ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. తప్పక గెలవాల్సిన ఎన్నికల్లో ఫలితం తారు మారైతే మాజీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) భవితవ్యం కూడా గందరగోళంలో పడనుండగా.. తాజాగా, కేజ్రీవాల్ ( Arvind Kejriwal) చేసిన ఆరోపణలతో అక్కడి రాజకీయం రంజుగా మారింది.
సీఎం అతిశీ (Atishi Marlena) త్వరలోనే అరెస్ట్ కానున్నారంటూ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్ని ఢిల్లీ రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గోయల్ (Prashant Goyal) ఖండించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం,తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు.
గత బుధవారం ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ప్రస్తుత సీఎం అతిశీలు సంయుక్తంగా మీడియా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ..ఆ ట్వీట్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేంద్రం (బీజేపీ పెద్దలు) సమావేశమైంది. సమావేశంలో తమ ప్రభుత్వం ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తుంది. ఆ పథకాన్ని ఆపేందుకు కుట్ర పన్నింది. సీఎం అతిశీపై తప్పుడు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు అతిశీ ఇవ్వాళో, రేపో అరెస్ట్ కావొచ్చనే’ సమాచారం మాకు అందింది అని అన్నారు. ఆ మేరకు ట్వీట్ కూడా చేశారు.
महिला सम्मान योजना और संजीवनी योजना से ये लोग बुरी तरह से बौखला गए हैं।
अगले कुछ दिनों में फ़र्ज़ी केस बनाकर आतिशी जी को गिरफ्तार करने का इन्होंने प्लान बनाया है
उसके पहले “आप” के सीनियर नेताओं पर रेड की जायेंगी
आज 12 बजे इस पर प्रेस कांफ्रेंस करूँगा।— Arvind Kejriwal (@ArvindKejriwal) December 25, 2024
కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ గోయల్ (Prashant Goyal) స్పందించారు. ఆయన వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం,తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఢిల్లీ సీఎం అతిశీకి లేఖ రాశారు. ఆ లేఖలో ఉచిత బస్సు సర్వీసు పథకంపై విచారణ చేపట్టాలని ‘ది గవర్న్‌మెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ’ (gnctd),విజిలెన్స్ విభాగం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. కాబట్టే కేజ్రీవాల్ పేర్కొన్న దావా పూర్తిగా తప్పుగా, తప్పుదారి పట్టించేది’అని గోయల్ తన లేఖలో పేర్కొన్నారు.
కేజ్రీవాల్‌తో పాటు సీఎం అతిశీ మాట్లాడారు. నేను గట్టి నమ్మకంతో చెబుతున్నా. ఒక వేళ దర్యాప్తు సంస్థలు నాపై తప్పుడు కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా చివరికి నిజమే గెలుస్తోంది. దేశ న్యాయ వ్యవస్థపై గట్టి నమ్మకం ఉంది. అరెస్టయినా బెయిల్‌పై బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment