న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం విమర్శించారు. ఉద్యోగ మేళాల పేరిట మోదీ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఉద్యోగాలు, ప్రమోషన్లు వచి్చనవారికి మళ్లీ నియామక పత్రాలు ఇస్తూ ప్రచారం కోసం పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాల కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న కోట్లాది మంది యువత ఆశలపై ప్రధానమంత్రి నీళ్లు చల్లుతున్నారని ఆక్షేపించారు.
దేశంలో ప్రస్తుతం నిరుద్యోగిత శాతం రెండేళ్ల గరిష్టాన్ని అధిగమించిందంటూ ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లిమిటెడ్’ తాజాగా విడుదల చేసిన నివేదికను ఖర్గే ప్రస్తావించారు. మోదీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో 90 లక్షలకుపైగా ఉద్యోగాలు మాయమయ్యాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థిత మరింత దారుణంగా ఉందన్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనుల కోసం డిమాండ్ 20 శాతం పెరిగిందని తెలిపారు. మొత్తానికి దేశంలో నిరుద్యోగం 10.8 శాతానికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువతలో నిరుద్యోగం 13.4 శాతంగా ఉందని, ప్రభుత్వ సర్వేలోనే ఈ విషయం బయటపడిందని పేర్కొన్నారు. ఉద్యోగాల విషయంలో తప్పుడు ప్రకటనలు, ట్రిక్కులు ఎక్కువ కాలం చేయవని తేలి్చచెప్పారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలి్పంచకుండా అన్యాయం చేసిన వారిపై యువత ప్రతీకారం తీర్చుకుంటారని, ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment