హంద్రీ–నీవా కాలువలో పార్టీ జెండాలతో టీడీపీ కార్యకర్తలు,జల్లిగానిపల్లె సమీపంలో కాలువ వద్ద మోహరించిన పోలీసులు
కుప్పం/శాంతిపురం: కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన 25వేల ఇంటిపట్టాలకు స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు అడ్డుపడుతున్నారని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళనకు సన్నద్ధమయ్యారు. దీనికి ప్రజల నుంచి మద్దతు లభిస్తే తమ పార్టీకి మైనస్ అవుతుందని టీటీడీ శ్రేణులు కొత్త ఎత్తుగడ వేశాయి. హంద్రీ–నీవా కాలువ పనులను రాజకీయం చేసే దిశగా పాదయాత్రకు స్కెచ్ వేసింది. దీనిపై దృష్టి సారించిన పోలీస్ అధికారులు రెండ్రోజుల క్రితం నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించారు. ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలను నిషేధించారు. అయినా దీనిని ఉల్లంఘిస్తూ తెలుగు తమ్ముళ్లు నిరసనకు దిగి చివరకు అభాసుపాలయ్యారు. (చదవండి: అచ్చెన్నాయుడి కుటుంబీకుల అరాచకం)
గురువారం సంతూరు–గుండిశెట్టిపల్లె మధ్య హంద్రీ–నీవా కాలువలో కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ జెండాలతో ప్రదర్శనకు దిగారు. ఇది తెలుసుకున్న కుప్పం రూరల్ సీఐ యతీంద్ర, రాళ్లబూదుగూరు ఎస్‌ఐ మురళీమోహన్, పోలీసులతో అక్కడికి చేరుకునేసరికి వాళ్లంతా మాయమయ్యారు! అంతలోనే చిన్నారిదొడ్డి–జలి్లగానిపల్లె మధ్య కూడా టీడీపీ నేతలు నిరసనకు దిగారనే సమాచారం అందడంతో పోలీసులు అక్కడికీ వెళ్లారు. మళ్లీ సేమ్ టు సేమ్..పోలీసులను చూసి టీడీపీ నేతలు తలో దిక్కుకు జారుకున్నారు. టీడీపీ వ్యవహారాన్ని తెలుసుకున్న మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ కన్వీనర్ కోదండరెడ్డి, కో–కనీ్వనర్ బుల్లెట్ దండపాణి, వడ్డెర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పెద్దన్న, నాయకులు విజయకుమార్, కృష్ణమూర్తి, మురుగేష్ కార్యకర్తలతో సంతూరుకు చేరుకున్నారు. అధికారంలో ఉన్నంతకాలం కాలువ పనుల ఊసెత్తని టీడీపీ నేతలు ఇప్పుడు నిరసనకు పూనుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. వీళ్లాడుతున్న డ్రామాలన్నీ ప్రజలకు తెలుసన్నారు. (చదవండి: కోటానుకోట్ల లాభాలు.. ఏమిటో ఈ కిటుకు?)
పలాయనంతో గాయాలు
జల్లిగానిపల్లె వద్దకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులను దుర్భాషలాడుతూ పారిపోయే క్రమంలో కాలువలో పడి నడింపల్లెకు చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. దీనికి కూడా రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు. తమపై అధికార పక్షం దాడులకు పాల్ప డినట్టు పేర్కొంటూ ఆస్పత్రిలో వారు చేరినట్టు తెలిసింది.
పోలీసుల మోహరింపు
తెలుగుతమ్ముళ్ల నాటకీయ ఎత్తుగడల నేప«థ్యంలో హంద్రీ–నీవా కాలువ పొడవునా పోలీసులను మోహరించారు. టీడీపీ నేతలు ఇటువైపు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, 144 సెక్షన్ అతిక్రమించే వారిపై చర్యలు తప్పవని సీఐ, ఎస్సై హెచ్చరించారు. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment