'ఈ మధ్యే ప్రేమలో పడ్డాను' | Vidya Balan in love with Pakistani dramas | Sakshi
Sakshi News home page

'ఈ మధ్యే ప్రేమలో పడ్డాను'

Published Sat, Apr 30 2016 7:34 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

'ఈ మధ్యే ప్రేమలో పడ్డాను'

'ఈ మధ్యే ప్రేమలో పడ్డాను'

ముంబయి: పాకిస్థాన్ నాటకాలకు(సీరియల్స్) ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఫిదా అయిపోతోంది. అక్కడి నాటకాలు తనను కట్టిపడేస్తున్నాయని, వాటితో ప్రేమలో పడిపోయానని చెబుతోంది. పాకిస్థాన్కు చెందిన డ్రామాల రచన శైలి, నిర్మాణ విలువలు, మేకప్, నటన అద్భుతంగా ఉంటాయని తెగ పొగిడేస్తోంది. ముఖ్యంగా అక్కడి నటుల నటన చాలా అద్భుతంగా ఉంటుందని, వాస్తవికంగా ఉంటాయని తెలిపింది.

'రాత్రి వేళ షూటింగ్ కార్యక్రమాలు ముగించుకొని వస్తున్న నేను ఈ మధ్య కొత్తగా ఒక అలవాటు నేర్చుకున్నాను. దాన్ని ఇష్టపడుతున్నాను కూడా. పొద్దున్నే లేవగానే.. ఈ మధ్య జిందగీ అనే చానెల్ చూస్తున్నాను. అందులో ముఖ్యంగా కాంకర్ అనే సీరియల్ అయితే నన్ను కట్టిపడేస్తోంది. దానికే వేలాడుతున్నాను. మేరి హర్జాయ్, ఏక్ మోహబ్బత్ కే బాద్ డ్రామాల రచన శైలి అద్బుతంగా ఉంది. ఇలాంటి టీవీ చూడటం నిజంగా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఫిమేల్ క్యారెక్టర్లు తెగనచ్చుతున్నాయి. అవి చాలా బాగా ఉన్నాయి' అని విద్యా చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement