టించుకోని అణగారిన వర్గాల ఆక్రందన వినగలిగి, వారి బాధలను చూడగలిగి చట్టాన్ని, న్యాయాన్ని నేర్పుగా బ్యాలెన్స్ చేయగలిగిన నాడు న్యాయమూర్తిగా బాధ్యతలను సరిగా నిర్వర్తించినట్టు లెక్క’’ అన్నారు అమెరికాతో పోలికేల...? మన సుప్రీంకోర్టును అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల అత్యున్నత న్యాయస్థానాలతో పోల్చడం సరికాదని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘అమెరికా సుప్రీంకోర్టు ఏడాదంతా కలిపి మహా అయితే 180 పై చిలుకు కేసులు పరిష్కరిస్తుంది. బ్రిటన్‌లోనైతే 85 కేసులు దాటవు! కానీ మన సుప్రీంకోర్టులో ప్రతి న్యాయమూర్తీ సోమ, శుక్రవారాల్లో 75 నుంచి 80 కేసుల దాకా ఆలకిస్తారు. మంగళ, బుధ, గురువారాల్లో 30 నుంచి 40 దాకా కేసులు చూస్తారు. మన సుప్రీంకోర్టు విస్తృతి అంత సువిశాలమైనది! మేం పరిష్కరించే చాలా ముఖ్యమైన కేసుల్లో కొన్ని వార్తాపత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో కన్పించకపోవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా పెన్షన్, భరణం వంటి చిన్నాచితకా కేసులనూ విచారించాల్సిందేనా అంటే, అవునన్నదే నా సమాధానం. ఎందుకంటే ప్రజలకు నిజమైన భరోసా కల్పించగలిగినప్పుడే న్యాయ వ్యవస్థ పరిఢవిల్లుతుంది’’ అన్నారు. మేము మానసికంగా పక్కా యూత్! న్యాయమూర్తులు నల్లకోటుతో పాత, రాచరిక కాలపు వస్త్రధారణలో కన్పించి బోరు కొట్టిస్తుంటారని సీజేఐ అన్నారు. ‘‘మా లుక్స్ జనాలకు బాగా విసుగు పుట్టిస్తాయన్నది నిజమే కావచ్చు. కానీ నిజానికి మానసికంగా మాత్రం మేమంతా నవ యవ్వనంతో ఉరకలేస్తుంటాం’’ అంటూ చమత్కరించారు! ..అందుకే ప్రత్యక్ష ప్రసారాలు రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాల్లో ఒక్కోసారి పారదర్శకత లేమి పెద్ద ప్రమాదంగా మారుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. దానికి అడ్డుకట్ట వేసేందుకే సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారానికి తెర తీసినట్టు చెప్పారు. తద్వారా న్యాయపాలికలో ఏం జరుగుతోందనే పౌరులు తెలుసుకునే అవకాశం దక్కడమే గాక న్యాయవ్యవస్థ మరింత జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు వీలు కలుగుతుందన్నారు. ‘‘కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారాలు మేం చేపట్టిన ఓ నూతన ప్రయోగం. న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంలో టెక్నాలజీ ఎంత పాత్ర పోషించగలదో దీని ద్వారా అర్థమైంది. న్యాయం కోసం సామాన్యుడు తొలుత ఆశ్రయించే జిల్లా కోర్టుల విచారణలనూ ప్రత్యక్ష ప్రసారం చేయాలి’’ అన్నారు. ‘సోషల్’ సవాలుకు తగ్గట్టు అప్డేట్ కావాలి ‘‘కోర్టు గదిలో న్యాయమూర్తులు మాట్లాడే ప్రతి చిన్న మాటనూ రియల్ టైంలో రిపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా పెను సవాలుగా విసురుతోంది. న్యాయమూర్తుల పనితీరు నిత్యం మదింపుకు గురవుతోంది’’ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘మనమిప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. కనుక న్యాయమూర్తులుగా మనల్ని మనం నిత్యం కొత్తగా ఆవిష్కరించుకోవాలి. ఈ కొత్త తరపు సవాళ్లను ఎదుర్కోవడంలో మన పాత్రపై పునరాలోచించుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాలి’’ అని పిలుపునిచ్చారు. -
వీథి బాలల్ని బడిపిల్లలుగా మార్చింది...మమ్మీజీ
పిల్లల్ని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో టీచర్లదే ప్రముఖ పాత్ర. అయితే, తరగతిలో ఉన్న విద్యార్థుల్నే కాదు.. వీధుల్లో చిల్లర డబ్బులు అడుగుతూ (యాచిస్తూ) తిరుగుతున్న వీధి బాలలను కూడా బడిలో చేర్పించి, తానే స్వయంగా పాఠాలు బోధిస్తూ... వారి జీవితాలనే మార్చేస్తున్నారు మనోరమ టీచర్. ఆసరాలేని పిల్లలకు అమ్మలా అండగా నిలుస్తూ వారిని చేరదీసి, ఆశ్రయమివ్వడమే కాకుండా విద్యాబుద్ధులు సైతం నేర్పించి భవిష్యత్‌ను బంగారు మయం చేస్తుండడంతో మనోరమను అంతా మమ్మీజీ అని పిలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గంగానదీ పరివాహక జిల్లా బల్లియాలో పుట్టింది మనోరమ. చిన్నప్పటినుంచి ఆడుతూ పాడుతూ రోజూ గుడికి వెళ్తుండేది. గుళ్లో వచ్చే సాంబ్రాణీ, పూల పరిమళాలను ఆస్వాదిస్తోన్న మనోరమకు.. గుడినుండి బయటకు వచ్చేటప్పుడు మాసిన, చిరిగిపోయిన దుస్తులు ధరించి దీనంగా యాచించే పిల్లలు కనిపించేవారు. వాళ్లు కొన్నిసార్లు మనోరమ దగ్గరకు వచ్చి ప్రసాదం పెట్టమని అడిగేవారు. చిన్న లడ్డు ముక్క ఇస్తే వాళ్ల సమస్య తీరిపోతుందా? అనిపించేది తనకు. కానీ ఏం చేయాలో అప్పట్లో అర్థం కాలేదు. వాళ్లకెలా సాయం చేయాలి? అన్న ఆలోచనలతోనే ఇంటర్ కాగానే బీఎస్సీ, ఎమ్మెస్సీ చేసి, తర్వాత పూర్వాంచల్ యూనివర్శిటీలో బీఈడీ పూర్తిచేసి టీచర్ ఉద్యోగం సంపాదించింది. పాఠాలతోపాటు.. పోస్టింగ్ డెహ్రాడూన్‌లో రావడంతో అక్కడ టీచర్‌గా పనిచేస్తూనే, ఆల్ ఇండియా రేడియోలో అంధ విద్యార్థులకు కథల పుస్తకాలను చదివి వినిపించేది. కథల విన్న విద్యార్థుల వ్యక్తం చేసే సంతోషం ఆమెకు చాలా సంతృప్తినిచ్చేది. ఇంతలోనే మనోరమకు పెళ్లి అవడం, భర్త లక్నోలో ఉండడంతో తను కూడా లక్నో వెళ్లింది. లక్నోలో కూడా గుడికి వెళ్లినప్పుడు యాచించే పిల్లలు కనిపించేవారు. చిన్నప్పటినుంచి ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకున్న మనోరమ... యాచించే పిల్లల వద్దకు వెళ్లి ఇలా ‘అడుక్కోవడం తప్పు, మీరు ఈ వయసులో ఇటువంటి పనులు చేయకూడదు. చదువుకోవాలి’ అని హితవు చెప్పేది. ఆమె మాటలు వినడానికి పిల్లలు గుంపుగా పోగయ్యేవారు. అప్పుడు ఆ పిల్లలకు స్నానాలు చేయించి, కొత్తబట్టలు తొడిగి, తలకు నూనె రాసి, దువ్వి వాళ్లను అద్దంలో చూపిస్తూ ‘చూడండి మీరు ఎంత అందంగా ఉన్నారో’... అడుక్కోవడం అంటే దేవుడిని కించపరచడంతో సమానమని చెప్పి, అడుక్కోవద్దని వారించేవారు. ఈ మాటలు విన్న పిల్లలు, కొంతమంది తల్దిండ్రులు నిజమే కదా! అని అర్థం చేసుకుని తమ పిల్లలను స్కూళ్లలో చేర్చి చదువుకోవడానికి ప్రోత్సహించేవారు. మనోరమ పనిచేసే స్కూలు, ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చేర్పించి, వారి పిల్లల యాచకత్వాన్ని మాన్పించారు. దత్తత సెంటర్.. మనోరమ ప్రారంభంలో డెభ్బై మంది దాకా పిల్లలను స్కూళ్లలో చేర్పించింది. రోజురోజుకి నిరాశ్రయ యాచక పిల్లల సంఖ్య పెరగడం, వాళ్లను ఆదరించే వారు లేకపోవడం వంటి కన్నీటి గాథలకు చలించి పోయిన మనోరమ వారికోసం దత్తత కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంది. 2004లో ‘జమి అప్ని ఆస్మా మేరా’ పేరుతో దత్తత కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ సెంటర్లో ఇల్లువాకిలి, తల్లిదండ్రులు, తోబుట్టువులు, నా అనేవారు లేని వారిని చేరదీసి ఆశ్రయం కల్పిస్తుంది. ఎవరైనా ఈ సెంటర్లో ఉన్న పిల్లల్ని దత్తత తీసుకోవాలంటే వారికి దత్తత ఇస్తుంది. అలా ఇప్పటిదాకా పదకొండు వందలమంది పిల్లలను యాచన నుంచి మాన్పించగలిగింది. వీరిలో చాలా మంది ఇప్పుడు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది క్యాటరింగ్, డ్రైవర్స్, హౌస్‌కీపింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మరికొందరు బీఏ పూర్తిచేసి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మాయిలైతే బ్యూటీపార్లర్, కుట్టుమిషన్, ఎంబ్రాయిడరీ వర్క్ లు నేర్చుకుని ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మనోరమ భర్త కూడా తనకి అన్ని పను ల్లో చేదోడు వాదోడుగా ఉంటూ సాయం చేయడం వల్ల ఆమె ఇంతమందిని ప్రయోజకుల్ని చేయగలిగారు. లక్నోలో యాచకత్వం చేసే పిల్లల సంఖ్య కూడా తగ్గింది. నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లల్ని చేరదీసి బడికి పంపిస్తూ, భవిష్యత్‌ను మారుస్తున్న మనోరమను అంతా ‘మమ్మీజీ’ అని పిలుస్తున్నారు. అవార్డులు.. టీచర్‌గా పాఠాలు చెప్పి సరిపెట్టుకోకుండా స్కూలు బయట ఉన్న పిల్లల్ని స్కూలుకు వచ్చేలా చేసి వారి జీవితాలనే తీర్చిదిద్దిన మనోరమను గుర్తించిన హిందుస్థాన్ టైమ్స్ ‘ఉమెన్ ఎచీవర్స్ అవార్డుతో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘గోమతి గౌరవ్ సమ్మాన్’ అవార్డులతో సత్కరించాయి. ఈ ఏడాది టీచర్‌గా రిటైర్ అయిన మనోరమ తన సమాజసేవను కొనసాగిస్తున్నారు. భర్తతో మనోరమ -
ఇక ‘ఓవర్‌టైమ్’కి వేతనం..
న్యూఢిల్లీ: ఇక మీదట వారానికి నాలుగు రోజులే పని దినాలుగా తీసుకురావాలని భావిస్తోన్న కేంద్రం కార్మిక శాఖ మరో నూతన చట్టం తీసుకురానుంది. దీని ప్రకారం కార్మికులు కంపెనీలో పనివేళలకు అదనంగా(ఓటీ) పని చేస్తే.. అందుకు వేతనం చెల్లించాలనే కొత్త నిబంధనను పరిశీలిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీని అమలుకు సన్నాహాలు చేస్తోంది. హిందూస్తాన్ టైమ్స్ తాజా రిపోర్టు ప్రకారం సామాన్యంగా పనివేళలు ముగిసిన తర్వాత ఒక కార్మికుడు 15 నిముషాలు అదనంగా పనిచేస్తే దానికి కూడా సదరు కంపెనీ వేతనం చెల్లించాలని ఈ చట్టం చెబుతోంది. ఈ విధంగా కేంద్రం కొత్త నిబంధనలు, చట్టాల ద్వారా కార్మికులకు కొంత పని ఒత్తిడి తగ్గించడంతోపాటు, ఉత్పాదకత పెరిగే దిశగా ప్రోత్సహించాలని చూస్తోంది. (చదవండి: ఇక వారానికి నాలుగే పనిరోజులు!) -
అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న విధానానికి తాము కట్టుబడి ఉన్నామని, ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమై ఉండాలనడం ఎంత మాత్రం సరికాదని అందుకే తాము మూడు రాజధానులను ప్రతిపాదించామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. గుడ్లన్నీ ఒకే బుట్టలో ఉంటే తీవ్రంగా నష్ట పోతామని గతంలో చెన్నై, హైదరాబాద్ నగరాల విషయంలో అదే జరిగిందని ఆయన అన్నారు. అమరావతిలో జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమేనని, తాను తన మనుషులు భూములు కొన్న చోట అభివృద్ధి చేయాలని చంద్రబాబు చెబితే ఎలాగని జగన్ సూటిగా ప్రశ్నించారు. ‘హిందూస్థాన్ టైమ్స్’ ఆంగ్ల దినపత్రికకు తాజాగా ఇచ్చిన ఇంటర్యూలో జగన్ పలు అంశాలపై తన ఆలోచనలను స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలపై తమకు ఏ మాత్రం ఆసక్తి లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం బీజేపీకి అంశాల వారీ మద్దతు నిస్తున్నామని ఆయన తేట తెల్లం చేశారు. ఇంటర్యూ పూర్తి వివరాలు.. హిందూస్థాన్ టైమ్స్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్య నిర్వాహక, న్యాయ, శాసన విభాగాలకు మూడు రాజధానులు ఉండాలనే అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉంది. చర్చించుకోవడం సబ్ జ్యుడిస్ అవుతుంది. అయినప్పటికీ మీ ఈ ప్రయత్నం వెనుక పాలనాపరమైన ఉద్దేశ్యం ఏమిటి? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ : మూడు రాజధానులు అనేది ఒక సామాన్యుడి ఆలోచన. రాజధాని విధుల విభజించాం. విశాఖపట్నం నుంచి కార్యనిర్వాహక, అమరావతి నుంచి శాసన, కర్నూలు నుంచి న్యాయ వ్యవస్థ విధులు నిర్వహణ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ కూడా రాజధాని విధులు విభిన్న ప్రాంతాలకు కేటాయించవచ్చునని చెప్పింది. అన్ని విధులూ ఒకే చోట నుంచి ఎందుకు నిర్వహించాలి? చెన్నై, హైదరాబాద్ నగరాల్లో విధులన్నింటినీ కేంద్రీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు సార్లు తీవ్రంగా నష్ట పోయింది. అన్ని గుడ్లూ ఒకే బుట్టలో ఉంటే నష్టపోతారని చరిత్ర చెబుతోంది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇంకా అదే వైఖరిని ఎందుకు కొనసాగించాలి? ఇది తార్కికమైన, హేతుబద్ధన ఆలోచన కానే కాదు. హైదరాబాద్‌లోని మాధాపూర్‌లో 1990 ప్రాంతంలో జరిగిన ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ విధానమే మళ్లీ గత టీడీపీ పాలనలో అమరావతిలో జరిగింది. సచివాలయం, అసెంబ్లీ లేదా హైకోర్టు అనేవి అభివృద్ధి కాక పోతే ఎందుకంతగా వాటి గురించి పట్టించుకోవాలి. వాటి గురించి మాట్లాడుకోవద్దు. రాజధాని నిర్మాణానికి రూ. లక్ష కోట్లు కావాలని గత ప్రభుత్వం చెప్పింది. రైతుల నుంచి సేకరించిన, సమీకరించిన (పూలింగ్) 33000 ఎకరాల భూమిలో మెగా భవన నిర్మాణాలకు ఏ మాత్రం అనువుగా లేని చోట ఒక నగరాన్ని నిర్మించడం కన్నా ఆయన (చంద్రబాబు) 500 ఎకరాల్లో మరొక చోట నిర్మాణానికి ప్రయత్నించి ఉండొచ్చు. (చదవండి : మరో నాలుగు కులాలకు వైఎస్సార్ చేయూత) ప్రశ్న : శివరామకృష్ణన్ నివేదిక ప్రకారం రాజధాని ఏర్పాటుకు కేవలం 500 ఎకరాలు సరిపోతే ఆయనకు(చంద్రబాబు) 33000 ఎకరాలు ఎందుకు కావాల్సి వచ్చింది? జగన్ : అమరావతిలో జరిగిన భూ లావాదేవీలపై ఒక ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోంది. నాకు ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మనుషుల బినామీ లావాదేవీలను వెలికి తీసే పనిలో ఉంది. ఆ ప్రాంతంలో స్వప్రయోజనాలను ఆశించి పబ్బం గడుపుకోవాలనే కొందరు వ్యక్తులు పేద రైతుల నుంచి భూములను కొనుగోలు చేశారు. ఆ తరువాతనే రాజధానిని అక్కడ పెడుతున్నట్లు ప్రకటన వెలువబడింది. భూకుంభకోణం చోటు చేసుకుంది. కారు చౌకధరలకు కొనుగోలు చేసిన వారు వేలాది కోట్ల రూపాయల లబ్ది పొందారు. కేవలం ఒక వర్గానికి లాభం చేకూర్చడం కోసం గత ప్రభుత్వం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప మరొకటి కాదు. అభివృద్ధి అనేది ఒకే చోట కాకుండా దానిని వికేంద్రీకరించి రాష్ట్రమంతటికీ విస్తరింప జేస్తే అన్ని చోట్లా సమీప భవిష్యత్తులో గ్రోత్ సెంటర్లుగా విరాజిల్లుతాయి. ఉదాహరణకు కేరళ రాష్ట్రంలో ఎన్ని పెద్ద నగరాలున్నాయి? లేవే! అయినప్పటికీ ఆ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే అనేక ప్రామాణికాల్లో ముందంజలో ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి విస్తరింప జేస్తే విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, తిరుపతి మరి కొన్ని నగరాలు అభివృద్ధి క్లస్టర్లు ఉంటాయి. పోర్టుల అభివృద్ధి కూడా జరుగుతోంది. వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న మధ్య కోస్తాలో అగ్రోలాజిస్టిక్ పార్కును కలిగి ఉండొచ్చు, అన్నీ కలిసి అభివృద్ధి దిశగా ముందుకు వెళతాయి. ప్రశ్న: చంద్రబాబును చులకన చేయడం కోసం అమరావతిని మీరు నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శలకు ఏం సమాధానం చెబుతారు? టీడీపీ నేత కూడా మీ పరిపాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షంపై గూఢచర్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జగన్ : అది పూర్తిగా అర్థరహితం. అమరావతి గురించే మేం ఎందుకు ఆలోచించాలి? యావత్ రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలనేది మా అభిమతం. అమరావతిని మేం వదలి వేయం. అక్కడి నుంచి శాసనసభ పని చేస్తుంది. దేశంలో ఏదైనా అంశంపై నిపుణులు ఇది తప్పుడు విధానం అని చెప్పినపుడు ఎందుకు పరిగణించరు? (గౌరవించరు?) మన దేశంలో ఏదైనా ఒక విధానంపై రెఫరెండం చేసే (ప్రజాభిప్రాయ సేకరణ) విధానం లేదు. అందువల్లనే నిపుణులు వ్యక్తం చేసే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడమే ఇక మిగిలి ఉన్న మార్గం. రెఫరెండమ్ కనుక అమలులో ఉంటే మేం ఆ విధానాన్ని కచ్చితంగా అనుసరించి ఉండేవాళ్లం. అభివృద్ధి వికేంద్రీకరణ అనే మా విధానానికి ప్రజలు మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారని మేం పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అభివృద్ధి వికేంద్రీకరణపై మేం కనుక రెఫరెండమ్ నిర్వహించి ఉంటే ఆ 29 గ్రామాల్లోని పది వేల మంది రైతులు మినహా యావత్ రాష్ట్ర ప్రజలు మా వెనుక మద్దతుగా నిలబడి ఉండే వారు. ఆ రైతులు కూడా ఎందుకు వ్యతిరేకిస్తారో కారణాలు విస్పష్టం. రెఫరెండమ్‌కు అవకాశం లేదు కనుకనే కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదికను మేం గౌరవించాం. మేం కూడా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారి అభిప్రాయం తీసుకున్నాం. ఈ రెండు కమిటీలు నివేదికలు ఇచ్చాయి. బీసీజీ నివేదిక కూడా తీసుకున్నాం. వాటన్నింటి ఆధారంగా రాష్ట్ర రాజకీయ కార్య నిర్వాహక వర్గం అభివృద్ధి కేంద్రీకరణ కన్నా వికేంద్రీకరణ తరహా అయితే ఎంతో మెరుగ్గా ఉంటుందని ఒక ఆమోదంతో నిర్ణయం తీసుకుంది. మెగా సిటీలనేవి అవాంఛనీయం. వాటికి అన్ని రకాల వనరులు ఎక్కువగా అవసరమవుతాయి, అంతే కాదు ప్రజలకు పెనుభారంగా పరిణమిస్తాయి. అనువైన రీతిలో (ధరలకు) ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వం ప్రధాన పాత్రగా ఉండాలి. అందుకే మేం అభివృద్ధి వికేంద్రీకరణను సమర్థిస్తున్నాం. అన్ని జిల్లాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల, వైద్య కళాశాలల ఏర్పాటుకు పూనుకుంటున్నాం. అంతే కాదు ప్రస్తుతమున్న 13 జిల్లాలను విభజించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నాం. (చదవండి : ప్రారంభమైన ‘కిసాన్ రైలు’ ) ఇక చంద్రబాబు చేస్తున్న గూఢచర్యం అనే ఆరోపణ పూర్తిగా అర్థ రహితమైంది. ఈ విషయంలో మీ వద్ద ఏమైనా సాక్షాధారాలుంటే ఇవ్వండి అని స్వయంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ప్రతిపక్షాన్ని అడిగారు. వారు ఎలాంటి సాక్ష్యాన్ని చూపలేక పోయారు. అదే మేం ప్రతిపక్షంలో ఉన్నపుడు మా పార్టీ సీనియర్ నేతల ఫోన్లను ‘ట్యాప్’ చేశారు. ఇందుకు సంబంధించి అధికారిక సాక్ష్యాధారాలను కూడా మేం అప్పట్లో చూపించాం. ప్రశ్న : మీ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా చంద్రబాబుకు ప్రత్యర్థే. తాను, వైఎస్సార్ ఒకే సారి రాజకీయాల్లోకి వచ్చామని, ఒకే పార్టీలో స్నేహితులుగా ఉన్నామని చంద్రబాబు తరచూ చెబుతూ ఉంటారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రజారోగ్యానికి హానిని కలిగిస్తూ... ప్రాణాంతకంగా పరిణమించడమే కాక ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన సవాలు ఎదురవుతున్న సమయంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి రెండు ప్రత్యర్థి పార్టీల నేతలు ఏకమై పనిచేయాల్సిన అవసరం లేదంటారా? జగన్ : అమరావతిలో తాము పెట్టిన పెట్టుబడులను ఎలా కాపాడుకోవాలనే ఏకైక ఆలోచనతో వారు (టీడీపీ) ఉండి పోయారు. వారికి ఇతరత్రా ఇక ఎలాంటి ఎజెండా లేదు. గత 15 నెలలుగా అయన (చంద్రబాబు) అమరావతి గురించి తప్ప ఇంక ఏ విషయంపైనా మాట్లాడ్డం లేదు. అసలు అమరావతి అనేది అంత చర్చనీయాంశం కానే కాదు. అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని మేం అనేక సార్లు చెప్పాం. మీరు , మీ మనుషులు భూములు కొనుగోలు చేశారనే ఒకే కారణంతో ఒకే చోట అభివృద్ధి చేయాలన్న ఆలోచనను మేం పరిగణించ లేం కదా? ఇక ఏ సహకారం గురించి ఆయన (చంద్రబాబు) మాట్లాడుతున్నారు? యావత్ రాష్ట్రం కరోనా మహమ్మారితో సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నపుడు, ఈ ఏడాది మార్చి తరువాత ఆయన ఏపీలో అడుగైనా పెట్టలేదే? ప్రశ్న : మీరు గతంలో ఉండిన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళ చేయాలని వచ్చిన డిమాండ్లను మీరెలా చూస్తున్నారు? గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి లేకుండా అది మనగలుగుతుందని భావిస్తున్నారా? జగన్ : చూడండి. మాది ఆంధ్రాలో బలమైన ఒక ప్రాంతీయ పార్టీ. జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో మాకు సంఖ్యాబలం లేదు. మాది లోక్‌సభలో నాలుగో అతి పెద్ద పార్టీ. విభజన వల్ల దారుణంగా ప్రతికూల పరిస్థితుల్లోకి పడిపోయిన (నష్ట పోయిన) ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసుకోవడం వరకే మా పాత్ర పరిమితమై ఉంటుంది. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే ప్రక్రియలో మేమున్నాం. అంతే కానీ జాతీయ స్థాయిలో మాకెలాంటి ఆసక్తి లేదు. ప్రశ్న : ఇంతకీ బీజేపీతో మీ సంబంధాల మాటేమిటి? మీరు ఆ పార్టీకి దగ్గరి మిత్రులు అనుకోవాలా? లేక అంశాల వారీ మద్దతు నిస్తున్న పార్టీ అనుకోవాలా? తరచూ మీ పార్టీ పార్లమెంటులో బీజేపీకి మద్దతు నిస్తూ ఉంది కదా? జగన్ : మా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ప్రధానం. అదే దారిలో వెళతాం. ఏం అంశంలోనూ మేం అదే విధంగా వ్యవహరిస్తాం. ఏపీకి ప్రత్యేక హోదా అనేది సాకారం అవుతుందని మేం విశ్వసిస్తున్నాం. ఇపుడు కాకపోయినా భవిష్యత్‌లో అది నిజమవుతుంది. ఆ విషయంపై మేం పూర్తి ఆశావహ దృక్పథంతో ఉన్నాం. బీజేపీకి మేం అంశాల వారీగా మద్దతు నిస్తున్నాం. మా పిసరంత మద్దతు కూడా అన్ని విధాలా రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే. ప్రధానంగా మేం విభజన తరువాత నష్ట పోయిన మా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే ప్రక్రియలో ఉన్నాం. -
వారు కోరితే ప్రధానినవుతా
న్యూఢిల్లీ: ఒకవేళ మిత్రపక్షాలు కోరుకుంటే తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ తొలి ప్రాధాన్యమని వెల్లడించారు. ఎన్నికలు పూర్తయ్యాక అన్ని పక్షాలతో కలిసి చర్చించి ప్రధాని అభ్యర్థిపై తుదినిర్ణయం తీసుకుంటామన్నారు. శుక్రవారం నాడిక్కడ జరిగిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్–2018(హెచ్‌టీఎల్‌ఎస్)లో ప్రసంగించిన రాహుల్ పలువురు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. ‘తొలుత కలిసికట్టుగా పోటీచేసి బీజేపీని ఓడించాలనీ, అనంతరం అందరూ కూర్చుని చర్చించి ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలని మేం(ప్రతిపక్షాలు) నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ మా మిత్రపక్షాలు కోరుకుంటే నేను ప్రధానిగా బాధ్యతలు తప్పకుండా చేపడతా. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీచేసేందుకు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) నిరాకరించడంతో మాకు వచ్చిన నష్టమేమీ లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి విపక్షాలన్నీ ఏకమవుతాయి. మా అమ్మ సోనియాగాంధీ నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఓపిక తక్కువగా ఉండే నాకు ప్రశాంతంగా ఎలా ఉండాలో అమ్మ నేర్పించింది. కొన్నిసార్లు ‘అమ్మ నీకు ఓపిక మరీ ఎక్కువైంది’ అని నేను చెబుతుంటా’’ అని రాహుల్ చమత్కరించారు. మీ జీవితంలో ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారా? అన్న ప్రశ్నకు.. ‘ఎందుకులేరూ.. మా అమ్మ, సోదరి సహా నా జీవితంలో చాలామంది ఉన్నారు‘ అని రాహుల్ నవ్వుతూ జవాబిచ్చారు. సామాన్యులపై పెట్రో భారాన్ని తగ్గించేందుకు వీలుగా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలోకి తీసుకురావాలని రాహుల్ ప్రధాని మోదీని కోరారు. -
వ్యవస్థలపై అజమాయిషీ ప్రమాదకరం: రాహుల్
న్యూఢిల్లీ : దేశంలో వ్యవస్థలను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలనే ప్రయత్నం ప్రమాదకరమని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ ఎన్నడూ పూనుకోదని, ఇవి తమ పార్టీకి చెందినవి కాదని దేశానివని తాము విశ్వసిస్తామన్నారు. వ్యవస్థలన్నింటిపైనా ఆరెస్సెస్ భావజాలం రుద్దుతున్నారని ఆరోపించారు. హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్‌లో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. 21వ శతాబ్ధపు అవసరాలకు అనుగుణమైన సంస్థలను దేశం ఆవిష్కరించాల్సి ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థలను బలోపేతం చేయడంతో పాటు రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టడం, అందుబాటు ధరల్లో విద్యా, వైద్య మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. పరిశ్రమతో కలిసి రైతులు పనిచేసే వాతావరణం కల్పించడం, విద్వేష భావనలను తొలగించడం తక్షణ కర్తవ్యంగా ముందుకెళతామన్నారు. సమస్యలను ఓపిగ్గా వినడం అవసరమని, తాను ఎదుటివారు చెప్పింది శ్రద్ధగా ఆలకిస్తానని రాహుల్ పేర్కొన్నారు. దేశ విదేశాంగ విధానం వ్యూహాత్మకంగా లేదని విమర్శించారు. నిరుద్యోగంతో యువత సతమతమవుతున్నదని, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కుదేలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న సంస్థలను నరేంద్ర మోదీ ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తోందన్నారు. కేవలం తాము మాత్రమే దేవాలయాలను సందర్శిస్తామని బీజేపీ భావిస్తోందన్నారు. బీజేపీతో సిద్ధాంత పరంగా కేవలం కాంగ్రెస్ మాత్రమే పోరాడుతోందన్నారు. ప్రజల జీవితాలను సరళతరం చేసేందుకు ప్రవేశపెట్టిన ఆధార్ ఇప్పుడు ప్రజలను పర్యవేక్షించే పరికరంగా మారిందన్నారు. నోట్ల రద్దు తిరోగమన చర్య మోదీ ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు అనాలోచిత చర్యగా రాహుల్ అభివర్ణించారు. నోట్ల రద్దుతో సామాన్యులు బ్యాంకు క్యూల్లో కూలబడగా, సంపన్నులు దర్జాగా తమ నల్లధనాన్ని వైట్‌గా మార్చుకున్నారన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని, దురదృష్టవశాత్తూ ప్రభుత్వం ఇప్పుడు ఎవరితోనూ చర్చలు జరిపే స్థితిలో లేదని దుయ్యబట్టారు. ప్రత్యేక వ్యక్తి ఎవరూ లేరు తనకు తోడుగా తల్లి, చెల్లి, స్నేహితులున్నారని.. తన జీవితంలో ప్రత్యేక వ్యక్తి అంటూ ఏ ఒక్కరూ లేరని రాహుల్ స్పష్టం చేశారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తామని భావిస్తున్నారనే ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ చాలా సీట్లను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నిర్ధిష్ట సంఖ్యను చెప్పేందుకు ఆయన నిరాకరించారు. -
పొత్తులు లేవు ఒంటరి పోరే...
-
వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవ్: జగన్
రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రానికి గత నాలుగేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు. – ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రాత్మక రీతిలో పాదయాత్ర చేసి 2004 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని విజయపథాన నడిపించారు. ప్రస్తుతం ఆయన తనయుడు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి బాటలోనే నడుస్తున్నారు. అసెంబ్లీకి సాధారణ ఎన్నికల వ్యవధి ఏడాదిలోపే ఉన్న తరుణంలో రాష్ట్రంలో ఆయన ‘ప్రజా సంకల్పం’ పేరుతో పాదయాత్ర చేపట్టి ఇప్పటికి 200 రోజులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆంగ్ల పత్రిక ‘హిందూస్థాన్ టైమ్స్’ ప్రతినిధి జగన్‌ను కలిసి చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ గురువారం ఆ పత్రికలో ప్రముఖంగా ప్రచురితమైంది. రాష్ట్రంలో గానీ, జాతీయ స్థాయిలో గానీ ఎన్నికల పొత్తులు ఉండబోవని జగన్ ఈ ఇంటర్వ్యూలో స్పష్టంగా తేల్చి చెప్పారు. 2019 ఎన్నికలకు ముందే ఫలానా పార్టీ లేదా గ్రూపు పట్ల మొగ్గు చూపే ప్రసక్తే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ఏ పార్టీ లేదా ఫ్రంట్ అయితే లిఖిత పూర్వకంగా అంగీకారం తెలుపుతుందో వారికే కేంద్రంలో మద్దతు ఇస్తామని చెప్పారు. ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఇలా ఉంది. మీరు ఇప్పటికే 200 రోజుల పాదయాత్రలో 2,400 కిలోమీటర్లకు పైగా పూర్తి చేశారు కదా.. ఈ యాత్రలో మీరు పరిశీలించింది ఏమిటి? ఈ యాత్రలో ప్రతి రోజూ నాకు ఒక కొత్త అనుభవమే. ఈ అనుభవం నుంచి నేను ప్రతిరోజూ ఎంతో నేర్చుకుంటున్నాను. బహుశా నాకు ఎదురయ్యే మనుషులు మారొచ్చు. కానీ వారి దీన స్థితిగతులు మాత్రం మారలేదు. కొన్ని చోట్ల వారి పరిస్థితుల్లో కొంత తేడా ఉండొచ్చు. గత నాలుగేళ్లుగా సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. అప్పుల భారాన్ని మోస్తూ సతమతం అవుతున్నారు. నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువగా ఉంది. మొత్తం ఆర్థిక వ్యవస్తే కుప్పకూలి పోయింది. గ్రామాల్లో ప్రజాస్వామ్యమనేదే లేదు. టీడీపీ నేతలతో నింపేసిన జన్మభూమి కమిటీలు స్థానిక ప్రభుత్వాల అధికారాలన్నింటినీ హరించి వేశాయి. పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలన్నా చివరకు మరుగుదొడ్లు మంజూరు చేయాలన్నా.. ఈ కమిటీలు టీడీపీ నేతల ద్వారా వెళ్లే వారికే ఇస్తున్నాయి. ప్రజల చేత ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన సర్పంచ్‌లు అధికారాలు లేక ఉత్సవ విగ్రహాల్లా మిగిలి పోయారు. గ్రామ స్థాయిలో అవినీతి పెచ్చరిల్లింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను మొత్తం లూటీ చేశారు. అధికారుల సమక్షంలోనే వారికి తెలిసే ఇసుక మాఫియా ఇసుకను తవ్వి దోచుకుంటోంది. కేవలం టీడీపీ బినామీలు మాత్రమే ఉచితంగా ఇసుకను తీసుకెళుతున్నారు. ఈ ఇసుక దోపిడీలో జిల్లా కలెక్టర్లు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, ఆయనకు చెందిన హెరిటేజ్ కంపెనీ కూడా ఈ లూటీలో భాగస్వాములే. మట్టిని కూడా వారు వదలడం లేదు. బొగ్గు సరఫరా, విద్యుత్ కొనుగోళ్లు, మద్యం వ్యాపారం ఇలా అన్నింట్లోనూ భారీ కుంభకోణాలున్నాయి. వారు ఆలయాలను, ఆలయాలకు చెందిన భూములను కూడా వదలడం లేదు. మీరు యాత్రలో గుర్తించిన ప్రధానమైన సమస్యలు ఏమిటి? ఎన్నో సమస్యలు చూశాను. అవన్నీ మానవ తప్పిదాల వల్ల ఏర్పడినవే. చంద్రబాబునాయుడు పరిపాలన అధ్వానంగా ఉన్నందువల్ల ఉత్పన్నమైనవే. రూ 87,612 కోట్ల రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు గత నాలుగేళ్లలో సగటున ఏటా మాఫీ చేసిందల్లా రూ.3,000 కోట్లు మాత్రమే. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలిస్తాను.. జాబు కావాలంటే బాబు రావాలి అనే నినాదంతో ఆయన అధికారంలోకి వచ్చారు. హామీ ఇచ్చినట్లుగా ఆయన ఎవ్వరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు.. ఇస్తానన్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. మన యువతకు ఉద్యోగాలు రాగలిగే అవకాశం ఉండేది కేవలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్లనే. ప్రత్యేక హోదా వస్తే జీరో ఆదాయపు పన్నుతో పాటు పరిశ్రమలకు జీఎస్టీ మినహాయింపులు వచ్చి ఉండేవి. కానీ ప్రత్యేక హోదా రాలేదు. వచ్చే ఎన్నికల్లో మీ ప్రధాన అజెండా ఏమిటి? ప్రత్యేక హోదానా? లేక వైఎస్సార్ పాలన పునరుద్ధరణా? లేక చంద్రబాబు పాలనా? ఎన్నికల్లో ఇవన్నీ ప్రధాన అంశాలుగా ఉంటాయి. గత ఎన్నికల్లో మేం కేవలం 1.5 శాతం ఓట్ల తేడాతో అధికారంలోకి రాలేక పోయాం. తనకు తాను అనుభవజ్ఞుడిగా చంద్రబాబు చెప్పుకోవడంతో పాటుగా ఆయన ప్రజలకిచ్చిన అబద్ధపు హామీలు, పవన్ కళ్యాణ్ మద్దతు, దేశంలో వీచిన నరేంద్ర మోదీ గాలి.. ఇవన్నీ అప్పట్లో మా ఓటమికి కారణాలయ్యాయి. కానీ నేడు రాష్ట్రంలో నెలకొన్న వాతావరణం వేరుగా ఉంది. చంద్రబాబు పెద్ద అబద్ధాల కోరు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన సైకిల్ నుంచి మోదీ, పవన్ కళ్యాణ్ అనే చక్రాలు వేరు పడ్డాయి. అధికారంలోకి వచ్చాక మేమేం చేస్తామో.. నవరత్నాలు కార్యక్రమం ద్వారా చెబుతున్నాం. అదే సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణ పాలనను తీసుకు వస్తామని ప్రజలకు చెబుతున్నాం. ప్రత్యేక హోదా సాధన కచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రధానాంశంగా ఉండబోతోంది. ప్రత్యేక హోదా కోసం తొలి నుంచీ రాజీ లేకుండా నిరంతరం పోరాడున్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే. చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఇప్పుడు తన వైఖరి మార్చుకున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని అంటున్నారు. వస్తే ఎదుర్కోనేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఇప్పటికైతే వాటి గురించి ఏమీ ఆలోచించడం లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా పాదయాత్రపైనే కేంద్రీకరించాను. అయితే.. త్వరగా ఎన్నికలు జరగడం అనేది మాకూ, ఈ రాష్ట్రానికి చాలా మేలు చేస్తుంది. రాబోయే ఎన్నికలకు అదనంగా ఏర్పాట్లు చేసుకోవడం అనేది అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బహుముఖ పోటీ జరిగేట్లు కనిపిస్తోంది.. దీంతోపాటు సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగబోతోంది.. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి ఆ ప్రభావం మీ పార్టీపై ఏమైనా పడుతుందనుకుంటున్నారా? నేనలా అనుకోను. బహుముఖ పోటీ ప్రభావం మా పార్టీ విజయావకాశాలపై ఏ మాత్రం ఉండదు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, బీజేపీ మద్దతుదార్లు ఇద్దరూ కూడా టీడీపీకే ఓట్లేశారు. ఆ పార్టీలన్నీ అప్పుడు కలిసి పోటీ చేసినందువల్ల అది సాధ్యమైంది. ప్రస్తుతం ఆ పార్టీలు రెండూ టీడీపీ ఓట్లనే చీల్చుతాయి తప్ప వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్లను కానే కాదు. పవన్ కళ్యాణ్ మీ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని మీ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చెప్పారు కదా? నా వద్దకు అయితే అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదు. ఎవ్వరి మద్దతూ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే సత్తా మా పార్టీకి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి మద్దతు కోసం, లేదా పొత్తు కోసం ఇప్పుడు, ఈ దశలో ఆలోచించే అవసరం మాకు ఉందని భావించడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన భుజాలపై బీజేపీ తుపాకులు ఎక్కు పెట్టి కాల్చుతూ.. తన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తోందని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు.. ? చంద్రబాబువి పూర్తిగా అర్థరహితమైన, పనికిమాలిన ఆరోపణలు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగింది టీడీపీ కాదా? మీ పార్టీకి ఏపీలో 2019 ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో అంటే 25కు గాను 20 ఎంపీ స్థానాలు వస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారు? నేను ఇప్పటికే ఈ విషయంపై పూర్తిగా స్పష్టత ఇచ్చాను. ఏపీకి ప్రత్యేక హోదా మంజూరు చేస్తామని లిఖిత పూర్వకంగా అంగీకారం తెలిపే పార్టీకి లేదా మిత్రపక్షాల కలయిక (అలయన్స్‌కు)కు మాత్రమే మా పార్టీ మద్దతు ఇస్తుంది. కేవలం పైపై హామీ ఇచ్చే వారికి మద్దతు ఇవ్వం. ఎన్నికల అనంతరం ఒకవేళ ఏర్పడబోయే ఫెడరల్ ఫ్రంట్‌లో చేరాల్సిందిగా మీ పార్టీకి ఆహ్వానం వస్తే చేరతారా? జాతీయ రాజకీయాల్లో మీ పార్టీ పాత్ర ఎలా ఉండబోతోంది? జాతీయ స్థాయిలో ఏదైనా ఫ్రంట్‌లో గాని, మిత్రపక్షాల కలయికలో గాని చేరాలన్న ఆసక్తి నాకు లేదు. జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించాలన్న కోరికా లేదు. -
మూడు టెస్టులు ఫిక్స్!
న్యూఢిల్లీ: మళ్లీ ఫిక్సింగ్ భూతం బుసలు కొట్టింది. గత రెండేళ్లుగా భారత్ ఆడిన మూడు టెస్టులు ఫిక్స్ అయినట్లు ఖతర్‌కు చెందిన అల్ జజీరా టీవీ చానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడవడంతో క్రికెట్ ప్రపంచం ఉలిక్కి పడింది. ఇదంతా కూడా దావూద్ (డి) గ్యాంగ్ కనుసన్నల్లో జరిగినట్లు ఈ చానెల్ నిర్వహించిన శూల శోధనలో వెల్లడైంది. ఇందులో ముంబైకి చెందిన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ రాబిన్ మోరిస్ హస్తం ఉన్నప్పటికీ టీమిండియా క్రికెటర్ల ప్రమేయం లేకపోవడం ఊరట. ఈ స్టింగ్ ఆపరేషన్ వీడియోలో భారత క్రికెటర్ల పేర్లు మాత్రం లేవు. జర్నలిస్ట్ డేవిడ్ హారిసన్ ఈ ఆపరేషన్‌ను ముంబై, యూఏఈ, శ్రీలంకల్లో నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో డాక్యుమెంటరీ ఆదివారం ‘హిందుస్తాన్ టైమ్స్’ వెబ్సైట్లో ప్రసారమైంది. మొత్తం మ్యాచ్, ఇన్నింగ్స్ కాకుండా కొన్ని ఓవర్లు, సెషన్లు మాత్రమే ఫిక్సయ్యాయి. అంటే మ్యాచ్‌లు జరిగిన ఐదు రోజుల్లో ఏదో ఓ రోజు పది ఓవర్లో, 20 ఓవర్లో ఫిక్స్ అయ్యాయి. చెన్నై (2016)లో భారత్–ఇంగ్లండ్ టెస్టు, గతేడాది రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు, గాలే (శ్రీలంక)లో శ్రీలంకతో ఆడిన టెస్టు మ్యాచ్‌లు బుకీలు, ఫిక్సర్ల బారిన పడినట్లు ఆ డాక్యుమెంటరీలో వెల్లడైంది. ఇందులో ఇద్దరు ఆస్ట్రేలియన్, ముగ్గురు ఇంగ్లండ్ క్రికెటర్ల పాత్ర ఉన్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే సదరు ఆటగాళ్ల పేర్లను ‘బీప్’సౌండ్‌తో వినపడకుండా కవర్ చేశారు. పాకిస్తాన్, శ్రీలంక ఆటగాళ్ల పేర్లు మాత్రం వినిపించాయి. హసన్ రజా (పాక్ తరఫున టెస్టు ఆడిన అతిపిన్న క్రికెటర్), దిల్హార లోకుహెత్తిగె, జీవంత కులతుంగ, తరిందు మెండీస్ (శ్రీలంక)లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తెలిసింది. వీరితో పాటు గాలే పిచ్ క్యురేటర్ తరంగ ఇండిక పేరు వినిపించింది. ఆయన గాలేలో జరిగిన శ్రీలంక–ఆసీస్, భారత్–లంక టెస్టుల్లో పిచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. శూల శోధన వీడియోలో డి–గ్యాంగ్‌కు చెందిన అనీల్ మునవర్ మాట్లాడుతూ ‘ప్రతీ స్క్రిప్టు నాదే. నేనిచ్చిందే జరుగుతుంది... జరిగి తీరుతుంది’ అని జర్నలిస్ట్‌కు వెల్లడించారు. ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాళ్లకు రూ. 2 కోట్లు నుంచి 6 కోట్ల వరకు ఇస్తామన్నారు. గాలే క్యురేటర్‌కు రూ. 25 లక్షలిచ్చామని ఇది ఆయన (క్యురేటర్) ఎనిమిదేళ్ల జీతంతో సమానమని చెప్పారు. భారత మాజీ దేశవాళీ ఆటగాడు రాబిన్ మోరిస్ మాట్లాడుతూ ‘నా చేతిలో 30 మంది ఆటగాళ్లున్నారు. వాళ్లంతా నేనేది చెబితే అదే చేస్తారు’ అని అన్నాడు. అతని వ్యాపార భాగస్వామి గౌరవ్ రాజ్‌కుమార్ ‘మాకు గేమ్ వినోదంతో పనిలేదు. ఆట గురించి పట్టించుకోం. మాకు కావాల్సింది డబ్బే! దాని కోసమే ఇదంతా చేస్తున్నాం’ అని చెప్పాడు. ఐసీసీ పూర్తిస్థాయి విచారణ... ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వెల్లడించింది. ఇందులో ఆరోపణలెదుర్కొంటున్న ఆటగాళ్ల దేశాలతో మాట్లాడి పూర్తిస్థాయి విచారణ జరుపుతామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మాత్రం... ముందు సాక్ష్యాలు కావాలని, విశ్వసనీయ రుజువులందాకే తమ ఆటగాళ్ల ప్రమేయంపై విచారణ చేపడుతామని తెలిపింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటీవ్ టామ్ హారిసన్ మాట్లాడుతూ భారత్‌తో జరిగిన టెస్టులో మాకెలాంటి సందేహాలు లేవని, ఆటగాళ్లను అనుమానించాల్సిన అవసరం లేదని అన్నారు. ఐసీసీ దర్యాప్తు తర్వాతే... ఐసీసీ దర్యాప్తు జరిగేదాకా వేచి చూస్తామని, ఆ తర్వాతే తమ బోర్డు పరిధిలో విచారణ నిర్వహిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై ఆటగాడు రాబిన్ మోరిస్‌కు బోర్డు నుంచి రూ. 22,500 పెన్షన్ చెల్లిస్తున్నామని, దోషిగా తేలితే దాన్ని నిలిపివేస్తామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. -
బిల్లులో మార్పులు చేయాల్సిందే: కాంగ్రెస్
కాంగ్రెస్ అడ్డుకుంటోంది:ఎన్సీపీ, బీజేడీ న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లులో తాము కోరిన సవరణలు చేయాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్ పునరుద్ఘాటించింది. బిల్లు విషయంలో ప్రధాని మోదీ కొద్ది రోజుల కిందట తమ పార్టీ చీఫ్ సోనియా గాంధీతో చర్చించటం శుభారంభమని, ఈ మార్పు కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్యసింధియా హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో మాట్లాడుతూ.. ఈ బిల్లుపై ప్రతిష్టంభనకు ప్రభుత్వమే కారణమన్నారు. జీఎస్టీ పన్నుపై 18 శాతం గరిష్ట పరిమితి విధించాలని, అంతర్రాష్ట్ర విక్రయాలపై ప్రతిపాదిత ఒక శాతం పన్నును తొలగించాలని, వివాదాలను పరిష్కరించటానికి స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని తమ డిమాండ్లను పునరుద్ఘాటించారు. అలాగే కాంగ్రెస్ హయాం లో ఎమర్జెన్సీ, 1984 సిక్కు అల్లర్లు తప్పని అన్నారు. అయితే.. జీఎస్టీ వంటి చట్టాలను కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఎన్సీపీ నేత సుప్రియాసూలే, బీజేడీ నేత జేపాండాలు విమర్శించారు. ప్రతిపక్షం తన పాత్రపోషించాల్సి ఉన్నప్పటికీ, దానర్థం చట్టాలను అడ్డుకోవటం కాదన్నారు. అంతర్రాష్ట్ర అమ్మకాలపై ఒక శాతం పన్ను తొలగింపు డిమాండ్‌కు మద్దతిస్తున్నామని.. అయితే.. జీఎస్టీపై 18 శాతం పరిమితిని రాజ్యాంగపరంగా విధించాలనటాన్ని సమర్థించలేమని పాండా అన్నారు. -
విరాట్ కోహ్లికి కష్టాలు
ఈ సారికి వదిలేద్దామన్న ఠాకూర్ పెర్త్/న్యూఢిల్లీ: భారత క్రికెటర్ విరాట్ కోహ్లి, తమ విలేకరితో వ్యవహరించిన తీరు పట్ల జాతీయ ఆంగ్ల దిన పత్రిక ‘హిందూస్తాన్ టైమ్స్’ ఆగ్రహంతో ఉంది. కోహ్లి పరోక్ష క్షమాపణతో దీనిని వదిలి పెట్టరాదని ఆ సంస్థ నిర్ణయించింది. అందుకే కోహ్లి వ్యవహార శైలిపై బీసీసీఐ, ఐసీసీలకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. ‘బోర్డు అధ్యక్షుడు దాల్మియాకు మేం ఫిర్యాదు చేశాం. ఆయన ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. అదే విధంగా మా రిపోర్టర్ కూడా పెర్త్‌లో ఐసీసీ సీఈ డేవ్ రిచర్డ్సన్కు ఫిర్యాదు చేశాడు’ అని పత్రిక క్రీడా సంపాదకులు వెల్లడించారు. మంగళవారం ప్రాక్టీస్ అనంతరం తనపై వ్యతిరేక వార్తలు రాశాడనే కారణంగా ఒక జర్నలిస్ట్‌పై ఆగ్రహంతో ఉన్న కోహ్లి... పొరపాటున మరో విలేకరిని బూతులు తిట్టిన సంగతి తెలిసిందే. అలా అనలేదు: మేనేజ్మెంట్ మరో వైపు విలేకరిని కోహ్లి తిట్టినట్లుగా వచ్చిన వార్తలను ఖండిస్తూ భారత టీమ్ మేనేజ్మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఈ విషయంలో కొంత అపార్థం చోటు చేసుకుంది. కోహ్లి ఎలాంటి అభ్యంతరకర భాష వాడలేదు. ఆ విలేకరితో కోహ్లి మాట్లాడాడు. వివాదం ముగిసిపోయింది’ అని పేర్కొన్నారు. ఆటగాళ్లందరి దృష్టీ ప్రపంచకప్‌పైనే ఉన్నందున మిగతా విషయాలన్నీప్రస్తుతానికి పక్కన పెట్టాలని బీసీసీఐ కొత్త కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అన్నారు. -
గ్రీన్ వారియర్.. మహిళా జర్నలిస్ట్
బహార్.. జగం తెలుసుకోవాల్సిన ఈ జర్నలిస్ట్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా.. వాళ్ల అమ్మ ప్రభాదత్ గురించి తెలుసుకోవాలి. హిందుస్థాన్ టైమ్స్‌లో ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్‌తో సాహసాలు రాసింది. ఇండియా, పాకిస్థాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎడిటర్ పర్మిషన్ కోసం ఎదురుచూడకుండా అద్భుతమైన కథనాలతో యుద్ధాన్ని కవర్ చేసిన మొదటి మహిళా జర్నలిస్ట్‌గా చరిత్రలో నిలిచింది. తల్లి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బర్ఖాదత్ కూడా కార్గిల్ యుద్ధానికి లైవ్ రిపోర్టింగ్ ఇచ్చింది. ఆమె చెల్లెలే.. బహార్. ఖైరతాబాద్‌లోని స్టాఫ్కాలేజ్లో ఓ వర్క్‌షాప్‌లో పాల్గొనడానికి వచ్చిన బహార్‌దత్ గురించి .. బహార్ దత్ పూర్వీకులు దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి ఢిల్లీ వచ్చి స్థిరపడిన సింధీలు. ఆమె తాత గోపాల్కిషన్దత్ స్వాతంత్య్ర సమరయోధుడు..అటు తర్వాత రాజకీయ నేత. తల్లి, అక్కా జగమెరిగిన జర్నలిస్టులు. ఆ ఇంట పుట్టిన బహార్ మరో కోణాన్ని ఆవిష్కరించాలనుకుంది. పచ్చదనం అన్నా.. దాని పరిరక్షణ అన్నా ఆమెకు ఇష్టం. అందుకే వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ అనే సంస్థలో చేరింది. సంచార జాతుల్లో ఒకరైన పాములు పట్టే వాళ్లకు పునరావాసం కల్పించే పని పెట్టుకుంది. అడవులు అంతరించిపోతున్నాయి. టైగర్ జోన్స్ హైవేలుగా మారుతున్నాయి. పర్యావరణం మీద ప్రజలకు అవగాహన కల్పించాలంటే జర్నలిజమే కరెక్ట్ అని.. కలం పట్టింది. ఇదంతా 2005 నాటి ముచ్చట. సీఎన్ఎన్ ఐబీఎన్‌తో.. జర్నలిజంలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న బహార్.. తాను ఫలానా ప్రభాదత్ కూతురనో, బర్ఖాదత్ చెల్లెలిననో చెప్పుకోలేదు. పేరు చివరన కూడా దత్ చేర్చలేదు. సీఎన్ఎన్ ఐబీఎన్‌లో ఎన్విరాన్మెంట్ రిపోర్టర్‌గా అవకాశం వచ్చింది. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న బహార్.. తిన్నగా చానల్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ దగ్గరకు వెళ్లి ‘పొలిటికల్ యాంగిల్లో ఎన్విరాన్మెంట్ రిపోర్టింగ్ చేస్తాను’ అని చెప్పింది. తొలి అడుగే సంచలనం వృత్తిలో చేరగానే అమె మొదట గురిపెట్టింది అప్పటి ఉత్తరప్రదేశ్ సీఎం ములాయం సింగ్ యాదవ్ మీదే. పచ్చటి అడవిని ఎయిర్ పోర్ట్‌గా మారుస్తున్న వైనాన్ని నిలదీసింది. ఆ స్టోరీ టెలికాస్ట్ అయిన మూడు రోజులకే ఎయిర్పోర్ట్ నిర్మాణం ఆగిపోయింది. అలా జర్నలిజంలో తొలి అడుగు విజయంతో మొదలుపెట్టింది. ‘అప్పుడందరూ ములాయంతో పెట్టుకుంటావా అని బెదిరించారు. అయినా నేనేం భయపడలేదు. రెండో స్టోరి గిర్ అడవులకు సంబంధించి! అదీ కలకలంరేపింది. తర్వాత శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట పవర్ ప్లాంట్ మీదా కథనమిచ్చాను. దాన్ని ఎక్కడ ఇగ్నోర్ చేస్తారేమోనని అది లోకల్ స్టోరీ కాదు నేషనల్ స్టోరీ అని మా ఎడిటర్‌తో డెరైక్ట్‌గా చెప్పాను. గోవాలోని ఓ మైనింగ్ కంపెనీ మీద చేసిన స్టోరీ చేస్తున్నప్పుడైతే నా మీద దాడి కూడా జరిగింది. కొందరు గూండాలు వచ్చి మా కెమెరాను లాక్కున్నారు. ఖాళీ టేప్‌లు ఇచ్చి అక్కడి నుంచి తప్పించుకున్నాం. నా ఎనిమిదేళ్ల జర్నలిజం చేసింది పది స్టోరీలే. వేటికవే సంచలనాలు’ అని బహార్ తన వృత్తిగతం చెప్పుకొచ్చింది. ఇన్ఫ్లుయెన్స్ నాపై పడకుండా చూసుకుంటాను. ఇండిపెండెంట్‌గా ఆలోచిస్తేనే రాణించగలం. ప్రస్తుతం నేను రాసిన ‘గ్రీన్ వార్స్’ అనే పుస్తకం ప్రమోటింగ్‌లో ఉన్నాను’ అంటూ తన జర్నో జర్నీ గురించి చెప్పింది బహార్. - సరస్వతి రమ ఫొటో: సృజన్ పున్నా