
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి వివాహిత కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కామారెడ్డిలోని మంగళవారం ఉదయం ఓ వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి దాడి ఘటన అంతా డ్రామాగా తేలింది. కానీ ఏ వ్యక్తి కూడా ఆమెపై కత్తితో దాడి చేయలేదని, తనకు తానే బ్లేడుతో గొంతు కోసుకుందని పోలీసుల విచారణలో వెల్లడైంది.
నిషాక్ ఫిర్దౌసి అనే మహిళ.. ఎవరో గొంతు కోశారంటూ హై డ్రామా నడిపింది. సీన్‌లోకి రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ సేకరించారు. డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. విచారణ జరిపి అసలు నిజాన్ని బయట పెట్టారు. తనే గొంతు కోసుకుని డ్రామా ఆడిందని పోలీసులు వెల్లడించారు. నిషాక్ వింత ప్రవర్తనతో అత్తమామలు షాక్ అయ్యారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని.. రెండు నెలల క్రితం ఉరివేసినట్లుగా నిషాక్ పడిపోయినట్లుగా సమాచారం. ఎవరో తనని చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది.
ఇవీ చదవండి:
వరంగల్‌లో దారుణం.. అన్న కుటుంబంపై కత్తులతో దాడి
లక్షా 75 వేల ఆవు దూడ.. వింత చేప..!
Comments
Please login to add a commentAdd a comment