పాండిచ్చేరిలో బిజీ సెంటర్... అక్కడున్న ఓ మద్యం దుకాణంలోకి ఓ అందమైన అమ్మాయి ఎంటరైంది. ‘బీరు కావాలి?’ అనడిగేసరికి, అందరూ షాక్. డబ్బున్న అమ్మాయిలు కొంతమంది పబ్‌లకెళ్లి, బీరు తాగుతారని తెలుసు కానీ, మరీ ఇలా బహిరంగంగా షాపుకొచ్చి కొనడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకూ ఆ అందమైన అమ్మాయి ఎవరంటే నయనతార. ఇది మళ్లీ షాక్ కదూ.
నయనతార ఓ మద్యం దుకాణంలో బీరు కొంటున్న వీడియో యూ ట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. కొంతమంది ఈ వీడియోను పదే పదే చూసి, ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం సంప్రదాయబద్ధంగా ఉండేవాళ్లు మాత్రం ‘హవ్వ. ఎంతకు తెగించింది. మరీ ఇంత విచ్చలవిడితనమా..’ అని నోటికొచ్చినట్లు మాట్లాడుకున్నారు. కానీ, నయనతార మాత్రం హాయిగా నవ్వుకున్నారు.
ఎందుకంటే, అసలు విషయం ఏంటో ఆమెకే తెలుసు కనుక. ఇంతకీ ఏంటా విషయం అనుకుంటున్నారా? నయన్ బీరు బాటిల్ కొనడం ఒక నటన. ప్రస్తుతం ‘నానుమ్ రౌడీదాన్’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారామె. ఈ చిత్రంలో నయన్ బీరు సీసా కొనే సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించారు. ఈ సన్నివేశాలను ఎవరో చిత్రీకరించి, ఆ వీడియోను బయటపెట్టారు. ఫలితంగా నలుగరి నోళ్లలోనూ నయన్ నానారు. ఈ నెగటివ్ పబ్లిసిటీ కారణంగా నయన్ అనవసరంగా నిందలకు గురయ్యారు కానీ, ఆ సినిమాకి మాత్రం బోల్డంత పబ్లిసిటీ వచ్చింది.
హల్‌చల్ చేస్తున్న వీడియో!
Published Mon, Jan 26 2015 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM
Advertisement
Advertisement