
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: నిజాన్ని అబద్ధంగా చెప్పించే ప్రయత్నం చేసి మరోసారి టీడీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. అసలు రహస్యం వీరమ్మ కుమారుడు బయటపెట్టాడు.దీంతో మీడియా సాక్షిగా పచ్చనేతలు దొరికిపోయారు.
చదవండి: ఇదే చివరి అవకాశం.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు
అయోధ్య లంక మర్రిమూలలో వరద నీరు బాటిల్లో పట్టించి ఇప్పటికే నవ్వుల పాలైన టీడీపీ నేతలు.. వీరమ్మ కుమారుడు వీరాంజనేయులతో మీడియా సమావేశం పెట్టించి.. వైఎస్సార్‌సీపీ నేతలు బెదిరించి చెప్పమన్నారంటూ టీడీపీ నేతలు చెప్పించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు బెదిరించలేదని వీరాంజనేయులు మీడియా సమావేశంలో చెప్పడంతో టీడీపీ నేతలు అవాక్కయ్యారు. నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించాలని చూసి మరోసారి టీడీపీ నేతలు అభాసు పాలయ్యారు.