సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల 12వరకు బీఆర్‌ఎస్ నేత హరీష్ రావును అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఫోన్ ట్యాంపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కీలక నేత హరీశ్‌రావుపై మంగళవారం(డిసెంబర్3) కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాప్ చేశారని బాచుపల్లికి చెందిన చక్రధర్‌గౌడ్ హరీశ్‌రావుపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పంజాగుట్ట పోలీసులు హరీశ్‌రావుపై 120బి,386,409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీష్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును కూడా పోలీసులు చేర్చడం గమనార్హం.
ఆ ఎఫ్‌ఐఆర్‌పై హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలని కోరారు. హరీష్ రావు పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తదుపరి తీర్పు వచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని పోలీసులు సూచించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును పొడిగించింది.
Comments
Please login to add a commentAdd a comment