సీఎం కేసీఆర్‌పై స్పందించిన చంద్రబాబు!
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసిమెలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
ఏపీ ప్రస్తుతం మిగులు విద్యుత్ గల రాష్ట్రంగా ఉందని చెప్పారు. ఏపీలో 24 గంటలపాటు విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రానికి విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశం లేదని చెప్పారు. ప్రజల ఇబ్బందులను తొలగి సంతోషంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు.