leadership summit
-
Hindustan Times Leadership Summit: కోర్టు తీర్పులను చట్టసభలు పక్కన పెట్టజాలవు
న్యూఢిల్లీ: కోర్టు తీర్పుల విషయంలో చట్టసభలు ఏం చేయగలవు, ఏం చేయలేవనే విషయంలో స్పష్టమైన విభజన రేఖ ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘‘తీర్పులు ఏమైనా చట్టపరమైన లోపాలను ఎత్తి చూపితే వాటిని సవరించేందుకు, సరిచేసేందుకు చట్టసభలు కొత్త చట్టాలను చేయవచ్చు. అంతే తప్ప తీర్పులు తప్పనే అభిప్రాయంతో వాటిని నేరుగా, పూర్తిగా పక్కన పెట్టేయజాలవు’’ అని స్పష్టం చేశారు. శనివారం ఇక్కడ హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. పలు అంశాలపై తీర్పులిచ్చేటప్పుడు ప్రభుత్వ విభాగాల మాదిరిగా వాటిపై సమాజం ఎలా స్పందిస్తుందని న్యాయమూర్తులు ఆలోచించరన్నారు. వారు రాజ్యాంగ నైతికతకు కట్టుబడి పని చేస్తారే తప్ప ప్రజల నైతికతకు కాదని చెప్పారు. మన దేశంలో జడ్జిలకు ఎన్నిక జరగదన్నది లోపం కాదని, మన వ్యవస్థ తాలూకు బలమని సీజేఐ అన్నారు. ‘‘మన సుప్రీంకోర్టు ప్రజల కోర్టు. అమెరికా సుప్రీంకోర్టు ఏటా పరిష్కరించే కేసుల సంఖ్య కేవలం 80. కానీ మన సుప్రీంకోర్టు ఈ ఏడాది ఇప్పటికే ఏకంగా 72 వేల కేసులను పరిష్కరించింది. ప్రజలకు చేరువయే లక్ష్యంతో సుప్రీంకోర్టు తీర్పులను భారతీయ భాషల్లోకి అనువదింపజేస్తున్నాం. అలా ఇప్పటిదాకా 31 వేల తీర్పులను అనువదించారు’’ అని చెప్పారు. -
Hindustan Times Leadership Summit: మళ్లీ జనం మద్దతు మాకే
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం వచి్చన నాటినుంచి 2014 దాకా మన దేశం నానా రకాల మానసిక అడ్డంకులతో సతమతమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి నిజమైన, ఊహాత్మక, అతిశయోక్తులతో కూడిన అన్ని అడ్డంకులనూ అధిగమించాం. అద్భుతమైన, అభివృద్ధి చెందిన, ప్రగతిశీల భారతానికి తిరుగులేని రీతిలో బలమైన పునాదులు వేశాం‘ అని ప్రకటించారు. అందుకే 2024 సాధారణ ఎన్నికల్లో ప్రజలు కూడా అన్ని అడ్డంకులనూ కూలదోసి బీజేపీకే మద్దతిస్తారని ధీమా వెలిబుచ్చారు. ఫలితాలు కూడా అన్ని అడ్డంకులనూ దాటుకుని వస్తాయన్నారు. నిజానికి కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతమే మన దేశం పాలిట నిజమైన అడ్డంకులుగా నిలిచాయన్నారు. వాటిని కూలదోయడంతో సామాన్యుడు సాధికారత సాధించాడని ప్రధాని చెప్పారు. శనివారం ఆయన హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్‌లో మాట్లాడారు. 2047లో సమిట్ థీమ్ ’భారత్ అభివృద్ధి చెందింది: ఇప్పుడేంటి?’ అని ఉండబోతోందని చమత్కరించారు. ‘జమ్మూ కశీ్మర్లో ఆరి్టకల్ 370ని రద్దు చేస్తే ఆకాశం విరిగి పడుతుందనేలా కొందరు లేనిపోని భయాందోళనలు కలిగించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ చర్యతో కశీ్మర్లో ఉగ్రవాదం అంతమవుతోంది. పర్యాటకం బ్రహా్మండంగా పెరుగుతోంది‘ అని మోదీ చెప్పారు. ‘అప్పట్లో కశీ్మర్లో ఉగ్రదాడులు జరిగినప్పుడల్లా భారత్ అంతర్జాతీయ సమాజం మద్దతు కోసం చూసేది. కానీ, అప్పట్లో సరిహద్దుల ఆవలి నుంచి నిత్యం ఆ దాడులను ప్రేరేపించినవారు ఇప్పుడు సాయం కోసం అంతర్జాతీయ సమాజం కేసి చూడాల్సిన పరిస్థితులు వచ్చాయి‘ అంటూ పాకిస్తాన్‌కు మోదీ చురకలు వేశారు. మంచి రాజకీయాలు మంచి ఆర్థిక విధానాలు కలిసి సాగగలవని తాము రుజువు చేశామన్నారు. -
న్యాయవ్యవస్థలో పురుషాధిక్యత
న్యూఢిల్లీ: భారతీయ న్యాయవ్యవస్థలో తొలినుంచీ పురుషాధిక్యత వేళ్లూనుకొని ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో న్యాయ వృత్తి ఫ్యూడల్, పితృస్వామ్య తరహాతో, మహిళలను సముచిత వాటా కల్పించని స్వభావంతో కూడుకున్నదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. మహిళలు, సమాజంలోని అణగారిన వర్గాల వారు న్యాయపాలికలోకి మరింత పెద్ద సంఖ్యలో ప్రవేశించాలని అభిప్రాయపడ్డారు. అందుకు వీలుగా మొత్తం న్యాయ వ్యవస్థను మరింత ప్రజాస్వామ్యయుతంగా, ప్రతిభాధారితంగా మార్చాల్సిన అవసరం చాలా ఉందంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థకు మానవ వనరులను అందించేందుకు మనకు ఒక నిర్ధారిత వ్యవస్థ ఉంది. దాని నిర్మాణం ఇప్పటికీ ఫ్యూడల్, పితృస్వామ్య పోకడలతోనే నిండి ఉందన్నది వాస్తవం. పురుషాధిక్యత మన న్యాయవ్యవస్థ స్వరూపంలోనే గూడుకట్టుకుపోయింది. సీనియర్ లాయర్లున్న ఏ చాంబర్లోకి వెళ్లినా అక్కడ మొత్తం పురుషులే కనిపిస్తారు. మార్పు అక్కడి నుంచే రావాలి. మహిళలు, అణగారిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులకు ఆ చాంబర్లలో చోటు దక్కాలి. అప్పుడు గానీ న్యాయపాలికలో వారి సంఖ్య పెరగదు! మహిళా న్యాయవాదులు, న్యాయమూర్తుల ద్వారానే భవిష్యత్తులో మెరుగైన న్యాయవ్యవస్థను నిర్మించుకోగలం’’ అన్నారు. ‘‘నేడు న్యాయవ్యవస్థ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. వాటిలో మొట్టమొదటిది, అతి ముఖ్యమైనది సుప్రీంకోర్టుపై ప్రజలు పెట్టుకున్న ఆశలు. ఎందుకంటే ప్రతి సామాజిక, న్యాయపరమైన అంశమూ, రాజకీయ అంశమూ సుప్రీంకోర్టు న్యాయ పరిధిలోకి వచ్చేవే’’ అని చెప్పారు. న్యాయమూర్తులకు ఆ నేర్పుండాలి చట్టం అణచివేతకు సాధనంగా కాక న్యాయమందించే సాధనంగా ఉండాలని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఆ బాధ్యత పాలకులదే తప్ప న్యాయమూర్తులది కాదని స్పష్టం చేశారు. ‘‘మాపై ప్రజలకు ఎన్నో ఆశలు, అంచనాలున్నాయి. కానీ కోర్టుల పరిమితులను కూడా అర్థం చేసుకోవాలి. ‘‘చట్టాలు, న్యాయం కొన్నిసార్లు ఒకే సరళరేఖపై వెళ్లకపోవచ్చు. కానీ చట్టాలున్నది అంతిమంగా న్యాయ వితరణకే. వాటిని అణచివేతకు దుర్వినియోగం చేయొద్దు’ అని సీజేఐ అన్నారు. ‘‘దీర్ఘకాలంలో న్యాయవ్యవస్థను నిలబెట్టేది దయా భావన, సహానుభూతితో ప్రజల వేదనను పోగొట్టగలిగిన సామర్థ్యం మాత్రమే. ఎవరూ పట్టించుకోని అణగారిన వర్గాల ఆక్రందన వినగలిగి, వారి బాధలను చూడగలిగి చట్టాన్ని, న్యాయాన్ని నేర్పుగా బ్యాలెన్స్ చేయగలిగిన నాడు న్యాయమూర్తిగా బాధ్యతలను సరిగా నిర్వర్తించినట్టు లెక్క’’ అన్నారు అమెరికాతో పోలికేల...? మన సుప్రీంకోర్టును అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల అత్యున్నత న్యాయస్థానాలతో పోల్చడం సరికాదని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘అమెరికా సుప్రీంకోర్టు ఏడాదంతా కలిపి మహా అయితే 180 పై చిలుకు కేసులు పరిష్కరిస్తుంది. బ్రిటన్‌లోనైతే 85 కేసులు దాటవు! కానీ మన సుప్రీంకోర్టులో ప్రతి న్యాయమూర్తీ సోమ, శుక్రవారాల్లో 75 నుంచి 80 కేసుల దాకా ఆలకిస్తారు. మంగళ, బుధ, గురువారాల్లో 30 నుంచి 40 దాకా కేసులు చూస్తారు. మన సుప్రీంకోర్టు విస్తృతి అంత సువిశాలమైనది! మేం పరిష్కరించే చాలా ముఖ్యమైన కేసుల్లో కొన్ని వార్తాపత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో కన్పించకపోవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా పెన్షన్, భరణం వంటి చిన్నాచితకా కేసులనూ విచారించాల్సిందేనా అంటే, అవునన్నదే నా సమాధానం. ఎందుకంటే ప్రజలకు నిజమైన భరోసా కల్పించగలిగినప్పుడే న్యాయ వ్యవస్థ పరిఢవిల్లుతుంది’’ అన్నారు. మేము మానసికంగా పక్కా యూత్! న్యాయమూర్తులు నల్లకోటుతో పాత, రాచరిక కాలపు వస్త్రధారణలో కన్పించి బోరు కొట్టిస్తుంటారని సీజేఐ అన్నారు. ‘‘మా లుక్స్ జనాలకు బాగా విసుగు పుట్టిస్తాయన్నది నిజమే కావచ్చు. కానీ నిజానికి మానసికంగా మాత్రం మేమంతా నవ యవ్వనంతో ఉరకలేస్తుంటాం’’ అంటూ చమత్కరించారు! ..అందుకే ప్రత్యక్ష ప్రసారాలు రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాల్లో ఒక్కోసారి పారదర్శకత లేమి పెద్ద ప్రమాదంగా మారుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. దానికి అడ్డుకట్ట వేసేందుకే సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారానికి తెర తీసినట్టు చెప్పారు. తద్వారా న్యాయపాలికలో ఏం జరుగుతోందనే పౌరులు తెలుసుకునే అవకాశం దక్కడమే గాక న్యాయవ్యవస్థ మరింత జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు వీలు కలుగుతుందన్నారు. ‘‘కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారాలు మేం చేపట్టిన ఓ నూతన ప్రయోగం. న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంలో టెక్నాలజీ ఎంత పాత్ర పోషించగలదో దీని ద్వారా అర్థమైంది. న్యాయం కోసం సామాన్యుడు తొలుత ఆశ్రయించే జిల్లా కోర్టుల విచారణలనూ ప్రత్యక్ష ప్రసారం చేయాలి’’ అన్నారు. ‘సోషల్’ సవాలుకు తగ్గట్టు అప్డేట్ కావాలి ‘‘కోర్టు గదిలో న్యాయమూర్తులు మాట్లాడే ప్రతి చిన్న మాటనూ రియల్ టైంలో రిపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా పెను సవాలుగా విసురుతోంది. న్యాయమూర్తుల పనితీరు నిత్యం మదింపుకు గురవుతోంది’’ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘మనమిప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. కనుక న్యాయమూర్తులుగా మనల్ని మనం నిత్యం కొత్తగా ఆవిష్కరించుకోవాలి. ఈ కొత్త తరపు సవాళ్లను ఎదుర్కోవడంలో మన పాత్రపై పునరాలోచించుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాలి’’ అని పిలుపునిచ్చారు. -
వ్యాపారం.. లాభాపేక్ష మాత్రమే కాకూడదు
హఫీజ్‌పేట్: వ్యాపారంలో లాభాపేక్ష మాత్రమే ప్రాధాన్యం కాకూడదని.. సమాజంలోని అసమానతలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో ‘లీడర్షిప్ సమ్మిట్–2022’ను జ్యోతి వెలిగించి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యాపార విద్య చదివే విద్యార్థులకు సైతం రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రాయోజిత వ్యాజ్యాలను నిలిపివేయాలని నిర్ణయించుకుంటే న్యాయవ్యవస్థలో సగం సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ఈ దేశంలో న్యాయపరమైన మౌలిక సదుపాయాల స్థితి ఇంకా కొనసాగుతోందన్నారు. పెండింగ్ కేసులు న్యాయవ్యవస్థకు ఎప్పుడూ ఒక సవాల్‌గానే ఉంటాయన్నారు. వాటిని తగ్గించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడం ఎప్పుడూ తాడుపై నడిచినట్లేనని ఆయన పేర్కొన్నారు. 16 నెలల్లో ఎన్నో మార్పులకు శ్రీకారం.. చీఫ్ జస్టి‹స్‌గా 16 నెలలు కొనసాగిన సమయంలో సుప్రీంకోర్టు కోర్టుకు 11 మంది న్యాయమూర్తులను, పలు హైకోర్టులకు 233 మందిని న్యాయమూర్తులను నియమించడం జరిగిందన్నారు. దేశంలో న్యాయవ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి తగిన ప్రణాళికతో ముందుకు సాగామని చెప్పారు. న్యాయ వ్యవస్థలో టెక్నాలజీ వినియోగం కూడా ప్రారంభించామని వివరించారు. ఇదిలా ఉంటే.. ఐఎస్బీ 20 ఏళ్ల కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా పురోభివృద్ధి సాధించిందని జస్టిస్ రమణ పేర్కొన్నారు. ఐఎస్బీ ఏర్పాటు సమయంలో 250 ఎకరాల స్థలాన్ని కేటాయించడంపై కోర్టులో కేసు వేయగా.. అదనపు అడ్వొకేట్ జనరల్‌గా ఉంటూ కేసులో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఇచ్చిన తీర్పు ఎప్పటికీ మరువలేమని చెప్పారు. ఆ తర్వాత 20 ఏళ్లకు ఇప్పుడు లీడర్షిప్ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఐఎస్బీ భూ వ్యాజ్యానికి సంబంధించి అప్పటి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తీర్పు కాపీని డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్లకు జస్టిస్ ఎన్వీ రమణ అందజేశారు. అంతకుముందు లీడర్షిప్ సమ్మిట్ ప్రాధాన్యతను మదన్ పిల్లుట్ల వివరించారు. అనంతరం మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్‌కుమార్, డాక్టర్ జయంతి కుమరేశ్, లైట్‌స్పీడ్ పార్ట్నర్ అభిషేక్నాగ్, ది బెటర్ ఇండియా సహ వ్యవస్థాపకుడు అనురాధ కేడియా, మైగేట్ సీఈఓ విజయ్ అరిశెట్టి, తెలంగాణ రాష్ట్ర సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఈడీ కేదార్లేలేతోపాటు పలువురు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐఎస్బీ అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులు, రాష్ట్ర హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. -
విలువైన సంస్థలను సృష్టించాలి
న్యూఢిల్లీ: వేల్యుయేషన్లు, నిష్క్రమించే వ్యూహాలే లక్ష్యంగా పనిచేయకుండా .. శతాబ్దాల పాటు మనుగడ సాగించే సంస్థలను సృష్టించడంపై దృష్టి పెట్టాలని స్టార్టప్ సంస్థలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అంతర్జాతీయంగా అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పగలిగే ప్రపంచ స్థాయి ఉత్పత్తులను రూపొందించాలని పేర్కొన్నారు. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశీ మార్కెట్‌ను సంస్థలు ఎంతో విలువైన ఆస్తిగా పరిగణించాలని ప్రధాని అభివర్ణించారు. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిర్వ హించిన టెక్నాలజీ, లీడర్షిప్ ఫోరం 29వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల బాలల్లో సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించే విధంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలపైనా ఐటీ కంపెనీలు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కొత్త ఐడియాలకు దేశంలో కొదవ లేదని, కానీ అవి వాస్తవ రూపం దాల్చేలా సరైన మార్గంలో నడిపించే దిశా నిర్దేశకులు అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. ఆప్టికల్ ఫైబర్ లక్ష్యాలు సాధిస్తాం.. ఇంటర్నెట్ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే దిశగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఏర్పాటు లక్ష్యాలు సాధించడంపై తాను వ్యక్తిగతంగా దృష్టి పెడతానని ప్రధాని తెలిపారు. అదే సమయంలో విస్తృతమైన నెట్వర్క్ ఊతంతో సమాజానికి ప్రయోజనం చేకూర్చే పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఐటీ పరిశ్రమ కృషి చేయాలని చెప్పారు. కరోనా వైరస్ కష్టకాలంలోనూ దేశీ ఐటీ రంగం అవిశ్రాంతంగా కృషి చేసిందని ఆయన కితాబిచ్చారు. నిబంధనలపరమైన అడ్డంకుల కారణంగా గతంలో భారతీయ ఐటీ పరిశ్రమ .. అనేక అవకాశాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయిందని ప్రధాని చెప్పారు. దీనివల్ల డిజిటల్ అంతరాలు పెరిగిపోయాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌ను అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ ఉత్పత్తుల హబ్‌గా తీర్చిదిద్దేందుకు నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీని రూపొందించినట్లు ఆయన వివరించారు. కనిష్ట స్థాయి ప్రభుత్వ యంత్రాంగంతో గరిష్టంగా పాలనను అందించడంలో సాంకేతిక ఆవిష్కరణలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ప్రధాని చెప్పారు. దూసుకెళ్తున్న భారత్ .. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో భారత్ ముందుకు దూసుకెడుతోందని.. సరిహద్దుల్లోని పరిణామాలు, జియోస్పేషియల్ డేటా నిబంధనలను సరళతరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రిస్కులు తీసుకోగలగాలి: ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణ నూతన ఆవిష్కరణలకు అంతర్జాతీయ హబ్‌గా భారత్ ఎదగాలంటే విధానాలు, రిస్కు తీసుకునే సామర్థ్యాలు, కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడం వంటి అంశాలు కీలకంగా ఉంటాయని ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణ అభిప్రాయపడ్డారు. మూడు ఐడియాలొస్తే ఒక్కటి మాత్రమే విజయవంతమయ్యే అవకాశం ఉంటుందని, నవకల్పనల ఆవిష్కరణల్లో ఇలాంటి రిస్కులు తప్పవని నాస్కామ్ సదస్సులో ఆయన పేర్కొన్నారు. డేటా భద్రతకు సంబంధించి నిబంధనలు, విధానాలు ఇటు దేశ ఎకానమీకి ప్రయోజనకరంగా ఉండటంతో పాటు అటు సర్వీసులు, సాఫ్ట్వేర్ ఎగుమతుల వృద్ధికి కూడా అనువైనవిగా ఉండాలని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ అనేది ఈ దశాబ్దంలోనే అత్యంత పెద్ద రిస్కని ఆయన చెప్పారు. -
వారు కోరితే ప్రధానినవుతా
న్యూఢిల్లీ: ఒకవేళ మిత్రపక్షాలు కోరుకుంటే తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ తొలి ప్రాధాన్యమని వెల్లడించారు. ఎన్నికలు పూర్తయ్యాక అన్ని పక్షాలతో కలిసి చర్చించి ప్రధాని అభ్యర్థిపై తుదినిర్ణయం తీసుకుంటామన్నారు. శుక్రవారం నాడిక్కడ జరిగిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్–2018(హెచ్‌టీఎల్‌ఎస్)లో ప్రసంగించిన రాహుల్ పలువురు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. ‘తొలుత కలిసికట్టుగా పోటీచేసి బీజేపీని ఓడించాలనీ, అనంతరం అందరూ కూర్చుని చర్చించి ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలని మేం(ప్రతిపక్షాలు) నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ మా మిత్రపక్షాలు కోరుకుంటే నేను ప్రధానిగా బాధ్యతలు తప్పకుండా చేపడతా. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీచేసేందుకు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) నిరాకరించడంతో మాకు వచ్చిన నష్టమేమీ లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి విపక్షాలన్నీ ఏకమవుతాయి. మా అమ్మ సోనియాగాంధీ నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఓపిక తక్కువగా ఉండే నాకు ప్రశాంతంగా ఎలా ఉండాలో అమ్మ నేర్పించింది. కొన్నిసార్లు ‘అమ్మ నీకు ఓపిక మరీ ఎక్కువైంది’ అని నేను చెబుతుంటా’’ అని రాహుల్ చమత్కరించారు. మీ జీవితంలో ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారా? అన్న ప్రశ్నకు.. ‘ఎందుకులేరూ.. మా అమ్మ, సోదరి సహా నా జీవితంలో చాలామంది ఉన్నారు‘ అని రాహుల్ నవ్వుతూ జవాబిచ్చారు. సామాన్యులపై పెట్రో భారాన్ని తగ్గించేందుకు వీలుగా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలోకి తీసుకురావాలని రాహుల్ ప్రధాని మోదీని కోరారు. -
సీఎం కేసీఆర్‌పై స్పందించిన చంద్రబాబు!
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసిమెలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఏపీ ప్రస్తుతం మిగులు విద్యుత్ గల రాష్ట్రంగా ఉందని చెప్పారు. ఏపీలో 24 గంటలపాటు విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రానికి విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశం లేదని చెప్పారు. ప్రజల ఇబ్బందులను తొలగి సంతోషంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. -
'ములాయం ప్రధాని, రాహుల్ ఉప ప్రధాని'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు అభ్యంతరం లేదని సమాజ్ వాది పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తెలిపారు. రాహుల్ గాంధీ తనకు పాత మిత్రుడని చెప్పారు. తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ను ప్రధాని, రాహుల్ గాంధీని ఉప ప్రధాని చేస్తామంటే కాంగ్రెస్ తో చేతులు కలుపుతామని అన్నారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమిట్ లో శుక్రవారం ఆయన ప్రసంగించారు. అవసరాలకు అనుగుణంగానే రాజకీయాలు చేస్తుంటామని తెలిపారు. ములాయం సింగ్ పుట్టినరోజు వేడుకలను వివాదం చేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు వివాదస్పద ప్రకటనలు చేస్తూ విభజన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అఖిలేశ్ చెప్పుకొచ్చారు. అయితే తాము చేసిన పనుల గురించి చెప్పుకోవడంలో వెనకబడ్డామని ఒప్పుకున్నారు. -
ఈ ఘనత నాది కాదు: మోదీ
న్యూఢిల్లీ: దేశాభివృద్ధిలో రాష్టాలూ కీలకభూమిక పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఢిల్లీ నుంచే అభివృద్ధి సాధ్యం కాదని రాష్ట్రాలు తమవంతు పాత్ర పోషించాలని అన్నారు. నిధులను రాష్ట్రాలు ఎక్కడ ఖర్చు చేయాలో ఇప్పటివరకు ఢిల్లీలోనే నిర్ణయించేవారని, తాము ఈ పరిస్థితిని మార్చామని చెప్పారు. శుక్రవారం హిందూస్థాన్ టైమ్స లీడర్ షిమ్ సమిట్ లో ఆయన ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొన్నప్పుడు మనదేశం అభివృద్ధి ఆగలేదని తెలిపారు. సుస్థిర ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యమన్నారు. ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని అన్నారు. దేశంలో ఇప్పటికి 18 వేల గ్రామాలకు కరెంట్ లేదని తెలిపారు. గత ప్రభుత్వాలు పనిచేయలేదని తాను చెప్పడం లేదని, 1000 రోజుల్లో గ్రామాలన్నింటికీ కరెంట్ అందిస్తామని హామీయిచ్చారు. పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు సజావుగా నడుస్తున్నాయని.. ఈ ఘనత తానొక్కడితే కాదని అన్ని పార్టీలకు చెందుతుందని నరేంద్ర మోదీ అన్నారు. -
ప్రత్యర్థులను చాలా సీరియస్‌గా తీసుకుంటా: ప్రధాని
ప్రధాని మన్మోహన్ సింగ్ నోరు విప్పారు. ప్రతిపక్షాల శక్తిని తక్కువగా అంచనా వేయకూడదని, పూర్తిగా సంతృప్తిచెందినట్లు భావిస్తే ఏమాత్రం కుదరదని పార్టీ వర్గాలకు చెప్పారు. వ్యవస్థీకృత రాజకీయ పార్టీగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్షాల శక్తిని తక్కువగా అంచనా వేయకూడదని, అలా చేసి మన ఓడను మనమే ముంచేసుకోకూడదని ఆయన అన్నారు. హిందూస్థాన్ టైమ్స్ నిర్వహించిన నాయకత్వ సదస్సులో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ గురించిన ప్రశ్నకు సమాధానంగా ఆయనీ విషయం చెప్పారు. ప్రతిపక్షాలను తాను చాలా సీరియస్‌గా తీసుకుంటానని ప్రధాని వివరించారు. నరేంద్రమోడీ విషయంలో కాంగ్రెస్ నాయకులు తలోమాట చెబుతున్నారు. మోడీ కాంగ్రెస్‌కు సవాలుగానే నిలుస్తారని, అయితే చాలా విషయాల్లో ఆయన అస్పష్టంగా ఉంటారని ఆర్థికమంత్రి చిదంబరం గతంలో వ్యాఖ్యానించారు. కానీ ఆ తర్వాతి రోజే హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ మోడీ అసలు కాంగ్రెస్ పార్టీకి సవాలే కాదన్నారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని చాలావరకు సర్వేలు అంచనా వేశాయి. ఎన్నికల ఫలితాలు ఆదివారం రానున్నాయి. అయితే, ఈ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు సంబంధం లేదని ప్రధాని అంటున్నారు. తాము పూర్తి ఆత్మవిశ్వాసంతో 2014 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనున్నామని, ఈ ఎన్నికల ఫలితాలను చూసి ఏదో అనుకుంటే మాత్రం పొరపాటేనని చెప్పారు.