రామాయణ ప్రస్తావనతో సీఎం అతిషి భావోద్వేగం | Delhi CM Atishi Emotional Comments On AAP Chief Arvind Kejriwal, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

సీఎం అతిషి స్వామి భక్తి.. కేజ్రీవాల్‌ కోసం పెద్ద త్యాగం!

Published Mon, Sep 23 2024 1:00 PM | Last Updated on Mon, Sep 23 2024 1:50 PM

Delhi CM Atishi Emotional Comments On Arvind Kejriwal

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో సీఎం అతిషి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కుర్చీ ఎప్పటికీ కేజ్రీవాల్‌దేనని అన్నారు. ఈ సందర్బంగా సీఎంగా కేజ్రీవాల్‌ కూర్చున్న కుర్చీని పక్కనపెట్టి మరో కుర్చీ వేసుకుని కూర్చున్నారు.

ఢిల్లీ సీఎంగా అతిషి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. రాముడు 14 ఏళ్లు వనవాసంలో ఉన్నప్పుడు భరతుడు రాజ్యం బాధ్యతలు చేపట్టాల్సి వచ్చినప్పుడు ఎలాంటి బాధ కలిగిందో ఈరోజు నాకు కూడా అంతే బాధగా ఉంది. ఎంతో కఠిన సమయంలో బాధ్యతలు స్వీకరిస్తున్నాను. 14 ఏళ్ల పాటు భరతుడు కుర్చీపై చెప్పులు పెట్టుకుని పాలన కొనసాగించాడో.. అదే విధంగా, రాబోయే నాలుగు నెలల పాటు నేను ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తాను. అరవింద్ కేజ్రీవాల్‌పై తప్పుడు కేసులు పెట్టి, అరెస్టు చేసి ఆరు నెలలు జైల్లో ఉంచారు. ఢిల్లీ ప్రజలకు ఆయన నిజాయితీపై నమ్మకం ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం అరవింద్ కేజ్రీవాల్‌కే చెందుతుంది. ప్రజలు మళ్లీ ఆయనను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు’ అని కామెంట్స్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సీబీఐ, ఈడీ అరెస్ట్‌ కారణంగా కేజ్రీవాల్‌ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అనంతరం, సుప్రీంకోర్టు తీర్పుతో కేజ్రీవాల్‌ విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ సీఎంగా మంత్రి అతిషి ప్రమాణ స్వీకారం చేశారు. నేడు బాధ్యతలు స్వీకరించారు. 

 

ఇది కూడా చదవండి: కశ్మీర్‌లో ‘హంగ్‌’ రావొద్దనే... కాంగ్రెస్‌తో పొత్తుపై ఒమర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement