dramas
-
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని డ్రామా బట్టబయలు
సాక్షి, తిరుపతి: ఎన్నికల సమయంలో ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని డ్రామాలను స్వీమ్స్ డాక్టర్లు బట్టబయలు చేశారు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన పద్మావతి మహిళా వర్శిటీ వద్ద పోలింగ్ అనంతరం మే 14వ తేదీన జరిగిన ఘటనలో పులివర్తి నానికి ఎలాంటి గాయాలు కాలేదని స్విమ్స్ వైద్య నివేదికలు తేల్చి చెప్పాయి.స్విమ్స్ ఆసుపత్రిలో నాని తల, శరీరం, చేయి, కాలికి తీసిన ఎక్స్‌రే, ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్.. ఇలా ఆరు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో ఒక్కదానిలోనూ ఆయన గాయపడినట్లు వెల్లడికాలేదు. వైద్య నివేదికలు అన్ని కూడా ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తేల్చాయి. రాజకీయ లబ్ధి కోసం పులివర్తి నాని నాటకాలు ఆడినట్లు తేటతెల్లమైంది.మే 14వ తేది మధ్యాహ్నం 3గంటల తర్వాత సంఘటన జరిగితే దాదాపు రెండు గంటలకు పైగా వర్శిటీ పరిసరాల్లోనే నాని హుషారుగా నడుస్తూ కనిపించిన పులివర్తి నాని వీడియో దృశ్యాలు ఆశ్చర్య పరుస్తున్నాయి. ర్యాలీ, ధర్నాలో పాల్గొన్న నాని.. చక్కగా నేలపై కూర్చుని ఆందోళనలు చేశారు. నాడు ఆ వీడియోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. నడుస్తూ వెళ్లిన పులివర్తి నాని.. తర్వాత వీల్ చైర్లో ప్రత్యక్షమై నటన ప్రదర్శించారు. ఒక్క గాయం లేదని వైద్య నివేదికలు స్పష్టం చేశాయి.తలకు, శరీరానికి, చేతికి, భుజానికి, పొట్టకు, కాలికి ఇలా అన్ని పరీక్షలను విడుదల చేశారు. ఎక్స్‌రేలు, ఎంఆర్ఐలు, సిటీ స్కానింగ్. వైద్య పరీక్షలు అన్నిటిలోనూ నానికి ఎలాంటి గాయాలు లేవని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య నివేదికలు వెల్లడించాయి. నాని స్వార్థంతో చేసిన నాటకం వల్ల అనేక మంది అమాయకులు జైలులోనూ, వారి కుటుంబసభ్యులు ఇంటి వద్ద రోదిస్తున్నారు. ఎలాంటి గాయాలు లేని వ్యక్తి పెట్టిన కేసులో 37 మంది జైలు పాలయ్యారు. నెలల తరబడి జైలులో ఉంచారు. -
81st Golden Globe Awards 2024: 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో తారల సందడి.. ఫోటోలు
-
అవినీతిపరులంతా బీజేపీలోకే: కేజ్రివాల్
చండీగఢ్: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతిపై పోరాటం పేరిట డ్రామాలు ఆడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆరోపించారు. అవినీతిపరులుగా ముద్ర పడిన వారిని బీజేపీలో చేర్చుకొని, మంత్రి పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఆదివారం హరియాణాలోని రోహ్తక్లో పార్టీ కార్యక్రమంలో కేజ్రివాల్ మాట్లాడారు. అవినీతిపై మోదీ సర్కారు సాగిస్తున్న పోరాటమంతా నాటకమేనని ధ్వజమెత్తారు. నేరాలు, అవినీతికి పాల్పడిన వారు బీజేపీలో చేరుతున్నారని, దాంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు వారిని ఏమీ చేయలేకపోతున్నాయని పేర్కొన్నారు. బీజేపీలో చేరి రక్షణ పొందుతున్న అక్రమార్కుల జోలికెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదని చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసుల్లో చిక్కుకొని జైలుకెళ్లిన వారంతా అవినీతిపరులు కాదని కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. ఈడీ కేసుల భయంతో బీజేపీలో చేరినవారే అసలైన అవినీతిపరులని తేలి్చచెప్పారు. -
ఉద్యోగ మేళాల పేరిట మోదీ డ్రామాలు: ఖర్గే
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం విమర్శించారు. ఉద్యోగ మేళాల పేరిట మోదీ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఉద్యోగాలు, ప్రమోషన్లు వచి్చనవారికి మళ్లీ నియామక పత్రాలు ఇస్తూ ప్రచారం కోసం పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాల కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న కోట్లాది మంది యువత ఆశలపై ప్రధానమంత్రి నీళ్లు చల్లుతున్నారని ఆక్షేపించారు. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగిత శాతం రెండేళ్ల గరిష్టాన్ని అధిగమించిందంటూ ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లిమిటెడ్’ తాజాగా విడుదల చేసిన నివేదికను ఖర్గే ప్రస్తావించారు. మోదీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో 90 లక్షలకుపైగా ఉద్యోగాలు మాయమయ్యాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థిత మరింత దారుణంగా ఉందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనుల కోసం డిమాండ్ 20 శాతం పెరిగిందని తెలిపారు. మొత్తానికి దేశంలో నిరుద్యోగం 10.8 శాతానికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువతలో నిరుద్యోగం 13.4 శాతంగా ఉందని, ప్రభుత్వ సర్వేలోనే ఈ విషయం బయటపడిందని పేర్కొన్నారు. ఉద్యోగాల విషయంలో తప్పుడు ప్రకటనలు, ట్రిక్కులు ఎక్కువ కాలం చేయవని తేలి్చచెప్పారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలి్పంచకుండా అన్యాయం చేసిన వారిపై యువత ప్రతీకారం తీర్చుకుంటారని, ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతున్నారన్నారు. -
అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యా యత్నం ఓ నాటకం
గుడివాడ రూరల్: కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పెదపారుపూడి మండలం గుర్విందగుంటలో అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం నాటకమని తేలిపోయింది. వైఎస్సార్సీపీ నాయకుల ఒత్తిళ్లు, బెదిరిస్తున్నారంటూ ఆమె చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలింది. ఇదంతా ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు ఆడించిన డ్రామా అని తేలిపోయింది. ఆమె ఎలుకల మందు తాగలేదని వైద్యులు ధ్రువీకరించారు. జరిగిందిదీ.. అంగన్వాడీ కార్యకర్త అన్నపూర్ణ సక్రమంగా విధులు నిర్వర్తించడంలేదని, బాలలు, గర్భిణులు, బాలింతలకు అందించాల్సిన పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారని గ్రామ ప్రజలు ఎంపీటీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీటీసీ, ఐసీడీఎస్ అధికారులు రెండు రోజుల క్రితం అంగన్వాడీ కేంద్రంలో తనిఖీ చేశారు. కేంద్రంలో 11 మంది చిన్నారులకు కేవలం ఒక్కరే ఉండటంతోపాటు పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు నిర్ధారణ అయింది. ఉన్నతాధికారుల విచారణలోనూ ఇదే తేలింది. దీంతో సస్పెన్షన్ తప్పదని భావించింది. ఈ విషయం తెలిసి అంగన్వాడీ సూపర్వైజర్ భర్త అయిన ఎల్లో మీడియా విలేకరి, టీడీపీ నాయకులు కలిసి కార్యకర్తతో ఆత్మహత్య డ్రామా ఆడించారు. వారి సూచన మేరకు ఆమె ఎలుకల మందు నోటికి పూసుకుని ఆసుపత్రిలో చేరింది. ఎంపీటీసీ వేముల మోహన్, వైఎస్సార్సీపీ నాయకుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డానని ఆరోపణలు చేసింది. దీనిని అడ్డుపెట్టుకొని ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. అయితే, ఆమెను వైద్యులు పరీక్షించి, ఎటువంటి ఎలుకల మందు సేవించలేదని నిర్ధారించారు. వైద్యం అవసరం లేదని చెప్పారు. దీంతో టీడీపీ నాయకులు కొందరు విలేకరులను వైద్యుల వద్దకు పంపించి నివేదిక మార్చాలని బెదిరించారు. వీరి బెదిరింపులకు భయపడని వైద్యులు ఆ నివేదికను పోలీసుల ద్వారా బయట పెట్టారు. దీంతో ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు తోక ముడిచారు. -
కుప్పం వేదికగా చంద్రబాబు కని‘కట్టు’ కథ
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం వేదికగా నిన్నటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న హడావుడి అంతా ఇంతాకాదు. కందుకూరు, గుంటూరు టీడీపీ సభల్లో జనం చనిపోయిన ఉదంతాలను మరిపించి ప్రజల్లో సానుభూతి కోసం చంద్రబాబు చేస్తున్న డ్రామాలు పతాక స్థాయికి చేరాయి. పోలీసుల లాఠీఛార్జీలో తమ కార్యకర్తలు గాయపడ్డారంటూ నిన్నటి నుంచి గగ్గోలు పెట్టిన చంద్రబాబు… కనికట్టు కథ బట్టబయలైంది. చంద్రబాబు రాకముందు చేతికి, తలకు ఎటువంటి కట్లు లేకుండా ఎదురుచూస్తున్న టీడీపీ కార్యకర్తలు గురువారం కుప్పంలో ఆ కార్యకర్తలను పరామర్శించే ఒక సీన్‌ను చంద్రబాబు క్రియేట్ చేశారు. చంద్రబాబు పరామర్శకు వచ్చే సరికి మహానటులైన టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రిలో బెడ్ల మీద తమకు గాయాలతో బాధపడుతున్నట్టుగా ఒక స్టిల్ ఇచ్చారు. తీరా చంద్రబాబు రాగానే.. యథాలాపంగా తన వంతు పాత్రను రక్తికట్టించారు. వారిని ఓదారుస్తున్నట్టుగా, భరోసానిస్తున్నట్టుగా బ్రహ్మాండంగా స్టిల్స్ ఇచ్చారు. ఈ పరామర్శ ముగిసిన తర్వాత చంద్రబాబు తన దైన శైలిలో రెచ్చిపోతూ మీడియాతో మాట్లాడారు. ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడారు. అంత వరకూ చూసేవాళ్లకు బాగానే ఉంది. కాకపోతే.. ఇక్కడే ఒక ట్విస్ట్. చంద్రబాబు కనికట్టు కథ… బట్టబయలైంది. ఇలా చంద్రబాబు వెళ్లారో లేదో… ఆ వెంటనే మహా నటులైన టీడీపీ కార్యకర్తలు తమ బెడ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. చంద్రబాబు పరామర్శ సమయంలో కనికట్టు కన్నీరు పాలైన ఆ వార్డు.. తర్వాత ఖాళీగా దర్శనమిచ్చింది. బాబు వచ్చారు..పరామర్శ డ్రామా మొదలెట్టారు చంద్రబాబు వెళ్లగానే వార్డులో ఖాళీగా దర్శనమిస్తున్న బెడ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్ డ్రామాను చంద్రబాబు రక్తికట్టిస్తున్న తీరు.. -
విద్యార్థులకు ఉరి...మరోసారి వెలుగులోకి కిమ్ నిరంకుశపాలన
ఉత్తర కొరియాలో అద్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ నిరంకుశ పాలన గురించి తెలియంది కాదు. ఆయన పాలనలో ప్రజలు తనకు నచ్చినప్పుడూ నవ్వాలి, ఏడవాలి అన్నట్లుంటుంది. ప్రతిదీ తన అదుపు ఆజ్క్షలో ఉండాలనే మనస్తత్వంతో... ప్రజలపై పలురకాల అర్థం కానీ ఆంక్షలు పెట్లి ఇబ్బందులకు గురిచేస్తాడు. ఇప్పుడూ అదీ కాస్తా మరోస్థాయికి చేరిందనేలా ఒక దారుణమై ఘటన వెలుగులోకి వచ్చింది. పసివాళ్లని జాలి కూడా లేకుండా ఇద్దరు హైస్కూల్ విద్యార్థులకు ఉరిశిక్ష విధించి మరోసారి ప్రపంచానికి తన కర్కశత్వ పాలనను చూపించాడు. అక్టోబర్ ప్రాంతంలో ఆ ఇద్దరు విద్యార్థులు చైనా సరిహద్దుగా ఉన్న ఉత్తరకొరియాలోని ర్యాంగ్‌గాంగ్ ప్రావిన్స్‌లోని ఒక ఉన్నత పాఠశాలలోని కొంతమంది విద్యార్థులను కలుసుకున్నారు. అక్కడ వారు దక్షిణ కొరియా సినిమాలు, అమెరికన్ నాటక ప్రదర్శనలను వీక్షించారని సమాచారం. దీంతో ఉత్తరకొరియా అధికారులు ఆ మైనర్లను ప్రజల ముందే మరణశిక్ష విధించి.. కాల్చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఉత్తర కొరియా సాంస్కృతిక సాధనాలను నియంత్రించే సైద్ధాంతిక చట్టాన్ని రూపొందించింది. ఈ మేరకు ఉత్తర కొరియాలో డ్రామాలు, సంగీతం పట్ల పెరుగుతున్న ప్రజాదరణను లక్ష్యంగా చేసుకుని విదేశీ ప్రభావం ఉండకూదని అణిచివేతలో భాగంగా నిషేధించింది. వాస్తవానికి ఉత్తరకొరియాలోకి దక్షిణ కొరియా సినిమాలను అక్రమంగా రవాణా అవ్వటమే గాక ప్రజలు ఎవరికంట పడకుండా అతి రహస్యంగా వీక్షిస్తుండటం గమనార్హం. (చదవండి: ప్రయాణికుడి బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువు...దెబ్బకు ఎయిర్పోర్ట్ క్లోజ్) -
అయ్యో.. అయ్యయ్యో.. బాబూ!
సాక్షి, కర్నూలు: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిలో ‘అధికార దాహం’ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏపీ ప్రజల సానుభూతి కోసం ఎంతగా వెంపర్లాడుతున్నాడంటే.. ఎమోషనల్ డ్రామాకు తెర తీస్తున్నారు. కర్నూల్ పత్తికొండ పర్యటనలో ఇదే తనకు చివరి ఎన్నిక అంటూ ప్రకటించి.. పక్కనే ఉన్న సొంత పార్టీ నేతలనే నివ్వెరపోయేలా చేశారు. అందుకే కర్నూల్ పర్యటనలో చంద్రబాబుకు జనం చుక్కలు చూపించారు. తనకు అవమానం జరిగిందని, మీరు(ప్రజలను ఉద్దేశించి..) గెలిపించి అసెంబ్లీకి పంపితే సరేనని, 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే నాకు ఆఖరి ఎన్నికలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. చూస్తుంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం చంద్రబాబు ప్రతీ మాటలోనూ కనిపించింది. అన్ని వర్గాలకు సంక్షేమం అత్యంత పారదర్శకంగా అందుతుండడం, ప్రభుత్వానికి ప్రజల మద్దతు పూర్తి స్థాయిలో కొనసాగుతుండడం.. ముఖ్యంగా టీడీపీ గత ఎన్నికల్లో నెగ్గిన 23 స్థానాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టడం, చొరవ తీసుకుని అభివృద్ధి చేయిస్తుండడం యెల్లో బ్యాచ్‌కి మింగుడు పడడం లేదు. ఈ పరిస్థితితో చంద్రబాబుకు సొంత నియోజక వర్గం కుప్పంలోనూ ఆశలు సన్నగిల్లితున్నట్లు అర్థమయింది. పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో ఘోర ఓటమితో పూర్తిగా అవగతం అయ్యింది. ఇక ఒక అడుగు ముందుకేసి.. ఆయన నియోజకవర్గమూ మారతారనే ప్రచారం, అదీ టీడీపీలోనే జోరుగా సాగుతుండడం గమనార్హం. అందుకే కొత్తగా చివరి ఎన్నిక అంటూ ప్రకటనలు ఇస్తున్నారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. అందుకే ఇలా భావోద్వేగమైన ప్రకటనలు ఇస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. అఫ్కోర్స్.. ఆ ప్రకటనలకు జనాల నుంచి లభించిన స్పందన పెద్దగాఏమీ లేదు. తమ నాయకుడే ఇలా ధైర్యం కోల్పోతే.. ఇక తమ పరిస్థితి ఏంటని అనుకుంటేనే చంద్రబాబుపై జాలి, మరోవైపు పార్టీ పరిస్థితి ఇలా అయ్యిందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకోవద్దన్న ప్రజలు.. ముందు మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు ద్రోహం చేయొద్దంటూ పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. తొలుత చంద్రబాబు కాన్వాయ్ పత్తికొండకు చేరుకోగానే అడ్డుకునేందుకు స్థానికులు యత్నించారు. గో బ్యాక్ బాబు.. రాయలసీమ ద్రోహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు దేవనకొండలో విద్యార్థి, ప్రజాసంఘాల సంఘాల నేతలు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఇలా దొంగ డ్రామాలు ఆడుతూ.. తప్పుడు స్టేట్మెంట్లతో ముందుకు వెళ్తున్న చంద్రబాబుకు నిరసన సెగలు తగలడం మాత్రం ఆగట్లేదు!. -
మరోసారి అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు.. అసలు రహస్యం బట్టబయలు
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: నిజాన్ని అబద్ధంగా చెప్పించే ప్రయత్నం చేసి మరోసారి టీడీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. అసలు రహస్యం వీరమ్మ కుమారుడు బయటపెట్టాడు.దీంతో మీడియా సాక్షిగా పచ్చనేతలు దొరికిపోయారు. చదవండి: ఇదే చివరి అవకాశం.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు అయోధ్య లంక మర్రిమూలలో వరద నీరు బాటిల్లో పట్టించి ఇప్పటికే నవ్వుల పాలైన టీడీపీ నేతలు.. వీరమ్మ కుమారుడు వీరాంజనేయులతో మీడియా సమావేశం పెట్టించి.. వైఎస్సార్సీపీ నేతలు బెదిరించి చెప్పమన్నారంటూ టీడీపీ నేతలు చెప్పించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు బెదిరించలేదని వీరాంజనేయులు మీడియా సమావేశంలో చెప్పడంతో టీడీపీ నేతలు అవాక్కయ్యారు. నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించాలని చూసి మరోసారి టీడీపీ నేతలు అభాసు పాలయ్యారు. -
కుప్పంలో టీడీపీ నేతల ‘కరెంట్ డ్రామా’
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వంపై బురద జల్లడానికి కుప్పం(చిత్తూరు) టీడీపీ నేతలు ఎన్నిరకాల అడ్డదారులు తొక్కాలో.. అన్ని దారుల్లోనూ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కరెంట్ కోతల డ్రామాను తెర మీదకు తీసుకొచ్చారు. ఒక పథకం ప్రకారం రాత్రివేళల్లో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను బంద్ చేయిస్తున్న పచ్చ నేతలు.. ఆ వెంటనే కరెంట్ లేదంటూ కొవ్వొత్తులతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే అసలు విషయం వెలుగు చూడడంతో ఇప్పుడు నీళ్లు నములుతున్నారు. ఇక ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లోనే నడుస్తున్న డ్రామా అంటున్నారు స్థానిక నేతలు. విషయం వెలుగులోకి రావడంతో ఈ కుట్ర వెనుక ఉన్న టీడీపీ నేతపై కేసు నమోదు అయ్యింది. అంతేకాదు.. విద్యుత్ సరఫరాను నిలిపివేసిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. -
టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం
చిలమత్తూరు(శ్రీ సత్యసాయి జిల్లా): టీడీపీ నేతలు దిగజారిపోతున్నారు. ఏదో ఒక వంకతో ప్రభుత్వంపై బురద జల్లేందుకు కుట్రలు చేస్తూనే ఉన్నారు. మండలంలోని సంజీవరాయునిపల్లికి చెందిన ఓ మహిళ టీడీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా వైకల్య ధ్రువీకరణ పత్రం పొంది పింఛన్ మంజూరు చేయించుకుంది. ఈ విషయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు దామోదర్ రెడ్డి ఇటీవల ఆమెను ప్రభుత్వానికి ఎందుకు నష్టం తెస్తున్నారంటూ ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన ఆమె కుమారుడు, టీడీపీ కార్యకర్త వేణు తప్పతాగి రెండు రోజుల క్రితం దామోదర్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి గొడవకు దిగి దుర్భాషలాడాడు. చదవండి: పన్నెండేళ్ల ప్రేమ.. పోలీసుల సమక్షంలో పెళ్లి.. దీనిపై దాము ఎస్ఐ రంగడుకు సమాచారం అందించగా, ఆయన ఇద్దరు కానిస్టేబుళ్లను గ్రామానికి పంపారు. వారిపైనా దౌర్జన్యానికి దిగిన వేణు లంచాలు తీసుకొనే ఎస్ఐ నన్ను రమ్మన్నాడా అంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడాడు. ఇంతా చేసి, శనివారం దామోదర్‌రెడ్డిపైనే ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఎస్ఐ రంగడు.. తప్పుడు పనులు చేయడమే కాకుండా లంచగొండులమంటూ తమనే దూషిస్తావా అంటూ అతడిని మందలించారు. ఈ విషయాలన్నింటినీ ముందస్తు ప్లాన్ ప్రకారం వేణుతో వచ్చిన టీడీపీ నాయకులు వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా కుట్రకు తెరలేపారు. టీడీపీ నాయకుడు నారా లోకేష్ సైతం పోలీసు వ్యవస్థపై బురదజల్లే యత్నం చేశారు. పోలీసులపైనే దౌర్జన్యం చేసి నానా తిట్లు తిట్టిన వ్యక్తిని వెనకేసుకొస్తూ టీడీపీ నేతలు నాటకాలు చేస్తుండడంపై జనం విస్తుబోతున్నారు. సదరు మహిళ పింఛన్ తొలగించకున్నా, తొలగించారంటూ లోకేష్ నానా యాగీ చేయడంపై నవ్వుకుంటున్నారు. ఇదిలాఉంటే, వీడియో విషయమై స్పందించిన జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. -
గండం ఉందని గల్లంతు నాటకం
కొలిమిగుండ్ల(కర్నూలు): భర్త, కుమార్తెకు ప్రాణ గండం ఉందని, దాని నుంచి వారు బయట పడేందుకు ఓ మహిళ తాను గల్లంతైనట్లు నాటకం ఆడింది. మూడు రోజుల పాటు అనంతపురంలో ఉండి ఆదివారం తాపీగా ఇంటికి చేరుకుంది. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లెకు చెందిన రసూల్‌బీతో పాటు కూతురు, బంధువులు, ఇంటి పొరుగున ఉన్న మహిళలు మొత్తం పది మంది కలిసి శుక్రవారం ఆటోలో బయలుదేరి ముందుగా తుమ్మలపెంట పొలిమేర సమీపంలో ఉన్న సుంకులమ్మ గుడి వద్ద పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి గొర్విమానుపల్లె సమీపంలోని లొక్కిగుండం వద్దకు చేరుకున్నారు. రామేశ్వరస్వామిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో గుండంలో నీటిలో దిగారు. రసూల్‌బీ గుండంలో గల్లంతయిందని కూతురుతో పాటు శివమ్మ, తోటి మహిళలంతా ఘంటా పథంగా చెప్పారు. అక్కడే ఉన్న పూజారితో పాటు అంకిరెడ్డిపల్లె, గొర్విమానుపల్లె గ్రామాల నుంచి భారీగా అక్కడికి చేరుకొని ఆచూకీ కోసం నీళ్లలోకి దిగి వెతకటం ప్రారంభించారు. రాత్రంతా అక్కడే ఉండి ప్రయత్నం చేసినా కుదరలేదు. శనివారం అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ సహకారంతో జనరేటర్ ఏర్పాటు చేసి మోటార్ల సాయంతో రాత్రి తొమ్మిది గంటల వరకు నీటిని బయటకు పంపింగ్ చేశారు. కేవలం మూడు అడుగుల నీళ్లు ఉండటంతో యువకులు నీళ్లలో దిగి గుండం అంతా జల్లెడ పట్టినా ఆనవాళ్లు దొరకలేదు. చివరకు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రయత్నం చేశారు. తాపీగా బస్సు దిగి ఇంట్లోకి.. గుండంలో మూడు రోజుల నుంచి గ్రామస్తులు, బంధువులు విశ్వప్రయత్నాలు చేస్తున్న ఉత్కంఠ సమయంలో మధ్యాహ్నం తాపీగా బస్సు దిగి రసూల్‌బీ ఇంట్లోకి వెళ్లడంతో హైడ్రామా ముగిసింది. గ్రామస్తులు భారీగా ఆగ్రహావేశాలతో ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈలోగా పోలీసులు గ్రామానికి చేరుకొని రసూల్‌బీలో పాటు తాడిపత్రిలో ఉన్న ఆమె అక్క, బావలు శివమ్మ, కార్తీక్ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. భర్త, కూతురుకు ప్రాణగండం ఉందని చెప్పారని, మూడు రోజుల పాటు కనిపించ కుండా పోతే గండం తప్పి పోతుందనే ఉద్దేశంతోనే ఈ నాటకం ఆడినట్లు ఆమె పోలీసులకు చెప్పారు. అనంతపురంలో ఉండి ఆమె ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండేది. చివరకు భయపడి ఇంటికి చేరుకుంది. విచారణ కోసం అందరినీ కోవెలకుంట్ల సర్కిల్ కార్యాలయానికి తీసుకెళ్లారు. -
అన్నదాతల ‘ఆత్మ’ సాక్షిగా రాజకీయం!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లా నల్లమాడ మండలం వంకరకుంట గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు సాకే రామకృష్ణ (40) ఆర్థిక సమస్యలతో 2020లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే మండలంలోని బాసంవారిపల్లి గ్రామానికి చెందిన గజ్జెల ఓబయ్య(38)కు సెంటు భూమి కూడా లేదు. ఇతను కూడా అప్పుల బాధ తాళలేక 2019 జూన్ 27న రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుత్తికి చెందిన పుల్లారెడ్డి పేరుపై ఎలాంటి భూమి లేదు. ఇంట్లో సమస్యలతో ఇతనూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇలా ఈ జిల్లాలో కండ్లగూడూరుకు చెందిన రమణారెడ్డి, ముప్పాలగుత్తికి చెందిన బాల దస్తగిరి, బందార్లపల్లికి చెందిన ఎ.సోమశేఖర్, పెద్దవడుగూరుకు చెందిన కె.నారాయణస్వామి, తనకల్లు మండలం కోటూరుకు చెందిన శివరామిరెడ్డి, మరో ఎనిమిది మంది.. మొత్తంగా ఇలా రైతులు కాని 16 మంది వేర్వేరు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 12 మందికి ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తరఫు నుంచి వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష చొప్పున పరిహారం అందింది. (మిగిలిన నలుగురిలో ఒకరిది కర్ణాటక, మరో మగ్గురు 2013కు ముందే మృతి చెందారు) అయితే వీరంతా రైతులని, వీరి కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇంతటితో ఆగకుండా ఈ 16 మందితో పాటు ఆత్మహత్య చేసుకున్న 15 మంది రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఇటీవల ఆర్థిక సాయం చేసి, రాజకీయంగా వాడుకునేందుకు వ్యూహ రచన చేశారు. వాస్తవానికి ఈ 15 మంది రైతు కుటుంబాలను ప్రస్తుత ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోంది. వీరిలో ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున (అప్పటి నిబంధనల ప్రకారం), ఏడుగురికి రూ.7 లక్షల చొప్పున పరిహారం అందించారు. మరో ఆరుగురు రైతులకు రూ.7 లక్షల చొప్పున సాయం అందించే ప్రక్రియ కొనసాగుతోంది. నాడు ఒక్కమాటైనా అన్నారా? 2014–19 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వడానికి అప్పటి టీడీపీ ప్రభుత్వానికి చేతులాడలేదు. ప్రతిదానికి ప్రశ్నిస్తాననే పవన్ కల్యాణ్ చంద్రబాబును ఎందుకు పరిహారం ఇవ్వలేదని ఒక్క ప్రశ్నా వేయలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. పైగా టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు కూడా పరిహారం అందించింది. కౌలు రైతులకు కూడా పరిహారం అందజేస్తోంది. ఈ విషయం రాష్ట్రంలో ఏ రైతును అడిగినా చెబుతారు. ఈ నేపథ్యంలో రైతులు కాని వారిని సైతం రైతులుగా చిత్రీకరించి, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపు కోవడానికి, రాజకీయంగా లబ్ధి పొందడానికి పవన్ కల్యాణ్ పొలిటికల్ ‘టూర్’ ప్రారంభించారని రైతు సంఘాల నేతలు, రైతుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌కల్యాణ్ హడావిడి చేసిన తీరుపై బాధిత రైతులు సైతం నోరెళ్లపెడుతున్న పరిస్థితి. పరిహారం ఇవ్వడం తప్పు కాకపోయినా, ప్రభుత్వం ఆదుకోనందునే తాను ముందుకు వచ్చానని చెప్పడం సరికాదని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందరూ రైతులేనా? పవన్‌కళ్యాణ్‌కు రైతులెవరో, కౌలు రైతులెవరో.. చేనేతలెవరో కూడా తెలియని పరిస్థితి. అందరినీ ఒకేగాట కట్టేసి.. చనిపోయిన వారంతా రైతులే అంటూ రాజకీయ విమర్శలు చేశారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నల్లమాడ మండలం వంకరకుంటకు చెందిన చేనేత కార్మికుడు సాకే రామకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం రూ.లక్ష సాయం అందించింది. ఈ కుటుంబానికి వితంతు పింఛన్, అమ్మ ఒడి పథకాన్నీ వర్తింపజేసింది. ఈ విషయం ఆ ఊళ్లో అందరికీ తెలుసు. అయితే పవన్ కల్యాణ్ ఇతన్ని కౌలు రైతు అంటూ హడావుడి చేయడంపై ఆ గ్రామస్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. పరిహారం ప్రక్రియ ఇలా.. ♦రైతులు/ కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే అధికారుల పంచనామా మొదలుకొని నివేదిక ఇచ్చే వరకు పక్కాగా వివరాలు సేకరిస్తారు. వీఆర్వో లేదా వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌కు, పోలీసులకు సమాచారం ఇస్తారు. వైఎస్సార్ బీమా పోర్టల్‌లో సంబంధిత వ్యక్తి వివరాలు అప్లోడ్ చేస్తారు. ♦పోలీసు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎస్ఐతో కలిసి మండల తహశీల్దార్, మండల వ్యవసాయాధికారి (త్రీమెన్ కమిటీ) గ్రామానికి వెళ్లి రైతు ఆత్మహత్యపై అన్ని వివరాలు సేకరిస్తారు. ♦త్రీమెన్ కమిటీ రిపోర్టుకు శవ పంచనామా, పోస్టు మార్టమ్ రిపోర్టు, డెత్ సర్టిఫికెట్, పురుగు మందులు తాగినట్లు రుజువు చేసే రిపోర్టు అన్నీ జత చేయాలి. ♦త్రీమెన్ కమిటీ రిపోర్టు డివిజన్ కమిటీకి పంపిస్తారు. డివిజన్ కమిటీలో ఆర్డీవో, డీఎస్పీ, వ్యవసాయశాఖ ఏడీ ఉంటారు. ఈ కమిటీ మరోసారి క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్థారించుకున్న తర్వాత రైతు ఆత్మహత్యకు పరిహారం ఇవ్వాలని రిపోర్టు తయారు చేసి, వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడి నుంచి ఫైలు జాయింట్ కలెక్టర్‌కు, ఆపై కలెక్టర్‌కు వెళ్తుంది. ♦అనంతరం డైరెక్ట్ బెనిఫిషర్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానంలో నామినీకి సీఎఫ్ఎంఎస్ ద్వారా పరిహారం అందజేస్తారు. -
పవన్ పర్యటనపై మండిపడుతున్న రైతులు, రైతు సంఘాలు
-
బయటపడ్డ పవన్ కల్యాణ్ రాజకీయ డ్రామాలు
సాక్షి, అనంతపురం, సత్యసాయి జిల్లా: టీడీపీ పాలనలో రైతు ఆత్మహత్యలపై నోరు మెదపని పవన్ కల్యాణ్.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరామర్శ పేరుతో ఇప్పుడు రాజకీయ డ్రామాలకు తెర తీశారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రాజకీయ లబ్ధి కోసమే పవన్ పర్యటనలు చేస్తున్నారని రైతులు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి. చదవండి: నెరవేరబోతున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల.. ఆత్మహత్య చేసుకున్న ఒక్కొ రైతు కుటుంబానికి రూ. 7 లక్షల చొప్పున వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 201 మందికి రూ.11.95 కోట్లు పంపిణీ చేసింది. గతంలో 110 మంది రైతు కుటుంబాలకు చంద్రబాబు పరిహారం ఎగొట్టారు. టీడీపీ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పరిహారం అందజేసింది. ఆర్థిక సాయాన్ని రూ.5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచింది. ఎవరిని ఉద్దరించేందుకు వస్తున్నారు? ‘అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షల మేర ఆర్థిక సాయం అందించింది. చివరకు టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలనూ సీఎం జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పథంతో ఆదుకున్నారు. బాధిత కుటుంబాలు గౌరవంగా బతుకుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆదుకునే పేరుతో అల్లరి చేసేందుకే వస్తున్నట్లు ఉన్నారు’’ అని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునే పేరుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కొత్తచెరువుకు చెందిన రైతు రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం వస్తుండగా.. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి స్పందించారు. రైతు రామకృష్ణ ఆత్మహత్య చేసుకుంటే 17 రోజుల్లోనే రూ.7 లక్షలు అందించామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇప్పుడు పవన్ పర్యటన ఎవ్వరిని ఉద్దరించేందుకని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇంత పెద్ద మొత్తంలో పరిహారం అందించలేదన్నారు. -
లంకలో కల్లోలం
కొలంబో: అల్లకల్లోలంగా మారిన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే పలు చర్యలను ప్రకటించారు. కేంద్ర కేబినెట్లో చేరాల్సిందిగా ప్రతిపక్షాలను ఆయన సోమవారం ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని ప్రతిపక్షాలు తిరస్కరించాయి. ప్రతిపక్షాలను ప్రభుత్వంలో చేరమని గొటబయ ఆహ్వానించడం ఒక డ్రామా అని ప్రతిపక్ష నేత సమగి జన బలవేగయ విమర్శించారు. సజిత్ ప్రేమదాస, మనో గణేసన్ తదితర విపక్ష నేతలు సైతం ఈ అఖిల పక్ష ప్రభుత్వ యోచనను తిరస్కరించారు. గొటబయ తమ్ముడు, లంక ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సేను ఆర్థిక మంత్రి పదవి నుంచి అధ్యక్షుడు స్వయంగా తొలగించారు. బసిల్ స్థానంలో ప్రస్తుత న్యాయమంత్రి ఆలి సబ్రేను నియమించారు. బెయిల్ అవుట్ ప్యాకేజీపై చర్చించేందుకు బసిల్ సోమవారం అమెరికా వెళ్లి ఐఎంఎఫ్‌తో చర్చలు జరపాల్సిఉంది. భారత రిలీఫ్ ప్యాకేజీపై కూడా బసిలే చర్చలు జరిపారు. అయితే బసిల్ చర్యలపై లంక అధికార పక్షం ఎస్ఎల్పీపీ కూటమిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో అధ్యక్షుడు బసిల్‌ను తొలగించినట్లు తెలిసింది. ఆదివారం కేబినెట్లోని మొత్తం 26మంది మంత్రులు తమ రాజీనామాలను సమర్పించారు. అనంతరం కొత్తగా కొందరు మంత్రులు పదవీ స్వీకారం చేశారు. కేంద్ర బ్యాంకు గవర్నర్ రాజీనామా లంక కేంద్ర బ్యాంకు గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ సోమవారం రాజీనామా చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో కబ్రాల్ ఈ పదవిని స్వీకరించారు. గతంలో ఆయన కేంద్ర సహాయ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2006–15 కాలంలో ఆయన కేంద్రబ్యాంకు గవర్నర్‌గా వ్యవహరించారు. రెండోదఫా గవర్నర్ పదవి స్వీకరించాక ఆయన విదేశీ రుణాలపై ఆధారపడడాన్ని తగ్గించే యత్నాలు చేశారు. సంక్షోభం ముదురుతున్నా బెయిలవుట్‌ను వ్యతిరేకించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరింది. మితిమీరి కరెన్సీ ముదణ్రకు కబ్రాల్ అనుమతివ్వడమే ఇందుకు కారణమన్న ఆరోపణలున్నాయి. కబ్రాల్ వ్యతిరేకతను పట్టించుకోకుండాప్రభుత్వం ఇటీవల ఐఎంఎఫ్‌ను సాయం ఆర్థించింది. లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగం ప్రధాని మహింద రాజపక్సే ఇంటిని చుట్టుముట్టిన ఆందోళనకారులను చెదరకొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగానికి దిగారు. కర్ఫ్యూ ఆదేశాలను లెక్కచేయకుండా దాదాపు 2వేల మందికి పైగా ఆందోళనకారులు తంగాలె లోని మహింద ఇంటిని చుట్టుముట్టారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని వీరు డిమాండ్ చేశారు. వీరిపై పోలీసులు బలపయ్రోగానికి దిగారు. నిజానికి ఈ ప్రాంతంలో రాజపక్సే కుటుంబానికి చాలా పట్టు ఉంది. అయితే సంక్షోభం ముదిరిపోయి జీవితాలు అస్థవ్యస్థమవుతుండడంతో సాధారణ ప్రజల్లో మహిందపై వ్యతిరేకత ప్రబలిందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో రాజపక్సే కుటుంబానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గొటబయ రాజీనామా కోరుతూ ప్రజలు వీధుల్లో ఆందోళనకు దిగుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు గొటబయ ప్రకటించారు. -
బెడిసికొట్టిన కిడ్నాప్ డ్రామా
సాక్షి, వేలూరు(తమిళనాడు): ఆంబూరులో కిడ్నాప్ నాటకం ఆడిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా ఆంబూరులోని ముకకొల్లై ప్రాంతానికి చెందిన ఎర్రగడ్డల వ్యాపారి ఆశీన్. ఇతను ఆదివారం రాత్రి ఆంబూరు సమీపంలోని వేంగిలిలో ఉన్న అత్తగారింటికి కారులో బయలుదేరాడు. ఈ సమయంలో ముగ్గురు యువకులు కారును వెంబడించి కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. అక్కడ నుంచి తప్పించుకున్న ఆశీన్ ఆంబూరు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆశీన్‌కు పిల్లలు లేక పోవడంతో అక్క కుమారుడు అమీద్(21)ను పెంచుకుంటున్నాడు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో అమీద్ సెల్ నెంబర్ నుంచి ఆశీన్‌కు ఫోన్ వచ్చింది. అందులో గుర్తుతెలియని వ్యక్తులు అమీద్‌ను కిడ్నాప్ చేశామని రూ. 10 లక్షలు ఇస్తే వదిలి పెడుతామని హెచ్చరించారు. వీటిపై ఆశీన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు మాదనూర్ వద్ద ఉన్నట్లు సెల్‌ఫోన్ సిగ్నిల్స్ ద్వారా గుర్తించి.. అక్కడ కారులో దాగి ఉన్న అమీద్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఆంబూరు ఆయిల్లా నగర్‌కు చెందిన మహ్మద్ సిద్దిక్, కుపేర వీధికి చెందిన అర్హత్ అబీ, పూతోటకు చెందిన పయాస్ అహ్మద్‌గా తెలిసింది. ఈ ముగ్గురు కిడ్నాపర్లు అమీద్ స్నేహితులుగా తెలిసింది. ప్రణాళిక ప్రకారం మామ అశీన్ కిడ్నాప్ చేయడానికి వేసిన పథకం విఫలం కావడంతో.. అమీద్ తనను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు నాటకం ఆడినట్లు తేల్చారు. -
కుప్పంలో కొత్త నాటకం.. టీడీపీ సానుభూతి డ్రామా
సాక్షి, తిరుపతి/చిత్తూరు అర్బన్: కుప్పంలో టీడీపీ కొత్త నాటకానికి తెరలేపింది. మున్సిపల్ కార్యాలయంపై ఆ పార్టీ శ్రేణులతో దాడి చేయించి వైఎస్సార్ సీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తోంది. తద్వారా సానుభూతి పొంది మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని పన్నాగం పన్నింది. ఎంతచేసినా ఓటర్ల నుంచి స్పందన కనిపించలేదు. దీనికితోడు పార్టీలో 30 ఏళ్లుగా కీలకంగా ఉన్న ముగ్గురు నాయకులు చేసిన అవినీతి, అక్రమాలు శాపంగా మారడంతో టీడీపీ కేడర్ డీలాపడిపోయింది. చదవండి: తిరుపతిలో కుండపోత వర్షం ఆ రోజు ఏం జరిగిందంటే నామినేషన్ల ఉపసంహరణ రోజు సోమవారం రాత్రి 14వ వార్డు టీడీపీ అభ్యర్థులు ప్రకాష్, తిరుమగన్ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి మునుస్వామి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్వో ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. తమ అభ్యర్థి ఎవ్వరూ నామినేషన్లు ఉపసంహరించుకోలేదంటూ పథకం ప్రకారం సుమారు 150 మంది మున్సిపల్ కార్యాలయం గేట్లను తోసుకుని లోనికి వచ్చారు. అద్దాలు ధ్వంసం చేశారు. కమిషనర్‌ను నోటికి వచ్చినట్టు దూషించడంతోపాటు బెదిరింపులకు దిగారు. ‘వచ్చేది మా ప్రభుత్వం. మేం చెప్పినట్టు వినకపోతే నడిరోడ్డుపైనే నిలబెట్టి నరుకుతాం. రాష్ట్రంలో ఎక్కడ పనిచేస్తున్నా కుప్పానికి తీసుకొచ్చి రోడ్డుపై తన్నుకుంటూ పోతాం’ అంటూ హెచ్చరించారు. క్రిమినల్ కేసులు నమోదు తనపై దాడికి యత్నించిన టీడీపీ నాయకులపై కుప్పం మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఐపీసీ సెక్షన్ కింద 143, 147, 353, 427 రెడ్ విత్ 149, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినందుకు కేసులు నమోదు చేశారు. తమకు అన్యాయం జరిగితే శాంతియుతంగా నిరసన తెలపాలని, దౌర్జన్యాలు, దాడులకు తెగపడడం తగదని హితవుపలికారు. ఎన్నికలు సజావుగా సాగాలంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు కుప్పం వదలి వెళ్లాలని హెచ్చరించారు. అయినా టీడీపీ నేతలు లెక్కచేయకుండా కుప్పం హోటల్లో బసచేశారు. వారిని మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు చిత్తూరు, పలమనేరులో వారి నివాసాల వద్ద విడిచిపెట్టారు. వెంటాడుతున్న ఓటమి భయం మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. 30 ఏళ్లుగా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, చంద్రబాబు పీఏ మనోహర్, పీఎస్ మునిరత్నం అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. ఈ విషయం తెలిసినా చంద్రబాబు ఏ రోజూ పట్టించుకోలేదని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఓటర్లు వైఎస్సార్ సీపీ వైపు ఉన్నారని గుర్తించి తటస్తంగా ఉండిపోయారు. ప్రచారంలో పాల్గొనకుండా నివాసానికే పరిమితమయ్యారు. ఆ ఫలితాలొస్తే కుప్పంలో టీడీపీ ఖాళీ మూడు నెలల క్రితం వెలువడిన స్థానిక సంస్థల ఫలితాల్లో టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే కుప్పం నియోజకవర్గాన్ని వైఎస్సార్ సీపీ బద్ధలు కొట్టింది. శాంతిపురం, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం జెడ్పీటీసీలతో పాటు ఎంపీపీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. 68 ఎంపీటీసీ స్థానాల్లోనూ 62 కైవసం చేసుకుంది. 89 సర్పంచ్ స్థానాల్లో 74 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. ఈ ఫలితాలు కుప్పంలోని టీడీపీని అథఃపాతాళానికి నెట్టేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడులైన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. 25 వార్డుల్లో ఒక వార్డును ఏకగ్రీవం చేసుకున్న వైఎస్సార్ సీపీ మిగిలిన స్థానాల్లోనూ ఆ పార్టీ జెండాను ఎగురవేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళుతోంది. మున్సిపల్ ఫలితాల్లో కుప్పం స్థానాన్ని పోగొట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందేనని అధికార పార్టీ నాయకులు ధీమాగా చెబుతుండడం టీడీపీ నాయకులకు నిద్రపట్టనివ్వడంలేదు. డ్రామాను రక్తికట్టించే యత్నం కుప్పం ఓటర్ల నుంచి సానుభూతి పొందేందుకు టీడీపీ నానా తంటాలు పడుతోంది. ఇప్పటికే టీడీపీ శ్రేణులు కొందరు గ్రూపుగా ఏర్పడి వైఎస్సార్ సీపీపై దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. టీడీపీ అనుకూల పత్రికలు, మీడియా ద్వారా బూతద్దంలో చూపిస్తున్నా ఓటర్ల నుంచి సానుభూతి లభించలేదు. ‘‘30 ఏళ్లుగా చంద్రబాబు ఏమీ చేయలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలో ప్రతి కుటుంబానికీ లబ్ధికలిగించడంతో ఓటర్లు సీఎం వైఎస్ జగన్‌వైపే ఉన్నారు’’ అని గుర్తించిన టీడీపీ నాయకులు చీప్‌ట్రిక్స్ ప్లే చేయడానికి ప్రయత్నం ముమ్మరం చేశారు. టీడీపీ నేతలపై క్రిమినల్ కేసులు ఉన్నా పోలీసులు అరెస్టు చేయకుండా గౌరవంగా వారి ఇళ్ల వద్ద విడిచిపెట్టి రావడాన్ని కూడా తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చలో కుప్పం పేరుతో మరికొంత మంది టీడీపీ గూండాలను రంగంలోకి దింపేందుకు రంగం సిద్ధం చేయడం గమనార్హం. -
టీడీపీ మొసలి కన్నీరు: నాడు దాటవేత.. నేడు డ్రామా
జిల్లా టీడీపీ నేతలు రాజకీయ డ్రామాలతో అభాసుపాలవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా ప్రవర్తిస్తూ ఛీత్కారాలకు గురవుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధిపైగానీ, రైతుల సంక్షేమంపైగానీ నాయకులు దృష్టిపెట్టలేదు. ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తుండటంపై రైతులు అసహ్యించుకుంటున్నారు. ప్రస్తుతం రైతులు సుభిక్షంగా ఉండటం చూసి ఎక్కడ తమకు దూరమవుతారోనని టీడీపీ నేతలు చేస్తున్న డ్రామాలకు ప్రజా స్పందన కరువైంది. (చదవండి: అయ్యన్న పాత్రుడు, చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు) సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధిపై కనీసం దృష్టి సారించని ఆ పార్టీ జిల్లా నాయకులు ప్రస్తుతం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తోందని గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో జరగాల్సిన అభివృద్ధిపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిందిపోయి డీఆర్సీ సమీక్ష సమావేశాలకు సైతం డుమ్మా కొట్టి లేఖాస్త్రాల డ్రామాలు ఆడుతున్నారు. 2014 నుంచి 2019 వరకు సాగిన టీడీపీ పాలనలో జిల్లా అభివృద్ధికి సంబంధించి ఒక్కసారి కూడా డిస్ట్రిక్ట్ డెవలెప్మెంట్ రివ్యూ కమిటీ (డీడీఆర్సీ) సమావేశం నిర్వహించిన పాపాన పోలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు కూర్చుని జిల్లా అభివృద్ధిపై సమీక్షించిన దాఖలాలు అంతకంటే లేవు. ఐదేళ్ల పాలనలో జిల్లాకు మొండిచేయి చూపారు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదు. వెలిగొండ ప్రాజెక్టును ఆదాయవనరుగా మార్చుకుని చంద్రబాబు బినామీ అయిన సీఎం రమేష్‌కు టన్నెల్ కాంట్రాక్ట్‌ను నామినేషన్ పద్ధతిపై కేటాయించి దోచుకున్నారు తప్ప ప్రజలకు ఒరగబెట్టింది శూన్యం. ఒక్క ప్రాజెక్టు అంటే ఒక్క ప్రాజెక్టును కూడా జిల్లాకు తీసుకురాలేదు. 2019 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రామాయపట్నం పోర్టు అంటూ ఒక పైలాన్ నిర్మించి, పేపర్ మిల్లు అని ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోయారు. 28 నెలల్లో 5 డీఆర్సీలు... వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటైన గడిచిన 28 నెలల కాలంలో ఐదు డీడీఆర్సీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌తో పాటు జిల్లాలోని వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షిస్తూ వస్తున్నారు. 2019 మే నెలలో అధికారం చేపట్టిన తర్వాత మొదటి సారిగా 2019 నవంబర్ 20న మొదటి డీడీఆర్సీ నిర్వహించారు. రెండోది 2020 ఫిబ్రవరి 29న, మూడోది 2020 అక్టోబర్ 15న, నాలుగోది 2021 మే 28న, ఐదవది 2021 సెప్టెంబర్ 15న వరుసగా నిర్వహిస్తూ వస్తున్నారు. డీఆర్సీలకు టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా... జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకోవాల్సిన ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మొహం చాటేస్తున్నారు. డీఆర్సీ సమావేశాలకు కచ్చితంగా హాజరై వారి వాణి వినిపించాలి. ప్రజల ఇబ్బందులు, నష్టాలపై ప్రశ్నించాలి. అవన్నీ వదిలేసి జిల్లాలో ఉన్న టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు డీడీఆర్సీ సమావేశాలకు రావడమే మానుకున్నారు. ఒక్క సమావేశానికి మాత్రం కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు జిల్లా అభివృద్ధిపై నిర్మాణాత్మక పాత్ర పోషించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతు కోసం దీక్ష అని హైడ్రామా... అధికారంలో ఉన్నప్పుడు రైతులను నిండా ముంచిన టీడీపీ నేతలు ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారు. అప్పుడు అసలు పట్టించుకోని టీడీపీ నేతలను ఓడిపోయాక ఇప్పుడు రైతులు గుర్తుకొచ్చారంటూ జనం చీవాట్లు పెడుతున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రైతులు అప్పుల్లో కునారిల్లారు. రైతులకు రుణమాఫీ మొదలు, 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్, మద్దతు ధరలు, ఇతర రైతు సంక్షేమ పథకాలను విస్మరించిన అప్పటి సీఎం చంద్రబాబును నిలదీయని నేతలు.. ప్రస్తుతం రైతు కోసం అంటూ నిరసనలు చేపట్టడాన్ని చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారు. చదవండి: వెలుగులోకి భూ ఆక్రమణలు: రోడ్డును మింగేసిన గల్లా ఫుడ్స్ -
కామారెడ్డి వివాహిత కేసులో ట్విస్ట్.. ఏం జరిగిందో తెలిస్తే షాక్..
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి వివాహిత కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కామారెడ్డిలోని మంగళవారం ఉదయం ఓ వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి దాడి ఘటన అంతా డ్రామాగా తేలింది. కానీ ఏ వ్యక్తి కూడా ఆమెపై కత్తితో దాడి చేయలేదని, తనకు తానే బ్లేడుతో గొంతు కోసుకుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. నిషాక్ ఫిర్దౌసి అనే మహిళ.. ఎవరో గొంతు కోశారంటూ హై డ్రామా నడిపింది. సీన్లోకి రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ సేకరించారు. డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. విచారణ జరిపి అసలు నిజాన్ని బయట పెట్టారు. తనే గొంతు కోసుకుని డ్రామా ఆడిందని పోలీసులు వెల్లడించారు. నిషాక్ వింత ప్రవర్తనతో అత్తమామలు షాక్ అయ్యారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని.. రెండు నెలల క్రితం ఉరివేసినట్లుగా నిషాక్ పడిపోయినట్లుగా సమాచారం. ఎవరో తనని చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది. ఇవీ చదవండి: వరంగల్‌లో దారుణం.. అన్న కుటుంబంపై కత్తులతో దాడి లక్షా 75 వేల ఆవు దూడ.. వింత చేప..! -
Telugu Natakam: నటనలో జీవిస్తూ.. నాటకాన్ని బతికిస్తూ!
ఒకప్పుడు తెలుగునాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించడమే కాకుండా ప్రజల మదిలో చైతన్య భావాలను రేకెత్తించిన సుందర దృశ్యకావ్యం నాటకం. మారుతున్న కాలంలో నేటి యువతకు నాటకంలోని రసజ్ఞతను ఆస్వాదించే ఆసక్తి లేకున్నా.. వారిని నటనతో కట్టిపడేసే సామర్థ్యం కలిగిన కళాకారులకు పుట్టినిల్లు సిక్కోలు. ఇక్కడి నాటక కళాసమితులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. కవిటి: పౌరాణిక, సాంఘిక నాటకాల్లో విశేష సేవలందించి శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని దశదిశలా మారుమోగేలా చేసిన కళాకారులు ఎంతోమంది కళామతల్లి ముద్దుబిడ్డలుగా గుర్తింపు పొందారు. పద్మశ్రీ బిరుదుపొందిన యడ్ల గోపాలరావు, మీగడ రామలింగస్వామి, ఉద్దానం ప్రాంతానికి చెందిన దివంగత బెందాళం ప్రకాష్ వంటి ఎందరో ఈ ప్రాంతంనుంచి నాటకాలు వేసి సినిమాల్లో సైతం తమ నటనా ప్రతిభను చాటుకున్నారు. 2000 సంవత్సరం వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 20 వరకు నాటక సమాఖ్యలు ఉండేవి. కాలక్రమంలో వీటిసంఖ్య సగానికి తగ్గిపోయింది. కవిటి ఉద్దానం ప్రాంతం బొరివంకకు చెందిన శార్వాణి గిరిజన సాంస్కృతిక సమాఖ్య, శ్రీకాకుళానికి చెందిన శ్రీశయన నాటక సమాఖ్య, నందిగాం మండలం పెద్దతామరాపల్లి శ్రీవేంకటేశ్వర నాటక కళాసమితి, టెక్కలిలో ప్రజాచైతన్య నాటక కళా సమితి, కోటబొమ్మాళి మండలం లఖిందిడ్డిలో శ్రీనివాస నాటక కళాసమితి, సంతబొమ్మాళి మండలం వడ్డివాడలో చైతన్య నాటక కళాసమితి తమ కళాసేవల్ని నేటికీ కొనసాగిస్తున్నాయి. శ్రీకాకుళంలో మిత్రా సాంస్కృతిక సమాఖ్య, ఉద్దానం ప్రాంతంలో భైరిపురం, బి.గొనపపుట్టేగ, బొరివంక, బెజ్జిపుట్టుగ, మఖరాంపురం, కత్తివరం గ్రామాల్లో నాటక పరిషత్ పోటీలు తరచుగా నిర్వహిస్తూ సాంఘిక నాటిక కళాసౌరభాల్ని భావితరాలకు అందించడంలో విశేషంగా కృషిచేస్తున్నాయి. ఉద్దానం ప్రాంతంలో 60 ఏళ్లుగా నాటికలు వేసే ప్రక్రియ నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం బొరివంకలో పలువురు ఉపాధ్యాయులతో కలిసి ఏర్పడిన శార్వాణి నాటక సమితి సేవలు ప్రశంసనీయంగా ఉన్నాయి. ‘నంది’సంతృప్తి అనిర్వచనీయం నాటిక ప్రదర్శనల్లో మూడు దశాబ్దాలుగా భాగస్వామిగా నటజీవితం కొనసాగడం ఎంతో సంతోషాన్నిస్తోంది. రాష్ట్రప్రభుత్వం ఇచ్చే నంది పురస్కారం పొందడం మరపురాని అనుభూతి. –పిరియాచలపతిరావు, శార్వాణీ నాటక సమాఖ్య, బొరివంక నిర్మాణంలో కళావేదిక.. బొరివంక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కళావేదిక ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత తెలుగురాష్ట్రాల నాటిక పరిషత్ పోటీలు నిర్వహించాలన్న అభిలాష ఉంది. –బల్లెడ లక్ష్మణమూర్తి, గౌరవాధ్యక్షుడు, శార్వాణీనాటక సమాఖ్య, బొరివంక కళాపోషణ ఉండాలి.. మడిసన్నాక కూసింత కళాపోషణుండాలి.. అనే తెలుగు సినిమా డైలాగు నన్నెంతగానో ప్రభావితం చేసింది. వృత్తి వ్యవసాయమైనా కళారంగంపై మక్కువ నన్ను నటన వైపు ఆకర్షించేలా చేసింది. – బెందాళం శోభన్‌బాబు, సీనియర్ నటుడు, శార్వాణీనాటక సమాఖ్య -
కందుకూరి జయంతి; తెలుగు నాటకరంగం దినోత్సవం
నవ్యతా ప్రయోక్త, సంస్కర్త, శతాధిక గ్రంథకర్త కందుకూరి వీరేశలింగం పంతులు సాహితీ ప్రీతితో, సంస్కరణ దృక్పథంతో స్పృశించని శాఖలేదు.. చేపట్టని ప్రక్రియలేదు. ఆయన ప్రజ్ఞ బహుముఖాలుగా విస్తరించింది. ఆంధ్ర సాహిత్యంలో కవుల చరిత్రలు, జీవిత చరిత్రలు, స్వీయ చరిత్ర, శాస్త్ర వాజ్మయాది ప్రక్రియలన్నింటికీ ఆద్యులయ్యారు. సాహిత్యాన్ని ఆయన సంఘ సంస్క రణకు ఉపకరణంగా చేసుకున్నారు. ఆనాటి సంఘంలో గూడు కట్టుకొన్న మూఢాచారాలను పారద్రోలారు. తెలుగు నాటకరంగం దినోత్సవ నేపథ్యం.. తెలుగు నాటకరంగానికి వీరేంశలింగం కృషి గణ నీయమైంది. 19వ శతాబ్దిలో బాల్యవివాహాలు, మూఢనమ్మకాలు, కన్యాశుల్కం, అంటరానితనం, వేశ్యావృత్తి వంటి దురాచారాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. అప్పట్లో సామాజిక చైతన్యంతో, సంస్కరణ దృక్పధంతో ప్రజల్ని చైతన్యవంతులను చేసేందుకు శ్రవ్యకావ్యాల కంటే నాటకాలు శక్తివం తమైనవన్న ఆలోచనతో వీరేశలింగం 16 నాటకాలను రచించారు. వీరేశలింగంగారి నాటకాల్లో బ్రాహ్మ వివాహం, వ్యవహార ధర్మబోధిని, అభిజ్ఞాన శాకుంతలం, సత్యహరిశ్చంద్ర, రత్నావళి వంటివి ప్రసిద్ధాలు. బ్రాహ్మ వివాహం నాటకం ఆయనకు మంచి పేరును తెచ్చింది. ఈ నాటకంలో ముక్కుపచ్చలారని బాలికను, కన్యాశుల్కానికి ఆశపడి ముసలివాడికిచ్చి పెళ్లి చేయడాన్ని అధిక్షేపించారు. ముసలివాళ్ల పెళ్లి ఆశను అవహేళన చేసి ప్రేక్షకుల కళ్లు తెరిపించారు. డబ్బు కక్కుర్తితో కన్యాశుల్కానికి ఆశపడి పిల్లల జీవితాలను నాశనం చేసే తల్లిదండ్రులను, పెళ్లిళ్ల పేరయ్యలను తీవ్రంగా నిరసించారు. వీరేశలింగంకి పేరు తెచ్చిన మరో నాటకం వ్యవహార ధర్మబోధిని. ఈ నాటకంలో న్యాయాధికారుల అవినీతిని, న్యాయవాదుల మోసాలను, వాదిప్రతివాదుల దుశ్చర్యలను బట్టబయలు చేశారు. తెలుగు నాటకరంగం దినోత్సవంపై 2000లో పెద్ది రామారావు యవనిక త్రైమాసిక పత్రిక ద్వారా చర్చలు జరిగాయి. ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో మాదిరి తెలుగు నాటకరంగం దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం అవసరం అన్న ఆలోచన నాటకరంగ కళాకారులు, విమర్శకుల్లో కలిగింది. వ్యవహారిక భాషలో నాటకాలు రాసిన తొలినాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడు, నాటక సమాజ స్థాపకుడైన వీరేశలింగం జయంతిని ఏప్రిల్ 16న తెలుగు నాటక రంగం దినోత్సవంగా ఏర్పాటు చేయాలని నాటకరంగం ప్రముఖులంతా ఏకాభి ప్రాయానికి వచ్చారు. కొన్ని నాటక రంగం సంస్థలు 2001 నుంచి వీరేశలింగం జయంతిని తెలుగు నాటకరంగం దినోత్సవంగా జరిపారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు డాక్టర్ కేవీ రమణాచారి నాటక కళాకారుల అభిమతం మేరకు వీరేశలింగం జయంతిని తెలుగు నాటకరంగం దినోత్సవంగా గుర్తించాలని 2007 మార్చిలో ప్రస్తావించారు. వైఎస్సార్ వెంటనే స్పందించి 2007 మార్చిలో వీరేశలింగం దినో త్సవాన్ని ఏప్రిల్ 16వ తేదీని తెలుగు నాటకరంగం దినోత్సవంగా ప్రకటిస్తూ ఉత్వర్తులు జారీ చేశారు. 2007 ఏప్రిల్ 16న ప్రభుత్వం అధికారికంగా తొలిసారిగా తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని నిర్వహించింది. వివిధ సంస్థల ఆధ్వర్యంలో నాటక ప్రదర్శనలు, సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. నాటక రంగంలో విశేష కృషి చేసిన కళాకారులకు సన్మానాలు, జిల్లా, రాష్ట్రస్థాయి పురస్కారా లతో సత్కరించాలని తీర్మానించారు. ప్రముఖ నాటక కళాకారుల జయంతి, వర్ధంతులను నిర్వహించి ప్రజల్లో నాటకకళ పట్ల ఆసక్తి పెంచాలన్న లక్ష్యంతో తెలుగు నాటకరంగ దినోత్సవం ఆవిర్భ వించింది. కరోనా తగ్గిన తర్వాత తెలంగాణ, ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వాలు నాటక రంగ దినోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించగలవని ఆశిద్దాం..! డాక్టర్ పీవీ సుబ్బారావు వ్యాసకర్త సాహితీ విమర్శకులు మొబైల్ : 98491 77594 -
World Theatre Day: నాటకం సర్వజనీయం
ప్రపంచవ్యాప్తంగా నాటక ప్రియులు పెద్ద ఎత్తున సభలూ, సమావేశలు జరుపుకునే రోజు మార్చి 27. ఈ రోజు అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం. ప్రాచీన కళల్లో నాటక కళ ఒకటి. దాదాపు ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ, భారతదేశంలోనూ నాటక ప్రక్రియ మొదలైంది. కాలాన్ని బట్టీ, ప్రదేశాన్ని బట్టీ, సంస్కృతిని బట్టీ నాటక రూపం మారుతుందే కానీ అంతర్లీనంగా దాని మూల సూత్రం మాత్రం అందరికీ ఒక్కటే ఉంటుంది. అందువల్లే నాటకం బహుళ ప్రజాదరణ పొంది రంగస్థల ప్రక్రియగా విరాజిల్లుతుంది. ప్రస్తుతం ఉన్న నాటకం కాలక్రమేణా రూపం మార్చుకుంటూ విశ్వజనీనమైంది. 1961లో వియన్నాలో ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ వారు నిర్వహించిన 9వ ప్రపంచ కాంగ్రెస్‌లో ఆనాటి అధ్యక్షుడు అరవికివియో ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతిపాదన చేశారు. సభ్యులందరూ అంగీకరించాక తదుపరి ఏడాది పారిస్‌లో జరిగిన రంగస్థల సమాఖ్య పూర్తి స్థాయిలో మొదలైంది. రంగస్థల దినోత్సవం ప్రపంచమంతా విస్తరించింది. ఐక్యరాజ్యసమితి, యునెస్కోలచే ప్రాధాన్యత పొందింది. ఈ వేడుకలలో భాగంగా అన్ని దేశాల్లో జరుగుతున్న నాటకాల ప్రదర్శనలు, ప్రక్రియల ప్రమాణాలపై పరిశీలకులు, నాటక ప్రియులు వచ్చి సమీక్షలు జరుపుకుంటారు. ప్రతీ సంవత్సరం నాటకరంగంలో నిష్ణాతులైన ఒకరిని సమన్వయకర్తగా ఎంచుకొని ప్రముఖుల మాటగా వారి మనోగతసారాన్ని ఆ సంవత్సరం సందేశంగా ప్రపంచ రంగస్థలానికి అందిస్తారు. 1962లో మొదటి ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని జీన్ కాక్టే ఫ్రాన్స్ దేశస్తుడు అందించాడు. అప్పటినుంచి ప్రతీ ఏటా ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు. (నేడు అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం) – గాదిరాజు రంగరాజు, రంగస్థల నటుడు, చెరుకువాడ మొబైల్ : 87901 22275 -
టీడీపీ స్కెచ్.. అంతా తుస్స్
కుప్పం/శాంతిపురం: కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన 25వేల ఇంటిపట్టాలకు స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు అడ్డుపడుతున్నారని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళనకు సన్నద్ధమయ్యారు. దీనికి ప్రజల నుంచి మద్దతు లభిస్తే తమ పార్టీకి మైనస్ అవుతుందని టీటీడీ శ్రేణులు కొత్త ఎత్తుగడ వేశాయి. హంద్రీ–నీవా కాలువ పనులను రాజకీయం చేసే దిశగా పాదయాత్రకు స్కెచ్ వేసింది. దీనిపై దృష్టి సారించిన పోలీస్ అధికారులు రెండ్రోజుల క్రితం నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించారు. ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలను నిషేధించారు. అయినా దీనిని ఉల్లంఘిస్తూ తెలుగు తమ్ముళ్లు నిరసనకు దిగి చివరకు అభాసుపాలయ్యారు. (చదవండి: అచ్చెన్నాయుడి కుటుంబీకుల అరాచకం) గురువారం సంతూరు–గుండిశెట్టిపల్లె మధ్య హంద్రీ–నీవా కాలువలో కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ జెండాలతో ప్రదర్శనకు దిగారు. ఇది తెలుసుకున్న కుప్పం రూరల్ సీఐ యతీంద్ర, రాళ్లబూదుగూరు ఎస్ఐ మురళీమోహన్, పోలీసులతో అక్కడికి చేరుకునేసరికి వాళ్లంతా మాయమయ్యారు! అంతలోనే చిన్నారిదొడ్డి–జలి్లగానిపల్లె మధ్య కూడా టీడీపీ నేతలు నిరసనకు దిగారనే సమాచారం అందడంతో పోలీసులు అక్కడికీ వెళ్లారు. మళ్లీ సేమ్ టు సేమ్..పోలీసులను చూసి టీడీపీ నేతలు తలో దిక్కుకు జారుకున్నారు. టీడీపీ వ్యవహారాన్ని తెలుసుకున్న మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ కన్వీనర్ కోదండరెడ్డి, కో–కనీ్వనర్ బుల్లెట్ దండపాణి, వడ్డెర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పెద్దన్న, నాయకులు విజయకుమార్, కృష్ణమూర్తి, మురుగేష్ కార్యకర్తలతో సంతూరుకు చేరుకున్నారు. అధికారంలో ఉన్నంతకాలం కాలువ పనుల ఊసెత్తని టీడీపీ నేతలు ఇప్పుడు నిరసనకు పూనుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. వీళ్లాడుతున్న డ్రామాలన్నీ ప్రజలకు తెలుసన్నారు. (చదవండి: కోటానుకోట్ల లాభాలు.. ఏమిటో ఈ కిటుకు?) పలాయనంతో గాయాలు జల్లిగానిపల్లె వద్దకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులను దుర్భాషలాడుతూ పారిపోయే క్రమంలో కాలువలో పడి నడింపల్లెకు చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. దీనికి కూడా రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు. తమపై అధికార పక్షం దాడులకు పాల్ప డినట్టు పేర్కొంటూ ఆస్పత్రిలో వారు చేరినట్టు తెలిసింది. పోలీసుల మోహరింపు తెలుగుతమ్ముళ్ల నాటకీయ ఎత్తుగడల నేప«థ్యంలో హంద్రీ–నీవా కాలువ పొడవునా పోలీసులను మోహరించారు. టీడీపీ నేతలు ఇటువైపు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, 144 సెక్షన్ అతిక్రమించే వారిపై చర్యలు తప్పవని సీఐ, ఎస్సై హెచ్చరించారు. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరారు. -
మిస్టర్ సీతమ్మ
గోవింద మౌర్య అనే యువకుడు గత పదిహేడేళ్లుగా నిష్ఠగా సీతమ్మవారి పాత్రను పోషిస్తున్నాడు. ఇంత నిష్ఠా తన కుటుంబాన్ని పోషించుకోడానికే. మగవారు ఆడ పాత్రలు వేయడం మహాభారత కాలం నాటి నుంచి చూస్తున్నాం. అర్జునుడు వేసిన బృహన్నల పాత్ర అటువంటిదే కదా. ఒకప్పుడు కూచిపూడి నాట్యం మగవారే ఆడవేషంలో చేసేవారు. ఇప్పటికీ ఇటువంటి సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. నెలక్రితం విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘డ్రీమ్ గర్ల్’ సినిమాలో హిందీ నటుడు ఆయుష్మాన్ ఖురానా పోషించిన ఆడ పాత్ర కూడా అమిత ఆదరణ పొందింది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఒక కాల్ సెంటర్లో పనిచేస్తాడు. ఆడ గొంతుతో మాట్లాడుతుంటాడు. అంతేకాదు తను నివసించే ప్రాంతంలో ‘రామ్‌లీల’ నాటకంలో నటుడు కూడా. అందులో సీతాదేవి పాత్ర పోషిస్తుంటాడు. నాటకం అయ్యాక, మామూలు మగ దుస్తుల్లో ఉన్నా కూడా స్థానికులొచ్చి అతడి.. అంటే సీతాదేవి ఆశీస్సులు అందుకుని వెళుతుంటారు. ఇది సినిమా కథ. ఇటువంటిదే నిజ జీవితంలో కూడా ఒక సంఘటన జరుగుతోంది. ముప్పై ఆరు సంవత్సరాల గోవింద మౌర్య అనే కళాకారుడు ఢిల్లీ రామలీలా సన్నివేశంలో, పదిహేడు సంవత్సరాలుగా సీతాదేవి పాత్రను ఎంతో భక్తి, నేర్పుగా ప్రదర్శిస్తున్నాడు. ఆయన మేకప్ తీసేసినప్పుడు కూడా ఎంతోమంది భక్తులు ఆయన (సీతాదేవి) ఆశీర్వాదాల కోసం రావడం అతడికే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ‘‘నన్ను చూసి చాలామంది అప్పుడప్పుడు, ‘అదిగో సీతను చూడు. మేకప్ లేకపోయినా కూడా అచ్చంగా సీతమ్మ తల్లిలా ఉన్నాడు’ అంటూ నన్ను ఆరాధనగా చూస్తుంటారు’’ అంటారు గురుగ్రామ్‌కి చెందిన ఈ గోవింద మౌర్య. గోవింద మౌర్య బాల్యం నుంచి తన గ్రామంలో జరిగే రామ్‌లీల నాటకాన్ని చూసేవాడు. ‘‘ఓసారి నేను రామ్‌లీలా చూస్తున్నాను. నా గొంతు వారికి నచ్చింది. నన్ను స్టేజీ మీదకు తీసుకువెళ్లి, నాతో మాట్లాడించారు’’ అని బాల్యాన్ని గుర్తు చేసుకుంటారు గోవింద మౌర్య. ప్రారంభంలో అతడికి సీతాదేవి తల్లి పాత్రను ఇచ్చారు. పదిహేను రోజులవ్వగానే సీతాదేవి పాత్ర ఇచ్చారు. సీతాదేవి పాత్రలో – ‘‘సఖీ, ఒక్కసారి నిలువుము. నాకు కొంచెం బెదురుగా ఉంది’’ అనే డైలాగులు వింటుంటే అమ్మాయే మాట్లాడుతోందేమో అనుకునేలా మాట్లాడతారు గోవింద. సీతాదేవిని కలవడానికి శ్రీరామచంద్రుడు పుష్పవాటికకు వచ్చిన సందర్భంలో ఈ సంభాషణ ఉంటుంది. అయితే సీతాదేవి పాత్రను గోవింద పోషించడం అతని కుటుంబ సభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదు. ‘‘కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు తప్పదు. గతంలో నేను లెదర్ ఫ్యాక్టరీలో పనిచేశాను. అది మూత పడటంతో ఇంటి ఆర్థిక అవసరాల కోసం ఈ పాత్ర పోషిస్తున్నాను’’ అంటారు గోవింద. అయితే ఈ పాత్ర పోషించినందుకుగాను పారితోషికం ఆయనకు నగదు రూపంలో అందటం లేదు. ఇంటికి పనికివచ్చే వస్తువులు ఇస్తున్నారు. ‘‘నేను సీతాదేవి వేషం వేసుకున్నాక, ఒక్కరు కూడా హేళన చేయరు. పైగా నా పాదాలకు నమస్కరిస్తారు. మేకప్ తీశాక కూడా ఎవ్వరూ నన్ను ఎగతాళి చేయరు. ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు రామ్‌లీలాలో నటిస్తున్నారు. కాని ఆడపాత్రలను మగవారు పోషించే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది’’ అంటారు గోవింద. . – రోహిణి -
అమ్మా రంగస్థలం నీకు శతకోటి చప్పట్లు
‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్నాడు కాళిదాసు. నాటక రంగానికి ఇదివరకటి కాలంలో విశేషమైన ఆదరణ ఉండేది. చాలామంది కళాకారులు రంగస్థలాన్నే నమ్ముకుని జీవిక సాగించేవారు. సినీరంగం ఊపిరి పోసుకున్న తొలినాళ్లల్లో కూడా నాటకాలకు బాగానే ఆదరణ ఉండేది. తొలితరం సినీ జనాలందరూ రంగస్థలం పునాదుల మీదుగానే సినీరంగంలో తమదైన ముద్ర వేశారు. తెలుగు నాటకరంగం సమాజంపై చూపిన ప్రభావం సామాన్యమైనది కాదు. స్వాతంత్య్రోద్యమ కాలంలో సామాజిక సంస్కరణ ఉద్యమాలకు నాటక రంగం వెన్నుదన్నుగా నిలిచింది. తెలుగునాట గొప్పగా జనాదరణ పొందిన నాటకాలు చాలానే ఉన్నాయి. రంగస్థలంపై అసాధారణంగా రాణించిన నటీనటులు అనేకులు ఉన్నారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా నాటక రంగం గురించి కొన్ని విశేషాలు... ప్రపంచవ్యాప్తంగా నాటకాలు ఉండేవి. ఆధునిక వినోద సాధనాలేవీ లేని రోజుల్లో నాటకాలే జనాలకు వినోదం కలిగించేవి. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్ది నాటికే నాటక ప్రక్రియ ఉనికిలో ఉండేది. ప్రాచీన గ్రీకు, రోమన్ సామ్రాజ్యాల్లో విరివిగా నాటక ప్రదర్శనలు జరిగేవి. ప్రపంచంలోనే తొలి నాటక ప్రదర్శనఇప్పటి వరకు లభించిన చారిత్రక ఆధారాల ప్రకారం క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దికి చెందిన గ్రీకు కళాకారుడు థెస్పిస్ మరికొందరితో కలసి తొలిసారిగా రంగస్థలంపై నటనా ప్రదర్శన చేశాడు. బహుశ అదే చరిత్రలో తొలి నాటక ప్రదర్శన కావచ్చని అంచనా. ఏథెన్స్లోని డయోనిసియా నగరంలో థెస్పిస్ ప్రదర్శనలకు విపరీతమైన జనాదరణ ఉండేది. ఆయన తన బృందంతో కలసి ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించి ప్రదర్శనలు ఇచ్చేవాడు. నాటకాలకు అవసరమైన దుస్తులు, మాస్క్‌లు, అలంకరణ సామగ్రి గుర్రపు బగ్గీల్లో వేసుకుని తిరుగుతూ ఒక్కొక్క చోట కొన్నాళ్లు మకాం వేసి నాటకాలను ప్రదర్శించేవాడు. థెస్పిస్ మార్గంలోనే తర్వాతి కాలంలో ఈషిలస్, సోఫోక్లెస్, యూరిపిడెస్ వంటి వారు నాటకాలను స్వయంగా రచించి, ప్రదర్శించేవారు. వారంతా ఎక్కువగా విషాదాంత నాటకాలనే ప్రదర్శించేవారు. అప్పట్లో నాటక పోటీలు కూడా జరిగేవి. ఈషిలస్ రచించి, ప్రదర్శించిన ‘ది పర్షియన్స్’ నాటకానికి డయోనిసియా నగరంలో క్రీస్తుపూర్వం 472లో జరిగిన పోటీలో మొదటి బహుమతి లభించింది. ఇప్పటికీ మిగిలి ఉన్న అత్యంత పురాతన నాటక ప్రతి ‘ది పర్షియన్స్’ కావడం విశేషం. విషాదాంత నాటక పోటీలు క్రీస్తుపూర్వం 534 నాటి నుంచే జరిగేవని ప్రాచీన గ్రీకు ఆధారాల ద్వారా తెలుస్తోంది. విషాదాంత నాటకాలు విరివిగా ప్రచారంలో ఉన్న కాలంలోనే కొందరు వ్యంగ్య నాటకాలు, హాస్యభరిత నాటకాలు కూడా వేసేవారు. వ్యంగ్య నాటక పోటీలు క్రీస్తుపూర్వం 501 నాటి నుంచి, హాస్యనాటక పోటీలు క్రీస్తుపూర్వం 487 నుంచి జరిగేవి. ప్రాచీన రోమన్ సామ్రాజ్యంలో క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్ది నుంచి నాటక ప్రదర్శనలు జరిగేవి. రోమన్ సామ్రాజ్య విస్తరణ ఫలితంగా క్రీస్తుపూర్వం 270–240 నాటికి గ్రీకు భూభాగంలో గ్రీకు నాటకాలతో పాటే రోమన్ నాటకాల ప్రదర్శనలు కూడా జరిగేవి. క్రీస్తుపూర్వం రెండో శతాబ్ది నాటికి రోమన్ రచయితలు బృందాలుగా ఏర్పడి నాటకాలు రాసేవారు. గ్రీకుల జీవనశైలిని ఎద్దేవా చేస్తూ ప్లాటుస్, టెరెన్స్ అనే రోమన్ రచయితలు రాసిన ‘ఫ్యాబులా పాలియాటా’ అనే నాటక ప్రతి ఇప్పటికీ మిగిలి ఉంది. ఈ జంట రచయితల్లో ప్లాటుస్ ఎక్కువ ప్రసిద్ధి పొందాడు. అతడు రాసిన మరో ఇరవై నాటకాలు కూడా ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. ప్రధాన నటుడు తన పాత్రను అభినయిస్తుండగా, వెనక నుంచి కొందరు వంత పాడే ‘కోరస్’ పద్ధతికి రోమన్ నాటకకర్తలు క్రీస్తుపూర్వం రెండో శతాబ్ది నాటికే స్వస్తి చెప్పారు. నాటకంలోని కథను సన్నివేశాలుగా, అధ్యాయాలుగా విభజించే పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆధునిక నాటక పద్ధతికి నాటి రోమన్ నాటక పద్ధతే మూలంగా చెప్పుకోవచ్చు. మన దేశంలో ప్రాచీన నాటకాలు ప్రాచీన గ్రీకు, రోమన్ నాటకరంగాలు వేళ్లూనుకున్న కొద్ది కాలానికే మన దేశంలో సంస్కృత నాటక రంగం ఊపిరి పోసుకుంది. భారత భూభాగంపై అలెగ్జాండర్ దండయాత్ర తర్వాతనే గ్రీకుల ప్రభావంతో ఇక్కడ నాటకరంగం మొదలైందనే వాదన కూడా ఉంది. సంస్కృత నాటకాల ప్రదర్శన క్రీస్తుపూర్వం రెండో శతాబ్ది నాటికి మొదలైంది. క్రీస్తుశకం ఒకటో శతాబ్ది నుంచి పదో శతాబ్ది వరకు బాగా వ్యాప్తి చెందింది. సంస్కృత వ్యాకరణకర్త పతంజలి భాష్యంలో నాటక ప్రస్తావన కనిపిస్తుంది. పతంజలి భాష్యం క్రీస్తుపూర్వం 140 ఏళ్ల నాటిది. నాటక లక్షణాలను సూత్రబద్ధంగా చేస్తూ భరతముని ‘నాట్యశాస్త్రం’ రచించాడు. కేవలం రంగస్థలం గురించి మాత్రమే కాకుండా, నటన, రంగాలంకరణ, సంగీతం, నాట్యం, ఆహార్యం, అలంకరణ, నాటక సంస్థల నిర్వహణ, నాటక పోటీలు, ప్రేక్షకులు వంటి అంశాలపై విపులంగా వివరించిన తొలిగ్రంథం భరతముని రచించిన నాట్యశాస్త్రం. సంప్రదాయ సంస్కృత నాటకాల్లో నాయక, నాయిక, విదూషక పాత్రలు ప్రధానంగా ఉండేవి. క్రీస్తుశకం నాలుగో శతాబ్దికి చెందిన కాళిదాసు రచించిన మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, అభిజ్ఞాన శాకుంతలం వంటి సంస్కృత నాటకాలు ప్రసిద్ధి పొందాయి. తర తరాల పాటు ఇవి ప్రదర్శనలకు నోచుకున్నాయి. మన నాటక రంగానికి చెందిన ప్రాచీన యుగంలో కాళిదాసుతో పాటు భాసుడు, అశ్వఘోషుడు, దండి వంటి కవులే కాదు, హర్షవర్ధనుడు వంటి రాజులు కూడా సంస్కృతంలో నాటక రచన చేశారు. భారత దేశంపై ముస్లింల దండయాత్రలు మొదలైన తర్వాత సంస్కృత నాటకాల ప్రాభవం చాలావరకు తగ్గింది. కొందరు ముస్లిం పాలకుల హయాంలో నాటక ప్రదర్శనలపై పూర్తి నిషేధం ఉండేది. అయితే, క్రీస్తుశకం పదిహేనో శతాబ్ది నుంచి పంతొమ్మిదో శతాబ్ది మధ్యకాలంలో ప్రాంతీయ భాషల్లో నాటక రచన, ప్రదర్శనలు పుంజుకున్నాయి. మధ్యయుగంలో భవభూతి నాటకకర్తగా ప్రసిద్ధి పొందాడు. ఆయన రచించిన ఉత్తర రామచరితం, మాలతీ మాధవం వంటి నాటకాలు ప్రసిద్ధి పొందాయి. మధ్యయుగాల నాటికి ప్రాంతీయ భాషలు పుంజుకోవడం, జన సామాన్యానికి సంస్కృత నాటకాలు అర్థం కాకపోవడంతో సంస్కృత నాటక ప్రదర్శనలు నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. అదే కాలంలో భక్తి ఉద్యమం మొదలైంది. జన సామాన్యానికి అర్థమయ్యే భక్తి కావ్యాలను గానం చేసే రంగస్థల ప్రక్రియ మొదలైంది. దాంతో సంస్కృత నాటకాల కంటే రంగస్థలంపై ప్రదర్శించే భక్తి గీతాల గానానికి, ఆ గానానికి అనుగుణంగా తన్మయంతో చేసే నాట్యానికి జనాదరణ పెరగింది. రంగస్థలంపై ఆధునికతకు నాంది బ్రిటిష్ హయాంలో భారతీయ రంగస్థలంపై ఆధునికతకు నాంది ఏర్పడింది. బెంగాలీ రచయిత మైకేల్ మధుసూదన్ దత్ 1860లో రచించిన ‘బురొ షాలిఖేర్ ఘరె రొవా’ను తొలి భారతీయ ఆధునిక నాటకాల్లో ఒకటి. అదే ఏడాది మరో బెంగాలీ రచయిత దీనబంధు మిత్రా ‘నీలదర్పణ్’ నాటకాన్ని రాశారు. ఇది విరివిగా ప్రదర్శనలకు నోచుకుంది. నీలిమందు సాగు ఫలితంగా రైతుల జీవితాల్లో కలిగిన సంక్షోభాన్ని కళ్లకు కట్టేలా రచించిన ‘నీలదర్పణ్’ బెంగాల్ అంతటా అమిత జనాదరణ పొందింది. ఈ నాటకాన్ని గిరీష్‌చంద్ర ఘోష్ బెంగాల్ అంతటా విరివిగా ప్రదర్శించారు. ఆధునిక బెంగాలీ నాటక రచయితల్లో రవీంద్రనాథ్ టాగోర్ బాగా ప్రసిద్ధి పొందారు. ‘విశ్వకవి’గా ప్రసిద్ధి పొందిన రవీంద్రనాథ్ టాగోర్ కవిత్వంతో పాటు కథలు, నాటకాలు కూడా రాశారు. ఆయన రచించిన నాటకాల్లో ‘చిత్రాంగద’, ‘డాక్ఘర్’, ‘రాజా’, ‘రక్త కరాబి’ వంటి నాటకాలు పేరు పొందాయి. పద్యనాటకాల వైభవం ఆధునిక కాలంలో తెలుగునాట నాటక ప్రదర్శన ప్రారంభమైన తొలినాళ్లలో పద్యనాటకాలే ప్రభంజనం కొనసాగించాయి. వివిధ నాటక బృందాలు ఊరూరా తిరుగుతూ పద్యనాటకాలను ప్రదర్శించేవి. అమిత జనాదరణ పొందిన పద్యనాటకాల్లోని పద్యాలు ఆ తర్వాతి కాలంలో తీసిన పౌరాణిక సినిమాలకూ పాకాయంటే నాటి పద్యనాటకాల ఘనతను అర్థంచేసుకోవచ్చు. చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన ‘గయోపాఖ్యానం’, తిరుపతి వెంకటకవులుగా ప్రసిద్ధి పొందిన జంట కవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి రచించిన ‘పాండవ ఉద్యోగం’, ‘పాండవ విజయం’, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రచించిన ‘సత్య హరిశ్చంద్ర’, కొప్పరపు సుబ్బారావు రచించిన ‘తారాశశాంకం’, ముత్తరాజు సుబ్బారావు రచించిన ‘శ్రీకృష్ణ తులాభారం’ వంటివి బాగా జనాదరణ పొందాయి. తెలుగునాట నాటకరంగం తెలుగునాట నాటకరంగం ఎప్పటి నుంచి ఉనికిలోకి వచ్చిందనే దానిపై కచ్చితమైన ఆధారాలేవీ అందుబాటులో లేవు. అయితే, నన్నయ కాలానికే నాటకాలు విరివిగా ఉండేవని చెప్పవచ్చు. మహాభారత అవతారికలో నన్నయ ‘రసాన్విత కావ్యనాటకముల్ పెక్కుజూచితి’ అని చెప్పడమే ఇందుకు ఆధారం. పదహారో శతాబ్ది నాటికి చిందుభాగవతం, యక్షగానం వంటి రంగస్థల ప్రక్రియలకు, వీధినాటకాలకు జనాదరణ ఉండేది. కాకతీయుల కాలంలో వినుకొండ వల్లభరాయుడు రచించిన ‘క్రీడాభిరామం’ వీధినాటకమే. అప్పట్లో ప్రదర్శించిన యక్షగానాలు, వీధినాటకాలు ఎక్కువగా సంస్కృతంలో రచించినవే. ఆధునికకాలంలోనే తెలుగు భాషలో నాటక రచన మొదలైంది. ఆధునిక కాలంలో వెలువడిన తొలి తెలుగు నాటకం ‘మంజరీ మధుకరీయం’. కోరాడ రామచంద్రశాస్త్రి ఈ నాటకాన్ని 1860 ప్రాంతాల్లో రాశారు. బ్రిటిష్ హయాంలో దేశంలోని విశ్వవిద్యాలయాలు ఏర్పడటం, ఆంగ్ల సాహిత్యంతో పరిచయం ఏర్పడటం వల్ల ఆ ప్రభావంతో తెలుగులో కూడా నాటక రచన విరివిగా కొనసాగింది. కోరాడ రామచంద్రశాస్త్రితో పాటు కొక్కొండ వెంకటరత్నం పంతులు, పరవస్తు వెంకట రంగాచార్యులు, వావిలాల వాసుదేవశాస్త్రి వంటి వారు తెలుగునాట తొలినాళ్లలో నాటక రచనకు ఆద్యులు. కందుకూరి వీరేశలింగం పంతులు, కొండుభట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, నాదెళ్ల పురుషోత్తమ కవి, వడ్డాది సుబ్బారాయుడు తదితరులు నాటక ప్రదర్శనకు ఆద్యులుగా చెప్పుకోవచ్చు. తొలినాళ్లలో ఎక్కువగా సంస్కృత నాటకాల అనువాదాలు వచ్చేవి. కొందరు ఇంగ్లిష్ నాటకాలను కూడా అనువదించారు. పురాణగాథల ఆధారంగా రూపొందించిన పద్యనాటకాలు విపరీతంగా జనాదరణ పొందేవి. ఆ నాటకాల్లోని పద్యాలు నిరక్షరాస్యులైన ప్రేక్షకులకు కూడా కంఠోపాఠంగా ఉండేవి. వడ్డాది సుబ్బారాయుడు తెలుగు నాటకాల్లో పద్యపఠనాన్ని ప్రవేశపెట్టారు. ఆయన ‘వేణీ సంహారం’ అనే పద్యనాటకాన్ని రాశారు. అనతి కాలంలోనే పద్యాలకు రాగాలు తోడయ్యాయి. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకాన్ని 1872లో పరవస్తు వెంకట రంగాచార్యులు తెలుగులోకి అనువదించారు. షేక్స్పియర్ రచించిన ‘జూలియస్ సీజర్’ నాటకాన్ని వావిలాల వాసుదేవ శాస్త్రి తెలుగులోకి ‘సీజరు చరితము’ పేరుతో అనువదించారు. ఇంగ్లిష్ నాటకాన్ని తెలుగులోకి అనువదించిన తొలి రచయితగా మాత్రమే కాకుండా, తెలుగులో తొలి సాంఘిక నాటకాన్ని రచించిన ఘనత కూడా వావిలాల వాసుదేవ శాస్త్రికే దక్కుతుంది. ఆయన రచించిన ‘నందకరాజ్యం’ తెలుగులో తొలి సాంఘిక నాటకం. పరిషత్తులూ ప్రయోగాలూ కృష్ణా ప్రాంతంలో 1913లో తొలిసారిగా నాటక పోటీలు ప్రారంభమయ్యాయి. అనతికాలంలోనే ఈ నాటక పోటీలు దేశమంతా వ్యాపించాయి. తెనాలిలో 1929లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు ఏర్పడింది. పరిషత్తు పోటీల్లో ప్రదర్శించే నాటకాలకు అనేక నిబంధనలు ఉండేవి. ముఖ్యంగా ఐదేళ్ల కిందట రచించిన నాటకాలను పరిషత్తుల్లో ప్రదర్శించరాదు. అందువల్ల పరిషత్ పోటీల కోసం ప్రత్యేకంగా నాటక రచన చేయడం మొదలైంది. ఒక నటుడు, ఒక నటి ఒక నాటకంలో లేదా ఒక నాటికలో మాత్రమే నటించాలి. స్త్రీ పాత్రలను స్త్రీలే పోషించాలి. నాటక రంగానికి పరిషత్తులు చాలావరకు ఊతమిచ్చాయి. స్త్రీ పాత్రలను స్త్రీలే పోషించాలనే నిబంధన అప్పట్లో కొంత ఇబ్బందిగానే ఉండేది. నాటకరంగంలో అప్పట్లో స్త్రీలు ఎక్కువమంది ఉండేవారు కాదు. దానివల్ల కొందరు స్త్రీపాత్రలు లేని నాటకాలను ప్రత్యేకంగా రాసి, ప్రదర్శించేవారు. కన్యాశుల్కం వచ్చిన నాలుగు దశాబ్దాల తర్వాత గాని తెలుగులో సాంఘిక నాటకాలు ఊపందుకోలేదు. తెలుగు సాంఘిక నాటకాల్లో ఆత్రేయ రచించిన ‘ఎన్జీవో’, ‘కప్పలు’, ‘మాయ’, సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు రాసిన ‘మా భూమి’, భమిడిపాటి రాధాకృష్ణ రాసిన ‘కీర్తిశేషులు’, యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘కుక్క’ వంటి నాటకాలు ప్రసిద్ధి పొందాయి. సాంఘిక నాటకాల వ్యాప్తికి ప్రజా నాట్యమండలి వంటి సంస్థలు ఎనలేని కృషి చేశాయి. ఎన్.ఆర్.నంది 1964లో రాసిన ‘మరో మొహెంజదారో’ తెలుగు నాటకాల్లో ప్రయోగాత్మక నాటకాల ఒరవడికి నాంది పలికింది. నాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1998 నుంచి నంది నాటకోత్సవాలను ప్రారంభించింది. సినిమాలు, టీవీ, ఇంటర్నెట్ ప్రభావం ఎంతగా ఉన్నా, నేటికీ నాటకరంగం మనుగడ సాగిస్తూనే ఉంది. – పన్యాల జగన్నాథదాసు విలక్షణ ప్రదర్శనల సురభి నాటక సంఘం తెలుగు రంగస్థల చరిత్రలో సురభి నాటక సంఘానికి ప్రత్యేక స్థానం. సినిమా తెరలపై చూపించే చిత్రవిచిత్రాలన్నీ రంగస్థల వేదికపైనే ప్రదర్శించడం ‘సురభి’ నాటకాల ప్రత్యేకత. ‘సురభి’ నాటకాలు ఈనాటికీ తమ ప్రత్యేకతను కాపాడుకుంటూనే ఉన్నాయి. వనారస గోవిందరావు, వనారస చిన్న రామయ్య 1885లో కడప జిల్లా చక్రాయపేట మండలంలోని సురభి రెడ్డివారిపల్లెలో ‘శ్రీ శారదా వినోదిని నాటక సభ’ను ప్రారంభించారు. కాలక్రమేణా ఇది సురభి నాటక సంఘంగా ప్రసిద్ధి పొందింది. అనతికాలంలోనే ఇది విస్తరించి యాభై బృందాలుగా విస్తరించింది. సురభి నాటక బృందాల్లో అన్నింటి కంటే పెద్దదైన శ్రీ వెంకటేశ్వర నాట్య మండలిని 1937లో వనారస గోవిందరావు ఐదో కూతురైన సుభద్రమ్మ, ఆమె భర్త ఆర్.వెంకటరావు స్థాపించారు. ఇప్పటికీ ఈ సంస్థ నాటకాలను ప్రదర్శిస్తూనే ఉంది. (కవర్ ఫొటోలు సురభి నాటక ప్రదర్శనలోని దృశ్యాలు) బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రచించిన ‘సత్య హరిశ్చంద్ర’ నాటకంలోని...తిరమై సంపదలెల్ల వెంటనొక రీతిన్ సాగి రావేరికేసరికేపాటు విధించినో విధి యవశ్య ప్రాప్త మద్దానినెవ్వరు దప్పించెదరున్నవాడనని గర్వంబేరికిన్ గాదు కింకరుడే రాజగు రాజే కింకరుడగున్ గాలానుకూలంబుగన్’మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్నా యిల్లాలని నాకుమారుడని ప్రాణంబుండునందాకనెంతోయల్లాడిన యీ శరీరమిపుడిందు గట్టెలంగాలుచోనా యిల్లాలును రాదు పుత్రుండును దోడైరాడు తప్పింపగన్ వంటి పద్యాలు కూడా ఊరూరా మార్మోగేవి. సినిమా రంగం ఇంకా ఊపిరిపోసుకోని కాలంలో తెలుగునాట పద్యనాటకాలకే విశేష ఆదరణ ఉండేది. వాటిలో నటించే నటులకు ఇప్పటి సినీనటుల స్థాయిలోనే జనాభిమానం ఉండేది. సంస్కరణ ఉద్యమాలకు ఊతమిచ్చిన నాటకాలు తెలుగు నాట సంచలనం సృష్టించిన ఆధునిక సాంఘిక నాటకం ‘కన్యాశుల్కం’. గురజాడ అప్పారావు రచించిన ఈ నాటకం మొదటి కూర్పు 1897లో ముద్రితమైంది. దీని రచన 1892లోనే జరిగింది. అదే ఏడాది విజయనగరం మహారాజా పోషణలోని జగన్నాథ నాటక విలాస సంస్థ ఈ నాటకాన్ని తొలిసారిగా ప్రదర్శించింది. నాటి సాంఘిక దురాచారంపై వ్యంగ్యాస్త్రంగా సంధించిన ‘కన్యాశుల్కం’ తెలుగునాట అమిత జనాదరణ పొందింది. దేశంలో తెలుగు ప్రజలు ఉండే ప్రతిచోటా లెక్కకు మిక్కిలిగా ప్రదర్శనలకు నోచుకుంది. చాలా నాటక సమాజాలు ఈ నాటకాన్ని ప్రదర్శించాయి. చాలామంది ఈ నాటకం ద్వారానే ప్రసిద్ధిలోకి వచ్చారు. ‘కన్యాశుల్కం’లోని కొన్ని సంభాషణలు జాతీయాలుగా స్థిరపడ్డాయి. ‘కన్యాశుల్కం’ నాటకానికి వందేళ్లు పూర్తయినా, ఈనాటికీ ఈ నాటకాన్ని ఎక్కడ ప్రదర్శించినా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉండటం విశేషం. ‘కన్యాశుల్కం’ పూర్తిగా వాడుక భాషలో రాసిన నాటకం. సంస్కరణ ఉద్యమాలకు ఊతమిచ్చే లక్ష్యంతో వచ్చిన నాటకాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ‘కన్యాశుల్కం’ నాటకానికే మొదటి స్థానం దక్కుతుంది. సంస్కరణ ఉద్యమ నేపథ్యంలో సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా కాళ్లకూరి నారాయణరావు రచించిన ‘వరవిక్రయం’, ‘చింతామణి’, ‘మధుసేవ’ కూడా గొప్ప ఆదరణ పొందాయి. ఆనాటి రంగస్థల ప్రముఖులు ఆనాటి రంగస్థల ప్రముఖుల్లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు ‘ఆంధ్రనాటక పితామహుడు’గా ప్రసిద్ధి పొందారు. బళ్లారిలో 1886లో ‘సరస వినోదినీ సభ’ అనే నాటక సమాజాన్ని నెలకొల్పి విరివిగా నాటకాలను ప్రదర్శించారు. ఆయన రచించిన వాటిలో ‘చిత్ర నళినీయం’, ‘ప్రమీలార్జునీయం’, ‘రోషనారా శివాజీ’, ‘పాదుకా పట్టాభిషేకము’ వంటివి ప్రసిద్ధి పొందాయి. కన్నడ, ఇంగ్లిషు భాషలలో కూడా ధర్మవరం రామకృష్ణమాచార్యులు నాటక రచన చేశారు. నాటక రచనతో పాటు రంగస్థల దర్శకుడిగా, నటుడిగా కూడా ప్రసిద్ధి పొందారు. రంగస్థల నటుడిగా సుప్రసిద్ధి పొందిన బళ్లారి రాఘవ ఆయన మేనల్లుడే. బళ్లారి రాఘవ వృత్తిరీత్యా న్యాయవాది అయినా, ఆయనకు చిన్ననాటి నుంచి నాటకరంగంపై మక్కువ ఉండేది. పన్నెండేళ్ల వయసులో తొలిసారి రంగస్థలంపై నటించిన రాఘవ, బళ్లారిలో షేక్స్పియర్ క్లబ్ స్థాపించారు. తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషలలో దేశ విదేశాల్లో విరివిగా నాటకాలను ప్రదర్శించారు. గాంధీజీ, రవీంద్రనాథ్ టాగోర్ వంటి ప్రముఖుల ప్రశంసలను పొందిన గొప్ప నటుడు బళ్లారి రాఘవ. ఆయన తర్వాతి కాలంలో ఈలపాట రఘురామయ్యగా ప్రసిద్ధి పొందిన కల్యాణం రఘురామయ్య దాదాపు అదే స్థాయిలో ప్రేక్షకాదరణ పొందారు. పద్యనాటకాల్లో ఆయన భావాత్మకంగా పద్యాలు పాడే తీరు ప్రేక్షకులను ఆకట్టుకునేది. రవీంద్రనాథ్ టాగోర్ ఆయనను ‘రంగస్థల కోకిల’గా అభివర్ణించారు. స్థానం నరసింహారావు స్త్రీ పాత్రల అభినయంలో ప్రసిద్ధి పొందారు. ఆనాటి నటుల్లో కపిలవాయి రామనాథశాస్త్రి, బందా కనకలింగేశ్వరరావు, పీసపాటి నరసింహమూర్తి, పువ్వుల సూరిబాబు, డి.వి.సుబ్బారావు, గోవిందరాజుల వెంకటసుబ్బారావు, వడ్లమాని విశ్వనాథం, మాధవపెద్ది వెంకటరామయ్య తదితరులు అనేకులు రంగస్థలంపై తమదైన ముద్రవేశారు. అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధులుగా ప్రసిద్ధులైన వారిలో టంగుటూరి ప్రకాశం పంతులు, కొండా వెంకటప్పయ్య వంటి వారు నాటకాలు వేశారు. చిత్తూరు నాగయ్య, కస్తూరి శివరావు, సీహెచ్.నారాయణరావు, వేమూరి గగ్గయ్య, సీఎస్ఆర్ ఆంజనేయులు, యడవల్లి సూర్యనారాయణ, టి.కనకం, కన్నాంబ, ఋష్యేంద్రమణి, సీనియర్ శ్రీరంజని, లక్ష్మీరాజ్యం «వంటి తొలితరం సినీ ప్రముఖులందరూ నాటక నేపథ్యం నుంచి వచ్చిన వారే. వీరి తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టిన ప్రముఖుల్లో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కొంగర జగ్గయ్య, రేలంగి వెంకటరామయ్య, నాగభూషణం, సావిత్రి, జి.వరలక్ష్మి తదితరులు చాలామంది నాటకాలు వేసిన వారే. -
దాన వీర శూర కర్ణ
మా ఊరోళ్లకు వేడివేడిగా ఆరోజే విడుదలైన సినిమాలు బోర్ కొట్టేశాయి. విడుదల కాకముందే లీకైన సినిమాలు సెల్ఫోన్లో చూసీచూసీ బొర్ కొట్టేశాయి. పనీపాటలేని అప్లోడింగ్ వీడియోలు బోర్ కొట్టేశాయి.ట్రెండింగ్ వీడియోలు బోర్ కొట్టేశాయి.ఇలాంటి మహాబోర్ సమయంలో...‘‘మన గ్రామ సర్పంచి పుట్టిన రోజు సందర్భంగా రేపు రాత్రి మన ఊళ్లో దానవీరశూరకర్ణ నాటకం ఉంటుందహో’’ అనే చాటింపు విని ఊళ్లో ఆబాలగోపాలం ఆనందించారు.‘నాటకం చూడక ఎన్నాళ్లయిందో...ఆరోజులే వేరు’ అనే నాస్టాల్జియాతో వయసు మళ్లిన వాళ్లు...‘నాటకమటా...ఎలా ఉంటుందో చూద్దాం’ అని సోషల్ మీడియా జమానాలో పుట్టిన లేలేత కుర్రోళ్లు...చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఆరోజు సర్పంచి పుట్టిన రోజు. ఆయన ఇంటెనకాల పెద్ద గ్రౌండ్లో పెద్ద స్టేజీ ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆరింటికే ప్రేక్షకదేవుళ్లతో నాటకప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈలలు, కేకల తరువాత నాటకం మొదలైంది....నాటుసార సారయ్య శకుని వేషం కట్టాడు. బాగా కుదిరాడు.‘‘దుర్యోధన... నాకే ఓ కూతురు ఉండి ఉంటే....నీ తలపు, వలపు, నీ కులుకు వేరే వన్నెలాడివైపు పొనిచ్చేవాడినాఏంచేయనూ...మేనమామనై ఉండి కూడా మామను కాలేని దురదృష్టవంతుడిని’’ అని విషాదంగా డైలాగు కొట్టాడు ఇంతలో ప్రేక్షకుల్లో నుంచి ఒక తాగబోతు గట్టిగా అరుస్తూ పైకి లేచాడు. ఇతడు సారయ్యకు స్వయానాబావమరిది. పేరు సారా సాంబయ్య.‘‘ఒరేయ్ సారిగా...నీకు కూతుళ్లు లేకపోవడం ఏందిరా! పెళ్లీడుకొచ్చిన ముగ్గురు ఆడపిల్లలున్నరు. ఒక్కరి పెళ్లి అయినా చేసినవా? పొద్దున లేసుడు....కల్లుతాగుడు....సాయంత్రం గుడంబ తాగుడు...నీ ముఖానికో నాటకం...’’సాంబయ్య తిట్లు విని ప్రేక్షకులు ఒకటే నవ్వడం! పాపం కళాకారుడు సారయ్య ముఖం మాడిపోయిన పెసరట్టయింది.‘‘ఒరేయ్ సాంబా కూకో....’’ అని సర్పంచి అరిచేసరికి సైలెంట్ అయిపోయాడు సాంబయ్య. ఆతరువాత భీష్మ పాత్రధారి కాషయ్య డైలాగు:‘‘నాయనా...వంశం కోసం బ్రతికున్నంత వరకు వయసంతా ధారబోసిన ఘోటక బ్రహ్మచారిని. నేను మాట ఇవ్వను. ఇచ్చాను అంటే దానికి చచ్చినా తిరుగుండదు. నేను ప్రతిజ్ఞ చేసినానుఅంటే, అంతే...తిరుగుండదు. అందుకే భీష్మప్రతిజ్ఞ అంటారు’’ఈలోపే ప్రేక్షకుల మధ్యలో నుంచి కాషయ్య క్లాస్మేట్ ఒకడు లేచి....‘‘ఒరే కాశీ....వంశం కోసం వయసంతా ధారపోసావా?! పదిహేడేళ్లకే మూడు కాపురాలు పెట్టావు....నువ్వు వయసు ధారపోయడం ఏమిట్రా బెవకూఫ్. పెళ్లి చేసుకుని వదిలేయడమేనా? వాళ్ల బాగోగుల గురించి పట్టించుకునేదిలేదా! మూడో భార్య ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేసి పిల్లను సాకుతోంది. రెండో భార్య ఎండల్లో కూలీనాలికీ పోతూ కష్టపడుతోంది. మొదటి భార్యను పట్టించుకునే దిక్కేలేదు....భార్యలు కష్టపడుతుంటే నాటకాలంటూ తిరుగుతున్నవేందిరా మొద్దునాయాలా....గబ్బు నాయాలా...’’ అని నాన్‌స్టాప్‌గా తిట్లు మొదలు పెట్టాడు.ఈలోపు లచ్చయ్య అనే వార్డు మెంబరు లేచాడు... ‘‘ఆడిన మాటను తప్పను...అని ఎంత సిగ్గులేకుండా అంటున్నావురా కాశీగా! నన్ను ఉపసర్పంచి చేస్తానని మాటిచ్చావు. చేశావా? చేయకపోతే చెయ్యకపోతివి...నా దగ్గర తీసుకున్న డబ్బైనా ఇచ్చినవా? నీకేమాత్రం సిగ్గున్నా నా డబ్బు నాకు ఇచ్చేయాలి లేదా నన్ను ఉపసర్పంచి చేయాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను’’ అని అవేశంగా అరిచాడు.ఉపసర్పంచి రాజయ్య ఆగ్రహంగా లేచి...‘‘దైవం మీద ఆన. నన్ను పదవీచ్యుతుడిని చేస్తే ఊరుకునేది లేదు. ఫస్ట్‌టైమ్ వార్డ్మెంబర్గా గెలిచాను. భగవంతుని దయతో ఫస్ట్‌టైమ్ ఉపసర్పంచి అయ్యాను. పట్టుమని రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే మీ కళ్లు మండిపోయాయి. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండాలా? ఇదేనా డెమోక్రసీ? అని ఈ సందర్భంగా అడుగుతూ, ఓటరు మహాశయులకు నమస్తేచెబుతూ...నా సీట్లో నేను కూసుంటున్నాను’’ అంటూ కూర్చున్నాడు.ఫ్రెండ్స్ మాటలతో భీష్మ పాత్రధారి కాశయ్య హర్ట్ అయ్యాడు....‘‘రేయ్ దొంగనాయల్లారా...టేజీ(స్టేజీ) మీదున్నంత వరకే నేను భీష్ముడిని. టేజీ దిగానా....మాస్....పక్కా మాస్. నా డైలాగులు అయిపోయేంతవరకు గమ్మునుండండి. ఆ తరువాత...మీరు మా ఇంటికొచ్చినా సరే. నన్ను మీ ఇంటికి రమ్మన్నా సరే...ఎక్కడైనాసరే...ఎప్పుడైనా సరే...మొకాలి చిప్పలు పగిలిపోవాలా....ఏం అనుకున్నారో ఏమో....’’ అన్నాడు ఆవేశంగా.సర్పంచి మళ్లీ గట్టిగా అరిచాడు.‘‘నాటకం వేస్తరా? నకరాలు చేస్తరా?’’చిన్నబ్రేక్ తరువాత నాటకం మళ్లీ మొదలైంది.దుర్యోధన సార్వభౌముడు రేకుల కైలాసం ఆవేశంగా తన డైలాగు స్టార్ట్ చేశాడు...‘‘ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి?ఎంత మాట ఎంత మాటా!మట్టికుండలో పుట్టిన నీదే కులం?(ఆ తరువాత డైలాగు మరిచిపోయాడు కైలాసం. ఈ మతిమరుపు వల్లే పదవతరగతి పరీక్ష మూడుసార్లు తప్పాడు. ఇంకా తప్పుతూనే ఉన్నాడు. ఏదో ఒక సంవత్సరం అన్ని సబ్జెక్టులు పాసై తనను తాను ప్రూవ్ చేసుకోవాలనేది కైలాసం ఆశయం. ఎంత పెద్ద మొనగాడైనా స్టేజీ మీద డైలాగులు మరిచిపోవడం కామన్ విషయమని, అలాంటప్పుడు ప్రేక్షకులకు అనుమానం రాకుండా ఫ్లోలో నోటికొచ్చింది దంచుకుంటూ పోవాలని సీనియర్ నటుడు, నటరత్న కల్లు నాగమల్లు చెప్పిన విషయం కైలాసానికి గుర్తుకు వచ్చింది. ఇక చూస్కోండి. ఇలా అందుకున్నాడు...)‘ఆచార్యదేవాఏమంటివి ఏమంటివి?ఇది క్షేత్రపరీక్ష కాని క్షత్రియపరీక్ష కాదు... టెన్త్‌క్లాస్ పరీక్ష కానేకాదు.ఆచార్యదేవా...ఏమంటివి?టెన్త్క్లాస్పరీక్ష పాసు కావడమంటే మామూలనుకుంటివా?పొద్దున లేచి పండ్లు తోముకున్నంత ఈజీ అనుకుంటివా?ఆచార్యాదేవా...క్షేత్రపరీక్ష, క్షత్రియపరీక్షైనా పాస్కావచ్చుగానీ... టెన్త్క్లాసుపరీక్ష పాస్ కావడం అల్లాటప్పా వ్యవహారం అనుకుంటివా...’ఇంకేముంది....ఒన్స్మోర్ అంటూ ఒకటే లీలలు! – యాకుబ్ పాషా -
నాటకరంగ వ్యాప్తికి కృషి
సాక్షి, సిటీబ్యూరో: ‘తెలంగాణలో నాటక రంగం మరింత బలపడాలని మా తండ్రి ఖదీర్ అలీ బేగ్ ఎప్పుడూ తలంచేవారు. అందుకోసం 14ఏళ్లుగా ఖదీర్ అలీ బేగ్ థియేటర్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాం. ప్రతిఏటా థియేటర్ ఫెస్టివల్‌తో ఆయన్ని గుర్తు చేస్తున్నాం. యాంత్రిక జీవనంతో ఒత్తిడికి గురవుతున్న సిటీజనులకు ఓ మంచి వినోదం అందించాలని ఖదీర్ అలీ బేగ్ తపించేవారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని కష్టాలు ఎదురైనా ఫెస్ట్ నిర్వహిస్తున్నామ’ని థియేటర్ ఫెస్టివల్ నిర్వాహకులు, ప్రముఖ నాటక దర్శకుడు మహ్మద్ అలీ బేగ్ ‘సాక్షి’తో చెప్పారు. 2005లో ఏర్పాటు... ‘మా త్రండి హైదరాబాద్ నుంచి ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు. 1970లో న్యూ థియేటర్ ఆఫ్ హైదరాబాద్ ‘ఎన్‌టీహెచ్ స్థాపించారు. సఖరం బైండర్, అధే అడోహోరే, ఖమోష్ అడాలాత్ జారి హై, కెహ్రాన్ కే రాజాన్స్ తదితర నాటకాల్లో నటించారు. ఆనాడు ఆయన వేసిన సెట్లు అందర్నీ ఆకట్టుకునేవి. 2005లో ఖదీర్ అలీ బేగ్ థియేటర్ ఫెస్టివల్ ఫౌండేషన్‌ను స్థాపించి ఎన్నో థియేటర్ ఫెస్టివల్స్ నిర్వహించాం. మరెన్నో చారిటీ కార్యక్రమాలు ఏర్పాటు చేశామ’ని మహ్మద్ అలీ బేగ్ చెప్పారు. 150 మంది కళాకారులతో... ఈ థియేటర్ ఫెస్టివల్ రవీంద్రభారతిలో గురువారం ప్రారంభమైంది. ఈ నెల 4వరకు కొనసాగుతుంది. ఇందులో దాదాపు 150 మంది కళాకారులు పాల్గొంటున్నారు. అస్మిత థియేటర్ గ్రూప్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన తారా హిందీ నాటకం ఆకట్టుకుంది. 2న డ్రీమ్జ్ సెహర్, 3న ‘ల’మెంట్ (దిలవర్), 4న హౌ ఐ మెట్ యువర్ ఫాదర్ నాటకాలను ప్రదర్శించనున్నారు. ఈ నాటకాల్లో ఒగ్గు డోలు, చిందు యక్షగానం కూడా ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. -
మనస్సాక్షినే నమ్ముతాను..
‘ఎంజీఆర్ సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత కూడా మా మధ్య స్నేహం కొనసాగింది. ఇద్దరం వేరు వేరు పార్టీలకు నాయకులమైనప్పటికీ స్నేహితుల్లా మసలుకున్నాం. ఎంజీఆర్ తర్వాత, ఆ పార్టీ నాయకత్వం మమ్మల్ని ద్వేషించడం మొదలెట్టింది. కామరాజ్ – నేనూ దోస్తులమే. మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి భక్తవత్సలంతోనూ స్నేహం చేశాను. ఆర్ వెంకటరామన్ ఇప్పటికీ నా స్నేహితుడే (2007 నాటికి). తమిళనాడులో ఏఐఏడీఎంకే అని పిలవబడే పార్టీని మినహాయిస్తే, మిగిలిన వారితో మాకు మంచి స్నేహమే వుంది’ అని 2007లో ఓ వార్తా ్తసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరుణ చెప్పారు. - ‘నా మనస్సాక్షినే నేను నమ్ముతాను. నా దైవం అదొక్కటే’ అంటారు కరుణ. - సంకీర్ణ ప్రభుత్వామనేది తాత్కాలిక ఏర్పాటు. సంకీర్ణం కారణంగా మేం కొన్ని డిమాండ్లు సాధించుకోగలిగాం. తమిళ భాషకు ప్రాచీన ప్రతిపత్తి లభిస్తుందని మేమెప్పుడూ అనుకోలేదు. చివరికి అది కూడా సంకీర్ణం వల్లే సాకారమైంది’ అని ఓ ఇంటర్వ్యూలో వివరించారు కరుణానిధి. - కేంద్రంలో తాను కలసిన వ్యక్తుల్లో వీపీ సింగ్‌ను గొప్ప మనిషిగా భావిస్తారు కరుణ. వీపీ చేపట్టిన సామాజిక సంస్కరణలు, రిజర్వేషన్లు, మండల్ కమిషన్ ఏర్పాటు వంటి అంశాలు తమ స్నేహానికి వారధి వేశాయంటారు. - కరుణతో వాజ్‌పేయ్ బాగుండేవారు. ‘మా బంధం గట్టిగా ఉండడానికి మురసోలి మారన్ ఒకానొక కారణం’ అని కరుణ ఒక సందర్భంలో చెప్పారు. (వాజ్‌పేయ్ ప్రభుత్వంలో మారన్ కేబినెట్ మంత్రి పనిచేశారు. ఇప్పుడు లేరు)) ఈ నేతలిద్దరూ ఎమర్జెన్సీ కాలంలో ఒకే వేదికపై ప్రసంగాలు చేశారు. రాముడు నాకు శత్రువు కాదు.. వాల్మీకి రామాయణాన్నీ, తులసీ రామాయణాన్నీ చదివాను. పలు రామాయణాల్లో మాదిరిగానే తులసీ రామాయణంలో సీత రాముడి చెల్లెలు. వాల్మీకి రామాయణంలో మాత్రం ఆమె రాముడికి భార్య. ఆర్యులు – ద్రవిడుల మధ్య జరిగిన యుద్ధం ఆధారంగా రామాయణాన్ని రచించారు. రాముడు ఓ కల్పిత పాత్ర. జవహర్లాల్ నెహ్రూ కూడా రాముణ్ణి నాయకుడిగానే చూశారు. దేవుడిగా కాదు. సి. రాజగోపాలచారి రచించిన ‘చక్రవర్తి తిరుమగల్’ పుస్తకం ప్రకారం – రాముడు యువరాజు. దేవుడు కాదు. రాముడికి నేను శత్రువును కాను. ముస్లింలు / క్రైస్తవులు పండుగల వేళ ఆహ్వానిస్తే వెళతాం. అలాగే హిందువులూ ఆహ్వానిస్తే ఎందుకెళ్లం? అందులో తప్పేం లేదు కదా!.. – 2007లో కరుణానిధి ఇచ్చిన ఇంటర్వ్యూల నుంచి కళానిధి చిన్నతనంలో చదువు పట్ల ఆసక్తి వుండేది కాదని కరుణ తన ఆత్మకథలో రాసుకున్నారు. నాటకం, కవిత్వం, తమిళ సాహిత్యం వైపే ఆయన మనసు మళ్లుతుండేదట. కరుణ తండ్రి ముత్తువేలు.. చనిపోవడానికి ఒక నెల ముందు కరుణానిధి మాటలు రాసిన‘రాజకుమారి’ సినిమా చూడాలనుకున్నారట. కానీ అప్పటికే ఆయన కంటి చూపుకు దూరమయ్యారు. కనీసం కొడుకు రాసిన మాటలైనా విందామనుకున్నారాయన. దీంతో తిరువారూర్‌లో ఓ థియేటర్‌కు తీసుకుపోయారు. ‘రచయితగా నేను ఎదిగిన తీరును చూసి ఆయన ఎంతో సంబరపడ్డారు’ అని ఆత్మకథలో చెప్పారు కరుణ. -(సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో టీడీపీ నేతలు..
సాక్షి, విశాఖపట్నం : ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న మోసపూరిత విధానం, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హోదా హామీని అమలు చేయని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 30న విశాఖలో చేపట్టనున్న ‘వంచన దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కోరారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల నాయకులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. వంచన దినం సందర్భంగా ఆ రోజు ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు 12 గంటల పాటు పార్టీ నేతలు నిరాహార దీక్ష చేపడతారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఇటీవల రాజీనామాలు చేసిన పార్టీ ఎంపీలు, రాజ్యసభ్యులతో పాటు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర జరుగుతున్న జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనాయకులంతా హాజరవుతారని వివరించారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదాపై ప్రజలను ఎలా మోసం చేస్తున్నది, తప్పుదారి పట్టిస్తున్నదీ ఆయా నియోజకవర్గాల్లో వివరించాలని కోరారు. వంచన దీక్షకు వేదిక స్థలాన్ని ఎక్కడ ఖరారు చేయాలన్న దానిపై నాయకులతో విజయసాయిరెడ్డి చర్చించారు. అందరి సూచనల మేరకు ఏకాభిప్రాయంతో పాత జైల్‌రోడ్డు జంక్షన్ వద్ద ఉన్న మహిళా కళాశాల ఎదురుగా ఉన్న స్థలం అనువైనదిగా ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. చివరకు ఆ స్థలాన్ని ఖరారు చేశారు. వంచన దినం కార్యక్రమానికి తరలి వచ్చే వేలాది మందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత సమన్వయకర్తలు, నాయకులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్సార్సీపీ ఉద్యమాలు, ఆందోళనలు కొనసాగిస్తుందని, ఇందుకు పార్టీ శ్రేణులు సంసిద్ధులై ఉండాలని చెప్పారు. సమీక్షా సమవేశంలో మాడుగుల ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ శాసనసభ పక్ష ఉపనేత బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ, అనకాపల్లి, అరకు పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు తైనాల విజయకుమార్, గుడివాడ అమర్నాథ్, పరీక్షిత్‌రాజు, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాదరాజు, సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, సత్తిరామకృష్ణారెడ్డి, పసుపులేటి ఉషాకిరణ్, అదీప్‌రాజు, పెట్ల ఉమాశంకర్ గణేష్, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, శెట్టి ఫల్గుణ, అక్కరమాని వెంకట్రావు, సీఈసీ సభ్యులు శ్రీకాంత్‌రాజు, కంపా హనోకు, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, అదనపు కార్యదర్శులు జి. రవిరెడ్డి, పక్కి దివాకర్, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఫరూఖీ, బోని శివరామకృష్ణ, వాసు, షరీఫ్, బర్కత్ ఆలీ, పాత్రుడు, జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన టీడీపీ నేతలు విజయనగరం టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ వీరభద్రస్వామి, చినశ్రీను సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. గుత్తిరాల వెంకటేశ్వరరావు, కొండపల్లి సునీల్, కోకర్ల మస్తాన్ చౌదిరి,మయనేన మోషన్‌సాయి,పెలిశేటి రమేష్,పర్వతనేని సత్యనారాయణ,కడియాల రామకృష్ణ(ఆర్.కె) పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. -
ఇది వైద్యుడి ఉద్యమం
సాక్షి ప్రతినిధి,తిరుపతి : ఈయన పేరు డాక్టర్ బీవీ రాజారావు. తిరుపతిలో పేరున్న డాక్టర్. ఈయ న్ని కలిసే రోగులూ ఎక్కువే. రోజువారీ సంపాదన కూడా బాగానే ఉంటుంది. ఏసీ రూములో కూర్చుని రోగుల్ని పరీక్షించి రోజుకు రూ.50 వేల కు తగ్గకుండా సంపాదించుకోవచ్చు. ఒకమాటలో చెప్పాలంటే సుఖవంతమైన జీవితం. అయితే... డాక్టర్ రాజారావు ఈ తరహా జీవితాన్ని కోరుకోవడం లేదు. మనం తెలుగు గడ్డపై పుట్టి, తెలుగువాడిగా పెరిగి రాష్ట్రానికి ఏం చేశామని ప్రశ్నించుకుంటున్నారు. ప్రత్యేక హోదా సాధన తన కర్తవ్యమంటూ పోరాటం మొదలు పెట్టారు. ఎవరు కలిసొచ్చినా, రాకపోయినా తాను మా త్రం పోరాటాన్ని వీడబోనని స్పష్టం చేస్తున్నారు. చెప్పడమే కాదు.. ఆస్పత్రి వదిలి రోడ్డు మీదకొచ్చి తిరుపతి మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఐ దు రోజులుగా ఆత్మగౌరవ ఉద్యమం చేస్తున్నారు. ఇది ప్రజా వేదిక... సమాజంలో ప్రతి ఒక్కరూ దేశం, రాష్ట్రం కోసం బాధ్యతగా ఆలోచించాలన్నదే డాక్టర్ బీవీ రాజారావు అభిప్రాయం. వృత్తి ఏదైనా పౌరుడిగా రాష్ట్రం కోసం పోరాడాలన్నదే ఆయన నినా దం. ఇందుకోసం ఒంటరి పోరు ప్రారంభించా రు. ప్రజలు, రాజకీయ పార్టీలన్నీ ఉమ్మడిగా ఒకే వేదికపై పోరాటం చేసేందుకు అనువుగా ప్రజావేదికను ఏర్పాటు చేశారు. అందులోనే తాను కూ ర్చుని, రండి...ఉద్యమిద్దామని పిలుస్తున్నారు. హోదా విషయంలో చంద్రబాబు ఆడిన డ్రామాలను వివరిస్తున్నారు. ఇది ప్రజా వేదిక.. ఇక్కడ ఎవరైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకోవచ్చని చెబుతున్నారు. వేసవి గాలులు, ఉక్కపోతను భరిస్తూనే పోరాటం చేస్తున్నారు. రోడ్డున పోయే పరిచయస్తులను పిలిచి, హోదా అవసరాన్ని వివరించి వారినీ ఉద్యమంలో భాగస్వాముల్ని చేస్తున్నారు. ఐదురోజులుగా సు మా రు ఐదువేల మందితో భావాలు పంచుకున్నారు. వేదిక దగ్గరే ఉచిత వైద్యం... హోదా సాధన పోరు చేపట్టిన డాక్టర్ రాజా రావు వేదిక వద్దనే ఉచిత వైద్యాన్ని చేస్తున్నారు. రోజూ వేదిక దగ్గరకొచ్చే యాచకులు, పేదలు, అనాథలు, ఏ ఆదరణ లేని వృద్ధులకు ఉచితంగా వైద్యం చేస్తున్నారు. యాచకులు, పేదలకు అర్థమయ్యేలా తెలుగులోనే ప్రిస్క్రిప్షన్ రాసి, రుయా ఆస్పత్రికి సిఫార్సు చేస్తున్నారు. గ్రామాల్లోకి వెళతా...పల్లెజనాన్ని కదిలిస్తా... ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పల్లెల్లోనూ కొనసాగిస్తానని డాక్టర్ రాజారావు అంటున్నారు. రో జుకు నాలుగైదు గ్రామాలకు వెళ్లి అక్కడి పల్లె జనానికి హోదా అవసరాన్ని తెలియజేస్తానని చె బుతున్నారు. పల్లెల్లో ఉద్యమ పోరును ఉధృతం చేస్తేనే కేంద్రం కదలి వస్తుందని అంటున్నారు. అన్ని పార్టీలూ ఒకే వేదికపై ఆమరణ దీక్ష చేయాలని, నేరుగా సీఎం చంద్రబాబే స్వయంగా ఢిల్లీ వెళ్లి ఆమరణ దీక్షకు పూనుకుంటే ఏపీకి ప్రత్యేక హోదా ఖాయమని ఆయన అంటున్నారు. -
హత్య.. హైడ్రామా..!
మహబూబ్‌నగర్ క్రైం: సినిమా స్థాయిలో హత్య డ్రామా నడిచింది.. ఓ వ్యక్తిపై కుంకుమ కలిపిన నీటిని పోసి.. అతనిని హత్య చేయకపోయినా చేసినట్లు చిత్రీకరించి సుపారి ఇచ్చిన వ్యక్తికి ఫొటోలు తీసి వాట్సాప్ ద్వారా పంపించి నమ్మించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రూరల్ ఎస్ఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా.. మూసాపేట మండలం పొల్కంపల్లికి చెందిన పుట్ట చెన్నయ్య ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేస్తూ పట్టణంలోని పద్మవతికాలనీలో నివాసం ఉంటున్నాడు. అయితే పొల్కంపల్లి గ్రామ సర్పంచ్ యాదయ్యకు పుట్ట యాదయ్యకు గ్రామంలో భూమి గొడవలు జరుగుతున్నాయి. ఇదే కేసుల విషయంలో మార్చి 24న జిల్లా కోర్టుకు హాజరయ్యేందుకు యాదయ్య, పుట్ట చెన్నయ్య ఇద్దరు వచ్చారు. ఆ సమయంలో యాదయ్య ఇద్దరు కొత్త వ్యక్తులకు పుట్ట చెన్నయ్యను చూపించాడు. ఆ విషయంపై అనుమానం వచ్చిన చెన్నయ్య అతని మామ కొడుకు అయిన ఆంజనేయులును పిలిచి ఆ కొత్త వ్యక్తులను చూపించాడు. దాంట్లో భగీరథకాలనీకి చెందిన అజయ్‌గా గుర్తించాడు. అదేరోజు సాయంత్రం అజయ్ పిలిచి ఆంజనేయులు అడిగాడు అప్పుడు అతను పొల్కంపల్లి సర్పంచ్ యాదయ్య మీ మామను హత్య చేయాలని మాకు రూ.2లక్షలకు సుపారీ ఇచ్చినట్లు తెలిపాడు. ఆ తర్వాత ఆంజనేయులు అజన్ను బతిమిలాడగా హత్య చేయనని ఒప్పుకున్నాడు. చంపినట్లు చిత్రీకరణ అజయ్ వారం రోజుల తర్వాత పుట్ట చెన్నయ్యను మహబూబ్‌నగర్‌లో కలిశాడు. సర్పంచ్ యాదయ్య నిన్ను చంపమని ఫోన్ చేస్తున్నాడని చెప్పాడు. నేను చెప్పినట్లు నవ్వు చేస్తే చావు నుంచి తప్పించుకోవచ్చు అనే సలహా ఇచ్చాడు. దీంతో ఈనెల 1న రాత్రి 7గంటల సమయంలో రూరల్ పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలోకి అజయ్, వరు ణ్, పుట్ట చెన్నయ్య ముగ్గురు వెళ్లారు. ఆ తర్వాత అజయ్, వరుణ్ కలిసి పుట్ట చెన్నయ్యను ఒక రాయి దగ్గర పడ్డుకోబెట్టి అతనిపై కుంకుమ కలిపిన నీటిని చల్లి..హత్య చేసినట్లు చిత్రీకరించారు. వాటి పుటేజీలను వాట్సాప్ ద్వారా యాదయ్యకు పంపించి చెన్నయ్యను హత్యచేసినట్లు తెలిపారు. అనంతరం చెన్నయ్య షాద్‌నగర్‌కు వెళ్లాడు. మంగళవారం ఉదయం చెన్నయ్య హత్యకు గురైనట్లు ప్రచారం జరిగింది. అతని కుటుంబసభ్యులకు సైతం తెలియడంతో వారు రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. చెన్నయ్య అపుడే ఫోన్ చేసి తాను బతికే ఉన్నానని చెప్పాడు. అనంతరం చెన్నయ్య మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పొల్కంపల్లి సర్పంచ్ యాదయ్యపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్ఐ ఏ–1గా యాదయ్యపై, అజయ్, వరుణ్‌లపై సైతం హత్యాయత్నం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫెడరల్ ఫ్రంట్ ఓ డ్రామా
సుల్తానాబాద్(పెద్దపల్లి) : సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ డ్రామా చేస్తున్నారని అందులో పస లేదని బీజేపీ రాష్ట్ర ఉపాద్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సుల్తానాబాద్ పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన బూత్ కమిటీల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేంద్రం రాష్ట్రానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తుంటే, కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను ప్రక్క దారి పట్టిస్తూ బీజేపీని బద్నాం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం కృషి వికాస్ యోజన పథకం ద్వారా జిల్లాకు 52 సబ్సిడీ ట్రాక్టర్లు, ప్రధానమంత్రి కృషి శిక్షణ యోజన ద్వారా 400 విద్యుత్ మోటార్లు సబ్సిడీపై రాగా టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇవ్వడంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. 2019లో కేంద్రంలో నరేంద్రమో«డి ప్రభుత్వం రాష్ట్రంలో బీజేపీ భాగస్వామ్య పక్షాలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి 37లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్తున్నారని, అది ఎలా సాధ్యమో వివరించాలన్నారు. కేంద్రం 13వ, 14వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామాలకు నేరుగా నిధులు అందిస్తోందన్నారు. గ్రామ పంచాయతి యాత్ర ఈ నెల 29న కాల్వ శ్రీరాంపూర్ నుంచి ప్రారంభించేందుకు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరు కానున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీస అర్జున్ రావు, జిల్లా కార్యదర్శి సంజీవ రెడ్డి, అశోక్ రావు, కన్నం అంజయ్య, బీజెవైఎం జిల్లా అధ్యక్షుడు కోట రాంరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మహేందర్ యాదవ్, మండలాధ్యక్షుడు తిరుపతి యాదవ్, లింగారెడ్డి, ఎల్లయ్య, రాజేంద్రప్రసాద్, సదయ్య, నాగేశ్వర్, మహిపాల్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. -
బీజేపీ, టీడీపీ నాటకాలు
అనంతపురం: ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాటకాలు ఆడుతూ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధనకు చేస్తున్న పోరాటంలో భాగంగా వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సోమవారం పార్లమెంటులో చర్చకు రానున్న నేపథ్యంలో ఎంపీలకు సంఘీభావంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ప్రజా సంకల్ప మానవహారం’ చేపట్టనున్నట్లు తెలిపారు. హోదా కోసం పోరాడుతున్న పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, విద్యార్థులు, యువజన సంఘాలు, నిరుద్యోగులు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదా అంశాన్ని నాలుగేళ్లుగా కాలయాపన చేస్తూ వచ్చిన బీజేపీ, టీడీపీలు ఈ రోజు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా టీడీపీ చేసిన తప్పిదాలను ఇతరులపై నెట్టేందుకు కుటిలయత్నం చేస్తోందన్నారు. వైఎస్సార్సీపీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్ధతిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఉదయానికే మాట మార్చి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఉగాది శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు అనంత వెంకటరామిరెడ్డి విళంబి నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. -
అగ్రవర్ణాల లబ్ధి కోసమే వర్గీకరణ డ్రామా
సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణాలు లబ్ధి పొందేందుకే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ డ్రామా ఆడుతున్నాయని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆరోపించారు. వర్గీకరణ అంశానికి కాలం చెల్లిందని, దళితులు ఈ డిమాండ్ కోరుకోవడం లేదన్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మాలమహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీల్లో మాల, మాదిగలు, ఎస్టీల్లో లంబాడ, ఆదివాసీల మధ్య గొడవలు సృష్టించి అగ్రవర్ణ రాజకీయ పార్టీలు లబ్ధి పొందుతున్నాయని చెన్నయ్య విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికిన రాజకీయ పార్టీల వైఖరిని మాలమహానాడు ఖండిస్తోందన్నారు. అఖిల పక్షాన్ని డిల్లీకి తీసుకెళ్లాలన్న ఆలోచనను రాజకీయ పార్టీలు విరమించుకోవాలని, లేకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును దళితులు వ్యతిరేకిస్తున్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో మాలమహానాడు ప్రతినిధులు జంగా, భగవాన్ దాస్, బి.సాయి తదితరులు పాల్గొన్నారు. -
రక్తికట్టని టీడీపీ నాటకం
పిడుగురాళ్లరూరల్: లేని గుడిసెలను ఉన్నట్లు సృష్టించి, పైగా తగులబెట్టారంటూ అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు మండలంలోని కోనంకి గ్రామంలో మంగళవారం హైడ్రామా నడిపారు. పథకం ప్రకారం గుడారాలు తగులబెట్టారని, కొంతమందిని కూడా కొట్టారంటూ ధర్నాకు దిగారు. పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో 141, 142 సర్వే నంబర్లలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు అన్నపరెడ్డి హనుమాయమ్మ, అన్నపరెడ్డి మట్టారెడ్డి, వీరభద్రుని భాస్కరరెడ్డి, వీరభద్రుని అంతి రెడ్డి, వీరభద్రుని శేషిరెడ్డిలకు 7.01 ఎకరాల భూమి ఉంది. దీనికి నష్టపరిహారం చెల్లించకుండా అధికారులు పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామంటూ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ అధికారులు ఈనెల 20న భారీ పోలీసు బలగాలను తీసుకువచ్చి ఆ భూమి వద్దకు బాధితులను సైతం రానివ్వకుండా లేఅవుట్లు వేశారు. అప్పటికప్పుడే నాలుగైదు గుడారాలను ఏర్పాటు చేశారు. దీంతో తిరిగి బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో మంగళవారం అనుకూలంగా స్టే వచ్చింది. వీరు ప్రతిసారి కోర్టును ఆశ్రయిస్తున్నారన్న నెపంతో, వీరిపై అక్రమ కేసులు బనాయించాలన్న దురుద్దేశంతో పథకం ప్రకారం గుడారాలు తగులబడ్డాయని, కొంతమందిని కొట్టారంటూ టీడీపీ నేతలు హల్చల్ చేస్తూ ధర్నాకు దిగారు. కోనంకికి చెందిన పదిహేను మందితో పాటు పిడుగురాళ్లకు చెందిన టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు కూడా పాల్గొనడంతో గ్రామస్తులు విస్తుపోయారు. వంత పాడుతున్న అధికారులు గుడారాలను రాత్రికి రాత్రి తగులబెట్టుకుని అక్కడ కొంత వంట పాత్రలను వారే పడేసి ఓ పెద్ద నేర చరిత్రను సృష్టించేందుకు టీడీపీ గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి నాయకుల వరకు ప్రయత్నం చేశారు. తీరా భూమి వద్దకు వెళ్లి చూస్తే అది చలిమంటలు వేసుకున్నట్లుగా, ఒకచోట కట్టెపుల్లలు తగులబడినట్లు ఉంది కానీ గుడారాలు తగులబడినట్లు లేదని చూసిన ప్రతి ఒక్కరికీ ఇట్టే అర్థమవుతోంది. స్థానిక ప్రజాప్రతినిధి ఆజ్ఞలకు రెవెన్యూ, పోలీసు అధికారులు సైతం తలొగ్గి కేసును ఏ విధంగా పెట్టాలో.. ఎలా దీన్ని హైలెట్ చేయాలో తెలి యక తలలు పట్టుకుంటున్నారు. సంఘటన స్థలాన్ని సత్తెనపల్లి డీఎస్పీ కాలేషావలి, పిడుగురాళ్ల సీఐ హనుమంతరావు పరిశీలించారు. -
పెడ పోకడలతో జగతికి విపత్తు
ఒంగోలు కల్చరల్: భారతీయం కళార్చనలో భాగంగా బుధవారం రాత్రి స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రదర్శించిన సాంఘిక నాటికలు సామాజిక స్పృహను చాటిచెప్పాయి. యంగ్ థియేటర్స్, విజయవాడ కళాకారులు ప్రదర్శించిన ‘దేవుడ్ని చంపిన మనిషి’ నాటిక నేటి మానవుడు పర్యావరణ విరోధిగా ఎలా మారుతున్నాడో చాటిచెప్పింది. జీవరాశిలో విజ్ఞాన ధనుడిగా మానవుడిని భగవంతుడు సృష్టించాడని అయితే నేడు మనిషి పెడ పోకడలతో అందమైన జగత్తును నాశనం చేస్తూ దైవాంతకునిగా మారుతున్నాడని, ఇది ప్రపంచానికి తీరని ముప్పని ఈ నాటిక హెచ్చరించింది. భాస్కర చంద్ర రచించిన ఈ నాటికకు శశి భాగ్యారావు దర్శకత్వం వహించారు. సాయి ఆర్ట్స్, ఒంగోలు ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘నిర్లక్ష్యం ఖరీదు’ బాలల నాటిక ఎయిడ్స్, హెచ్ఐవీ మూలంగా జరిగే అనర్థాలను తెలియజెప్పింది. కె.వెంకటేశ్వరరావు రచించిన ఈ నాటికకు ఎస్కే రసూల్ దర్శకత్వం వహించారు. చింతలపాలెం కోలాట భజన బృందం కళాకారుల ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. చిన్నారుల నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. నాటకోత్సవంలో భాగంగా గురువారం సాయంత్రం ‘శ్రీకృష్ణ భీమసేనం’ పద్య నాటక ప్రదర్శన, కళారూపాల ప్రదర్శన ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కళాపరిషత్ ఉత్సవాల్లో స్టాల్స్ ఏర్పాటు బుధవారం ప్రారంభమైంది. చేనేత వస్త్రాలు, రెడీమేడ్ దుస్తుల దుకాణాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చీరలు నేసేందుకు ఉపయోగించే మగ్గాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. -
ఆ నాటకం ఓ స్వప్న సాఫల్యం
ఆదిత్య హృదయం సినిమా కంటే రంగస్థలం అనేది ప్రజలు, వారి విలువలు, ప్రవృత్తులకు సంబంధించిన ఉత్తమ ప్రతిబింబంగా ఉంటుందని నేను చెబుతాను. ఉదాహరణకు, అవాస్తవాన్ని లేక పలాయనవాద కాల్పనికతను నమ్మింపజేయడం వెండితెర కంటే రంగస్థలం మీద చాలా కష్టం. సినిమాను ముందుగా తీసి చూపించడం కంటే, నాటకాన్ని అప్పటికప్పుడు ప్రదర్శించడం మరింత ఆసక్తిదాయకంగా ఉంటుంది. గత వారం లండన్‌లో నేను చూసిన ఒక సంగీత నాటకమే ఈరోజు మీకు నేను చెప్పబోతున్న ఉదాహరణ. ‘ఎవ్రీబడీ ఈజ్ టాకింగ్ ఎబౌట్ జేమీ’ అనే ఈ నాటకాన్ని బ్రిటన్ మధ్యప్రాంత పట్టణం షెఫీల్డ్‌లో రూపొందించారు. ఇది అమ్మాయిలా దుస్తులు ధరించాలనుకునే జేమీ అనే పదహారేళ్ల కుర్రాడి గురించిన కథ. అయితే జేమీ హిజ్రా కాదు. పైగా అతడు గే కావలసిన అవసరం కూడా లేదు. ఆకర్షణీయమైన రాణి కావాలనేది అతడి కల. ఆ కల ఎలా నెరవేరింది, శ్రోతల కోసం అతడు హీరోగా ఎలా పరిణమించాడు అనేదే నాటక ఇతివృత్తం. మరిన్ని వివరాల్లోకి వెళ్లడానికి ముందు ఈ నాటకం గురించి స్థూలంగా చెప్పనివ్వండి. అ సమయంలోనే అమెరికన్ హిప్– హాప్ సంగీత రూపకం హామిల్టన్ బాగా ప్రాచుర్యంలో ఉండేది. ఆ ప్రదర్శన టిక్కెట్లు పూర్తిగా అమ్ముడైపోయాయి. బ్లాక్ మార్కెట్లో ఒక టికెట్‌ను వెయ్యి పౌండ్లకు అమ్మినట్లు దళారులు ఘనంగా ప్రకటించారు. వాస్తవం ఏమిటంటే ప్రతి ఒక్కరూ హామిల్టన్ రూపకం గురించే మాట్లాడుతున్నారు తప్ప జేమీ గురించి ప్రస్తావించే వారు కూడా లేరు. లండన్‌లో ఆ రెండింటినీ నేను చూశాను. హామిల్టన్ చాలా మంచి ప్రదర్శన అంటే నేను నిరాకరించను. కానీ జేమీ మాత్రం అసాధారణమైంది, అరుదైనది కూడా. అదొక విశిష్ట రూపకం. మొత్తంమీద చెప్పాలంటే హామిల్టన్ రూపకం.. చూడటానికి మీరు పెట్టే డబ్బుకు తగిన విలువైనది కాదు. సగటు థియేటర్లలో ఉన్న ధర కంటే ఎక్కువ ధరను పెట్టినప్పటికీ, జేమీ కోసం మీరు పెట్టిన ప్రతి పెన్నీ కూడా విలువైనదే. బ్రిటన్ గర్వించదగిన నాటకంగా జేమీ ఎందుకు విశిష్టమైనదో తెలుసుకోవడానికి ఇప్పుడు మళ్లీ వెనక్కు వద్దాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిలాగా దుస్తులు ధరించాలన్న కోరికను వెల్లడిస్తే ప్రపంచంలో ఉన్న పలు సమాజాలలో అది కుటుంబ విషాదంగానూ, జనానికి చికాకును, సంకటస్థితిని కలిగించే ఘటనగాను తయారవుతుంది. అప్పటినుంచి అతడు తెరచాటునే ఉండాల్సి వస్తుంది. తలుపుల వెనుక అతడిని నిర్బంధిస్తారు. పైగా అతడిని ఇక మాట్లాడనివ్వరు. నిజాయితీగా చెప్పాలంటే, భారత్‌లో అతడితో మనం అలాగే వ్యవహరిస్తాం. కానీ ఈ నాటకం మాత్రం అలా చూపలేదు. అందుకే అది అత్యంత ప్రత్యేకమైన నాటకంగా నిలుస్తోంది. కార్మికవర్గం ప్రధానంగా ఉండే యార్క్‌షైర్ సెట్టింగులో, జేమీ ఆకాంక్షను జీవితానికి సంబంధించిన పరమ సంతోషకరమైన సంబరంగా చిత్రించారు. మీకు మీరు నిజాయితీగా ఉండి, మిగిలిన ప్రపంచం ఏం చెబుతుందో లెక్కపెట్టకుండా ఉన్నట్లయితే, ఈ నాటకంలో సగ భాగం ఈ ఆనందకరమైన సంబరాన్నే చూపిస్తుంది. మరొకటి ఇంకా ముఖ్యమైంది. మీరు కోరుకున్నట్లు ఉండాలని మీరు భావిస్తే ప్రపంచం మిమ్మల్ని ఆమోదిస్తుంది, అంతేకాకుండా మిమ్మల్ని గౌరవించడానికి కూడా ముందుకొస్తుంది. నాటకం కొనసాగిన రెండున్నర గంటల సమయంలో శ్రోతలు జేమీని చూసి, అతడి తల్లి తన కోరికను ప్రోత్సహించి, సమర్థించే తీరును చూసి పగలబడి నవ్వారు, ఏడ్చారు కూడా. జేమీ మారిన వస్త్రధారణను ఆమోదించని అతడి స్కూల్ టీచర్ తానెంత క్రూరమైన వ్యక్తి అన్నదాన్ని గుర్తించనప్పటికీ, అతడికి మద్దతు పలుకుతూ వచ్చిన తోటి విద్యార్థులు మాత్రం, పెద్దల కంటే పిల్లలే తరచుగా విజ్ఞత కలవారన్న అంశాన్ని శక్తివంతంగా శ్రోతలముందు పెడతారు. చివరకు మెరిసే దుస్తులతో వాటికి సరిపోలే మహిళలు వాడే స్టిలెట్టో హీల్స్‌తో, ఒక బ్లాండ్ విగ్‌తో, మేకప్‌తో జేమీ పాఠశాలకు వచ్చినప్పుడు ఈ నాటకం తనదైన సుందర క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. జేమీ మైమరపించే అమ్మాయిని తలపించడంలో సందేహం లేదు కానీ, ఆ క్షణంలో మీరు తిలకించే అసలు మ్యాజిక్ ఏమిటంటే, మానవ స్వప్న సాఫల్యానికి చెందిన నిసర్గ సౌందర్యమే. అది ఆచార సంప్రదాయాలను తోసిపుచ్చినప్పటికీ, జేమ్స్ స్నేహితులు, ఇరుగు పొరుగువారు జేమీ నూతన వస్త్ర ధారణను పూర్తిగా ఆమోదిస్తారు. పరమలోభి అయిన అతడి తండ్రి మాత్రమే వీళ్లందరికీ దూరం జరుగుతాడు. నాటకం ముగియగానే శ్రోతలు సుదీర్ఘ కరతాళధ్వనులతో అభినందనల్లో ముంచెత్తారు. తర్వాత వెంటనే అందరూ లేచి నిలబడి మరీ ఆ నాటకాన్ని గౌరవించారు. జేమీ తండ్రిని ఛీకొట్టారు. కాబట్టి, మీరు ఈ సంవత్సరం లండన్ సందర్శించాలని అనుకుంటే.. అడుక్కుని, అరువు తీసుకుని, టిక్కెట్ దొంగిలించి అయినా సరే.. జేమీ నాటకం తప్పక చూడండి. ఇలాంటి నాట కాన్ని మీరు భారత్‌లో ఎన్నటికీ చూడలేరు. నిజం చెప్పాలంటే, ఇలాంటి నాటకాన్ని, ప్రదర్శనను మీ జీవితంలో మరెన్నడూ చూడలేరు కూడా. కొస మెరుపు : బ్రిటన్ సంగీత రూపకాల చరిత్రలో ‘ఎవ్రీబడీ ఈజ్ టాకింగ్ ఎబౌట్ జేమీ’ కొత్త ట్రెండ్ సృష్టించింది. 2017లో తొలిసారిగా ప్రదర్శితమైన ఈ సంగీత నాటకం సుప్రసిద్ధ పత్రికల ప్రశంసలను పొందుతోంది. బ్రిటన్‌లోని షెఫీల్డ్ పట్టణంలో, ఒక కౌన్సిల్ ఎస్టేట్‌లో నివసించే 16 ఏళ్ల కుర్రాడు జేమ్స్ పాత్ర మనిషి ఆకాంక్షలను సఫలం చేసుకునే కృషిని ఈ సంగీత రూపకంలో అత్యద్భుతంగా ప్రదర్శించింది. భవిష్యత్తు గురించి భయకంపితుడైన జేమ్స్ ప్రేమమూర్తి అయిన తన తల్లి, స్నేహాన్ని పంచే మిత్రుల దన్నుతో తనలోని దురభిప్రాయాలను అధిగమించి, అంధకారం నుంచి బయటపడటమే కాకుండా ప్రపంచం చూసి ఉండని ఒక సంచలనాత్మక ఘటనను ప్రపంచం ముందుకు తీసుకొచ్చాడు. చివరిక్షణంలో కూడా అనుకున్నది సాధించవచ్చని, మీరు కనే చిన్న చిన్న కలలను కూడా సాకారం చేసుకుని సమాజ ఆమోదం పొందవచ్చని ఒక సున్నితమైన అంశం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ఈ నాటకం పండితులను, పామరులను, విమర్శకులను కూడా ఏకమొత్తంగా ఆకర్షించి తిరుగులేని ప్రాచుర్యం పొందుతోంది. 2017 ఫిబ్రవరి 13న షెఫీల్డ్ లోని క్రుసిబుల్ థియేటర్లో ప్రదర్శన ప్రారంభమైన ఈ సంగీత రూపకం బ్రిటన్‌లోని పలు ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా ప్రదర్శితమవుతూనే ఉంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net -
అది కిడ్నాప్ కాదు.. డ్రామా
సాక్షి, పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండలో ఆరుగురు విద్యార్థుల కిడ్నాప్ ఉదంతాన్ని పోలీసులు డ్రామాగా తేల్చారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన హేమ, ఇందు, ఆశ, పూజిత, షమీసునీషా, ఫర్జానా స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. గురువారం సాయంత్రం సమ్మెటివ్ పరీక్షలు ముగిసిన తర్వాత తనకు కడుపునొప్పి ఉందని ఫర్జానా అనే విద్యార్థిని చెప్పింది. మాత్రలు తీసుకుందామని మిగిలిన ఐదుగురితో కలిసి తేరుబజారుకు వెళ్తుండగా రెండు ఆటోల్లో వచ్చిన దుండగులు వీరిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. దీనిపై పోలీసులు విచారించగా కిడ్నాప్ డ్రామాగా తేలింది. పాఠశాలలో ప్రధానోపాధ్యాయిని సరోజిని, క్లర్క్ శశికళ మధ్య విభేదాలతోనే ఈ డ్రామా నడిచినట్లు తెలుస్తోంది. హెచ్ఎం సరోజనియే విద్యార్థినులతో కిడ్నాప్ డ్రామా ఆడించినట్లు, కేసును శశికళపై నెట్టేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. కాగా, తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. -
పోలవరంపై చంద్రబాబు నాటకాలు
-
సైసైరా నరసింహారెడ్డి
కర్నూలు(కల్చరల్) : విప్లవ వీరుడు నరసింహారెడ్డి తెల్ల దొరలకు వ్యతిరేకంగా జరిపిన చారిత్రాత్మక పోరాటాన్ని సై సైరా నరసింహారెడ్డి పేరుతో నాటకంగా రూపొందించామని టీజీవి కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక టీజీవి కళాక్షేత్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన నాటకానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 87 నంది అవార్డులు పొందిన ప్రముఖ రచయిత, పల్లేటి కులశేఖర్ రచించిన ఈ నాటకాన్ని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రదర్శించనున్నామని తెలిపారు. సురభి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నాటకం ప్రేక్షకులను అలరింపజేస్తుందన్నారు. ఈ నాటకాన్ని భవిష్యత్తులో 13 జిల్లాలలో ప్రదర్శించనున్నామని తెలిపారు. రాబోయే నంది నాటకోత్సవాల్లో సైతం ఈ నాటకాన్ని ప్రదర్శించడానికి అంతా సిద్ధం చేశామన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరగనున్న రంగస్థల కళాకారుల సమావేశంలో నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొననున్నారని, ఈ సందర్భంగా రంగస్థల కళాకారుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే నాటక ప్రదర్శనను నాటకాభిమానులు తిలకించి జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఆకట్టుకున్న రిహార్సల్స్... సైసైరా నరసింహారెడ్డి నాటకానికి సంబంధించిన రిహార్సల్స్ స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో వారం రోజులుగా జోరుగా సాగుతున్నాయి. నాటకంలో నరసింహారెడ్డి, తహసీల్దార్ రాఘవాచారి, జాన్‌పీటర్, కాక్రేన్ దొర మధ్య జరిగే సన్నివేశాలను రసవత్తరంగా తీర్చిదిద్దుతున్నారు. నొస్సం కోటను పేల్చడం, నరసింహారెడ్డి ట్రెజరీపై దాడి చేయడం లాంటి ఆకర్షణీయమైన దృశ్యాలు ఉన్నాయి. దర్శకుడు పత్తి ఓబులయ్య, నాటక రచయిత కులశేఖర్, సంగీత దర్శకుడు రామలింగం, గంగాధర్, సుజాత.. ఈ నాటకాన్ని అత్యంత ఆసక్తికరంగా రూపొందిస్తున్నారు. -
‘రంగస్థలి’ నాటిక పోటీలు ప్రారంభం
ఆకట్టుకున్న తొలిరోజు ప్రదర్శనలు నరసరావుపేట ఈస్ట్: నరసరావుపేటలోని సాంస్కృతిక సంస్థ రంగస్థలి 37వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 19వ ఆహ్వాన నాటిక పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రకాష్‌నగర్‌లోని భువనచంద్ర టౌన్హాల్లో మూడు రోజుల పాటు నాటిక పోటీలు నిర్వహించనున్నారు. శుక్రవారం రాత్రి తొలిప్రదర్శనగా గణేష్‌పాత్రో కళావేదికపై తాడేపల్లి అరవింద ఆర్ట్స్ వారు ‘ఆగ్రహం’ నాటికను ప్రదర్శించారు. నేటి సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులకు కారణమవుతున్న పురుషులకు తగిన శిక్ష విధించేలా కుటుంబం నుంచి వెలివేయడం ఇతివృత్తంగా ఈ నాటిక సాగింది. రచయిత,దర్శకుడు గంగోత్రి సాయి, సినీనటి డి.సరోజ తదితరులు నాటికలో ప్రధానపాత్రలను పోషించారు. అలాగే తల్లిదండ్రుల పట్ల పిల్లలు చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని కొలకలూరు శ్రియ ఆర్ట్స్ వారి ‘చాలు...ఇకచాలు’ నాటికలో కళ్లకు కట్టినట్టు చూపారు. మరో ప్రదర్శనలో విశాఖపట్నం లిఖితసాయి శ్రీక్రియేషన్స్ కళాకారులు రైతు స్వాభిమానం కథాంశంగా ‘మాకంటు ఓ రోజు’ నాటికను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రదర్శనలకు ముందుగా.. తొలుత కొత్త పద్మావతి, సాంబశివరావు దంపతులు జ్యోతి ప్రజ్వలనను గావించారు. ఈ సందర్భంగా సీనియర్ చిత్రకారులు నందిగం నాగయ్యను ఘనంగా సత్కరించగా.. సభలో సీనీ, నాటక కళాకారుడు కెఎస్డి సాయి, రంగస్థలి ఫైనాన్స్ కమిటీ చైర్మన్ కపిలవాయి విజయకుమార్, గౌరవ అధ్యక్షుడు కె.వి.కె. రామారావు, అధ్యక్షులు కిలారు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి ఎం.డి.ఎస్. పాషా, అధ్యాపకులు కె.రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. నాటిక పోటీలకు న్యాయనిర్ణేతలుగా కె.రామకోటేశ్వరరావు, ఎస్.బి. రమణ, ఎస్.వెంకటరెడ్డి వ్యవహరించారు. -
ఆద్యంతం.. నవరసభరితం
- అలరిస్తున్న నంది నాటకోత్సవాలు – సామాజిక, కుటుంబ అంశాలే ఇతివృత్తాలు – ఆకట్టుకున్న క్రైమ్‌స్టోరీ - సైకతశిల్పం రేపటికి వాయిదా కర్నూలు(హాస్పిటల్): రాష్ట్ర స్థాయి నందినాటకోత్సవాల్లో భాగంగా మంగళవారం సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన నాటికలు కుటుంబసమస్యలు, సామాజిక అంశాల ఇతివృత్తాలతో సాగాయి. రాత్రి ఉద్యోగం వల్ల కలిగే అనర్థాల గురించి చెప్పే ‘కొత్తబానిసలు’, నిత్య జీవితంలో జరిగే సంఘటనలు ప్రాప్తమా లేక మాయా మంత్రాలా అనే ఇతివృత్తంతో సాగే ‘నియతి’, గెస్ట్‌హౌస్‌లో జరిగే హత్య నేపథ్యంలో సాగే ‘మిస్టరీ’, కుమారుడిపై ఉన్న ప్రేమ వెలకట్టలేనిదని తెలిపే ‘రుణాబంధ రూపేణా’, ఆస్తి కంటే అనుబంధాలే ముఖ్యమని చెప్పే ‘పంపకాలు’ హృదయాన్ని హత్తుకుంటాయి. మంగళవారం మొత్తం ఏడు నాటికలు జరగాల్సి ఉండగా కళాకారులు, టెక్నీషియన్లు రాకపోవడంతో నాయకురాలు నాగమ్మ రద్దు కాగా, సైకతశిల్పం 26వ తేదీకి వాయిదా పడింది. రాత్రి ఉద్యోగానికి భాష్యం చెప్పే ‘కొత్త బానిసలు’ భార్యాభర్తలిద్దరూ రాత్రి ఉద్యోగాలు చేస్తే వారి మనసులు ఎలా స్పందిస్తాయో...చిన్న చిన్న విషయాలకు కూడా ఎలా గొడవలు పెరిగిపోతాయో ‘కొత్త బానిసలు’ నాటిక కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో సంబంధం లేని గృహహింస చట్టాన్ని ఆశ్రయించి బతుకుని రోడ్డు మీదకు తెచ్చేలా భార్య ప్రవర్తించి విడాకుల వరకు వెళ్తుంది. వీరి సమస్యకు రాత్రి ఉద్యోగమేనని తెలుసుకున్న మానసిక వైద్యుడు వారికి కౌన్సిలింగ్ ఇస్తాడు. ‘నైట్ షిఫ్ట్‌లు చేస్తున్న ఓ రాత్రి ఉద్యోగులురా..!! ఆత్మవిశ్వాసం, ధృఢ సంకల్పం ఉంటేనే రాత్రి ఉద్యోగాలు చేయండి, లేదంటే ప్రతి చిన్నదానికీ అతిగా స్పందించి జీవితాన్ని బలిచేయాల్సి ఉంటుంది జాగ్రత్త’ అని వైద్యుడు బదులిస్తాడు. అటు హాస్యం, ఇటు సందేశాత్మకంగా ఉన్న ఈ నాటికను హుజూరాబాద్‌లోని ఈటెల నాటక రంగ కళాకారుల సమాఖ్య ప్రదర్శించింది. రచన డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు, దర్శకత్వం కొలుగూరి దేవయ్య. పాత్రదారులు కొలుగూరి దేవయ్య, ఎం. ప్రకాశ్, కుడికాల ప్రభాకర్, ముదం కుమారస్వామి, దేవసేన నటించారు. ఆకట్టుకున్న ‘నియతి’ మంత్రాలు, మహత్తులు ఉన్నాయా..? ఉంటే వాటి సాయంతో మనం జీవితంలో కావాలనుకున్నవి సాధించగలమా..?, అది సాధ్యపడేటట్లయితే జీవితంలో మనకు ఎదురయ్యే ఆటు–పోట్ల సంగతేమిటి.?, మనం కోరుకోకపోయినా అవి జరుగుతున్నాయే...!, అందుకు కారణం నియతి అంటే ప్రాప్తం అంటారే..!, అది ఎంత వరకు నిజం..?. ఆనందంగా తృప్తిగా బతుకుతున్న ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎదురుచూడని సంఘటనలు ఈ సమస్యను, సందేహాన్ని ఎంత వరకు తీరుస్తాయంటూ ఆలోచింపజేసే నాటిక ఈ ‘నియతి’. హైదరాబాద్‌లోని శ్రీ మహతి క్రియేషన్స్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ నాటికకు రచన చిట్టాశంకర్, దర్శకత్వం ఉప్పలూరి సుబ్బరాయశర్మ. పాత్రదారులు చిట్టాశంకర్, మంజునాథ్, శివరామకృష్ణ, సుబ్బారావు, విజయలక్ష్మి నటించారు. ఉత్కంఠ భరిత మలుపులతో ‘మిస్టరి’ హైదరాబాద్‌కు చెందిన శ్రీ మహతి క్రియేషన్స్ వారు ‘మిస్టరి’ అనే నాటికను ప్రదర్శించారు. ఓ గెస్ట్‌హౌస్‌లో జరిగిన హత్యకు సంబంధించిన ఇతి వృత్తమే మిస్టరీ. సూర్యం, సునీత దంపతులు భీమిలిలో గెస్ట్‌హౌస్ ప్రారంభిస్తారు. అందులో సైకాలజీ లెక్చరర్ సుకుమార్, రిటైర్డ్ జడ్జి జగన్నాథం, రిటైర్డ్ ఆర్మీ మేజర్ మిత్రకాంత్, బిజినెస్‌మ్యాన్ చక్రధర్ రూములు అద్దెకు తీసుకుంటారు. అంతకుముందు రోజు రాత్రి విశాఖపట్టణంలో దుర్గమ్మ అనే మహిళ దారుణంగా హత్యకు గురైనట్లు టీవీ న్యూస్‌లో వారు తెలుసుకుంటారు. ఆ హత్యకు, గెస్ట్‌హౌస్‌కు సంబంధం ఉందంటూ స్థానిక సీఐ గిరిధర్ విచారణ చేసేందుకు వస్తారు. దర్యాప్తు జరుగుతుండగానే జగన్నాథం హత్యకు గురవుతారు. ఈ హత్యలకు కారణం ఏమిటి..?, హంతకులు ఒకరా..ఇద్దరా..? హంతకుడు పట్టబడతాడా లేదా ..? అనే ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ నాటిక సాగుతుంది. ఈ నాటికకు రచన డీఏ సుబ్రహ్మణ్యశర్మ, దర్శకత్వం ఉప్పలూరి సుబ్బరాయశర్మ వహించారు. పాత్రదారులు ఏకే శ్రీదేవి, నిట్టల శ్రీరామ్మూర్తి, ఆర్. ప్రేమ్‌సాగర్, సతీష్‌కుమార్, చిట్టా శంకర్, పి. సుబ్బారావు, పుండరీక శర్మ, జానకీనాథ్, మల్లికార్జున నటించారు. తండ్రీ కొడుకుల అనుబంధమే ‘రుణానుబంధ రూపేణా’ అనంతపురం లలిత కళాపరిషత్ వారి ‘రుణానుబంధరూపేణా’ నాటిక కుటుంబ బాంధవ్యాలను కళ్లకు కడుతుంది. కథలోకి వెళ్తే మధ్యతరగతికి చెందిన రంగనాథం కుటుంబ బాధ్యతలను చక్కగా నెరవేరుస్తాడు. ఆయన భార్య తులసి అర్దంతరంగా మరణిస్తుంది. ఇదే సమయంలో కోడలు భేషజాలకు పోయి రంగనాథాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. కోడలు పట్ల కొడుకు నిర్లక్ష్యంతో చివరకు ఆయన వృద్ధాశ్రమంలో చేరాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఓసారి రంగనాథం కుమారుని కిడ్నీలు పాడై అసహాయస్థితిలో ఆసుపత్రిలో ఉంటాడు. అతనికి తెలియకుండానే తండ్రి వైద్యుని సహాయంతో కిడ్నీలు దానం చేసి ప్రాణం నిలబెడతాడు. కొన్నాళ్లకు ఈ విషయాన్ని తెలుసుకున్న కుమారుడు ప్రశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. కోడలు కూడా తన తప్పును తెలుసుకుని రంగనాథాన్ని వృద్ధాశ్రమం నుంచి ఇంటికి రమ్మని కోరుతుంది. కానీ తనకు ఇంటికన్నా వృద్ధాశ్రమంలోనే చాలా అవసరం ఉందని తిరస్కరించి వెళ్లిపోతాడు. ఈ నాటికకు రచన సి. రాము, దర్శకత్వం డి. మస్తాన్‌సాహెబ్. అనుబంధాలే ముఖ్యమని చెప్పే ‘పంపకాలు’ మీకోసమే వారి ‘పంపకాలు’ అనే సాంఘిక నాటిక అన్నదమ్ములు ఆస్తి పంపకాల ఇతివృత్తం గురించి ప్రదర్శించారు. పట్నంలో ఉద్యోగం చేస్తున్న ప్రభాకర్ తన పొలాన్ని భాగం వేయించుకుని, దాన్ని అమ్మి పట్నంలో ఇళ్లు కొందామని సొంతూరు బయలుదేరతాడు. ఇంటికి వెళ్లేసరికి తండ్రి, అన్నయ్య ఇంట్లో ఉండరు. విషయాన్ని ప్రభాకర్ తన వదినతో ప్రస్తావిస్తాడు. వారి మధ్య పిల్లల చదువులు, పెంపకం ప్రస్తావనకు వస్తాయి. ‘పొలాన్ని పంచడమంటే శరీర భాగాలను పంచినట్లే’ అని వదిన చెబుతుంది. తర్వాత అన్న రాఘవ తమ్మునిపై ప్రేమతో పంపకాలు ఏమీ ఉండవు ఆస్తి అంతా నువ్వే అనుభవించు అని ఇంటి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడతాడు. పెద్దకుమారుని వెంటే తండ్రి కూడా వెళ్లిపోతుండటంతో ప్రభాకర్‌కు జ్ఞానోదయం అవుతుంది. ఆస్తి పంపకాల కంటే అనుబంధాలే ముఖ్యమని గ్రహించడంతో కథ సుఖాంతం అవుతుంది. కుటుంబంలో జరిగే ఇలాంటి సంఘటనలను ఎంతో హృద్యంగా ప్రదర్శించారు. రచన డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు, దర్శకత్వం ఎంఎస్కె ప్రభు. పాత్రదారులు ఎంఎస్కె ప్రభు, డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు, రవికుమార్, హసీనాజాన్ నటించారు. నేటి నాటికలు బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీ వాసవి డ్రమెటిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ‘విముక్త’, ఉదయం 10.30 గంటలకు శ్రీ కృష్ణతెలుగు థియేటర్ ఆర్ట్స్ వారి ‘ఇంకెంత దూరం’, మధ్యాహ్నం 12 గంటలకు ఆర్ట్ ఫామ్ క్రియేషన్స్ వారి ‘ఓ కాశీ వాసి రావయ్యా’, సాయంత్రం 4.30 గంటలకు లలిత కళా సమితి వారి ‘నిష్క్రమణ’, రాత్రి 7 గంటలకు కళావర్షిణి వారి ‘ఊహాజీవులు’, రాత్రి 8.30 గంటలకు గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్ వారి ‘రచ్చబండ’ సాంఘిక నాటికలు ప్రదర్శితమవుతాయి. -
సందేశాత్మకం..ఆ‘నంది’ ఉత్సవం
- సమకాలీన సమస్యలకు అద్దం పట్టిన నాటకాలు - రెండో రోజు నాలుగు నాటక ప్రదర్శనలు కర్నూలు (కల్చరల్): రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం.. సందేశాత్మక నాటకాలను ప్రదర్శించారు. కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో నాటక ప్రదర్శనలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమై మనుషుల మధ్య మమతానురాగాలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రదర్శించిన నాటకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గురువారం ఉదయం మంచ్ థియేటర్ హైదరాబాద్ నాటక సమాజం వారు ప్రదర్శించిన ‘చాయ్ ఏది బే’ నాటకం తెలంగాణ మాండలికంలో సాగింది. ఒక కుటుంబ సమస్య ఊరి సమస్యగా మారినప్పుడు..అందరికీ అనుకూలుడైన చాయ్‌వాలా దానికి పరిష్కారం చూపడమే ఈ నాటకంలోని ప్రధాన ఇతివృత్తం. శ్రీకాంత్ బాణాల రచించి దర్శకత్వం వహించిన ఈ నాటకంలో సంభాషణలు ప్రేక్షకులను ఉత్తేజపరిచాయి. మీ కోసం... హైదరాబాద్ నాటక సమాజం ప్రదర్శించిన ‘ఫోమో’ సాంఘిక నాటకం ఆధునిక తరం, ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లు ఉపయోగిస్తూ మానవీయ సంబంధాలను ఎలా మంటగలుపుతుందో తెలియజేస్తుంది. డా.శ్రీనివాసరావు రచించిన ఈ నాటకానికి ఎంఎస్కే ప్రభు దర్శకత్వం వహించారు. కుటుంబ ప్రాధాన్యం తెలిపిన ‘ఈ లెక్క.. ఇంతే’ చైతన్య కళా భారతి కరీంనగర్ నాటక సమాజం ప్రదర్శించిన ఈ లెక్క ఇంతే నాటిక కుటుంబవ్యవస్థ మరింత పటిష్టంగా ఏర్పాడాలనే ఆవశ్యకతను తెలియజేస్తుంది. కుటుంబాలు బాగుంటేనే సమాజం సుభిక్షంగా ఉంటుందనే సందేశాన్ని అందించింది. కుటుంబంలోని వారు బలహీనతలకు బానిసై బాధ్యతారాహిత్యంగా మారితే ఆ కుటుంబం అస్తవ్యస్తమవుతుందని ఈ నాటిక సందేశం అందించింది. మంచాల రమేష్ రచించిన ఈ నాటకానికి పరమాత్మ దర్శకత్వం వహించారు. సందేశాత్మక నాటిక ‘జారుడు మెట్లు’ కళాంజలి హైదరాబాద్ నాటక సమాజం ప్రదర్శించిన జారుడు మెట్లు నాటకం చక్కని సామాజిక సందేశాన్ని అందించింది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో పాలకులు ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలిచ్చి తమ పబ్బం గడుపుకుంటున్న తీరు తెన్నులకు ఈ నాటిక దర్పణం పట్టింది. నాయకులు అనునిత్యం బంధుప్రీతితో, స్వార్థంతో తన సొంతానికి, తన వాళ్లకు సేవ చేసుకోవడం తప్ప ప్రజలకు ప్రయోజనకరమయ్యే పనులు చేపట్టకపోవడంతో ప్రజాస్వామ్యం పరిహాసానికి గురవుతుందని ఈ నాటిక దృశ్య రూపంలో తెలియజేసింది. కంచర్ల సూర్యప్రకాష్ రచించిన ఈ నాటకానికి కొల్ల రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. రెండు నాటక ప్రదర్శనలు రద్దు నంది నాటకోత్సవాలల్లో భాగంగా గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8.30 గంటల వరకు ఆరు నాటకాలు ప్రదర్శించ వలసి ఉంది. అయితే పాప్‌కార్న్ థియేటర్ వారి దావత్ నాటిక, స్వర్ణాంధ్ర కల్చరల్ అసోసియేషన్ వారు హిమం నాటికలు రద్దు అయ్యాయి. ఈ నాటక సమాజాల కళాకారులు ప్రదర్శన కోసం రాకపోవడంతో ఈ రెండు నాటికలు రద్దు అయ్యాయని ఎఫ్డీసీ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులకు భోజన ఏర్పాట్లు కల్పించినట్లు నాటకోత్సవాల కన్వీనర్ ఆర్డీఓ రఘుబాబు, లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు. -
'ఈ మధ్యే ప్రేమలో పడ్డాను'
ముంబయి: పాకిస్థాన్ నాటకాలకు(సీరియల్స్) ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఫిదా అయిపోతోంది. అక్కడి నాటకాలు తనను కట్టిపడేస్తున్నాయని, వాటితో ప్రేమలో పడిపోయానని చెబుతోంది. పాకిస్థాన్‌కు చెందిన డ్రామాల రచన శైలి, నిర్మాణ విలువలు, మేకప్, నటన అద్భుతంగా ఉంటాయని తెగ పొగిడేస్తోంది. ముఖ్యంగా అక్కడి నటుల నటన చాలా అద్భుతంగా ఉంటుందని, వాస్తవికంగా ఉంటాయని తెలిపింది. 'రాత్రి వేళ షూటింగ్ కార్యక్రమాలు ముగించుకొని వస్తున్న నేను ఈ మధ్య కొత్తగా ఒక అలవాటు నేర్చుకున్నాను. దాన్ని ఇష్టపడుతున్నాను కూడా. పొద్దున్నే లేవగానే.. ఈ మధ్య జిందగీ అనే చానెల్ చూస్తున్నాను. అందులో ముఖ్యంగా కాంకర్ అనే సీరియల్ అయితే నన్ను కట్టిపడేస్తోంది. దానికే వేలాడుతున్నాను. మేరి హర్జాయ్, ఏక్ మోహబ్బత్ కే బాద్ డ్రామాల రచన శైలి అద్బుతంగా ఉంది. ఇలాంటి టీవీ చూడటం నిజంగా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఫిమేల్ క్యారెక్టర్లు తెగనచ్చుతున్నాయి. అవి చాలా బాగా ఉన్నాయి' అని విద్యా చెప్పింది. -
ఆద్యంతం అలరించిన శ్రీకృష్ణలీలలు
చోడవరం : ఆకాశం పైనుంచి దేవ కన్యలు దిగడం... మహావిష్ణువు నాభినుంచి గాలిలో బ్రహ్మదేవుడు కూర్చొని ఉండటం...నెత్తిన గంపలో పిల్లోడిని పెట్టుకొని వసుదేవుడు సముద్రంలో వెళుతుంటే ఏడు శిరసుల పాము వచ్చి తన పడగతో కాపు కాయడం... రాక్షసుని బొడ్డులోంచి తాళాం వచ్చి జైలు తాళాం కప్ప తీయడం.. ఇలాంటి ఎన్నో దృశ్యాలు చూపరులను కట్టి పడేశాయి. ‘సురభి’ నాటకాలంటే సినిమాలను తలపించే భారీ సెట్టింగ్‌లు ఉంటాయని తెలిసిందే. చోడవరం స్వయంభూ గౌరీశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన సురభి నాటకాలు జనాన్ని కట్టి పడేస్తున్నాయి. ఇక్కడ ఐదు నాటకాలు ప్రదర్శించాల్సి ఉండగా శనివారం రాత్రి శ్రీ కృష్ణలీలలు నాటికను మొదటగా ప్రదర్శించారు. భారీ సెట్టింగ్‌లు మధ్య ఈ నాటకంలో సన్నివేశాలు అబ్బురపరిచాయి. మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన శ్రీ కృష్ణావతారంలో తన మేనమామ కంసుడిని వధించడంలో శ్రీ కృష్ణుడు చేసిన లీలలే ఈ కథ వృత్తాంతం. అయితే పురాణాల్లో చదవడం, సినిమాల్లో చూడడం తప్ప నేరుగా బహిరంగ స్టేజిపై ఇంతటి భారీ సెట్టింగ్‌లతో ఇలాంటి నాటికను ప్రదర్శించడంపై జనం ఆనందం వ్యక్తం చేశారు. మంచి టైమింగ్‌తో స్టేజిపై సెట్స్, వేశాలు, వ్యక్తులు మారడం, నెల రోజుల బాలుడి దగ్గర నుంచి 80 ఏళ్ల వృద్ధుడి వరకు ఈ నాటకంలో పాత్రలు పోషించడం కనువిందు చేశాయి. వేలాది మంది ప్రేక్షకులు తరలి రావడంతో వేదిక ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. మరింత ఉత్కంఠ రేపే సెట్టింగ్‌లతో బాలనాగమ్మ, మాయాబజార్, భక్తప్రహ్లాద, పాతాళబైరవి నాటకాలు వరుసగా 9వతేదీ వరకు ప్రదర్శించనున్నారు. -
సమాజాన్ని మేల్కొలిపేందుకే నాటికలు
మార్టూరు : సమాజాన్ని మేల్కొలపడంలో నాటికలు కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఆయన మార్టూరులోని శ్రీకారం కళాపరిషత్ రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు వారి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి నాటికల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీవీ, సినిమా రాక ముందు గ్రామీణులకు విజ్ఞానాన్ని, వినోదాన్ని నాటికలు అందించాయన్నారు. సమాజాన్నే ఇతివృత్తంగా తీసుకుని మంచి చెడులను బేరీజు వేస్తూ చక్కటి సందేశాన్ని నాటికలు అందిస్తాయన్నారు. కళలను, కళాకారులను అందరం గౌరవించాలన్నారు. మన సంసృ్కతి సాంప్రదాయాలను నాటికలు ప్రతిబింబిస్తాయన్నారు. కార్యక్రమంలో సినీ నటి కవిత, రోటరీ గవర్నర్ మల్లాది వాసుదేవ్, శ్రీకారం కళాపరిషత్ అధ్యక్షులు కందిమళ్ల సాంబశివరావు, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ జాస్తి వెంకటమోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సినీ నటి కవిత, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రోటరీ గవర్నర్ వాసుదేవ్లను ఘనంగా సన్మానించారు. రైతును ఆదుకోకపోతే అధోగతే సందేశాన్ని ఇచ్చిన ఆకుపచ్చ సూర్యుడు నాటిక గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు రచించిన ఆకుపచ్చ సూర్యుడు నాటిక ప్రేక్షకులను అలరించింది. అన్నదాతల భారతంలో ఆత్మహత్యల పర్వం కొనసాగుతోంది. అప్పుల బాధతో రైతులు బలవన్మరణాలు పొందుతున్నారు. ఎన్నికలప్పుడు రైతే రాజు అంటున్న పార్టీలు ఎన్నికలయిన తర్వాత వారిని పట్టించుకోవడం లేదు. రైతుకి, భూదేవికి సహనం చచ్చిపోతే ఉక్రోశం, ఆక్రోశం, పగిలితే ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే దేశ ప్రగతి ఉండదనే సందేశం ఇచ్చింది. జనశ్రేణి విజయవాడు వారు ప్రదర్శించిన పరోపకారమే పరమావధి, బాధిత ఆడపిల్లలను గౌరవించాలని సందేశాన్నిచ్చిన అగ్నిపుష్పాలు నాటిక అందరినీ ఆకట్టుకున్నాయి. -
పగటికళ నిజమాయెగా!
రాళ్లపల్లి వేంకట నరసింహారావు.. తెలుగు సినిమా ప్రేక్షకులకు రాళ్లపల్లిగా సుపరిచితుడు.. నాటకాలంటే అభిరుచి ఉన్న చాలామందికి ఆయన బహుముఖ ప్రజ్ఞ పరిచయం! మారని సంసారం.. జీవన్మృతుడు.. ముగింపులేని కథ.. ఆ ప్రజ్ఞకు నిదర్శనాలు! ఖాదర్ అలీబేగ్ థియేటర్ ఫెస్టివల్లో రాళ్లపల్లి ‘సుందరి.. సుందరుడు’ నాటకమూ వేదికను అలంకరించింది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన కొన్ని సంగతులు.. నాటకాలకు నాకు ఇన్సిపిరేషన్ పగటి వేషగాళ్లే. మా ఊళ్లో (తూర్పుగోదావరి జిల్లా రాచపల్లి) స్కూల్ ఎగ్గొట్టి మరీ పగటి వేషగాళ్ల వెంట తిరిగేవాడిని. వాళ్లు పూటకో వేషం కడుతుంటే చూసి ఎంజాయ్ చేసేవాడిని. నేనూ అలా వేషం కట్టి ఇతరులను ఆనందింపజేయగలనా? అనిపించేది. హైదరాబాద్.. నాటకాలు.. నాకు నాటకాన్ని పరిచయం చేసింది హైదరాబాదే! నేను వేషం వేసిన, చూసిన మొదటి నాటకం ‘కన్యాశుల్కం’. అందులో నా పాత్ర కరటకశాస్త్రి శిష్యుడు మహేంద్ర. ‘ఎవరీ అబ్బాయి పద్యాలవీ బాగా పాడుతున్నాడు’ అని మంతిరి శ్రీనివాస్‌రావు గారు నన్ను మెచ్చి కన్యాశుల్కంలోని ఆ పాత్రనిచ్చారు. మా నాన్న హెడ్మాస్టర్. ఇద్దరన్నయ్యలకు ఇక్కడ ఉద్యోగం రావడంతో నాకు పదిహేనేళ్లప్పుడు వాళ్లతో పాటు నేనూ హైదరాబాద్ వచ్చేశాను. నేను ఏదో డిగ్రీ చేసి ఉద్యోగం చేసుకుంటే చాలనుకున్నారు వాళ్లు. నాకేమో నాటకాల పిచ్చి. అందుకే పేరుకే సైఫాబాద్ సైన్స్ కాలేజ్‌లో బీఎస్సీ! మనసా వాచా కర్మణా నటనే! పరిషత్ కాంపిటీషన్స్‌తో.. అప్పట్లో ఇక్కడ నాటకాలకు అంత ఆదరణ ఉండేది కాదు. ఓ ఐదారు నాటక సంస్థలే ఉండేవి. ఎప్పుడైతే పరిషత్ పోటీలను నిర్వహించడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి నాటకాలకు ప్రోత్సాహం మొదలైంది. ఎన్నో నాటక సంస్థలు వెలిశాయి. యాక్టింగ్ స్కూళ్లూ పెరిగాయి. పరిషత్ పోటీల్లో బహుమతి రావడం ఆస్కార్ దొరికినంత గొప్పగా భావించేవాళ్లం. స్టెప్పింగ్ స్టోన్.. సినిమా ప్రభావంతో నాటకాలు తెరమరుగవుతున్నాయంటారు. కానీ.. నాటికి..నేటికీ నాటకాన్ని సినిమాకు స్టెప్పింగ్ స్టోన్‌గా మలచుకుంటున్న వాళ్లున్నారు. నాటకానికి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. టికెట్ కొని సినిమాలెలా చూస్తామో.. అలాంటి డిమాండ్ నాటకానికీ రావాలి. ఇది వరకు పౌరాణిక నాటకాలకు అంతటి డిమాండే ఉండేది. నటనను ఇష్టపడుతున్నవారు మాత్రం ముందు నాటకం ద్వారే తెరకు పరిచయం కావాలనుకుంటున్నారు. ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లూ ఆ ఉద్యోగాలను వదిలి నాటక రంగంలోకి రావడమే ఇందుకు గొప్ప నిదర్శనం. జీవకళ.. నిజానికి సినిమాను సాంకేతికత డామినేట్ చేస్తుంది. కానీ నాటకం జీవకళ. నటీనటుల ఆంగిక వాచికాభినయం.. ప్రత్యక్షంగా కనిపిస్తుంది.. వినిపిస్తుంది. సరిగా చేయలేకపోతే టెక్నికల్ ఎఫెక్ట్స్‌తో మసిపూసి మారేడుకాయ చేసే అవకాశం ఉండదు. సినిమా కన్నా నాటకానికే శ్రమ ఎక్కువ. నాటకం.. సమష్టి శ్రమ. వినోదం.. సాంకేతికత.. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో నాటకం ప్రభావవంతమైన మాధ్యమంగా మారాలి. కాలానుగుణంగా కథావస్తువులను ఎంచుకోవాలి. మొదటి రోజు సినిమా విడుదలైతే హౌస్‌ఫుల్ కలెక్షన్ ఎలా ఉంటుందో అంతకాకపోయినా పది శాతమైనా నాటకానికి రావాలి. ఈ మార్పు రావాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన వేదికలు కావాలి. జిల్లాకొకటి చొప్పున ఆధునిక ఆడిటోరియాలు నిర్మిస్తే నాటకం నిలబడుతుంది. వినోదం, టెక్నాలజీ సమ్మేళనంగా నాటకాలు రూపుదిద్దుకోవాలి. సుందరి.. సుందరుడు ఇది 1960ల నాటి నాటకం. దీన్ని అత్తిలి కృష్ణారావు రాశారు. 1966లో న్యూఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సమక్షంలో ‘మృశ్చకటికం’ ప్రదర్శించడం గొప్ప అనుభూతి. ఇలాంటి మధురమైన ఎన్నో జ్ఞాపకాలను నాటకరంగం అందించింది. నటనలో జాతీయస్థాయి పురస్కారం అందుకోవాలన్నదే నా లక్ష్యం. ..:: సరస్వతి రమ -
ఏడాది పాటు నాటకాలు వేశా!
‘‘చిన్నప్పుడు నేను చేసిన అల్లరిని పెద్దయ్యాక అప్పుడప్పుడూ అమ్మ చెబుతుంటుంది. అప్పుడు భలేగా ఉంటుంది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా మా అమ్మను నా చిన్నప్పటి విశేషాలు చెప్పమని అడుగుతుంటా’’ అన్నారు తమన్నా. ఇటీవల ఓ సందర్భంలో తమన్నా తన చిన్ననాటి విశేషాలను గుర్తు చేసుకుంటూ -‘‘చిన్నప్పుడు నాటకాల్లో నటించాను. ముంబయ్‌లోని ప్రసిద్ధ పృథ్వీ థియేటర్లో దాదాపు ఏడాది పాటు నాటకాల్లో నటించాను. నాటకాల్లో ఉన్న వెసులుబాటు ఏమిటంటే.. ప్రేక్షకుల స్పందన అప్పటికప్పుడు తెలిసిపోతుంది. నాకు చిన్నప్పుడు నాటకాలతో పాటు సినిమాలంటే కూడా బోల్డంత ఇష్టం. ముంబయ్‌లో మా ఇంటి చుట్టుపక్కల దాదాపు నాలుగైదు థియేటర్లు ఉండేవి. రిలీజైన ప్రతి సినిమా చూసేదాన్ని. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలకెళ్లేదాన్ని. ఒకవేళ ఇంటిపట్టున ఉంటే... ఒకే రోజు వరుసపెట్టి ఆరు సినిమాలు చూసేసేదాన్ని. మా అమ్మగారైతే ‘నీకు సినిమా పిచ్చి పట్టింది’ అనేవారు. అసలు అన్నేసి సినిమాలు అప్పుడు ఎలా చూశానో నాకే అర్థం కావడం లేదు’’ అని నవ్వేశారు. -
నాటకాలతో చైతన్యం
ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆదోని: తరతరాల సంస్కృతి, సాంప్రదాయాలను ముందు తరాలకు అందించడంతోపాటు ప్రజా చైతన్యానికి వేదికగా ఉండే నాటకాలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్లో ప్రదర్శించిన ‘కళ్లగురు-సుళ్లశిష్య’ (దొంగ గురువు-అబద్ధాల శిష్యుడు) నాటకం ఆద్యంతమూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. గురూజీ ముసుగులో దొంగస్వామి, ఆయన శిష్యుడు చేసే అకృత్యాలు..అంతిమంగా వారి ఆగడాలకు చెక్ పెట్టడం వరకు మధ్యలో సాగిన సన్నివేశాలు, చతురోక్తులతో కూడిన సంభాషణలతో ఆయా పాత్రధారులు తమ పాత్రలను రక్తి కట్టించారు. ప్రముఖ నాట కళాకారులు నాగయ్యస్వామి, గంగాధర, యరగట్టి ప్రమోద్, గోకార, బసవరాజ మదిరి, గీతా గుళేదగుట్ట, హేమావతి, అంబిక, రవి జాలహాళ తదితరులు వివిధ పాత్రలను ధరించారు. సామాజిక సందేశంతో కూడిన ఈ నాటక ప్రదర్శనకు ముందు ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. రంగస్థల ప్రదర్శనలకు ప్రోత్సాహం కరువవుతోందని, దీనినే నమ్ముకున్న కళాకారుల జీవితాలు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రంగస్థలం కూడా ఒక శక్తివంతమైన మాధ్యమమేనని, కొన్ని నాటకాలు ప్రజలను ఎంతగానో చైతన్యవంతుల్ని చేశాయని కొన్నింటిని ఉదహరించారు. నాటక రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నాటక ప్రదర్శనను ఏర్పాటు చేసిన ఘన మఠేశ్వర నాట్య సంఘం నిర్వాహకులు కె.మహేబలేశ్వరప్ప, చెన్నబసప్పను ఆయన అభినందించారు. అధికారులతో మాట్లాడి రిక్రియేషన్ క్లబ్ నాటక ప్రదర్శన వేదిక అద్దెను రద్దు చేయిస్తానని హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ దత్తాత్రేయ గౌడ్ మాట్లాడుతూ, కళాకారులకు ప్రభుత్వం తనవంతుగా చేయూతనందిస్తే నాటకాలు ఎప్పుడూ సజీవంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, పట్టణ ప్రముఖులు సూగూరప్ప, ప్రతాప్, చంద్రకాంత్‌రెడ్డి, విట్టారమేష్, సోమన్న, మదార్, రామలింగ, ఎండీ బసవరాజు, ముమ్మత్ స్వామి, కళాకారుడు గైక్వాడ్ విశ్వనాథ్ మరికొందరు పాల్గొన్నారు. -
‘కాఫిర్’, కోషిష్ నాటికలు