
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలిచ్చేవరుకూ అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది.
తన ఫోన్ ట్యాప్ చేశారంటూ రియల్టర్ చక్రధర్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. తదుపరి విచారణను హైకోర్టు మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధా కిషన్ రావుకు కూడా ఊరట లభించింది.