ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్లుగా యూజర్లకు సేవలందిస్తున్న వర్డ్ ప్యాడ్‌కు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించింది. భవిష్యత్‌లో విడుదల కానున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో వర్డ్ ప్యాడ్ అనే ఫీచర్ ఇక కనపించదని స్పష్టం చేసింది.
మైక్రోసాఫ్ట్ 1995లో విండోస్ 95 అనే ఆపరేటింగ్ సిస్టం (OS) ను విడుదల చేసింది. కొత్తగా విడుదలైన ఈ ఓఎస్‌లో వర్డ్ ప్యాడ్ అనే వర్డ్ ప్రాసెసింగ్ టూల్‌ను సైతం అందుబాటులోకి తెచ్చింది. వర్డ్ ప్యాడ్‌లో రెజ్యూమ్, లెటర్స్‌ను తయారు చేయడం, టేబుల్స్ క్రియేట్ చేయడంతో పాటు ఫోటోలను సైతం జత చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్‌లో లేని ఇటాలిక్,అండర్ లైన్, బుల్లెట్ పాయింట్స్, నెంబరింగ్, టెక్ట్స్ ఎలైన్‌మెంట్స్ వంటి అడ్వాన్స్ ఫీచర్లను సైతం ఉపయోగించుకునేలా వెసలు బాటు కల్పించింది.
వర్డ్ ప్యాడ్ కనుమరుగు
అయితే, ఈ తరుణంలో 30 ఏళ్లుగా వినియోగదారులకు సేవలందిస్తున్న వర్డ్ ప్యాడ్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వర్డ్ ప్యాడ్‌కు ప్రత్యామ్నాయంగా ఆఫీస్ 365 పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లో ఉన్న మైక్రోసాఫ్ట్ వర్డ్‌ను ఉపయోగించుకోవాలని కోరింది. రిచ్ టెక్స్ డాక్యుమెంట్స్ కోసం మైక్రోసాఫ్ట్ వర్డ్, డీవోసీ అండ్. ఆర్టీఎఫ్,ప్లెయిన్ టెక్ట్స్ డాక్యుమెంట్ కోసం విండోస్ నోట్‌ప్యాడ్‌లను వినియోగించుకోవచ్చని తెలిపింది.
అదే సమయంలో మైక్రోసాఫ్ట్ నోట్‌ప్యాడ్‌లో కొత్త ఫీచర‍్లను అందుబాటులోకి తెచ్చింది. ఆటోసేవ్, ఆటో రీస్టోర్ ట్యాబ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. భవిష్యత్‌లో ఎవరికైనా అవసరం అనిపిస్తే వర్డ్ ప్యాడ్ బదులు మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో పనికొస్తుందని మైక్రోసాఫ్ట్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.
చాట్‌జీపీటీకి అనువుగా కోర్టానా
మైక్రోసాఫ్ట్ చివరిగా విండోస్7 విడుదల సందర్భంగా కొన్ని మేజర్ అప్‌డేట్ చేసింది. 1990లలో మైక్రోసాఫ్డ్ వర్డ్, వర్డ్ స్టార్‌లలో యూజర్లు సులభంగా సెర్చ్ చేసేలా బటన్స్, డ్రాప్ డౌన్ లిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వాటిని గుర్తించేలా రిబ్బోన్ యూఐని విడుదల చేసింది. తాజాగా, ఆ యూఐ రిబ్బోన్ (Ribbon UI) స్థానంలో యూఐని తెచ్చింది.
మైక్రోసాఫ్ట్ ఇటీవలే వర్చువల్ అసిస్టెంట్ కోర్టానా ( Cortana ) యాప్‌ను మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ బింగ్‌కు అనుకూలంగా చాట్‌జీపీటీని అందిచంనుంది. నివేదికల ప్రకారం మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం విండోస్ 11కు లేటెస్ట్ వెర్షన్ విండోస్12 ఓఎస్‌పై పనిచేస్తుంది. దీనిని వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు పలు నివేదికలు హైలెట్ చేశాయి.
చదవండి👉 నోరు పారేసుకున్న యాంకర్..కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా
Comments
Please login to add a commentAdd a comment