phone taping
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. హైకోర్టుకు మాజీ డీసీపీ
సాక్షి,హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్‌లో కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావు హైకోర్టులో శుక్రవారం(అక్టోబర్18) బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావు అరెస్టయి రిమాండ్‌లో ఉన్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావును పంజాగుట్ట పోలీసులు ఏ4గా చేర్చారు. రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. బెయిల్‌పై తదుపరి విచారణ ఈనెల 23కు హైకోర్టు వాయిదా వేసింది. ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మరో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నారు. పోలీసులు ఆయనను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదీ చదవండి: స్పెల్లింగ్ చెబితే.. రేవంత్‌కు రూ.50 లక్షల బ్యాగ్ గిఫ్ట్ ఇస్తా: కేటీఆర్ -
Kc Venugopal: ప్రభుత్వం నా ఫోన్‌ను హ్యాక్ చేసింది
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధమైన, గోప్యతకు భంగకరమైన చర్యలను గట్టిగా వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు యాపిల్ సంస్థ నుంచి వచ్చిన హెచ్చరిక మెసేజ్‌ను శనివారం షేర్ చేశారు. ‘మీ యాపిల్ ఐడీతో ఉన్న ఐఫోన్‌ను రిమోట్‌గా హ్యాక్ చేసేందుకు కిరాయి స్పైవేర్‌తో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరెవరు? ఏం చేస్తున్నారు? అనేవి తెలుసుకునే లక్ష్యంతోనే ఈ దాడి జరుగుతున్నట్లుగా భావిస్తున్నాం’అని అందులో ఉంది. ఈ హెచ్చరిక నేపథ్యంలో వేణుగోపాల్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘మీకెంతో ఇష్టమైన స్పైవేర్‌ను నా ఫోన్‌కు కూడా పంపించినందుకు మోదీ జీ మీకు కృతజ్ఞతలు. మీరు పంపించిన ప్రత్యేక బహుమతి గురించి యాపిల్ సంస్థ నాకు సమాచారమిచ్చింది. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడేందుకు, వారి గోప్యతకు భంగం కలిగించేందుకు మీరు నేరపూరితంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది’అని పేర్కొన్నారు. -
ప్రకంపనలు రేపుతున్న ప్రజాప్రతినిధుల ఫోన్ ట్యాపింగ్..
సాక్షిప్రతినిధి, వరంగల్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రజాప్రతినిధుల ఫోన్ ట్యాపింగ్ రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ వ్యవహారం ఓరుగల్లులోనూ కలకలం రేపుతోంది. హైదరాబాద్ కేంద్రంగా మొదలైన విచారణ ఇప్పుడు వరంగల్ చుట్టూ తిరుగుతోంది. కీలక పాత్రధారి అయిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌కుమార్ అలియాస్ ప్రణీత్‌రావు నిచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను ‘సిట్’ గుర్తించింది. ఇందులో ఏ–4గా జేఎస్ భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావును గుర్తించిన విచారణ బృందం ఆదివారం రిమాండ్‌కు తరలించింది. ఇదే కేసులో ఇంటెలిజెన్స్ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు ఏ–1గా చేర్చడం కలకలం రేపుతోంది. ప్రభాకర్‌రావు స్వగ్రామం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామం కావడంతో ఈ ప్రాంతంలో చర్చ జరుగుతోంది. ప్రణీత్‌రావు సాక్ష్యమే ఆధారం.. మాజీ ఐజీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన ఎస్ఐబీ(పొలిటికల్) వింగ్‌లో కీలకంగా వ్యవహరించిన ప్రణీత్‌రావు ఇచ్చిన వివరాల ఆధారంగానే కేసు విచారణ జరుగుతోంది. ప్రణీత్‌ను అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందం 15రోజుల క్రితం పాలకుర్తి, పర్వతగిరి, హన్మకొండ ప్రాంతాల్లో గోప్యంగా తనిఖీలు నిర్వహించింది. ఓ మాజీ మంత్రి కనుసన్నల్లో జనగామ జిల్లాలో వార్ రూమ్ ఏర్పాటు చేసి ఉమ్మడి వరంగల్‌కు చెందిన అధికార, విపక్ష పార్టీల ప్రజాప్రతినిధుల సెల్‌ఫోన్ సంభాషణలను ట్యాపింగ్ చేశారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే సదరు కీలక ప్రజాప్రతినిధితో పాటు ముగ్గురు ఇన్స్పెక్టర్లను ‘సిట్’ విచారించింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో లభ్యమైన కీలక ఆధారాలను పరిశీలించి ఏ–1గా ఇంటెలిజెన్స్ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు,ఏ–2గా సస్పెండైన డీఎస్పీ ప్రణీత్‌రావు, ఏ–3గా రాచకొండ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్, ఏ–4, ఏ–5లుగా అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ఏ–6గా ఓ ప్రైవేట్ వ్యక్తిని చేర్చారు. ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ప్రకటించిన పోలీసులు రాధాకిషన్, ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావును విచారించేందుకు న్యాయపరమైన అనుమతులు తీసుకో వడం పోలీసుశాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. మరికొందరు పోలీసులపైనా అనుమానం.. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ కేసులో భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావును అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు.. ఉమ్మడి వరంగల్‌లో మరికొందరి పాత్రపైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబీలో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వర్తించారు. ఈ ఇద్దరిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లో పని చేసి.. ఎన్నికల కోడ్‌లో భాగంగా బదిలీపై ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న నలుగురు అధికారులను ఈ సందర్భంగా రెండు రోజుల క్రితం విచారించినట్లు తెలిసింది. అంతకు ముందు కూడా ఇద్దరు ఇన్స్పెక్టర్లపై వచ్చిన ఫిర్యాదులపైనా ఆరా తీసినట్లు సమాచారం. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు, శ్రవణ్‌రావు ఇళ్లల్లో పోలీసులు నిన్న, మొన్న తనిఖీలు నిర్వహించారు. వారు ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో ‘లుక్ అవుట్’ సర్క్యూలర్ జారీ చేశారు. అయితే ప్రణీత్‌రావు వాంగ్మూలంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉపఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలను లక్ష్యంగా చేసుకొని ట్యాపింగ్‌లకు పాల్పడినట్లు పేర్కొనడంతో ఈ కేసు తుదిదశకు తెచ్చే ఉద్దేశంతో ‘సిట్’ హైదరాబాద్‌తో పాటు వరంగల్లోనూ పలువురిని విచారిస్తుండడం కలకలం రేపుతోంది. ఇవి చదవండి: ట్యాపింగ్ కేసులో ముగ్గురికి రిమాండ్ -
ఫోన్ ట్యాపింగ్ కలకలం!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఫోన్ ట్యాపింగ్ కలకలం సృష్టించిన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు వ్యవహారం ఆరంభం ఉమ్మడి జిల్లాలోనే జరగడం.. ఆయన అరెస్టు కావడం ఇక్కడే కావడం విశేషం.ట్యాపింగ్‌లో కేసులో సస్పెండైన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం రేవంత్ లక్ష్యంగా పలువురు కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఉగ్ర సంస్థలు, దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి ఫోన్లను ట్యాప్ చేసేందుకు స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) అధికారులకు అనుమతి ఉంటుంది. ఆ సాకుతో డీఎస్పీ ప్రణీత్‌రావు తన ఉన్నతాధికారులు అందించిన జాబితాలోని రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేశారన్న విషయం కలకలం రేపుతోంది. దాదాపు 2 లక్షలకుపైగా కాల్స్‌ను రికార్డ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల ప్రణీత్‌రావును అరెస్టు చేసిన సమయంలో స్వాధీనం చేసుకున్న ఫోన్లో డిలిట్ చేసిన వాట్సాప్ చాట్‌ను రీట్రైవ్ చేయగలిగారు. అందులో ఉమ్మడి జిల్లాకు చెందిన, ముఖ్యంగా ప్రస్తుతం సీఎంకు సన్నిహితుడిగా పేరొందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ సత్తు మల్లేశ్ నంబరు ఉండటం కలకలం రేపుతోంది. ఎవరీ సత్తు మల్లేశ్? జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. అంతకు ముందు టీడీపీలో రేవంత్‌తో కలిసి పనిచేశారు. రేవంత్‌తోపాటు కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి రేవంత్‌కు సన్నిహితుడిగా, ఆంతరంగికుడిగా కొనసాగుతున్నారు. ఎన్నికల సమయంలో సత్తు మల్లేశ్ ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగినట్లు రీట్రైవ్ చేసిన వాట్సాప్ చాట్ ద్వారా వెల్లడైంది. ఇతను ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలతో పలుమార్లు సంభాషణలు జరిపారు. అంతేకాకుండా సత్తు మల్లేశ్ ఏం మాట్లాడుతున్నారు? ఎవరిని కలుస్తున్నారు? ఏమేం వ్యూహాలు రూపొందిస్తున్నారు? ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? అన్న విషయాలను నిరంతరం గమనించారు. ఈ క్రమంలో సత్తు మల్లేశ్ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులతో సంభాషణలు జరిపారు. ఈజాబితాలో ప్రస్తుత చొప్పదండి, మానకొండూర్, వేములవాడ, పెద్దపల్లి, ధర్మపురి ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, ఆదిశ్రీనివాస్, చింతకుంట విజ యరమణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితర నాయకులు ఉన్నారని సమాచారం. ఎన్నికల సందర్భంగా వీరితో మాట్లాడిన ప్రతీ కాల్‌ను ప్రణీత్‌రావు అండ్ టీమ్ ట్యాప్‌చేసి ఉంటారని పేరు తెలిపేందుకు ఇష్టపడని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇష్టానుసారంగా సాగిన ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలంతా మండిపడుతున్నారు. సిరిసిల్లలో నాలుగు రోజులే.. ఇటీవల డీఎస్పీ ప్రణీత్‌రావును సిరిసిల్లకు బదిలీ చేశారు. ఈ క్రమంలో తన కంటే ముందు పనిచేసిన ఓ డీఎస్పీ ఉన్న ఇంట్లోనే ప్రణీత్ అద్దెకు దిగినట్లు తెలిసింది. డీసీఆర్బీ విభాగంలో రిపోర్ట్ చేసిన ఆయన అక్కడ కేవలం నాలుగు రోజులే పనిచేశారు. అనంతరం ఒకరోజు బందోబస్తు విధుల్లోనూ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. 2007 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ప్రణీత్‌రావుకు డీఎస్పీగా పదోన్నతి రావడం అత్యంత గోప్యంగా జరిగింది. ఆయన బ్యాచ్ చెందిన సహచరులు దాదాపు 250 మందికిపైగా ఉండగా.. కేవలం ఇతనికి మాత్రమే డీఎస్పీ పదోన్నతి రావడం వెలుగుచూడగానే అతని బ్యాచ్మేట్లు అవాక్కయ్యారు. ప్రణీత్‌రావు ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో ఎస్పీగా పనిచేసిన అధికారే అతన్ని ఎస్ఐబీలోకి తీసుకుని ప్రోత్సహించినట్లుగా ఉన్నతాధికారులు గుర్తించారు. ఈక్రమంలో ఈనెల 12న సిరిసిల్లలోని ప్రణీత్ రావు నివాసం నుంచి ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. 2021లో ఇక్కడే వెల్లడించిన రేవంత్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను 2021, అక్టోబరు 24వ తేదీన అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కరీంనగర్ వేదికగానే సంధించారు. ఆ వేదిక మీద మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణలూ ఉన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పాల్గొనడానికి వచ్చిన రేవంత్ స్థానిక మైత్రీ హోటల్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో తొలిసారిగా ఈ ఫోన్‌ట్యాపింగ్‌పై బాంబు పేల్చారు. పోలీసు డిపార్ట్మెంటు రెండు వర్గాలుగా చీలిపోయిందని, అప్పటి డీజీపీ మహేందర్‌రెడ్డి ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. అదే వేదిక మీద నుంచి విశ్రాంత డీఎస్పీ వేణుగోపాల్‌రావు, ఇన్స్పెక్టర్ దుగ్యాల ప్రణీత్ రావు (ప్రస్తుతం సస్పెండైన డీఎస్పీ) ట్యాపింగ్ వ్యవహారాన్ని 30 మందితో పర్యవేక్షిస్తున్నారని కూడా ధ్వజమెత్తారు. కరీంనగర్ వేదికగా రేవంత్‌రెడ్డి అన్న మాటలు.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు సరిపోలడం గమనార్హం. ఇవి చదవండి: కలకలం.. ఉత్కంఠ! -
ఎవరో తన ఫోన్ ప్రధాని ట్యాప్ చేస్తున్నారని అన్నారట!
ఎవరో తన ఫోన్ ప్రధాని ట్యాప్ చేస్తున్నారని అన్నారట! -
కిషన్‌రెడ్డి ఆవేశంగా మాట్లాడటానికి కారణం అదేనా?
ఎప్పుడు ప్రశాంతంగా ఉండే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కోపమొచ్చింది. కోపంలో కూడా సాఫ్ట్‌గా మాట్లాడే కిషన్‌రెడ్డి ఆవేశంగా మాట్లాడేంత పొరపాటు బీజేపీ కార్యాలయంలో ఏం జరిగింది ? ఫోన్ ట్యాపింగ్ గురించి ఘాటుగా ఎందుకు స్పందించారు ? ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా చర్చసాగుతోంది. ఇంటెలిజెన్స్ అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదని.., ఇంకా బీజేపీ కార్యాలయంలోకి కూడా వస్తున్నారా? అంటూ నిలదీశారు. అసలు పార్టీ కార్యాలయంలోకి ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించేదుకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటెలిజెన్స్ అధికారులను చూసి తీవ్రంగా ఫైరయ్యారు. బీజేపీ కార్యాలయంలోకి మరోసారి వస్తే బాగోదని వారిని హెచ్చరించారు. ప్రగతి భవన్, తెలంగాణ భవన్ లో ఐబీ వాళ్ళను పెడితే ఒప్పుకుంటారా అంటూ నిలదీశారు. దీనికి ఒప్పుకుంటే.. రాష్ట్ర ఇంటలిజెన్స్ ను బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేయిస్తానంటూ కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర నిఘా విభాగం అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సమావేశ మందిరంలోకి వెళ్లి తీర్మానం కాపీలను ఫోటోలు తీసిన ఇంటలిజెన్స్ అధికారిని పట్టుకుని లోకల్ పోలీసులకు అప్పగించారు. అప్పటి నుంచి ఇంటలిజెన్స్ శాఖ అధికారుల తీరుపై కాషాయ పార్టీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. సహజంగానే సమాచారం బయట పెట్టాలని ఇష్టపడని బీజేపీ... ఇంటలిజెన్స్ అధికారుల తీరుపై అభ్యంతరాలున్నాయి. అది కిషన్‌రెడ్డి రూపంలో బయటకు వచ్చింది. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఫోన్ల ట్యాపింగ్ అంశం మాట్లాడటం కొత్త చర్చకు దారి తీసింది. ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించడం వివాదాస్పదంగా మారనుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం సైతం ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాప్ చేస్తోందని, ఇందుకు పెగాసెస్ అనే సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారని కేంద్ర ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు దుమ్మెత్తిపోశాయి. ఈ అంశం మొత్తం పార్లమెంట్‌ను సైతం కుదిపేసింది. ఇప్పుడు ఇదే తరహా కామెంట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేశారు. తమ పార్టీకి చెందిన నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలను తేలికగా తీసుకునే ఆస్కారం లేకుండాపోయింది. సెంట్రల్ మినిస్టర్ గా ఉన్న కిషన్ రెడ్డి కచ్చితమైన సమాచారంతోనే ఇలాంటి కామెంట్స్ చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు. ఒక్క బిజేపీ నేతలవే కాదు.. టీఆర్ఎస్ నేతలు, ఐఏఎస్ అధికారుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తుందా? చేస్తే ఎవరెవరివి చేస్తోంది? అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
ఎన్ఎస్ఈ అక్రమాలు: మాజీ సీఎండీ రవి నరైన్‌కు ఈడీ షాక్
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఇ) మాజీ ఛైర్మన్ రవి నరైన్‌ను మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. కో-లొకేషన్ స్కాం కేసులో ఉద్యోగుల అక్రమ ఫోన్ ట్యాపింగ్ లాంటి రెండు క్రిమినల్ కేసుల్లో భాగంగానరైన్ పాత్రను ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. విచారణలో సహకరించపోవడంతో అధికారులు ఆయను అరస్టు చేసినట్టు తెలుస్తోంది. కస్టడీ నిమిత్తం నరేన్‌ను బుధవారం ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.ఎన్ఎస్ఈలో జరిగిన అవకతవకలపై ఐదేళ్లుగా విచారణచేస్తున్న సంస్థ నారేన్ను అరెస్టు చేయడం ఇదే తొలిసారి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండేతోపాటు, మరో ఎన్ఎస్ఈ మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణను అరెస్టు చేసిన నెలల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. కోలొకేషన్ స్కామ్‌లో మనీ లాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించిన దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తున్న రెండో కేసు ఇది. అయితే ఈ కేసులను సమాంతరంగా విచారిస్తున్న సీబీఐ, కో-లొకేషన్ కేసులో ఆమెను అరెస్ట్ చేసింది. రవి నరైన్ 1994 నుంచి 2013 వరకు ఎన్ఎస్ఈ సీఎండీ వ్యహరించారు. నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరిలో 2013, ఏప్రిల్ 1 నుంచి 2017, జూన్ 1 వరకు వైస్ చైర్మన్‌గా పనిచేశారు. -
ఫోన్ ట్యాపింగ్‌పై ప్రధాని మోదీ మౌనం వీడాలి
-
ఫోన్ ట్యాపింగ్‌పై ప్రధాని మోదీ మౌనం వీడాలి
హైదరాబాద్: దేశంలో భావస్వేచ్ఛ లేకుండా పోతోందని కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. పెగాసెస్ స్పైవేర్‌ను ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతారని గుర్తుచేశారు. అలాంటిది రాహుల్‌గాంధీ ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాప్ వ్యవహారంపై ప్రధాని మోదీ, అమిత్‌షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యంపైనా పెద్ద ఎత్తు దాడి జరుగుతోందని తెలిపారు. దేశంలో భావ స్వేచ్ఛ, ప్రైవసీ లేకుండాపోతోందని చెప్పారు. పెగాసెస్ ఫోన్ ట్యాప్ అంశంపై భట్టి స్పందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక సేవకుల ఫోన్లను బీజేపీ ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ఫోన్ కాల్స్ ట్యాప్ చేస్తుండడంతో ప్రజాస్వామ్యానికి రక్షణ కరువైందని మండిపడ్డారు. వ్యక్తుల భద్రతా సమస్యకు ఫోన్ కాల్స్ ట్యాప్ తెరలేపాయని పేర్కొన్నారు. పెగాసెస్ అనే స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ని ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తామని తయారీ సంస్థ ఎన్.ఎస్.ఓ చెబుతోందని గుర్తుచేశారు. దీనిని ప్రయివేటు వ్యక్తులకు అమ్మలేదు.. ఇవ్వలేదని కూడా చెబుతోందని తెలిపారు. పెగాసెస్ స్పైవేర్‌తో చాలామంది నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు 2019 సాధారణ లోక్‌సభ ఎన్నికలకు ముందు నుంచి ట్యాప్ అయినట్లు సిటిజన్స్ ల్యాబ్ మంత్ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ టొరొంటో డీటైల్డ్ రిపోర్ట్ ఇచ్చిందని వెల్లడించారు. ఆ నివేదికలో దేశానికి చెందిన చాలామంది నాయకులు ఫోన్ ట్యాప్ అయినట్లు తేల్చిందని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఫోన్ కూడా ట్యాప్ చేయడంతో పాటు, ఆయన కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఫోన్లను ట్యాప్ చేశారని వివరించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా ఆందోళనకరం.. ఇది భద్రతా సమస్యకు తెరలేపిందని చెప్పారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా జాతికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో, చట్టబద్దంగా, రాజ్యాంగబద్దంగా గుర్తించిన ప్రతిపక్ష పార్టీల మనుగడకు సంబంధించి, వాటి భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగితే.. అది ప్రజాస్వామ్య మూల సిద్దాంతాలకు ప్రమాదమేనని పేర్కొన్నారు. పెగాసెస్ ఫోన్ ట్యాపింగ్ పై ప్రధాని మోదీ మౌనం వీడి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని కోరారు. మీడియా సంస్థలపైన కూడా పెగాసెస్ నిఘా పనిచేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజకీయ నాయకుల ఫోన్లతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఫోన్ల ట్యాపింగ్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘానికి సంబంధించిన వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని కూడా చెప్పారు. ట్యాపింగ్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ ఫోన్ ట్యాపింగ్‌ను నిరసిస్తూ ఈ నెల 22వ తేదీన ఇందిరాపార్క్ నుంచి చలో రాజ్ భవన్ చేపడుతున్నట్లు ప్రకటించారు. -
ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): ఎమ్మెల్యే అరవింద్ బెల్లద్ ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపు తిరిగింది. బెల్లద్‌కు పరప్పన అగ్రహార జైలు లో ఉన్న యువరాజ్‌స్వామి నుంచి ఫోన్‌కాల్ రాలేదని విచారణలో తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన అర్చకుడు జితేంద్రనాద్ అనే వ్యక్తిని పోలీసులు ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు ఆయన ఫోన్ చేసింది నిజమేనని, అయితే పరిచయస్తుడేనని తేల్చారు. జైల్లో ఉండే యువరాజ్‌స్వామి అనే ఖైదీతో ఎలాంటి సంబంధం లేదని డీసీపీ అనుచేత్ నిర్వహించిన విచారణలో నిర్ధారించినట్లు తెలిసింది. చదవండి: వామ్మో.. మాయ మాటలు చెప్పి ఎంత పనిచేశాడు.. -
‘దృష్టిమళ్లించేందుకే చంద్రబాబు కట్టుకథలు’
సాక్షి, అమరావతి : ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణల నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరి 24 గంటలు గడిచినా ఏ ఆధారాలు సమర్పించలేకపోయారని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. హోంమంత్రిగా తాను, రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తిచేసి 24 గంటలు గడిచిపోయిందని, అయినా ఈ క్షణం వరకూ ఎటువంటి ఆధారాలూ సమర్పించలేకపోయారని పేర్కొన్నారు. అయితే కొన్ని మీడియా సంస్థలతో కలిసి వారు చేస్తున్న ఒక కుట్రపూరితమైన ప్రచారం వెనుక ఏ వ్యూహం దాగిఉందన్న అంశాన్ని రాష్ట్ర ప్రజలముందు ఉంచటం తన విధిగా భావిస్తున్నానని ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. (బాబు అక్రమాల కేసు గిన్నిస్ రికార్డు లెవల్లో..) ‘మీ అందరికీ తెలుసు. అమరావతిలో చంద్రబాబునాయుడు, ఆయన బినామీలు, ఆయన సన్నిహితులు ఎంతటి భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్నది. అయితే అందుకు సంబంధించి పూర్తిస్థాయి విచారణను మేం అధికారంలోకి రాగానే చేపడతామని చెప్పిన మేరకు రాష్ట్ర పోలీసులోని సంబంధిత విభాగాలు ఈ విషయంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. విచారణను ఒక కొలిక్కి తీసుకు వస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు ఈ నివేదికలో నిజాలను ప్రజలకు తెలియకుండా మరుగుపరచాలన్న దురుద్దేశంతో పెద్ద కుట్రకు తెరతీసినట్టుగా మాకు కనిపిస్తోంది. ఇంటా, బయటా తనకున్న పరిచయాలను, తనకు సహకరించే వారిని ఉపయోగించుకుంటూ, మీడియా సంస్థలతో కలిసి చేస్తున్న ఈకుట్ర వల్ల ఆయన పొందాలనుకుంటున్న ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో పొందలేరని స్పష్టంచేస్తున్నాను.(రాష్ట్రానికి చంద్రబాబు ద్రోహం) అమరావతి భూముల చుట్టూ అసలైన కుంభకోణాన్ని వెలికి తీయకుండా నిరోధించేందుకు, దర్యాప్తు ముందుకు సాగనీయకుండా అడ్డుకునేందుకు, పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల ద్వారా వారిని లక్ష్యంగా చేసుకున్నారు. వారి స్థైర్యాన్ని దెబ్బతీయాలనే ఈ కుట్రపూరిత వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో చంద్రబాబు మీడియా భాగస్వాములు, మరికొందరు ఇంటా, బయటా సహకరించే వ్యక్తులు ఉన్నారని అందరికీ అర్థమవుతోంది. కాబట్టి చట్టవిరుద్ధమైన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనేది అబద్ధం. ఈ విషయాలు అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. అమరావతి ల్యాండ్ స్కాంనుంచి తప్పించుకునేందుకు ఇటువంటి ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు, ఆయన బినామీలు, ఆయన సన్నిహితులు తప్పించుకోలేరని, అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టంచేస్తున్నాను’ అని సుచరిత పేర్కొన్నారు.(ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ 20 కి వాయిదా) -
నేను బీజేపీతోనే..
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో రాజకీయ పరిణామాలపై కొందరు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని బీజేపీ నేత, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే వ్యాఖ్యానించారు. తాను బీజేపీలోనే కొనసాగుతాననీ, పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తానని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, తిరుగుబాటు వర్గం నేత, మాజీ డిప్యూటీ సీఎం పైలట్ మధ్య విభేదాలతో తలెత్తిన సంక్షోభంలో గహ్లోత్‌కు వసుంధరా రాజే అంతర్గతంగా మద్దతిస్తున్నారంటూ రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ నేత, ఎంపీ హనుమాన్ బెణివాల్ శుక్రవారం ఆరోపించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలతో గహ్లోత్ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. బీజేపీ నేతలు, అధిష్టానంపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందన్నారు. రాజస్తాన్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ నేతల ఫోన్లను చట్ట విరుద్ధంగా ట్యాప్ చేయిస్తే సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని గహ్లోత్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితర బీజేపీ నేతల హస్తం ఉందంటూ కాంగ్రెస్ ఆడియో టేపులు విడుదల చేయడంపై బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర శనివారం స్పందించారు. ‘ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని, గహ్లోత్‌ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయా? ఒక వేళ జరిగితే, నిర్దేశిత నిబంధనల మేరకే చేశారా? తమ గుట్టు బయటపడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిందా?’అని ప్రశ్నించారు. బీజేపీ తప్పు చేసినట్లే: కాంగ్రెస్ ఆడియో టేపుల వ్యవహారంలో బీజేపీ సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అలాగైతే, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌పై సచిన్ పైలట్ తదితరుల తిరుగుబాటు వెనుక తమ ప్రమేయం ఉన్నట్లు బీజేపీ ఒప్పుకున్నట్లే అవుతుందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. బీజేపీ నేతల ప్రమేయమే లేకుంటే హరియాణాలోని ఓ రిసార్టులో ఉన్న కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను ప్రశ్నించడానికి వెళ్లిన రాజస్తాన్ పోలీసులను ఎందుకు అనుమతించలేదని రాజస్తాన్ పీసీసీ నూతన అధ్యక్షుడు గోవింద్ సింగ్ ప్రశ్నించారు. గహ్లోత్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పన్నిన కుట్రకు సంబంధించినవిగా చెబుతున్న రెండు ఆడియో క్లిప్పులపై చీఫ్ విప్ మహేశ్ జోషి ఫిర్యాదు మేరకు ఆ రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరో(ఏసీబీ) కేసు నమోదు చేసింది. -
ఐపీఎస్ ఇంటికి సీబీఐ.. నాకేం భయం: కుమారస్వామి
కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో భగ్గుమన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీబీఐ దూకుడు పెంచింది. సీనియర్ ఐపీఎస్, రౌడీలకు సింహస్వప్నమని పేరున్న అలోక్‌కుమార్ ఇంటి తలుపు తట్టింది. త్వరలో మరికొందరి ఇళ్లలోనూ సోదాలు జరగవచ్చని సమాచారం. కర్ణాటక, బనశంకరి: సంచలనాత్మక ఫోన్ ట్యాపింగ్ కేసులో సీబీఐ అధికారులు సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్‌కుమార్ ఇంటిపై గురువారం తెల్లవారుజామున ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆయన నివాసంలో రెండుగంటల పాటు శోధించి పలు ముఖ్యమైన పత్రాలను, మొబైల్‌ఫోన్, పెన్‌డ్రైవ్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. గత మూడు నాలుగు నెలల కిందట అలోక్‌కుమార్ నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో ఫోన్‌ట్యాపింగ్ జరిగినట్లు ఆగస్టులో ఆరోపణలు గుప్పుమన్నాయి. అప్పటి ప్రభుత్వ ఆదేశాలతో ట్యాపింగ్ నిర్వహించారని ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఇది తీవ్ర సంచలనం సృష్టించడంతో ముఖ్యమంత్రి బీఎస్.యడియూరప్ప ఈ కేసును సీబీఐ అప్పగించారు. ఈ నేపథ్యంలో బెంగళూరు మద్రాస్‌రోడ్డులో కేఎస్ఆర్పీ అదనపు పోలీస్డైరెక్టరేట్ (ఏడీజీపీ) గా ఉన్న అలోక్‌కుమార్ నివాసంపై ఒక్కసారిగా సీబీఐ అధికారులు చేరుకున్నారు. నివాసంలో మూలమూలనా శోధించారు. ఆయన ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ తదితరాలను జల్లెడ పట్టారు. ట్యాపింగ్‌పై ప్రశ్నలు సోదాల సమయంలోనే ఒక సీబీఐ సీనియర్ అధికారి నేతృత్వంలోని అలోక్‌కుమార్‌ను విచారణ చేపట్టి సమాచారం రాబట్టారు. ఫోన్ ట్యాపింగ్‌కు ఎందుకు పాల్పడ్డారు, కారణాలేమిటి? అని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో ఆయన పాత్ర కీలకం కావడంతో త్వరలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు తెలిపాయి. అలా రచ్చ అయ్యింది ప్రస్తుతం నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న భాస్కర్‌రావ్, కమిషనర్ పోస్టు కావాలని పలువురు నాయకులతో ఫోన్లో మాట్లాడటాన్ని ట్యాప్ చేసి లీక్ చేశారు. ఆ టేపులో టీవీ చానెళ్లలో ప్రసారం కావడంతో ట్యాపింగ్ అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్ధలైంది. నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధం మొదలైంది. అప్పట్లో అలోక్‌కుమార్ నివామైన నగర పోలీస్ కమిషనర్ బంగ్లా నుంచి ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అదికారుల పేర్లు కూడా వినబడుతున్నాయి. అలోక్‌కుమార్ కేఎస్ఆర్పీ ఏడీజీపీగా బదిలీ అయిన అనంతరం పెన్‌డ్రైవ్‌లో సుమారు 30 జీబీ వాయిస్ రికార్డింగ్‌లను తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధిచి మొదట సీసీబీ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో స్వయంప్రేరితంగా ఐపీసీ సెక్షన్ 72 ఐటీ యాక్టు, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం కేసును సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో ఆధారాలన్నింటినీ సీబీఐకి అప్పగించారు. విచారణ జరగనీ: దేవెగౌడ జేడీఎస్ అధినేత హెచ్డీ.దేవేగౌడ మాట్లాడుతూ.. సీబీఐ తన పని తాను చేస్తుందని, దీనిగురించి నేను ఎందుకు మాట్లాడాలని, ఎవరెవరిని విచారణ చేస్తుందో చేయనీ అని అన్నారు. హెచ్డీ.కుమారస్వామిని విచారిస్తారా? అన్న ప్రశ్నకు అందులో ఎవరు ఉన్నారో తనకు తెలియదని, ఊహాగానాలకు జవాబు ఇచ్చేది లేదని చెప్పారు. నాకేం భయం: కుమారస్వామి ట్యాపింగ్ కేసులో సీబీఐ విచారణపై తనకేమీ భయం లేదని జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్డీ.కుమారస్వామి అన్నారు. గురువారం బెంగళూరులో పార్టీ ఆఫీసులో పార్టీ ఎంపీల సమావేశంలో పాల్గొనే ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కేసులో ఎవరినైనా విచారిస్తే నేనెందుకు పట్టించుకోవాలి?, ఎవరెవరి హయాంలో ఫోన్ ట్యాపింగ్‌లు జరిగాయో వాటన్నింటిని మీదా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ దేశ న్యాయవ్యవస్థలో ఎవరు ఎవరినైనా విచారించవచ్చు, సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్‌కుమార్ సమర్థుడైన అధికారి అని కుమార కితాబిచ్చారు. -
డీజీపీని కూడా మార్చాలి: వైఎస్సార్ సీపీ
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ ఎందుకు గగ్గోలు పెడుతుందో అర్థం కావడం లేదని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరుకుందని, సొంత ప్రయోజనాల కోసం ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను కూడా పక్కన పెట్టాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇదే విషయంపై మరోసారి ఈసీని కలవబోతున్నట్లు ఆయన తెలిపారు. చదవండి...(ఇంటెలిజెన్స్ డీజీపై వేటు) ఇంటెలిజెన్స్ శాఖ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారి సమాచారాన్ని సేకరిస్తోందని, మరోవైపు వైఎస్సార్ సీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు తప్పుడు పనులకు డీజీపీ, ఏబీ వెంకటేశ్వరరావు కొమ్ము కాస్తున్నారన్నారు. అదృష్టవశాత్తూ ఎన్నికల కమిషన్ తమ గోడు విందని, ఏబీ వెంకటేశ్వరరావుపై వేటును స్వాగతిస్తున్నామన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వెనుక ఇంటెలిజెన్స్ చీఫ్ పాత్ర ఉందని, చీకటి చక్రవర్తి తయారు చేసినట్లు ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ తయారైందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని, ఇందుకోసం 20మంది హ్యాకర్లను నియమించుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు విదేశాలకు వెళ్లి మరీ ప్రత్యేక టెక్నాలజీని తీసుకొచ్చారన్నారు. వ్యక్తుల ప్రయివేట్ జీవితాల్లోకి చొరబడుతున్నారని ఆయన మండిప్డడారు. ఈసీ తీసుకున్న చిన్న చర్యకు కూడా టీడీపీ గగ్గోలు పెడుతోందని, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు, ఎన్నికలకు ఏం సంబంధం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అన్ని ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిశామని, టీడీపీ వాదనలో ఎలాంటి హేతుబద్ధత లేదన్నారు. కోర్టులో టీడీపీ వాదనలు నిలబడవని, ఇంటెలిజెన్స్ ఐజీ తన పరిధి దాటి రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్నారు. ఇక తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని, దీనిపై హైకోర్టులో కేసు వేసినట్లు ఆయన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌పై హైకోర్టులో పిటిషన్ కాగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పార్టీకి చెందిన పలువురు నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, 13మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కౌంటర్ ఇంజెలిజెన్స్ ఎస్పీ భాస్కర్ భూషన్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ప్రతివాదులుగా చేర్చారు. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలు సమర్పించారు. మరోవైపు ఎన్నికల కమిషన్ వేటు వేసిన ముగ్గురు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఇక ఈసీ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..కేంద్ర ఎన్నికల సంఘానికి ఏడు పేజీల లేఖ రాశారు. -
ఫోన్లో మాట్లాడటానికి భయపడుతున్న నేతలు..
సాక్షి, కాజీపేట: ఈ సారి ఎన్నికలలో రాజకీయ పార్టీల నేతలు ఫోన్లో ఏదైనా రాజకీయపరమైన సంభాషణలు చేయాలంటే జంకుతున్నారు. ఎక్కడ కాల్ రికార్డు అవుతుందో.. ఎవరు ట్యాపింగ్ చేస్తున్నరో అనే భయంతో తమ వ్యూహన్ని మార్చుతూ నేరుగా మాట్లాడాల్సిన వ్యక్తులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. మరికొందరు కొత్త నంబర్లను వినియోగిస్తున్నారు. ఎన్నికల నియమ నిబంధనలు కఠినంగా ఉండడంతో ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీల నేతలు ఎక్కడ ఎలాంటి ముప్పు ఎదురవుతుందోనని రాజకీయపరమైన అంశాల చర్చకు ఫోన్లలో స్వస్తి పలుకుతున్నారు. తమ ఫోన్లో జరుగుతున్న సంభాషణలు, అంశాలు, వ్యుహలపై ప్రత్యర్థి పార్టీకి ఎక్కడ లీకవుతుందోనని ముందుగానే ఫోన్ వినియోగానికి దూరం ఉంటూ కలిసినప్పుడు చర్చించుకోవడం లేదా ప్రత్యేకంగా కలుస్తున్నారు. మరికొందరు ఫోన్ సంభాషణలలో రాజకీయపరంగా చర్చకు తావివ్వకుండా సమాధానాన్ని దాటవేస్తున్నారు. రాజకీయ పార్టీల నేతల్లో ముఖ్యులు ఫోన్ల వాడకంలో ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయో అనే భయం లేకపోలేదు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న నంబర్లకు భిన్నంగా కొత్త నంబర్ల నుంచి ఫోన్లు రావడంతో అవతలి వ్యక్తులు ఇదేందన్న కొత్త నంబర్ నుంచి ఫోన్ చేస్తున్నావు అంటే.. అది అంతే తమ్మి ఎన్నికలు అయ్యేంత వరకు ఇలానే ఉంటుందనే సమాధానాలతో వారిని తృప్తి పరుస్తున్నారు. రోజురోజుకు వేడెక్కుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాన పార్టీల రాజకీయాల నేతలు వామ్మో ఫోన్లో వద్దు ఫ్లీజ్ అంటూ కింది స్థాయి క్యాడర్‌కు, ముఖ్యమైన నాయకులకు చెప్పడం ఇక్కడ కొసమెరుపు. -
'ఫోన్లు మావి కాదు.. ట్యాప్ చేశారు'
హైదరాబాద్: తమపై కుట్ర పూరితంగానే ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఓటుకు కోట్లు కేసు నిందితుడు సెబాస్టియన్ అన్నారు. కండిషనల్ బెయిల్లో భాగంగా ఏసీబీ కార్యాలయానికి వచ్చిన సెబాస్టియన్ అక్కడి మీడియా ప్రతినిధులతో అరకొరగా మాట్లాడారు. అసలు ఆ ఫోన్లు తమవి కాదని, ట్రాప్ చేశారని, కుట్రలు చేశారంటూ రుసరుసలాడారు. ఇదే సందర్భంలో ఓటుకు నోటు కేసులో జనార్దన్ పేరు వినిస్తోందని, అసలు జనార్దన్ ఎవరని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అతడు టీడీపీ కార్యాలయం ఇన్చార్జీ అని, తమ నాయకుడు చంద్రబాబు దృష్టికి ఏవైనా అంశాలు తీసుకెళ్లాలంటే జనార్దన్ ద్వారానే తీసుకెళతామని చెప్పారు. -
'మా ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఆధారాలున్నాయి'
న్యూ ఢిల్లీ: టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలున్నాయని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని నెల రోజులు జైల్లో పెట్టడం అక్రమం అన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో సెక్షన్ -8 అమలు అవసరమని కేంద్రానికి ఇప్పటికే నివేదిక ఇచ్చామని ప్రత్తిపాటి తెలిపారు. పొగాకు బోర్డు ఇచ్చిన ఇండెంట్ మేరకే పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని మంత్రి కోరారు. బోర్డు ఇచ్చిన హామీల మేరకే రైతులు పొగాకు సాగు చేశారన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించినట్టు మంత్రి చెప్పారు. జూలై 4న గుంటూరులో పొగాకు రైతు సమస్యల పరిష్కారానికి తుది నిర్ణయం తీసుకుటామని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. -
ఇద్దరు చంద్రులు గురుశిష్యులే
వరంగల్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులిద్దరూ గురుశిష్యులేనని టీ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హన్మకొండలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏడాది పాలనపై ప్రతిపక్షాలు, ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే.. ఒకరు ఓటుకు నోటు.. మరొకరు ఫోన్ ట్యాపింగ్ అంటూ వివాదం సృష్టించారన్నారు. తెలంగాణ బిల్లులో సెక్షన్-8 చేర్చినప్పుడు వ్యతిరేకత వ్యక్తం చేయలేదనీ, ఇపుడు ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్లను ట్యాపింగ్ చేయలేదని చెప్పే దమ్ము సీఎం కేసీఆర్‌కు ఉందా? అన్నారు. ఇద్దరు సీఎంలు తమ పదవులకు రాజీనామా చేసి క్షమించమని ప్రజలను కోరాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం ఈ తతంగం చేస్తున్నారని విమర్శించారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారుమయం చేసుకుంటున్నారని, ప్రజలు తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. -
ఫోన్ ట్యాప్‌పై రోజూ మాటలెందుకు
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులపై ప్రతి రోజూ మాట్లాడాల్సిన పనిలేదని, చట్టం తనపని తాను చేసుకుపోతుందని ఏపీ వ్యవసాయశాఖా మంత్రి ప్రతిపాటి పుల్లారావు అన్నారు. చంద్రబాబు రాజీపడిపోయారన్న బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఖండిస్తున్నానని, ఈ విషయంలో వెనుకకు తగ్గేది లేదని చెప్పారు. రాష్ట్రం కోసం చంద్రబాబు బస్సులోనే ఉంటానని చెప్పారని అన్నారు. బస్సు ఎక్కుగానే నిద్ర పడుతుందని.. దానిపై కూడా విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. వేరు శెనగ విత్తనాలు పక్క రాష్ట్రంలో కొందామన్న ఎవరూ ముందుకు రాలేదని ఆయన చెప్పారు. గతేడాది పంట దిగుమతి లేకపోవడం వల్ల ఈసారి విత్తనాల డిమాండ్ పెరిగిందని చెప్పారు. రైతులు బయటకొన్నా సబ్సిడీ ఇస్తామని చెప్పారు. రుణమాఫీపై ఆరు లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయని ఇక నుంచి ఫిర్యాదులు తీసుకోబోమని స్పష్టం చేశారు. రుణమాఫీకి సుమారుగా మరో 2.50 లక్షల వరకు అర్హత వచ్చే అవకాశం ఉందని ప్రత్తిపాటి తెలిపారు.