![All the corrupt are in BJP says Kejriwal - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/6/kejriwaalll.jpg.webp?itok=qmzUEZ5y)
చండీగఢ్: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతిపై పోరాటం పేరిట డ్రామాలు ఆడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆరోపించారు. అవినీతిపరులుగా ముద్ర పడిన వారిని బీజేపీలో చేర్చుకొని, మంత్రి పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఆదివారం హరియాణాలోని రోహ్‌తక్‌లో పార్టీ కార్యక్రమంలో కేజ్రివాల్ మాట్లాడారు. అవినీతిపై మోదీ సర్కారు సాగిస్తున్న పోరాటమంతా నాటకమేనని ధ్వజమెత్తారు.
నేరాలు, అవినీతికి పాల్పడిన వారు బీజేపీలో చేరుతున్నారని, దాంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు వారిని ఏమీ చేయలేకపోతున్నాయని పేర్కొన్నారు. బీజేపీలో చేరి రక్షణ పొందుతున్న అక్రమార్కుల జోలికెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదని చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసుల్లో చిక్కుకొని జైలుకెళ్లిన వారంతా అవినీతిపరులు కాదని కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. ఈడీ కేసుల భయంతో బీజేపీలో చేరినవారే అసలైన అవినీతిపరులని తేలి్చచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment