అంగన్‌వాడీ కార్యకర్త ఆత్మహత్యా యత్నం ఓ నాటకం | Anganwadi worker suicide attempt is a drama | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కార్యకర్త ఆత్మహత్యా యత్నం ఓ నాటకం

Published Sun, Jul 2 2023 4:42 AM | Last Updated on Sun, Jul 2 2023 3:33 PM

Anganwadi worker suicide attempt is a drama - Sakshi

గుడివాడ రూరల్‌:  కృష్ణా జిల్లా పామర్రు నియోజక­వర్గం పెదపారుపూడి మండలం గుర్విందగుంటలో అంగన్‌వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం నాటకమ­ని తేలిపోయింది. వైఎస్సార్‌సీపీ నాయకుల ఒత్తిళ్లు, బెది­రి­స్తున్నారంటూ ఆమె చేసిన ఆరోపణలు అవా­స్తవమని తేలింది. ఇదంతా ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు ఆడించిన డ్రామా అని తేలిపోయింది. ఆమె ఎలుకల మందు తాగలేదని వైద్యులు ధ్రువీకరించారు.

జరిగిందిదీ..
అంగన్‌వాడీ కార్యకర్త అన్నపూర్ణ సక్రమంగా విధులు నిర్వర్తించడంలేదని, బాలలు, గర్భిణులు, బాలింతలకు అందించాల్సిన పౌష్టికాహారాన్ని పక్క­దారి పట్టిస్తున్నారని గ్రామ ప్రజలు ఎంపీటీసీకి ఫిర్యా­దు చేశారు. దీంతో ఎంపీటీసీ, ఐసీడీఎస్‌ అధి­కారులు రెండు రోజుల క్రితం అంగన్‌వాడీ కేంద్రంలో తనిఖీ చేశారు. కేంద్రంలో 11 మంది చిన్నా­రు­లకు కేవలం ఒక్కరే ఉండటంతోపాటు పౌష్టికాహా­రాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు నిర్ధారణ అయింది.

ఉన్నతాధికారుల విచారణలోనూ ఇదే తేలింది. దీంతో సస్పెన్షన్‌ తప్ప­దని భావించింది. ఈ విషయం తెలిసి అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ భర్త అయిన ఎల్లో మీడియా విలేకరి, టీడీపీ నాయకులు కలిసి కార్య­కర్తతో ఆత్మహత్య డ్రామా ఆడించారు. వారి సూచన మేరకు ఆమె ఎలుకల మందు నోటికి పూసుకుని ఆసుపత్రిలో చేరింది. ఎంపీటీసీ వేముల మోహన్, వైఎస్సార్‌సీపీ నాయకుల వేధింపుల వల్లే ఆత్మహ­త్యకు పాల్పడ్డానని ఆరోపణలు చేసింది.

దీనిని అడ్డుపెట్టుకొని ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. అయితే, ఆమెను వైద్యులు పరీక్షించి, ఎటు­వంటి ఎలుకల మందు సేవించలేదని నిర్ధారించా­రు. వైద్యం అవసరం లేదని చెప్పారు. దీంతో టీడీపీ నాయకులు కొందరు విలేకరులను వైద్యుల వద్దకు పంపించి నివేదిక మార్చాలని బెదిరించారు. వీరి బెదిరింపులకు భయపడని వైద్యులు ఆ నివేదికను పోలీసుల ద్వారా బయట పెట్టారు. దీంతో ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు తోక ముడిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement