Development of India
-
మన అజ్ఞాత ఇంజినీర్లు
భారతదేశ అభివృద్ధి చేతివృత్తుల మీద జరిగింది. గౌండ్ల, కంసాలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వంటి నైపుణ్యాలున్న కులాలు దేశమంతటా ఎన్నో ఉన్నాయి. పౌర సమాజంలో వీరి జనాభానే అధికం. ఈ చేతివృత్తుల కులాలే అనేక రంగాల్లో అద్భుతమైన ఇంజినీరింగ్ పరిజ్ఞానాన్ని సృష్టించాయి. ఉత్పత్తి సంస్కృతికి వీరు ప్రతినిధులు. ఆర్యులు, ముస్లింలు, బ్రిటిష్ వలసవాదులు గనక భారతదేశం మీదకు దండెత్తి వచ్చి ఉండకపోతే, ఈ భారతీయ ఇంజినీరింగ్ నైపుణ్యాలు ఒక ప్రత్యేక తాత్విక దృక్పథాన్ని సంతరించుకొని ఉండేవి. అయితే ఈ కులాలను ముస్లిం, బ్రిటిష్ దురా క్రమణదారుల కంటే బ్రాహ్మణ హిందూమతమే ఎక్కువగా దెబ్బతీసింది. వీరి నైపుణ్యాలకు ఆధ్యాత్మిక హోదా కల్పించలేదు. వీరిని సమాజంలో తక్కువ స్థాయిలోనే ఉంచింది. అయినా వాళ్లు సమాజ అభివృద్ధిలో నిరంతరం పాలుపంచుకుంటూనే వచ్చారు. కల్లుగీత కార్మికులు వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలువబడుతున్నారు. వీళ్ళు మనుషులు తాగడానికీ, తద్వారా తమ ఆరోగ్యాన్ని సమ తూలంగా ఉంచుకోవడానికీ పనికొచ్చే పానీ యాన్ని అందించే చెట్లను కనుగొన్నారు. కనుగొన డమే కాదు, దానికి తగిన పనిముట్లను సిద్ధం చేశారు. ఇందులో వీరి గొప్ప ప్రతిభ దాగివుంది. అందుకే కల్లుగీత కోసం రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానం మనిషికీ, ప్రకృతికీ మధ్య ఒక సజీవ మైన అనుబంధంగా మారింది. భారతదేశంలో అత్యంత గొప్ప ఇంజినీరింగ్ నైపుణ్యాలు మరో మూడు కులాల్లో కనిపిస్తాయి. అవి కమ్మరి (ఇనుముతో పనిముట్లు తయారు చేసేవాళ్లు), వడ్రంగి (కలపతో వివిధ పనులు చేసేవాళ్ళు), కంసాలి (బంగారం, వెండితో ఆభర ణాలు చేసేవాళ్లు). కమ్మరి వృత్తి ఆర్యుల కాలం కంటే ముందు నుంచే ఉన్నట్టు కనపడుతుంది. వారి పనిముట్లు చరిత్రకు ఆనవాళ్లు పట్టిస్తాయి. ఈ వృత్తికి సంబంధించిన పరిజ్ఞానం ఇప్పటికీ మన గ్రామీణ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో అంత ర్భాగం. కమ్మరి పని వ్యవసాయ ప్రక్రియలో అనేక విధాలుగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. భారత దేశపు సామాజిక శక్తులు ఇనుము ఉపయోగాలను ఎలా కనుక్కొని ఉంటాయన్నది ఒక చారిత్రక అంశం. కమ్మరి కొలిమి ఇనుము సంబంధ పనుల్లో కీలకం. ఆ ప్రదేశం రెండు పైపు లైన్లను తోలు తిత్తితో అనుసంధానించి ఉంటుంది. అది కొలిమిలోకి క్రమబద్ధంగా గాలిని సరఫరా చేస్తుంది. ఈ తిత్తి ఆవిష్కరణ ఒక అద్భుతం. వడ్రంగి పనికి గొప్ప వృత్తి నైపుణ్యం అవసరం. వీరు సృష్టించిన అత్యంత విప్లవాత్మక సాధనం నాగలి. అలాగే వడ్రంగులు మానవ సమాజానికి అందించిన మరొక సేవ,ఇళ్ల నిర్మాణం. సమాజ ప్రధాన అవసరాలలో ఒకటైన ఇంటికి వాడే కర్రపనిలో వడ్రంగుల నైపుణ్యం మామూలుది కాదు. ఈనాటి ఇళ్ల నమూ నాల మూలాలన్నీ వడ్రంగుల నైపుణ్యంలో దాగి వున్నాయి. ప్రపంచంలో తొలినాళ్ల కుండల తయారీ జ్ఞాన వ్యవస్థల్లో కొన్నింటికి భారతదేశం పుట్టినిల్లు అని చెప్పవచ్చు. సింధు నాగరికత నాటికి మన దేశంలో కుండల తయారీ ఎంతో ఉచ్చస్థితిలో ఉంది. కుండల తయారీని ఎలా అభివృద్ధి పరిచారు అన్నది ఒక ఆశ్చర్యం. భారతీయ గ్రామాల్లో కుండల తయారీలో అధునాతన పరిజ్ఞానం కలిగిన కులాలు ఉన్నాయి. వారిని తెలుగునాట కుమ్మరోళ్లని పిలుస్తారు. అసలు సింధు నాగరికత ఈ కుండలు తయారు చేసేవారి భుజస్కందాలపై ఆధారపడే ఏర్పడినట్టు అనిపిస్తుంది. కుండల తయారీ పరి జ్ఞానం తొలుత మట్టికీ, చక్రానికీ మధ్య నుండే సంబంధాన్ని అర్థం చేసుకోవడంతో మొద లవుతుంది. ముడి కుండను మలిచేందుకు ముందు చక్రం తిప్పుతారు. మెత్తని బంక మట్టిని కుండగా మార్చవచ్చనీ, ఆ కుండలను వంటలకూ, నీళ్లు, ఇతర ద్రవ పదార్థాల నిల్వ ఉపయోగించవచ్చనీ వాళ్లకు ఎవరు చెప్పి ఉంటారు? మానవ జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు భూవనరు లతో నిరంతరం పోరాడేవాళ్ళే బంకమట్టి నుంచి రకరకాల కుండలు తయారు చేయ వచ్చని కను గొని ఉంటారు. వేగంగా తిరిగే చక్రం మీద ఉంచిన బంకమట్టిని చేతివేళ్ల కొనలతో నొక్కుతూ ఒక ఆకారంలోకి తెస్తారు. ఈ దశలో కుమ్మరి చేతివేళ్ళు, గోళ్ళు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవాళ గృహాల అంతర్గత అలంకరణకు వినియోగించేలా అనేక ఆకృతులను కూడా అద్భుతంగా తయారు చేస్తున్నారు. ఇలా దేశంలోని ఎన్నో కులాలు భారతదేశ ఉత్పత్తి సంస్కృతికి ప్రాతినిధ్యం వహించాయి. దేశ నాగరకతను ముందుండి నడిపించాయి. – కిరణ్ ఫిషర్ అడ్వకేట్ ‘ 79893 81219 -
Hindustan Times Leadership Summit: మళ్లీ జనం మద్దతు మాకే
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం వచి్చన నాటినుంచి 2014 దాకా మన దేశం నానా రకాల మానసిక అడ్డంకులతో సతమతమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి నిజమైన, ఊహాత్మక, అతిశయోక్తులతో కూడిన అన్ని అడ్డంకులనూ అధిగమించాం. అద్భుతమైన, అభివృద్ధి చెందిన, ప్రగతిశీల భారతానికి తిరుగులేని రీతిలో బలమైన పునాదులు వేశాం‘ అని ప్రకటించారు. అందుకే 2024 సాధారణ ఎన్నికల్లో ప్రజలు కూడా అన్ని అడ్డంకులనూ కూలదోసి బీజేపీకే మద్దతిస్తారని ధీమా వెలిబుచ్చారు. ఫలితాలు కూడా అన్ని అడ్డంకులనూ దాటుకుని వస్తాయన్నారు. నిజానికి కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతమే మన దేశం పాలిట నిజమైన అడ్డంకులుగా నిలిచాయన్నారు. వాటిని కూలదోయడంతో సామాన్యుడు సాధికారత సాధించాడని ప్రధాని చెప్పారు. శనివారం ఆయన హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్‌లో మాట్లాడారు. 2047లో సమిట్ థీమ్ ’భారత్ అభివృద్ధి చెందింది: ఇప్పుడేంటి?’ అని ఉండబోతోందని చమత్కరించారు. ‘జమ్మూ కశీ్మర్లో ఆరి్టకల్ 370ని రద్దు చేస్తే ఆకాశం విరిగి పడుతుందనేలా కొందరు లేనిపోని భయాందోళనలు కలిగించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ చర్యతో కశీ్మర్లో ఉగ్రవాదం అంతమవుతోంది. పర్యాటకం బ్రహా్మండంగా పెరుగుతోంది‘ అని మోదీ చెప్పారు. ‘అప్పట్లో కశీ్మర్లో ఉగ్రదాడులు జరిగినప్పుడల్లా భారత్ అంతర్జాతీయ సమాజం మద్దతు కోసం చూసేది. కానీ, అప్పట్లో సరిహద్దుల ఆవలి నుంచి నిత్యం ఆ దాడులను ప్రేరేపించినవారు ఇప్పుడు సాయం కోసం అంతర్జాతీయ సమాజం కేసి చూడాల్సిన పరిస్థితులు వచ్చాయి‘ అంటూ పాకిస్తాన్‌కు మోదీ చురకలు వేశారు. మంచి రాజకీయాలు మంచి ఆర్థిక విధానాలు కలిసి సాగగలవని తాము రుజువు చేశామన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి
చెన్నై: భారతదేశం అభివృద్ధి చెందిన దేశ హోదా సాధించడానికి రాబోయే 25 ఏళ్లు ‘క్లిష్టమైనవి’ అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భారత్ వృద్ధిలో ఆడిటర్లు కీలక పాత్ర పోషించాల్సన అవసరం ఉందని పేర్కొన్న ఆమె, ఈ బాటలో వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని, చిన్న కంపెనీలు అభివృద్ధి చెందేలా అవగాహన కలి్పంచాలనివిజ్ఞప్తి చేశారు. గత 20–25 ఏళ్లలో దేశం అనేక స్థాయిల్లో పురోగమించిందని, 60 ఏళ్లలో సాధించలేనిది గత దశాబ్దంలో భారత్ సాధించిందని పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్సహా పలు నివేదికలు ఇవే విషయాలను చెబుతున్నాయని అన్నారు. ది సోసైటీ ఆఫ్ ఆడిటర్స్ 90వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి తమిళం– ఇంగ్లీషుల్లో దాదాపు 40 నిమిషాలు మాట్లాడిన ఆమె ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ► నేను ఈ వృత్తిలో (ఆడిటింగ్) ఉన్న అనుభవజు్ఞలతో మాట్లాడుతున్నాను. దశాబ్దాల క్రితం రిజిస్టర్ అయిన సంస్థలలో మీది ఒకటి. మీ అందరితో నా సమావేశం కేవలం 90 సంవత్సరాల వేడుకలను జరుపుకోవడానికి మాత్రమే కాదు. ఈ వృత్తిలో మీరు మరిన్ని బాధ్యతలను స్వీకరించుకోవాల్సిన సమయంలో నేను మీతో మాట్లాడుతున్నాను. ► ప్రపంచవ్యాప్తంగా చార్టర్డ్ అకౌంటెంట్ల విధానాలు చాలా మార్పులకు లోనవుతున్నాయి. ఇక్కడకు వచి్చన ఆడిటర్లలో కొందరు ఇప్పటికే తమ వృత్తిలో నెలకొంటున్న మార్పును గమనించారని నేను భావిస్తున్నాను. ► ఆడిటింగ్ విధానంలో టెక్నాలజీ ఇకపై కీలక భూమికను పోషించనుంది. మీలో చాలా మంది ఈ మార్పును సానుకూలతలో స్వీకరిస్తున్నారు. వచ్చే జూలై నుండి చార్టర్డ్ అకౌంటెంట్ల పరీక్షలు కూడా వేరే ఫార్మాట్లో ఉండబోతున్నాయి. ► రాబోయే 25 ఏళ్లలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి కీలకం. మనలో ప్రతి ఒక్కరూ మీ వృత్తిపై దృష్టి పెట్టడమే కాకుండా దేశానికి మెరుగైన సేవలందించే మార్గాలను అందించండలో ముఖ్యమైన పాత్ర పోషించాలి. ► స్వాతంత్య్ర ఉద్యమంలో చేరడానికి చాలా మంది న్యాయవాదులు తమ వృత్తిని విడిచిపెట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రోజు మీరు మీ వృత్తిని విడిచిపెట్టాలని ఎవరూ కోరుకోరు. కానీ దేశానికి సేవ చేయడం, దేశ లక్ష్యాల గుర్తింపులో మీరు భాగస్వాములుగా ఉండాలి. మీ వృత్తి కార్యకలాపాల్లో ఇది కూడా ఒక భాగం కావాలి. ప్రతి ఒక్కరూ ‘కర్తవ్యం’ అనే గొప్ప భావాన్ని కలిగి ఉండాలి. భారత్ అభివృద్ధి చెందిన దేశ స్థితికి చేరుకోవడంలో అలాగే దేశం తన గత వైభవాన్ని తిరిగి సాధించడంలో ఉన్న సవాళ్లను ఎదుర్కోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా ఉండాలి. ► 1947కు ముందు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని ఇళ్లు, ఉద్యోగాలు కోల్పోయిన స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు. అలాంటి అవసరం ఈ రోజు తలెత్తబోదు. ప్రతి వృత్తిలోనూ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ.. తద్వారా దీనిని దేశాభివృద్ధికి మిళితం చేయడానికి తగిన కృషి సల్పాలి. ► ఉదాహరణకు, మీరు ఈ రంగంలో మీ పెట్టుబడులను కేటాయించినట్లయితే, మీరు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారని, అది దేశానికి మంచి ఆదాయాన్ని కూడా ఇస్తుందని మీరు మీ ఖాతాదారులకు సలహా ఇవ్వవచ్చు. ఇలాంటి సూచనలు ఇవ్వడం ద్వారా మీరు దేశాభివృద్ధికి తోడ్పడగలరు. ► ప్రభుత్వం ఎక్కడ డబ్బు కోల్పోతున్నారో సంబంధిత అధికారులకు తెలియజేయడం ద్వారా ఆడిటర్లు దేశ పురోగతిలో భాగం పంచుకోవాలి. ► మీరు కంపెనీ పేరు లేదా దానిలో ప్రమేయం ఉన్న వ్యక్తి పేరు చెప్పనవసరం లేదు. ఇది మీ ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తుంది. కానీ పన్ను ఏ రూపంలో ఎగవేత జరుగుతోందో మాత్రం మీరు ప్రభుత్వ అధికారులకు తెలియజేయవచ్చు. -
సుస్థిరమైన ఆవిష్కరణలు, ఉత్పత్తులు రావాలి
సాక్షి, హైదరాబాద్: మన దేశంలోని అతి పెద్ద మార్కెట్ లక్ష్యంగా వివిధ రంగాల్లో కొత్త ఆవిష్కరణలు, సుస్థిరమైన ఉత్పత్తులు తీసుకురావాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. వివిధ రంగాల పరస్పర సహకారం, వినూత్న విధానాలతో వచ్చే 25 ఏళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశాల శక్తికేంద్రంగా నిలుస్తుందనే ధీమా వ్యక్తంచేశారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిఫ్ట్, ఎఫ్డీఐఐ, ఎన్ఐడి, ఐఐఎఫ్టి, ఐఐపి విద్యార్థుల సమావేశం శిల్పకళావేదికలో శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన నిర్మలా సీతారామన్ ‘డిజిటలైజేషన్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్: భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలు’ అనే అంశంపై మాట్లాడారు. ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోదీ సూచించిన పంచ సూత్రాల(పంచ పరిష్కారాలు) అమలుతో దేశం మరింత బలోపేతం అవుతోందన్నారు. ఇప్పటికే భారత్ అభివృద్ధి చేసిన స్థిరమైన డిజైన్ల గురించి తెలుసుకొని, వాటిని ఈ తరానికి సౌకర్యంగా ఉండేలా మెరుగుపరచాలని విద్యార్థులకు సలహా ఇచ్చారు. మార్పును స్వీకరించి, కొనసాగించే వారధులుగా విద్యార్థులు ఉండాలని సీతారామన్ వ్యాఖ్యానించారు. ఆశాకిరణంగా భారత్ ఆర్థిక వ్యవస్థ : పీయూష్ గోయల్ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రపంచానికి భారత్ ఆర్థికవ్యవస్థ ఒక ఆశాకిరణంగా ఉందని కేంద్ర పరిశ్రమలు, ప్రజా పంపిణీ, జౌళి శాఖల మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఉత్తమ డిజైన్లను రూపొందించి, ఖర్చు తగ్గించే అంశాలపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. సభికులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. పేటెంట్ల కోసం ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డిజిటలైజేషన్ ద్వారా అవినీతిని రూపుమాపామని, మధ్యవర్తులను దూరం చేయగలిగామని, పోటీతత్వం పెంచగలిగామని తెలిపారు. నూతన ఆవిష్కరణలకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఐదు విద్యాసంస్థల విద్యార్థుల (పూర్వవిద్యార్థులుసహా) సమ్మేళనం తొలిసారిగా హైదరాబాద్‌లో జరుగుతోందని, రాబోయే రోజుల్లో దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటివి నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కేంద్రవాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ సింగ్ ఠాకూర్, ఎఫ్‌డీడీఐ ఎండీ అరుణ్ కుమార్ సిన్హా, నిఫ్ట్ డైరెక్టర్ విజయ్ కుమార్ మంత్రి, ఎన్ఐడి ప్రొఫెసర్ శేఖర్ ముఖర్జీ, ఎఫ్డిఐఐ హైదరాబాద్ సెంటర్ ఇంచార్జ్ దీపక్ చౌదరి, ఐఐఎఫ్టి డీన్ డాక్టర్ సతీందర్ భాటియా, ఐఐపీ చైర్మన్ వాగీ దీక్షిత్ పాల్గొన్నారు. -
ప్రపంచానికి నమ్మకమైన భాగస్వామి భారత్
లక్నో/కాన్పూర్: 21వ శతాబ్దంలో భారతదేశ అభివృద్ధి చరిత్రకు ఉత్తరప్రదేశ్ ఊపునిస్తుందని, దేశానికి చోదకశక్తిగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేడు ప్రపంచం అన్వేషిస్తున్న ఒక నమ్మకమైన భాగస్వామిగా భారత్ అవతరించిందని చెప్పారు. నమ్మకమైన భాగస్వామిగా తనను తాను నిరూపించుకొనే సత్తా ప్రజాస్వామ్యదేశమైన భారత్‌కు మాత్రమే ఉందన్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మూడో పెట్టుబడిదారుల సదస్సును ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. వివిధ రంగాల్లో రూ.80,000 కోట్లకు పైగా విలువైన 1,406 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలు భారత్‌కు ఎన్నెన్నో గొప్ప అవకాశాలను తెచ్చిపెట్టాయని వివరించారు. ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోందని, మన శక్తి సామర్థ్యాలను కొనియాడుతోందని గుర్తుచేశారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... అదొక సరికొత్త రికార్డు ‘‘జి–20 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గ్లోబల్ రిటైల్ సూచికలో రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలో చమురు, విద్యుత్, గ్యాస్ శక్తిని ఉపయోగించుకొనే దేశాల్లో మూడో స్థానంలో ఉంది. గతేడాది 100కు పైగా దేశాల నుంచి ఇండియాకు రికార్డు స్థాయిలో 84 బిలియన్ డాలర్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. 417 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేశాం. ఇదొక సరికొత్త రికార్డు. సంస్కరణలు కొనసాగుతాయ్ మన ప్రభుత్వం ఇటీవలే ఎనిమిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంది. ఎనిమిదేళ్లుగా సంస్కరణ–పనితీరు–మార్పు అనే మంత్రంతో ముందుకు సాగుతున్నాం. విధాన నిర్ణయాల్లో స్థిరత్వం, పరస్పర సహకారం, సులభతర వాణిజ్యానికి పెద్దపీట వేస్తున్నాం. ‘ఒకే దేశం–ఒకే పన్ను, ఒకే దేశం–ఒక్కటే రేషన్ కార్డు’ వంటివి మన స్పష్టమైన, బలమైన ప్రయత్నాలకు నిదర్శనం. రక్షణ రంగంలో తయారీకి గతంలో ఎవరూ ఇవ్వనంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆత్మనిర్భర్ అభియాన్‌లో భాగంగా 300 రక్షణ రంగ ఉత్పత్తులను ఇకపై దేశీయంగానే తయారు చేసుకోబోతున్నాం. రక్షణ తయారీ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టబోతున్నవారికి మార్కెట్ సిద్ధంగా ఉంది. దేశంలో సంస్కరణలు కొనసాగుతూనే ఉంటాయి. భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి అన్ని రంగాల్లో సంస్కరణలు చేపడతాం. నవ్య కాశీని సందర్శించండి 2014 పోలిస్తే ఇప్పుడు దేశంలో ఎంతో అభివృద్ధి జరిగింది. అప్పట్లో 6 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ ఖాతాదారులు ఉండేవారు. ఇప్పుడు 78 కోట్లకు చేరారు. జీబీ డేటా ధర రూ.200 ఉండేది రూ.11–12కు దిగొచ్చింది. 2014లో 100 కంటే తక్కువ గ్రామాలే ఆప్టికల్ ఫైబర్‌తో కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు వాటి సంఖ్య 1.75 లక్షలు. 70 వేల దాకా రిజిస్టర్డ్ స్టార్టప్‌లు ఉన్నాయి. యూపీలో నా సొంత నియోజకవర్గం వారణాసిని సందర్శించాలని పెట్టుబడిదారులను కోరుతున్నా. ఘనమైన పురాతన చరిత్ర ఉన్న కాశీ నవ్యత్వాన్ని సంతరించుకుంటోంది’’ అని మోదీ వెల్లడించారు. యూపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన దారుల సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్, పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, కుమార మంగళం బిర్లా తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పెట్టుబడులు, ఉద్యోగాల గురించి వివరించారు. మోదీ విజన్‌కు అనుగుణంగా పని చేస్తున్నారంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. బలమైన ప్రతిపక్షం ఉండాలి వంశ పారంపర్య రాజకీయాలపై (పరివార్వాద్) ప్రధాని మోదీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. యూపీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పూర్వీకుల గ్రామమైన పరౌంఖ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వంశ పారంపర్య రాజకీయాల వల్ల ప్రతిభావంతులకు అవకాశాలు దక్కకుండా పోతాయన్నారు. అలాంటి రాజకీయాలు చేసేవారంతా తనకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నారని చెప్పారు. వారి ఆటలను ప్రజలు సాగనివ్వరని పేర్కొన్నారు. మారుమూల గ్రామాల్లో జన్మించిన వారు కూడా రాష్ట్రపతి, ప్రధానమంత్రి కావాలంటే వంశ పారంపర్య రాజకీయాలకు చరమగీతం పాడాలన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తానని మోదీ చెప్పారు. దానివల్ల రాజకీయాల్లో యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు. అంతకముందు కాన్పూర్ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి రాష్ట్రపతి కోవింద్ స్వాగతం పలికారు. తనకు స్వాగతం పలికేందుకు రాష్ట్రపతి రావడం పట్ల తనకు సిగ్గుగా ఉందని మోదీ అన్నారు. కోవింద్ మార్గదర్శకత్వంలో తాము పనిచేస్తున్నామని చెప్పారు. తమ పూర్వీకుల గ్రామాన్ని సందర్శించిన మోదీకి రాష్ట్రపతి కృతజ్ఞతలు తెలిపారు. పరౌంఖ్‌లో పథ్రీమాత ఆలయాన్ని, బీఆర్ అంబేడ్కర్ భవనాన్ని, మిలన్ కేంద్రాన్ని కోవింద్‌తో కలిసి మోదీ సందర్శించారు. -
‘పొరుగు’ బంధాలు కీలకం
న్యూఢిల్లీ: భారత్ అభివృద్ధిలో పొరుగు దేశాలతో సంబంధాలు కూడా ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య కీలక వాణిజ్య మార్గం పెట్రాపోల్-బెనాపోల్ ల్యాండ్ పోర్టును బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో కలసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ప్రారంభించారు. పశ్చిమ బెంగా ల్ సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... పెట్రాపోల్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు (ఐసీపీ) ద్వారా ఇరు దేశాల మధ్య ఆర్థిక వ్యవస్థ అనుసంధానత మరింత బలపడి, సంబంధాలు మెరుగవుతాయన్నారు. భారత్, బంగ్లాదేశ్‌ల ఆర్థికాభివృద్ధి, అనుసంధానతలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయన్నారు. ఆసియాలోనే అతిపెద్ద ఈ ల్యాండ్ పోర్టు ప్రారంభోత్సవం ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక ఘట్టమన్నారు. ఏటా 15 లక్షల మంది ప్రజలు, లక్షన్నర ట్రక్కులు ఈ సరిహద్దు నుంచి రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. బంగ్లాదేశ్‌లోని ఢాకా, కిషోర్‌గంజ్‌ల్లో జరిగిన ఉగ్రవాద దాడులపై మోదీ సంతాపాన్ని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేం దుకు బంగ్లాకు భారత్ అండగా ఉంటుందని హసీనాకు స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపారాభివృద్ధికి ఐసీపీ కీలక అడుగని హసీనా వెల్లడించారు. భారత్‌తో సత్సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయన్నారు. భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య వాణిజ్యానికి పెట్రాపోల్-బెనాపోల్ ప్రధాన సరిహద్దు మార్గం. యాభై శాతానికి పైగా ద్వైపాక్షిక వాణిజ్యం ఈమార్గం ద్వారానే జరుగుతుంది. భద్రత, ఇమిగ్రేషన్, కస్టమ్స్ వంటి ముఖ్య సేవలను సమర్థవంతంగా పెట్రాపోల్ ఐసీపీ అందిస్తుంది. సరిహద్దుల్లో గందరగోళం లేకుండా ప్రజా, సరుకు రవాణాకు దోహడపడుతుంది. 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ ల్యాండ్ పోర్టు ద్వారా 68 వేల కోట్ల వాణిజ్యం జరుగుతుందని మమత చెప్పారు. -
వ్యవసహాయదారుడు...
అడవిలో... రెండు దారులు చీలి ఉన్నాయి. నేను బాటసారినై, ఒక్కడినే రెండు దారుల్లో వెళ్లలేను. ఆ విచారంతో... దట్టంగా పెరిగిన పొదలలో మలుపు తిరిగే వరకూ నాకు కనిపించిన ఒక దారిని గమనిస్తూ... చాలాసేపు ఆలోచిస్తూ నిలుచున్నాను. నేను అదే బాట పట్టాను..! రాబర్ట్ఫ్రాస్ట్ అనే ఆంగ్ల కవి రాసిన ‘ద రోడ్ నాట్ టేకెన్’ కవితలోని కొన్ని పంక్తులు ఇవి. ‘తక్కువమంది నడిచిన తోవను నేను ఎంచుకొన్నాను, అదే నా జీవితాన్ని మలుపు తిప్పింద’ని అంటాడు ఫ్రాస్ట్. ఏదో ఒక దారిని ఎంచుకోవాల్సిన సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎదురవుతుంటాయి. ఆ సమయంలో తక్కువగా నలిగిన దోవను ఎంచుకొనే వాళ్లు కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో ఒకరు తాహెర్ సర్తల్వాలా. భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉందన్నమాట వింటూనే ఉన్నాం కానీ... మన దేశంలోని చాలా వ్యవస్థలు ఇంకా మధ్యయుగం పరిధిని దాటి రాలేదు. అలాంటి వాటిల్లో వ్యవసాయం ఒకటి. ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ పద్ధతులు ఏ మాత్రం అభివృద్ధి చెందింది లేదు. ఒకవైపు కష్టపడుతున్నా సరైన ఒడుపులేకపోవడం వల్ల గిరిజనుల కష్టం రాళ్లపాలవుతోంది. చదువుకొంటున్న సమయంలోనే దీని గురించి అవగాహన ఉంది తాహెర్‌కు. పుట్టి పెరిగింది వ్యవసాయంతో సంబంధం లేని కుటుంబంలోనే అయినా... తాహెర్‌కు మాత్రం గ్రామీణ ప్రాంత స్థితిగతులపై ఎనలేని ఆసక్తి. వ్యవసాయం అంటే ఇష్టం. ఆ ఇష్టమే ఇతడు ప్రస్తుతం తక్కువమంది నడుస్తున్న దారిని ఎంచుకొనేలా చేసింది. పుణే విశ్వవిద్యాలయంలో ఎంకామ్ పూర్తి చేసిన తర్వాత ఏదో ఒక ఉద్యోగాన్ని చూసుకొని వెళ్లిపోవడం... లేదా తనకు ఆసక్తి, ఇష్టం ఉన్న గ్రామీణ పరిస్థితుల స్థితిగతుల గురించి అధ్యయనం చేసి... రైతుల్లో అవగాహన నింపడం... ఈ రెండింటిలో ఏ దారి ఎంచుకోవాలా అని సతమతమయ్యాడట తాహెర్. ఇలాంటి తరుణంలో రాబర్ట్ ఫ్రాస్ట్లాగా నలగని దారిలో నడిచాడు. ఆ పయనంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అనుకొన్న గమ్యాన్ని చేరాడు. ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిచాడు. తాహెర్ ఈ బాటలో నడవడానికి ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా వారు సహకారం అందించారు. గ్రామీణుల గురించి, గ్రామాల్లోని పరిస్థితుల గురించి ఆలోచించే తీరిక ఉన్న భారతీయ యువత కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమం ద్వారా సహకారం అందిస్తోంది. గిరిజన ప్రాంతాల్లోని రైతులు చేసే సేద్యంపై అధ్యయనం చేయాలని సంకల్పించాడు తాహెర్. అందుకు గుజరాత్ దక్షిణ ప్రాంతంలోని మొలంబా గ్రామాన్ని ఎంచుకొన్నాడు. ఆ గిరిజన ప్రాంతంలోని రైతులు సంప్రదాయ వ్యవసాయంతో నష్టపోతున్న తీరు అతి తక్కువ సమయంలోనే అర్థమైంది తాహెర్‌కు. వ్యవసాయ పనుల్లో భాగంగా రైతులు ప్రతి ఏటా కొండలకూ, పంట కోత తర్వాత పంటభూములకూ నిప్పుపెట్టే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఎండిపోయిన గడ్డితో ఉండే పంట పొలాలకు నిప్పుపెడతారు రైతులు. ఆ మంట పక్కనే ఉన్న చెట్లకు కూడా అల్లుకొంటుంది. చాలా ఎక్కువ విస్తీర్ణంలోని కొండ ప్రాంతం కాలిపోతుంది. ఇది ప్రతి ఏటా జరిగేదే! విషాదం ఏమిటంటే ఇలా చెట్టూచేమను కాల్చుకోవడం తమకు పంటకు మంచిదని అక్కడి రైతుల నమ్మకం. శతాబ్దాలుగా ఈ పద్ధతినే కొనసాగిస్తున్నారు వాళ్లు. తాహెర్ అక్కడి రైతుల్లో ముందుగా ఈ విషయం గురించి అవగాహన నింపడానికి ప్రయత్నించాడు. వ్యవసాయానికి ఎరువుగా ఉపయోగపడే ఎండుగడ్డి, ఇతర జీవావరణ నిక్షేపాలు (బయోమాస్)ను కాల్చివేయడం పంటకు తీవ్రమైన నష్టాన్ని కలగచేస్తుందని గిరిజన ప్రాంత రైతులకు వివరించాడు. కాల్చివేయడం వల్ల సారవంతమైన ఎరువు బూడిద కావడంతో పాటు మంటలు అడవికి కూడా అంటుకొని నష్టం కలిగిస్తున్న విషయాన్ని విశదీకరించాడు. అయితే ఆ గ్రామీణుల మనసు మార్చడం, వారిలో అవగాహన పెంచడం ఒకరోజులో జరిగిన పని కాదు. కొన్ని నెలల పాటు వారిలో ఒకరిగా మెలుగుతూ ప్రతి సందర్భంలోనూ వారికి జరుగుతున్న నష్టం గురించి తెలియజెప్పి, ఊరికి వ్యవసాయ శాస్త్రవేత్తలను తీసుకువచ్చి వారికి అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేశాడు. సాయిల్ సోలరైజేషన్ ట్రీట్మెంట్ (ఎస్ఎస్టీ) పేరుతో అక్కడి భూసారాన్ని పెంపొందించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతుల్లో అవగాహన కలిగించాడు. వ్యవసాయంపై ఎనలేని ఆసక్తి ఉన్న రైతులను ఇతడి పాఠాలు ఆకట్టుకొన్నాయి. వారు తమ సంప్రదాయ పద్ధతుల నుంచి బయటకు వచ్చారు. అధునాతన పద్ధతుల పట్ల ఉత్సాహం చూపారు. నాలుగేళ్ళ క్రితం మొలంబా, చుట్టుపక్కల పల్లెల్లో ఈ యువకుడు పని మొదలుపెట్టాడు. ఇప్పుడు అక్కడి వ్యవసాయకార్యక్రమాల్లో మార్పులొచ్చాయి. అక్కడి ప్రజలు తాహెర్‌ను తమవాడంటారు. తమకు కొత్త దారి చూపిన వ్యక్తిగా గౌరవిస్తారు. అన్నదాతలు ఇచ్చే ఆ గౌరవం ఏ మల్టీనేషనల్ కంపెనీ ఏసీ రూమ్‌లోనో కూర్చొని పనిచేస్తుంటే లభించేది కాదనేది అతడి భావన. ప్రపంచం ఎంత ముందడుగు వేసినా వ్యవసాయాన్ని విస్మరించకూడదనీ, ఆ రంగంలో పనిచేయడం తనకు ఆత్మసంతృప్తినిస్తోందనీ ఈ యువకుడు చెబుతాడు. గొప్ప ఆలోచనా విధానమే! - జీవన్ రెడ్డి.బి -
రానున్న పదేళ్లు దేశాభివృద్ధికి ఎంతో కీలకం
‘మీట్ ది ప్రెస్’లో ప్రధానమంత్రి సలహాదారు శ్యామ్ పిట్రోడా సాక్షి, బెంగళూరు: రానున్న పదేళ్లు భారతదేశ అభివృద్ధికి ఎంతో కీలకమైనవని ప్రధానమంత్రి సలహాదారు శ్యామ్ పిట్రోడా పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశ అభివృద్ధి ఒక కూడలి వరకు చేరుకుందని, కూడలి వద్ద కనిపిస్తున్న మార్గాల్లో ప్రజలు ఏ మార్గాన్ని ఎంచుకుంటారనే విషయంపై భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్, రిపోర్టర్స్ గిల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారమిక్కడ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం మనకు అందుబాటులోకి వచ్చిన బయోటెక్, నానోటెక్, స్టెమ్ టెక్నాలజీ వంటి ఎన్నో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు ఎన్నో సమస్యలకు సులువైన పరిష్కారాలను చూపుతున్నాయని, అయితే వాటిని మనం సరైన దారిలో ఉపయోగించుకోవడం లేదని అన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఎప్పుడో రూపొందించిన విద్యా బోధనా విధానాలనే మనం అనుసరిస్తున్నామంటే మార్పును స్వాగ తించడానికి ఎంత మాత్రం ఇష్టపడుతున్నామనే విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు. క్రికెట్, బాలీవుడ్ గాసిప్స్, రాజకీయాలు వంటి విషయాలపై చర్చించేందుకు తప్ప దేశంలో ఎలాంటి టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నారు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేమిటి అనే విషయాలపై ప్రజలతో పాటు మీడియా కూడా చర్చించడం లేదని అన్నారు. అందుకే అసలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతోందనే విషయంపై ప్రజలు కనీస సమాచారం కూడా లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు సరైన అవకాశాలు కల్పిస్తేనే.... ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారత్‌లోనే ఎక్కువ సంఖ్యలో యువత ఉందని శ్యామ్ పిట్రోడా పేర్కొన్నారు. అయితే భారత్‌లోని యువతకు సరైన అవకాశాలు కల్పించినప్పుడే ప్రపంచ దేశాలకు భారత్ మోడల్‌గా నిలుస్తుందని అన్నారు. ఇక ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువ శాతం యువతే ఉన్నా అన్ని రంగాల్లోనూ విధి విధానాలను రూపొందించే వారు మాత్రం 50-60 ఏళ్ల మధ్య ఉన్న వారే ఉంటున్నారని అన్నారు. ఆ విధానాలను అనుభవించే వారు మాత్రం 20ఏళ్ల వారై ఉంటున్నారని తెలిపారు. అమెరికా మోడల్‌ను కాపీ కొట్టడం కాకుండా సొంత ఆలోచనలకు పదును పెట్టడం ద్వారా భారతదేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు నడిపేందుకు ఆస్కారం ఉంటుందని శ్యామ్ పిట్రోడా పేర్కొన్నారు. సూపర్ పవర్ అని ఎలా అంటారు.... భారతదేశంలో 300 మిలియన్ల మంది ప్రజలు కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ఇబ్బంది పడుతుంటే భారత్‌ను సూపర్ పవర్‌గా ఎలా అభివర్ణిస్తారని శ్యామ్ పిట్రోడా ప్రశ్నించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు, యువతకు ఉద్యోగాలు కల్పించిన తరువాత భారత్‌ను సూపర్ పవ ర్గా చెప్పుకోవచ్చని, అప్పటి దాకా సూపర్ పవర్‌గా ఎదిగేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు. ఇక ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి అందుబాటులోకి తెచ్చిన పరిజ్ఞానాన్ని వాడుకోవడానికి కూడా భారత్‌లో చాలా మంది ఇష్టపడడం లేదని, ఐటీ శాఖలోని ఉద్యోగులే ఆ శాఖకు చెందిన వివిధ పత్రాలను ఇప్పటికీ కంప్యూటర్లో పొందుపరచకుండా ఫైల్స్ రూపంలోనే ఉంచేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని శ్యామ్ పిట్రోడా పేర్కొన్నారు.