Tool
-
మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 30 ఏళ్లుగా అందిస్తున్న సేవలకు గుడ్‌బై!
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్లుగా యూజర్లకు సేవలందిస్తున్న వర్డ్ ప్యాడ్‌కు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించింది. భవిష్యత్‌లో విడుదల కానున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో వర్డ్ ప్యాడ్ అనే ఫీచర్ ఇక కనపించదని స్పష్టం చేసింది. మైక్రోసాఫ్ట్ 1995లో విండోస్ 95 అనే ఆపరేటింగ్ సిస్టం (OS) ను విడుదల చేసింది. కొత్తగా విడుదలైన ఈ ఓఎస్‌లో వర్డ్ ప్యాడ్ అనే వర్డ్ ప్రాసెసింగ్ టూల్‌ను సైతం అందుబాటులోకి తెచ్చింది. వర్డ్ ప్యాడ్‌లో రెజ్యూమ్, లెటర్స్‌ను తయారు చేయడం, టేబుల్స్ క్రియేట్ చేయడంతో పాటు ఫోటోలను సైతం జత చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్‌లో లేని ఇటాలిక్,అండర్ లైన్, బుల్లెట్ పాయింట్స్, నెంబరింగ్, టెక్ట్స్ ఎలైన్‌మెంట్స్ వంటి అడ్వాన్స్ ఫీచర్లను సైతం ఉపయోగించుకునేలా వెసలు బాటు కల్పించింది. వర్డ్ ప్యాడ్ కనుమరుగు అయితే, ఈ తరుణంలో 30 ఏళ్లుగా వినియోగదారులకు సేవలందిస్తున్న వర్డ్ ప్యాడ్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వర్డ్ ప్యాడ్‌కు ప్రత్యామ్నాయంగా ఆఫీస్ 365 పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లో ఉన్న మైక్రోసాఫ్ట్ వర్డ్‌ను ఉపయోగించుకోవాలని కోరింది. రిచ్ టెక్స్ డాక్యుమెంట్స్ కోసం మైక్రోసాఫ్ట్ వర్డ్, డీవోసీ అండ్. ఆర్టీఎఫ్,ప్లెయిన్ టెక్ట్స్ డాక్యుమెంట్ కోసం విండోస్ నోట్‌ప్యాడ్‌లను వినియోగించుకోవచ్చని తెలిపింది. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ నోట్‌ప్యాడ్‌లో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆటోసేవ్, ఆటో రీస్టోర్ ట్యాబ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. భవిష్యత్‌లో ఎవరికైనా అవసరం అనిపిస్తే వర్డ్ ప్యాడ్ బదులు మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో పనికొస్తుందని మైక్రోసాఫ్ట్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. చాట్‌జీపీటీకి అనువుగా కోర్టానా మైక్రోసాఫ్ట్ చివరిగా విండోస్7 విడుదల సందర్భంగా కొన్ని మేజర్ అప్డేట్ చేసింది. 1990లలో మైక్రోసాఫ్డ్ వర్డ్, వర్డ్ స్టార్లలో యూజర్లు సులభంగా సెర్చ్ చేసేలా బటన్స్, డ్రాప్ డౌన్ లిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వాటిని గుర్తించేలా రిబ్బోన్ యూఐని విడుదల చేసింది. తాజాగా, ఆ యూఐ రిబ్బోన్ (Ribbon UI) స్థానంలో యూఐని తెచ్చింది. మైక్రోసాఫ్ట్ ఇటీవలే వర్చువల్ అసిస్టెంట్ కోర్టానా ( Cortana ) యాప్‌ను మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ బింగ్‌కు అనుకూలంగా చాట్‌జీపీటీని అందిచంనుంది. నివేదికల ప్రకారం మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం విండోస్ 11కు లేటెస్ట్ వెర్షన్ విండోస్12 ఓఎస్‌పై పనిచేస్తుంది. దీనిని వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు పలు నివేదికలు హైలెట్ చేశాయి. చదవండి👉 నోరు పారేసుకున్న యాంకర్..కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా -
సంచలనం:దేశీయ తొలి చాట్‌బాట్ ‘లెక్సీ’ వచ్చేసిందిగా..!
న్యూడిల్లీ: ఒకవైపు ఓపెన్ ఏఐ చాట్‌బాట్ చాట్ జీపీటీ సంచలనం కొనసాగుతుండగానే దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్‌ను ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థ వెలాసిటీ లాంచ్ చేసింది. ఈ చాట్‌బాట్‌కు కంపెనీ 'లెక్సీ' అని పేరు పెట్టింది. వినియోగదారులకు సులువైన, మెరుగైన సేవలు అందిస్తామని వెలాసిటీ సంస్థ కో ఫౌండర్ అభిరూప్ మెధేకర్ పేర్కొన్నారు. కంపెనీ ప్రకారం, వెలాసిటీ ఇన్సైట్లను ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్యాప్ వాట్సాప్ ఇంటర్ఫేస్లో ChatGPTని ఇంటిగ్రేట్ చేసింది. తద్వారా ఈ-కామర్స్ వ్యాపారులకు వారి వ్యాపారాలపై విశ్లేషణలు ,రోజువారీ వ్యాపార నివేదికలు (ఇన్సైట్స్ )పంపిస్తుందనీ, క్లిష్టమైన వ్యాపార విధుల కోసం సమయాన్ని ఖాళీ చేస్తుందని కంపెనీ తెలిపింది. లెక్సీ ప్రారంభించినప్పటి నుండి వెలాసిటీ ఇన్సైట్స్ తమ బ్రాండ్ ఆదాయాన్ని మార్కెటింగ్ ఖర్చులను పర్యవేక్షించడంలో సహాయపడిందని నేచర్ప్రో సీఈవో, పౌండర్ వ్యవస్థాపకుడు మోహిత్ మోహపాత్ర ఒక ప్రకటనలో తెలిపారు. -
పరిశ్రమల ఊతానికి టూల్ ‘కిటుకు’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 మహమ్మారి మూలంగా వివిధ రంగాలు తీవ్రంగా దెబ్బతినగా, కొన్ని మాత్రం నెలలు, ఏళ్లు గడిచినా పూర్వ స్థితికి చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరికొన్నింటికి ప్రభుత్వ పరంగా కొంత ఊతమిస్తే తిరిగి కార్యకలాపాలను పూర్తి స్థాయిలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రంగాల వారీగా పరిశ్రమల స్థితిగతులను అధ్యయనం చేయడంతో పాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందించాలనే అంశంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ దృష్టి సారించింది. వివిధ రంగాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ‘టూల్ కిట్ల’ను సిద్ధం చేసి 15 రోజుల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. పరిశ్రమలకు ముడి సరుకులు ఎంత మేర అందుబాటులో ఉన్నాయి, కార్మి కుల వలస వాటి పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతోంది, డీలర్లు, షాపుల మూసివేత వల్ల ఎంత మేర నష్టం జరుగుతోంది, వినియోగదారులు ఏ తరహా సమస్యలు ఎదుర్కొంటున్నారు వంటి అంశాలను ‘టూల్‌కిట్’లో పొందుపరుస్తారు. టూల్ కిట్ రూపొందించడంలో భాగంగా భారీపరిశ్రమలతో పాటు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగం ఎదుర్కొంటున్న స్థితిగతులపై పరిశ్రమల శాఖ వివిధ కోణాల్లో సమాచారాన్ని సేకరిస్తోంది. తద్వారా ఏయే రంగాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా ఏ తరహా సాయం అందించవచ్చనే అంశాన్ని కూడా ‘టూల్‌కిట్’లో పొందు పరుస్తున్నట్లు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘సాక్షి’కి వెల్లడించారు. రాత్రి షిఫ్టులకు కూడా అనుమతి లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో పారిశ్రామిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో పట్టాలెక్కినట్లు పరిశ్రమల శాఖ చెప్తోంది. చాలా పరిశ్రమలు ముడి సరుకుల కొరత, వాటి ధరలు పెరగడం, రవాణా, మార్కెటింగ్, కార్మికుల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కర్మాగారాల వద్దకు కార్మికులను చేరవేసేందుకు అవసరమైతే ఆర్టీసి బస్సులను తక్కువ అద్దెకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు చెప్తున్నాయి. గతంలో 33 శాతం సామర్థ్యంతో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, ప్రస్తుతం ఎంత మంది కార్మికులను అయినా విధుల్లోకి తీసుకునేందుకు అనుమతిస్తోంది. అవసరమైతే రాత్రి షిఫ్టుల్లోనూ ఉత్పత్తికి కూడా అనుమతులు ఇస్తోంది.పరిశ్రమలు మాత్రం కార్మి కుల కొరతను ఎదుర్కొనేందుకు గతంలో ఉన్న 8 గంటల పని విధానాన్ని 12గంటలకు పెంచాలని కోరుతున్నాయి. కార్మిక చట్టాలు, నిబంధనలకు లోబడి 12 గంటల షిఫ్టునకు అనుమతించడంలో సా ధ్యాసాధ్యాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. యూపీ, మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే 12 గంటల పని విధానానికి అనుమతిచ్చినా, వేతనాల్లో పెంపుపై స్పష్టత ఇవ్వలేదు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు కార్మికుల కొరత రాష్ట్రంలోని పారిశ్రామికవాడల్లో సుమారు పది వేలకు పైగా ఎంఎస్ఎంఈ పరిశ్రమల్లో 15లక్షల మంది కార్మికులు పనిచేస్తుండగా, ఇందులో సగం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తిరుగుముఖం పడుతున్నారు. తమ కంపెనీలో పని చేసే 30 మంది కార్మికుల్లో అందరూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని, ఇప్పటికే ఎనిమిది మంది స్వస్థలాలకు వెళ్లడంతో ఉత్పత్తికి అంతరాయం కలుగుతోందని ఉప్పల్ పారిశ్రామిక వాడకు చెందిన ఓ పరిశ్రమ యజమాని ఆందోళన వ్యక్తం చేశారు. -
మీరు ‘కేంబ్రిడ్జ్’ బాధితులా?
మెన్లో పార్క్ (కాలిఫోర్నియా): డేటా చౌర్యానికి పాల్పడిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్సల్టెన్సీ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికాకు ఎవరెవరి వ్యక్తిగత సమాచారం చిక్కిందో తెలుసుకోవడానికి ఫేస్బుక్ కొత్త టూల్‌ను ప్రవేశపెట్టింది. ఫేస్బుక్ వినియోగదారులంతా మంగళవారం నుంచే తమ ఖాతా న్యూస్‌ఫీడ్‌లో ‘ప్రొటెక్టింగ్ యువర్ ఇన్ఫర్మేషన్’ అనే నోటిఫికేషన్‌ను గమనించొచ్చు. ఇందులో ఉన్న లింకు ద్వారా వినియోగదారులు ఏయే యాప్‌లు వాడారు, ఆ యాప్‌లతో ఏ సమాచారం పంచుకున్నారో తెలుసుకోవచ్చు. డేటా దుర్వినియోగానికి కారణమైన ‘దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్’ అనే యాప్‌కు వినియోగదారు లు లేదా వారి స్నేహితులు లాగిన్ అయ్యారో లేదో కూడా ఈ లింకు సూచించే ప్రత్యేక టూల్ ద్వారా తెలుసుకోవచ్చు. కేంబ్రిడ్జ్ అనలిటికా బారినపడినట్లుగా భావిస్తున్న 8.7 కోట్ల మందికి ఈ వివరాలతో కూడిన సందేశం వస్తుందని ఫేస్బుక్ చెప్పింది. బాధితులకు భిన్న సందేశాలు.. ‘నా డేటా చౌర్యానికి గురైందో లేదో తెలుసుకోవడం ఎలా?’ అనే టూల్‌ను క్లిక్ చేయడం ద్వారా ఆ వినియోగదారుడి సమాచారం భద్రమో కాదో తెలుసుకోవచ్చు. ఒకవేళ సదరు వినియోగదారుడి డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా సేకరించని పక్షంలో..‘మాకున్న సమాచారం మేరకు.. మీరు, మీ స్నేహితులు డేటా దుర్వినియోగ కుంభకోణానికి కారణమైన దిస్ ఈజ్ డిజిటల్ లైఫ్‌కు లాగిన్ కాలేదు’ అనే సందేశం కనిపిస్తుంది. ఫేస్బుక్ ద్వారా లాగిన్ అయి వాడుకునే వెబ్సైట్లు, యాప్‌లను యథావిధిగా వాడుకోవచ్చనే సమాచారం కనిపిస్తుంది. బాధిత వినియోగదారులకు మాత్రం భిన్నమైన సందేశం కనిపిస్తుంది. ‘దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్’ యాప్‌ను నిషేధిస్తున్నట్లు ఫేస్బుక్ నుంచి వారికి సందేశం వెళ్తుంది. వారి ఖాతాలకు అనుసంధానమైన యాప్ లు ఏవీ? థర్డ్‌పార్టీలు వారికి చెందిన ఏయే వివరాల్ని చూస్తాయి? లాంటి సమాచారంతో లింకు కనిపిస్తుంది. తమ యాప్ సెట్టింగ్‌లను మార్చుకోవాలనే సూచనలు కనిపిస్తాయి. -
ఫేస్బుక్లో మాజీలను తొలగించే అవకాశం.!
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 150 కోట్ల వినియోగదారులున్న ఫేస్బుక్ సంస్థ యూజర్లకు ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫేస్బుక్ లోని ఫ్రెండ్స్ లిస్టులో విసుగు కలిగిస్తున్న, పాత స్నేహితులను లిస్టు నుంచి తొలగించేందుకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తోంది. అయితే ఈ కొత్త సౌకర్యాన్ని పొందే ముందు వినియోగదారులు కాస్త అసౌకర్యాన్ని కూడా భరించాల్సి వస్తుందని ఆ సంస్థ చెబుతోంది. కొత్త టూల్ ను ప్రారంభించిన తర్వాత అందుబాటులోకి ఓ కొత్త మొబైల్ యాప్ ను తెస్తామని, ఈ కొత్త యాప్... యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు ఫేస్బుక్ నిర్వాహకులు చెప్తున్నారు. కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫేస్బుక్ లో మీ స్థితి మార్చినపుడు ఇంతకు ముందు మీ ఫ్రెండ్స్ పోస్టు చేసిన ఫొటోలు, వీడియోలు.. మెసేజ్ లు డిలీట్ చేయాలా? వద్దా? అన్నది అడుగుతుంది. ఇలా చేసిన తర్వాత మీ వాల్ పై మీ పోస్ట్ లు, మెసేజ్ లు, ఫొటోలు మీరు లిస్టు నుంచి తొలగించిన వారికి కనిపించే అవకాశం ఉండదు. అలాగే గత పోస్ట్ వివరాలను కూడా చూసే సామర్థ్యాన్ని పరిమితం చేసుకునే అవకాశాన్ని ఈ కొత్త యాప్ కలిగిస్తుంది. అలాగే కొంతమందికి మాత్రమే మీ వివరాలు, పోస్ట్ లు కనిపించేట్టుగా ఎంపిక చేసుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. ఫేస్బుక్ ద్వారా తమ వినియోగదారుల జీవితాల్లో కలుగుతున్నకష్టాలను తీర్చేందుకు ఓ ప్రయత్నమని ఫేస్బుక్ ప్రొడక్ట్ మేనేజర్ కెల్లీ వింటర్స్ తన బ్లాగ్ స్పాట్ లో తెలిపారు. ఈ సౌకర్యం ప్రజలకు కలిగిస్తున్న అసౌకర్యాలను కూడా సులభంగా తొలగిస్తుందని నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. అయితే మీ నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో... మీ స్నేహితులు, పార్టనర్ కు తెలిసే అవకాశం కూడా ఉండదన్నారు. ఈ కొత్త టూల్ వల్ల ప్రజలు మరింత సౌలభ్యం, సౌకర్యం పొంది, ఫేస్బుక్ తో మంచి సంబంధాలను కొనసాగించేందుకు సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు కెల్లీ వింటర్ తెలిపారు. -
ఫేస్ బుక్ లో సరికొత్త వీడియో క్రియేషన్ ఆప్షన్!
న్యూయార్క్: జీవితంలోని మధుర అనుభూతుల్ని, సంఘటనల్ని వీడియోల ద్వారా పంచుకోవడానికి వినియోగదారులకు 'వీడియో క్రియేషన్' టూల్ ను ఫేస్ బుక్ అందుబాటులోకి తెచ్చింది. తాము పోస్ట్ చేసిన సందేశాల్ని, ఫోటోలను, కొత్త థీమ్స్ ను కలిపి వ్యక్తిగతంగా ఓ వీడియో రూపొందించుకోవడానికి 'సే థ్యాంక్స్' అనే కొత్త ఆప్షన్ ను ప్రారంభించింది. తమ వ్యక్తిగత, మిత్రుల టైమ్ లైన్స్ పై వీడియోలను షేర్ చేసుకోవడానికి వినియోగదారులకు ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. వీడియో క్రియేట్ చేసుకోవడానికి ఫేస్ బుక్ లో www. facebook.com/thanks పేజికి వెళ్లి వీడియోను రూపొందించుకోవచ్చు. వ్యక్తులతో ఉన్న బంధాలు, సంబంధాలకు అనుగుణంగా ఫోటోలను ఎడిట్ చేసుకోవడానికి, వివిధ థీమ్స్ లలో వీడియోను రూపొందించుకోవడానికి కూడా ఫేస్ బుక్ అవకాశం కల్పించింది. వీడియోను రూపొందించిన తర్వాత పర్సనల్ మెసేజ్ ను కూడా పంపించుకోవడానికి అవకాశం ఉంది. కొత్త ఆప్షన్ ఇంగ్లీష్, ఫ్రాన్స్, జర్మన్, ఇండోనేషియా, ఇటలీ, పోర్చుగీస్, స్పానిష్, టర్కీ దేశాల్లో డెస్క్ టాప్, మొబైల్ ద్వారా ఫేస్ బుక్ అందుబాటులోకి తెచ్చింది.