గుడిసెలను తగులబెట్టారంటూ చెప్పుకుంటున్న గుడారాలు ఇవే
పిడుగురాళ్లరూరల్: లేని గుడిసెలను ఉన్నట్లు సృష్టించి, పైగా తగులబెట్టారంటూ అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు మండలంలోని కోనంకి గ్రామంలో మంగళవారం హైడ్రామా నడిపారు. పథకం ప్రకారం గుడారాలు తగులబెట్టారని, కొంతమందిని కూడా కొట్టారంటూ ధర్నాకు దిగారు. పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో 141, 142 సర్వే నంబర్లలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు అన్నపరెడ్డి హనుమాయమ్మ, అన్నపరెడ్డి మట్టారెడ్డి, వీరభద్రుని భాస్కరరెడ్డి, వీరభద్రుని అంతి రెడ్డి, వీరభద్రుని శేషిరెడ్డిలకు 7.01 ఎకరాల భూమి ఉంది. దీనికి నష్టపరిహారం చెల్లించకుండా అధికారులు పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామంటూ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.
అయినప్పటికీ అధికారులు ఈనెల 20న భారీ పోలీసు బలగాలను తీసుకువచ్చి ఆ భూమి వద్దకు బాధితులను సైతం రానివ్వకుండా లేఅవుట్లు వేశారు. అప్పటికప్పుడే నాలుగైదు గుడారాలను ఏర్పాటు చేశారు. దీంతో తిరిగి బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో మంగళవారం అనుకూలంగా స్టే వచ్చింది. వీరు ప్రతిసారి కోర్టును ఆశ్రయిస్తున్నారన్న నెపంతో, వీరిపై అక్రమ కేసులు బనాయించాలన్న దురుద్దేశంతో పథకం ప్రకారం గుడారాలు తగులబడ్డాయని, కొంతమందిని కొట్టారంటూ టీడీపీ నేతలు హల్‌చల్ చేస్తూ ధర్నాకు దిగారు. కోనంకికి చెందిన పదిహేను మందితో పాటు పిడుగురాళ్లకు చెందిన టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు కూడా పాల్గొనడంతో గ్రామస్తులు విస్తుపోయారు.
వంత పాడుతున్న అధికారులు
గుడారాలను రాత్రికి రాత్రి తగులబెట్టుకుని అక్కడ కొంత వంట పాత్రలను వారే పడేసి ఓ పెద్ద నేర చరిత్రను సృష్టించేందుకు టీడీపీ గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి నాయకుల వరకు ప్రయత్నం చేశారు. తీరా భూమి వద్దకు వెళ్లి చూస్తే అది చలిమంటలు వేసుకున్నట్లుగా, ఒకచోట కట్టెపుల్లలు తగులబడినట్లు ఉంది కానీ గుడారాలు తగులబడినట్లు లేదని చూసిన ప్రతి ఒక్కరికీ ఇట్టే అర్థమవుతోంది. స్థానిక ప్రజాప్రతినిధి ఆజ్ఞలకు రెవెన్యూ, పోలీసు అధికారులు సైతం తలొగ్గి కేసును ఏ విధంగా పెట్టాలో.. ఎలా దీన్ని హైలెట్ చేయాలో తెలి యక తలలు పట్టుకుంటున్నారు. సంఘటన స్థలాన్ని సత్తెనపల్లి డీఎస్పీ కాలేషావలి, పిడుగురాళ్ల సీఐ హనుమంతరావు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment