ఫేస్ బుక్ లో సరికొత్త వీడియో క్రియేషన్ ఆప్షన్!
ఫేస్ బుక్ లో సరికొత్త వీడియో క్రియేషన్ ఆప్షన్!
Published Thu, Nov 13 2014 11:16 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM
న్యూయార్క్: జీవితంలోని మధుర అనుభూతుల్ని, సంఘటనల్ని వీడియోల ద్వారా పంచుకోవడానికి వినియోగదారులకు 'వీడియో క్రియేషన్' టూల్ ను ఫేస్ బుక్ అందుబాటులోకి తెచ్చింది. తాము పోస్ట్ చేసిన సందేశాల్ని, ఫోటోలను, కొత్త థీమ్స్ ను కలిపి వ్యక్తిగతంగా ఓ వీడియో రూపొందించుకోవడానికి 'సే థ్యాంక్స్' అనే కొత్త ఆప్షన్ ను ప్రారంభించింది. తమ వ్యక్తిగత, మిత్రుల టైమ్ లైన్స్ పై వీడియోలను షేర్ చేసుకోవడానికి వినియోగదారులకు ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.
వీడియో క్రియేట్ చేసుకోవడానికి ఫేస్ బుక్ లో www. facebook.com/thanks పేజికి వెళ్లి వీడియోను రూపొందించుకోవచ్చు. వ్యక్తులతో ఉన్న బంధాలు, సంబంధాలకు అనుగుణంగా ఫోటోలను ఎడిట్ చేసుకోవడానికి, వివిధ థీమ్స్ లలో వీడియోను రూపొందించుకోవడానికి కూడా ఫేస్ బుక్ అవకాశం కల్పించింది. వీడియోను రూపొందించిన తర్వాత పర్సనల్ మెసేజ్ ను కూడా పంపించుకోవడానికి అవకాశం ఉంది. కొత్త ఆప్షన్ ఇంగ్లీష్, ఫ్రాన్స్, జర్మన్, ఇండోనేషియా, ఇటలీ, పోర్చుగీస్, స్పానిష్, టర్కీ దేశాల్లో డెస్క్ టాప్, మొబైల్ ద్వారా ఫేస్ బుక్ అందుబాటులోకి తెచ్చింది.
Advertisement
Advertisement