న్యూఢిల్లీ: ఇక మీదట వారానికి నాలుగు రోజులే పని దినాలుగా తీసుకురావాలని భావిస్తోన్న కేంద్రం కార్మిక శాఖ మరో నూతన చట్టం తీసుకురానుంది. దీని ప్రకారం కార్మికులు కంపెనీలో పనివేళలకు అదనంగా(ఓటీ) పని చేస్తే.. అందుకు వేతనం చెల్లించాలనే కొత్త నిబంధనను పరిశీలిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీని అమలుకు సన్నాహాలు చేస్తోంది.
హిందూస్తాన్ టైమ్స్ తాజా రిపోర్టు ప్రకారం సామాన్యంగా పనివేళలు ముగిసిన తర్వాత ఒక కార్మికుడు 15 నిముషాలు అదనంగా పనిచేస్తే దానికి కూడా సదరు కంపెనీ వేతనం చెల్లించాలని ఈ చట్టం చెబుతోంది. ఈ విధంగా కేంద్రం కొత్త నిబంధనలు, చట్టాల ద్వారా కార్మికులకు కొంత పని ఒత్తిడి తగ్గించడంతోపాటు, ఉత్పాదకత పెరిగే దిశగా ప్రోత్సహించాలని చూస్తోంది.
(చదవండి: ఇక వారానికి నాలుగే పనిరోజులు!)
Comments
Please login to add a commentAdd a comment