Pondicherry
-
సిగ్నల్ నీడలో
బతుకు గడవాలంటే రోడ్డు మీదకు రాక తప్పదు. వస్తే భయంకరమైన ఎండ. దాంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వేచి ఉండాల్సిన బాధ. అందుకే పాండిచ్చేరి ప్రభుత్వం ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్‌షేడ్ ఏర్పాటు చేసింది. వీటిని ఒక స్కూటరిస్ట్ ‘ఎక్స్’లో షేర్ చేశాడు. వైరల్ అయిన ఈ పందిళ్లను చూసి చాలా మంది తమ నగరాల్లో కూడా ఇలా జరిగితే బాగుండని కోరుకుంటున్నారు.మన దేశంలో ఎండలు విపరీతమవడం గతంలో కూడా ఉంది. సాధారణంగా మైదాన్ర΄ాంతాల్లో 40 డిగ్రీల సెల్సియెస్, కొండ ్ర΄ాంతాల్లో 30 డిగ్రీల సెల్సియెస్ దాటితే వడగాడ్పు ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. 2016లో జో«ద్‌పూర్‌లో 51 డిగ్రీల రికార్డు టెంపరేచర్ నమోదైంది. 2019లో లాంగెస్ట్ హీట్‌వేవ్‌ను దేశం చూసింది. 32 రోజుల ΄ాటు సాగిన వడగాడ్పులకు ఆంధ్రప్రదేశ్ అల్లాడి΄ోయింది విదర్భ, రాజస్థాన్ కాకుండా. అందుకే మన దేశంలో మే నెలను చూసి జనం గడగడ వొణుకుతారు. బయటికొస్తే వాహనదారులకు నిలువ నీడ ఉండదు. ఇలాంటి సమయంలో పాండిచ్చేరిలో ప్రభుత్వం ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్షేడ్స్ ఏర్పాటు చేసింది. దీని వల్ల ఎండలో తిరిగే వారికి నీడ కింద ఉపశమనం దొరికినట్టవుతుంది... దాంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్‌ను పాటించినట్టవుతుంది. ఒక వాహనదారుడు ఇన్‌స్టాలో రిలీజ్ చేసిన పాండిచ్చేరి గ్రీన్షేడ్స్ను చూసి ప్రతి ఒక్కరూ మా నగరాల్లో కూడా ఇలాంటివి ఏర్పాటు చేస్తే బాగుండు అంటున్నారు. ప్రభుత్వాలు వింటే బాగుండు. -
San Rechal Gandhi : అందమైన విజయం
పాండిచ్చేరికి చెందిన సాన్ రేచల్ గాంధీ తన శరీరం రంగు కారణంగా వివక్షత, అవహేళనలను ఎదుర్కొంది. బయటి వాళ్ల నుంచి మాత్రమే కాదు బంధువులు, కుటుంబ సభ్యులకు నుంచి కూడా వెక్కిరింపులు ఎదుర్కొంది. ఈ వెక్కిరింపులు తట్టుకోలేక తన స్కిన్ కలర్ మార్చుకోవడానికి రకరకాల కాస్మెటిక్స్‌ను వాడేది. అయితే ఆ ప్రయత్నాలేవీ ప్రయత్నించలేదు. ఒకానొక దశలో రేచల్‌కు విసుగొచ్చి ‘ఇదంతా ఏమిటి!’ అనుకుంది. ‘నేను నల్లగా ఉండడం వల్ల ఎవరికీ నష్టం లేదు’ అనుకుంటూ తన రంగును ప్రేమించడం మొదలు పెట్టింది. ఇలా ఉంటే మాత్రమే, ఈ రంగులో ఉంటేనే అందాల పోటీల్లో విజేతలు అవుతారనే స్టీరియోటైప్ ఆలోచనలను బ్రేక్ చేయాలి, సెల్ఫ్–యాక్సెప్టెన్స్‌ను ప్రమోట్ చేయాలని అందాల పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. అయితే కొన్ని పోటీల్లో స్కిన్ కలర్ కారణంగా రిజెక్ట్ చేశారు. అయినా పట్టువదలకుండా అందాల పోటీల్లో పాల్గొనేది. ఎన్నో బ్యూటీ టైటిల్స్ కూడా గెలుచుకుంది. గత సంవత్సరం ‘మిస్ పాండిచ్చేరి’ కిరీటాన్ని గెలుచుకుంది. ‘ఒక డార్క్–స్కిన్ మోడల్‌ను టీవీలో చూసిన తరువాత నాకు కూడా మోడలింగ్ చేయాలనిపించింది’ అంటున్న రేచల్ ఒక జువెలరీ బ్రాండ్‌కు మోడలింగ్ చేసింది. మోడల్‌గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇక తాజా విజయానికి వస్తే సౌత్ ఆఫ్రికాలో జరగనున్న ‘మిస్ ఆఫ్రికా గోల్డెన్’లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
జరుగుమల్లి (సింగరాయకొండ): అర్ధరాత్రి హైవేపై ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అందరూ కిందికి దిగేశారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట సమీపంలో హెచ్‌పీ పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన మోజో ట్రావెల్స్ బస్సు(స్లీపర్) 25 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళుతోంది. బస్సు వెనుక భాగంలో ఉన్న సిగ్నల్ లైట్స్‌కు విద్యుత్ సరఫరా చేసే వైర్లు, ఏసీ కేబుల్స్ కలిసి ఉండటంతో షార్ట్ సర్క్యూటై మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ లక్ష్మణ్.. వెంటనే బస్సును రోడ్డు మార్జిన్లో ఆపివేశాడు. ప్రయాణికులను కిందకు దించి మంటలపై బకెట్‌తో నీళ్లు చల్లి ఆర్పే ప్రయత్నం చేశా డు. అయినప్పటికీ మంటలు తగ్గకపోగా, కాసేపట్లోనే బస్సు మొత్తం వ్యాí³ంచాయి. అప్పటికే ప్రయాణికులంతా కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపకశాఖ సిబ్బంది ఫైరింజన్‌తో అక్కడకు చేరుకుని మంటలనార్పారు. అయితే బస్సులోనే ఉండిపోయిన ప్రయాణికుల లగేజీ మొత్తం కాలిపోయింది. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కట్టుబట్టలతో మిగిలిన ప్రయాణికులను ఇతర వాహనాల్లో ఎక్కించి గమ్యస్థానాలకు చేర్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సింగరాయకొండ సీఐ రంగనాథ్ తెలిపారు. -
పారిస్.. యానాం మూడుముళ్ల బంధం
యానాం నుంచి పారిస్‌కు చాలా దూరం. కానీ.. రెండు ప్రాంతాల మనుషుల మధ్య కాదు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత 1954లో ఫ్రెంచ్ వాళ్లు యానాంను విడిచి వెళ్లినా.. ఇక్కడి వారితో మాత్రం నేటికీ బంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా, ఇటీవల కాలంలో మూడుముళ్లు.. ఏడడుగులతో పెనవేసుకుని.. కడవరకూ కలిసుంటామని ప్రమాణం చేసుకుంటూ బంధాలను మరింతగా పదిలం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో 30 మందికి పైగా యానాం యువతీ యువకులు ఫ్రెంచ్ వారిని వివాహం చేసుకున్నారు. ఏటా కనీసం మూడుకు పైగా వివాహాలు ఫ్రెంచ్ పౌరులతో ముడిపడుతున్నాయి. అవి కూడా పెద్దలు కూర్చిన వివాహాలు కావడం.. హిందూ సంప్రదాయం ప్రకారమే జరుగుతుండటం మరో విశేషం. సాక్షి ప్రతినిధి, కాకినాడ: యానాంకు చెందిన దవులూరు చంద్రశేఖర్.. ఫ్రెంచ్ యువతి షావలోత్ భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి పీటలెక్కారు. కాళ్లు కడగటం.. కన్యాదానం చేయడం.. కల్యాణ ఘడియలో వధూవరులు ఒకరి శిరస్సుపై ఒకరు పరస్పరం జీలకర్ర, బెల్లం ఉంచటం.. ఆ తరువాత వధువు మెడలో వరుడు తాళి కట్టడం.. అరుంధతీ నక్షత్ర వీక్షణ.. చివరగా అప్పగింతలు వంటి వివాహ తంతుల్లో ఏ ఒక్కటీ వదలకుండా వివాహ తంతును సంప్రదాయం ప్రకారం జరిపించారు. ఆ తరువాత ఆ దంపతులిద్దరూ యానాం–పారిస్ వివాహ బంధానికి ప్రతీకగా యానాంలోనూ ఈఫిల్ టవర్ నమూనా నిర్మిం చారు. 30 మందికి పైగా.. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 30 మందికి పైగా పారిస్ పౌరులను మన సంప్రదాయం ప్రకారమే వివాహమాడారు. వీరిలో మంచాల, బెజవాడ, దవులూరు, చింతా, కామిశెట్టి, సలాది వంటి కుటుంబాలకు చెందిన వారున్నారు. అలాగని.. ఇవన్నీ ప్రేమ వివాహాలే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వీటిలో అధిక శాతం వివాహాలు ఇరుపక్షాల తల్లిదండ్రులు కుదుర్చుకున్నవే. ఇక్కడి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అంగరంగ వైభవంగా వివాహాలు చేసుకోవడానికే ఫ్రెంచ్ పౌరులు మక్కువ చూపుతున్నారు. పెళ్లికి ముందు జాతకాలు, ఫొటోలు ఇచ్చిపుచ్చుకోవడంతోపాటు ఇరు కుటుంబాల మధ్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏటా మాఘమాసంలో కేంద్రపాలిత ప్రాంతాలైన యానాం, పాండిచ్చేరి, మాహే, కారైకల్ ప్రాంతాలకు చెందిన కనీసం పది జంటలు వివాహ బంధంతో ఒక్కటవుతూ అనుబంధాల్ని పెనవేసుకుంటున్నాయి. జాక్‌పాట్ కొట్టినట్టే.. ఫ్రెంచ్ వారితో వివాహ బంధంతో ఒక్కటైతే వరుడు లేదా వధువు జాక్‌పాట్ కొట్టినట్టే. ఫ్రెంచ్ యువతీ యువకులను వివాహం చేసుకుంటే లభించే ఫ్రెంచ్ పాస్పోర్టుతో వీసా లేకుండా ప్రపంచ దేశాలు చుట్టి రావచ్చు. కెనడా, ఆ్ర«ఫికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా తదితర 25కు పైగా దేశాలకు వీసా లేకుండా స్వేచ్ఛగా వెళ్లిరావచ్చు. పైగా ఫ్రెంచ్ ప్రభుత్వం అమలు చేసే పథకాలను, ప్రయోజనాలను అనుభవిస్తూ హాయిగా జీవనం సాగిస్తున్నారు. అలనాటి అనుబంధాన్ని కొనసాగిస్తూ.. కాకినాడ–కోనసీమ జిల్లాల నడుమ జాతీయ రహదారిని ఆనుకుని ఉండే యానాం పట్టణం కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి పరిధిలో ఉంది. యానాంను రెండు శతాబ్దాల పాటు ఫ్రెంచ్ వాళ్లు పాలించారు. తమ పాలనకు స్వస్తి పలికి తిరిగి వెళ్లేప్పుడు ఇక్కడి వారికి ఐచ్చికంగా ఫ్రెంచ్ పౌరసత్వం ఇచ్చే అవకాశం కల్పించారు. అప్పట్లో సుమారు 4 వేల మంది ఉండగా.. వారిలో 70 మంది ఫ్రెంచి పౌరసత్వం తీసుకున్నారు. ఫ్రెంచ్ పౌరసత్వం అనేది ఐచ్ఛికమని భారత్–పారిస్ మధ్య ఒప్పందం కుదిరింది. దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఫ్రెంచి–యానాం మధ్య అనుబంధం చెక్కుచెదరకుండా కొనసాగడం విశేషం. తొలినాళ్లలో 70 మంది ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకోగా.. ఆ దేశ పౌరసత్వం ఉన్న సుమారు 100కు పైగా కుటుంబాల వారు ఫ్రాన్స్‌లోనే స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఫ్రాన్స్‌లో ఉన్నా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు వీడకుండా ఏటా రెండు, మూడు పర్యాయాలు వచ్చి వెళుతుంటారు. యానాంలో నివసించిన తమ పూర్వీకుల సమాధులు, వారి స్వీయ అనుభవాలు నిక్షిప్తమై ఉన్న యానాం రోమన్ కేథలిక్ చర్చితోపాటు సమాధులను దర్శించుకుని వెళుతుంటారు. అలా వారి మధ్య కొనసాగుతున్న అనుబంధాన్ని ఇప్పుడు వివాహ బంధంతో ముడివేస్తున్నారు. చెక్కుచెదరని అనుబంధం స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ ఫ్రెంచ్ వారితో అనుబంధం కొనసాగుతూనే ఉంది. వారి పాలనకు మెచ్చి యానాం సహా పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతవాసులు వారితో వివాహ బంధం కోసం అమితాసక్తి చూపుతున్నారు. ఏటా యానాం సహా పాండిచ్చేరి ప్రాంతానికి చెందిన కనీసం 10 మంది ఫ్రెంచ్ వారిని సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంటున్నారు. – సాధనాల బాబు, ఫ్రెంచ్ కాన్సులేట్ సభ్యుడు, యానాం మూడుముళ్లతో ఒక్కటవుతున్నారు ఫ్రెంచ్ యువతీ, యువకులను యానాం ప్రాంత వాసులు పెళ్లిళ్లు చేసుకోవడం ద్వారా స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉన్న ఆత్మీయతను కొనసాగిస్తున్నారు. ఫ్రెంచ్ వారు కూడా మన సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. ఫ్రెంచ్ వారు తమ పూర్వికుల చరిత్రను తెలుసుకునేందుకు, సమాధులను దర్శించుకోవడం కోసం ఏటా ఒకటి, రెండుసార్లు వచ్చి వెళుతున్నారు. – కనకాల రామదాసు, ప్రముఖ న్యాయవాది, యానాం -
మేనత్త కూతురిని ఇష్టపడ్డాడు.. నో చెప్పడంతో అర్ధరాత్రి కీర్తనను..
సాక్షి, చెన్నై: మేనత్త కూతురిపై మనస్సు పడ్డ ఓ యువకుడు ప్రేమోన్మాదిగా మారాడు. తనతో మాట్లాడటం లేదనే ఆగ్రహంతో ఆ యువతిని నరికి చంపేశాడు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని తిరుబువనం సన్యాసి కుప్పానికి చెందిన నాగరాజ్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య మయిల్ మరణించడంతో అంబికను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదుగురు పిల్లలు, ఇందులో కీర్తన(19) మూడో కుమార్తె. ఈమె డిగ్రీ చదువుతోంది. కీర్తనపై మయిల్ అన్న కుమారుడు ముఖేష్ మనస్సు పడ్డాడు. అయితే ముఖేష్‌కు మద్యం అలవాటు ఉండడంతో అతడి ప్రేమను కీర్తన తిరస్కరిస్తూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో మంగళవారం రాత్రి కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో నిర్మానుష్య ప్రదేశంలో కీర్తనను ముఖేష్ అడ్డుకున్నాడు. ప్రేమించాలని, పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో ఉన్మాదిగా మారాడు. వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె తల వెంట్రుకల్ని కత్తరించేశాడు. తర్వాత ఉడాయించాడు. ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించి.. సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె శరీరంపై 18 చోట్ల కత్తిగాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు మృత దేహాన్ని మార్చురీకి తరలించారు. అనంతరం, పరారీలో ఉన్న ముఖేష్ కోసం గాలిస్తున్నారు. కాగా బుధవారం ఉదయం సంఘటనా స్థలాన్ని ఎస్పీ జిత్తన్ కోదండరామన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం పరిశీలించింది. ఇది కూడా చదవండి: ఆయన నా భర్తే.. రచ్చకెక్కిన నవ్య శ్రీ ఉదంతం.. ఫొటోలు వైరల్ -
పార్ధూ ఇంకోసారి చూసి చెప్పు: నిహారిక వైరల్ పోస్ట్
నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి తర్వాత మరింత యాక్టివ్‌గా కనిపిస్తోంది. భర్త జొన్నలగడ్డ చైతన్యతో కలిసి టూర్లు చుట్టోస్తూ.. మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. అత్తారింట్లో అడుగుపెట్టిన అనంతరం మెగా డాటర్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారిపోయింది. నిత్యం ట్రెండీ లుక్‌లోనే దర్శనమిస్తుంది. ఎక్కడికెళ్లినా తమ జంట దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా చైతన్య- నిహారిక జంట వెకేషన్ ట్రిప్‌లో భాగంగా పాండిచ్చేరి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ హోటల్ రూమ్‌లో దిగిన ఓ హాట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫోటోకు పెట్టిన కామెంట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అద్దంలో తనను తానే చూసుకుంటున్న ఈ ఫోటోపై 'పార్ధు ఇంకోసారి చూసి చెప్పు' అంటూ అతడు సినిమాలో త్రిష చెప్పిన డైలాగ్‌ను గుర్తుచేస్తూ కామెంట్‌గా పెట్టింది. అయితే ఇక్కడే ఓ షరతు పెట్టింది ఈ బ్యూటీ. ఈ డైలాగ్ ఏ సినిమాలో ఉందో గుర్తురాని వాళ్ళు దయచేసి కామెంట్ చేయొద్దు అని ఆమె పేర్కొంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. పెళ్లి తర్వాత నిహారిక గ్లామర్ డోస్ పెంచిదని కొందరు, అయినా ఏం బాలేదని మరికొందరు బదులిస్తున్నారు. కాగా ప్రస్తుతం నిహారిక పాండిచ్చేరిలో దిగిన ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
Puducherry: 40 ఏళ్లకు మహిళా మంత్రి
పుదుచ్చేరిలో 40 ఏళ్ల అనంతరం ఓ మహిళ మంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. ఈ ఛాన్స్ కారైక్కాల్ నెడుంగాడు నుంచి గెలిచిన చంద్ర ప్రియాంకకు దక్కింది. మంత్రి వర్గం ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనుంది. సాక్షి, చెన్నై : కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత, సీఎం రంగస్వామి ఎట్టకేలకు 52 రోజుల తర్వాత మంత్రి వర్గం జాబితాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. జాబితాను ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌కు అందజేశారు. ఇందుకు కేంద్ర హోం శాఖ, రాష్ట్రపతి భవన్ ఆమోద ముద్ర వేశాయి. ఆదివారం సాయంత్రం 3 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారం రాజ్ నివాస్‌లో జరగనుంది. బీజేపీకి చెందిన నమశ్శివాయం, సాయి శరవణన్ కుమార్, ఎన్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన లక్ష్మినారాయణన్, తేని జయకుమార్‌కు మంత్రి పదవులు దక్కాయి. 40 ఏళ్ల తర్వాత మహిళకు అవకాశం పుదుచ్చేరి మంత్రి వర్గంలో 40 ఏళ్ల అనంతరం ఓ మహిళకు చోటు దక్కింది. 1980– 1983లో కాంగ్రెస్– డీఎంకే కూటమి మంత్రివర్గంలో డీఎంకేకు చెందిన రేణుకఅప్పాదురై మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మహిళలకు మంత్రి పదవులు దక్కలేదు. తాజాగా రంగన్న కేబినెట్లో కారైక్కాల్ ప్రాంతీయం నుంచి నెడుంగాడు రిజర్వుడు స్థానంలో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన చంద్రప్రియాంకకు మంత్రి పదవి దక్కింది. పదిహేను నిమిషాల్లో ప్రమాణ స్వీకారం ముగిసేలా రాజ్ నివాస్‌లో ఏర్పాట్లు జరిగాయి. వంద మందికి మాత్రమే అనుమతిచ్చారు. మాజీ మంత్రి, ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రాజవేలుకు పదవి దక్కని దృష్ట్యా ఆయన వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అలాగే బీజేపీ నేత, ఎమ్మెల్యే జాన్‌కుమార్ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చదవండి: మిషన్ 2022పై కమలదళం కసరత్తు -
Pondicherry: రంగన్న కేబినెట్ రెడీ
సాక్షి, చెన్నై: మంత్రివర్గ జాబితాను పుదుచ్చేరి సీఎం రంగస్వామి సిద్ధం చేశారు. బీజేపీకి చెందిన ఇద్దరితో పాటు తన పార్టీకి చెందిన ముగ్గురితో కలిపి ఐదుగురు సభ్యులకు మంత్రి చాన్స్ కల్పించారు. ఈ జాబితాను ఒకటి రెండు రోజుల్లో ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌కు సమర్పించనున్నారు. పుదుచ్చేరిలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్‌ఆర్‌కాంగ్రెస్ అధినేత, సీఎం రంగ స్వామికి మంత్రివర్గం కూర్పు శిరోభారంగా మారింది. తొలుత బీజేపీతో సీట్ల పందేరం వివాదాల నడుమ సాగింది. అధికారపగ్గాలు చేపట్టి నెలన్నర రోజులు కావస్తున్నా ఇంతవరకు మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేయలేని పరిస్థితి. ఎట్టకేలకు బీజేపీకి చెందిన ఎన్బలం సెల్వం గత వారం స్పీకర్‌గా పగ్గాలు చేపట్టారు. మంత్రివర్గ పంచాయితీ కొలిక్కి రావడంతో జాబితా సిద్ధం చేసే పనిలో రంగన్న నిమగ్నం అయ్యారు. అదే సమయంలో తనకు మంత్రివర్గంలో చోటు దక్కడం లేదన్న సమాచారంతో బీజేపీకి చెందిన జాన్‌కుమార్ ఢిల్లీలో పైరవీలో మొదలెట్టే పనిలో పడ్డారు. అయితే ఎళ్ల తరబడి పార్టీ కోసం శ్రమిస్తున్న శరవణ కుమార్‌కు బీజేపీ అధిష్టానం అవకాశం ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే రంగన్న జాబితాలోనూ ఆయన పేరు ఉండడం వెలుగు చూసింది. జాన్ కుమార్‌కు రిక్త హస్తం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తనతో పాటుగా తన కుమారుడ్ని ఎన్నికల్లో గెలిపించుకున్న నేత జాన్‌కుమార్. అయితే, ఆయనకు మంత్రి వర్గంలో చోటు దక్కేది అనుమానంగా మారింది. ఆయన వర్గీయులు ఓ వైపు ఆందోళనలు సాగిస్తున్న నేపథ్యంలో మరో వైపు ఢిల్లీలో జాన్‌కుమార్ తిష్ట వేసి ఉండటం గమనార్హం. చివరి వరకు మంత్రి పదవి కోసం అధిష్టానంతో పోరాడుతానని జాన్‌కుమార్ ప్రకటించారు. సీఎం అభ్యర్థి కావాల్సిన వ్యక్తినని, బీజేపీ పిలుపు మేరకు ఇక్కడకు వచ్చానని ఆయన పేర్కొన్నారు. జాన్‌కుమార్ ఢిల్లీ వేదికగా పైరవీలు ఓ వైపు సాగిస్తుంటే, మరో వైపు రంగన్న తన మంత్రి వర్గ జాబితాను సిద్ధం చేసి ఎల్జీకి సమర్పించేందుకు సిద్ధం కావడం గమనార్హం. జాబితాలో బీజేపీకి చెందిన నమశ్శివాయంకు హోంశాఖ, శరవణకుమార్‌కు ఆదిద్రావిడ సంక్షేమ శాఖ కేటయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, తన పార్టీకి చెందిన తిరుమురుగన్కు విద్యాశాఖ, లక్ష్మీనారాయణన్‌కు ఆరోగ్యశాఖ, జయకుమార్‌కు గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించి ఉన్నట్టు సమాచారం. ఇక డిప్యూటీ స్పీకర్‌గా రాజవేలు, ప్రభుత్వ విప్‌గా ఆర్ముగం పేర్లను ఎంపిక చేసి ఈనెల 24న ఎల్జీకి జాబితాను రంగన్న సమర్పించబోతున్నట్టు ఎన్‌ఆర్‌కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: శశికళతో మాట్లాడాడని.. కారుపై పెట్రోలు పోసి -
Puducherry: పట్టు వీడని రంగన్న..!
సాక్షి, చెన్నై : బీజేపీ డిమాండ్లకు తలొగ్గేది లేదన్నట్టుగా పుదుచ్చేరి సీఎం రంగస్వామి సంకేతలిస్తున్నారు. దీంతో స్థానిక బీజేపీ పెద్దలు ఈ వ్యవహారాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు. పరిస్థితిని చక్క దిద్దేందుకు హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కేంద్రం రంగంలోకి దించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – ఎన్‌ఆర్‌కాంగ్రెస్ కూటమి పుదుచ్చేరి అధికార పగ్గాలు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. పది స్థానాల్లో గెలిచిన ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగస్వామి సీఎంగా పగ్గాలు చేపట్టారు. అయితే, ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న తమకు డిప్యూటీ సీఎం, అసెంబ్లీ స్పీకర్‌తో పాటుగా, రెండు కీలక శాఖలతో కూడిన మంత్రి పదవుల్ని కట్ట బెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశం రంగస్వామిని సంకటంలో పడేసింది. అదే సమయంలో తమ బలాన్ని పెంచుకునే రీతిలో స్వతంత్ర ఎమ్మెల్యేలను తమ వైపుగా బీజేపీ తిప్పుకోవడం వంటి పరిణామాల్ని రంగస్వామి నిశితంగానే పరిశీలిస్తూ వచ్చారు. ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో గెలిచిన ఆరుగురు, స్వతంత్ర అభ్యర్థులతో కలిపి బీజేపీ బలం తాజాగా 12కు చేరడాన్ని రంగస్వామి తీవ్రంగానే పరిగణించి ఉన్నారు. దీంతో బీజేపీ ముఖ్య నేతలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వక పోవడం చర్చకు దారి తీసింది. ఢిల్లీలో చర్చోపచర్చలు.. పుదుచ్చేరి బీజేపీ నేత నమశ్శివాయం, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ నిర్మల్‌కుమార్ సురానాతో పాటుగా పలువురు నేతలు ఆదివారం పదవుల పంచాయతీని ఢిల్లీకి తీసుకెళ్లారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రంగన్న తీరుపై ఫిర్యాదు చేశారు. సోమవారం పుదుచ్చేరికి చేరుకున్న నేతలు రంగస్వామితో భేటీకి ప్రయత్నించి విఫలం అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో పుదుచ్చేరిలో పదువుల వివాదాన్ని పరిష్కరించేందుకు హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కేంద్ర రంగంలోకి దించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. మంగళవారం లేదా బుధవారం కిషన్‌రెడ్డి రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. చదవండి: శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకోబోం: ఏఐఏడీఎంకే -
అసెంబ్లీ ఎన్నికల వేళ అభ్యర్థి మిస్సింగ్..!
సాక్షి, యానాం: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ బహిష్కృత నేత అదృశ్యం కలకలం రేపుతోంది. యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీచేస్తున్న పెమ్మాడి దుర్గాప్రసాద్ అదృశ్యమయ్యారు. తన భర్త గురువారం ఉదయం నుంచి కనిపించట్లేదని ఆయన భార్య పెమ్మాడి శాంతి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఉదయం ఎన్నికల ప్రచారం కోసం వెళ్లి, తిరిగి ఇంటికి రాలేదని అంతేకాకుండా మొబైల్ ఫోన్ స్విచాఫ్‌లో ఉన్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఆయన ఎక్కడున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, యానాం కొత్తపేటకు చెందిన పెమ్మాడి దుర్గా ప్రసాద్.. మత్స్య వ్యాపారి. ఆయనకు సొంతంగా ఫిషింగ్ బోట్లు ఉన్నాయి. యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. తన సామాజిక వర్గంలో మంచి పట్టు ఉండడంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఈనెల 6న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దుర్గా ప్రసాద్ అదృశ్యం సంచలనం రేకిత్తిస్తుంది. చదవండి: అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల్లో 18% నేరచరితులే -
మంత్రి విశ్రాంతి ప్రకటన.. ప్రజలు కన్నీటి పర్యంతం
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఉద్వేగానికి లోనయ్యారు. తాను విశ్రాంతి తీసుకోదలచినట్టు ఆయన చేసిన ప్రకటనతో యానం వాసులు కన్నీటి పర్యంతం అయ్యారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టారు. యానం ఎమ్మెల్యేగా మల్లాడి కృష్ణారావు అందరికి సుపరిచితులే. కాంగ్రెస్‌కు చెందిన ఈ నేత 25 ఏళ్లుగా యానం ప్రజలతో మమేకం అయ్యారు. వరస విజయాలతో దూసుకొచ్చిన ఆయన యానం ప్రజల కోసం పదవిని సైతం త్యాగం చేయడానికి సిద్ధమని చాటారు. ఆ దిశగా ఇటీవల తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదన్న ప్రకటన వెలువడింది. ఇందుకు తగ్గట్టుగా ఆదివారం యానం అయ్యన్నగర్లో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరైన మల్లాడి కృష్ణారావును రాజకీయాల్లో ఉండాల్సిందే, ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని ప్రజలు కన్నీటి పర్యంతంతో విజ్ఞప్తి చేయడం విశేషం. ప్రజలు, మద్దతుదారులు కన్నీటిపర్యంతంతో విజ్ఞప్తి చేయడంతో ఉద్వేగానికి లోనైన మల్లాడి రుమాలతో పలుమార్లు చెమరిన కళ్లను తడుచుకోవాల్సి వచ్చింది. ఆయన మాట్లాడుతూ తాను నిర్ణయం తీసుకున్నానని, తన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ఎవరూ రారని స్పష్టం చేశారు. తనకు విశ్రాంతి కావాలని, దయ చేసి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. మనలో ఒకర్ని ఎంపిక చేసి, పుదుచ్చేరి అసెంబ్లీకి పంపుదామని పిలుపునిచ్చారు. ఆ ఒకరు ఎవరో ప్రజలు చెప్పాలని, యానం అభివృద్ధిని కాంక్షించే ఆ వ్యక్తికి సంపూర్ణ మద్దతుఇద్దామన్నారు. తాను ఎక్కడికి వెళ్లనని, ఇక్కడే ఉంటానని ప్రజలకు నచ్చచెప్పారు. -
కాంగ్రెస్‌కు షాక్: మంత్రి, ఎమ్మెల్యే రాజీనామా
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వైఖరిని నిరసిస్తూ ఓ మంత్రి, ఎమ్మెల్యే రాజీనామా చేశారు. దీంతో పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. అయితే పార్టీ వైఖరి సక్రమంగా లేకనే రాజీనామా చేశామని వారు ప్రకటించారు. వీరి రాజీనామాతో పుదుచ్చేరి రాజకీయం హాట్‌హాట్‌గా మారింది. ప్రజా పనుల శాఖ మంత్రి నమశ్శివాయం, ఎమ్మెల్యే దీపాయందన్ సోమవారం అసెంబ్లీ స్పీకర్ శివకుళందైను కలిసి స్వయంగా రాజీనామా పత్రాలను సమర్పించారు. తనపై పార్టీ నాయకత్వం పక్షపాత వైఖరిని అవలంభిస్తోందని మంత్రి నమశ్శివాయం బహిరంగంగానే చెబుతున్నారు. అసంతృప్తిని వెళ్లగక్కినా పార్టీ పట్టించుకోకపోవడంతో నమశ్శివాయం ఇక ప్రత్యామ్నాయ ఆలోచన చేశారు. అందులో భాగంగా ఇటీవల తన అనుచరులతో సమావేశమై చర్చించి చివరకు పార్టీని వీడాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే పార్టీకి ద్రోహం చేస్తున్నారనే కారణంతో నమశ్శివాయంను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని బాధ్యతల నుంచి బహిష్కరిస్తున్నట్లు పాండిచ్చేరి పీసీపీ అధ్యక్షుడు సుబ్రహ్మణియన్ ప్రకటించారు. రాజీనామాలు చేసినా పార్టీ దిగిరాకపోవడంపై వారిద్దరూ అసహనం వ్యక్తం చేశారు. పైగా పార్టీ నుంచి తమను బహిష్కరించడంతో నమశ్శివాయంతోపాటు దీపాయందన్ త్వరలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరిద్దరి రాజీనామాతో కాంగ్రెస్ బలం 12కు చేరింది. ముగ్గురు డీఎంకే సభ్యులు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్‌కు 7 మంది, ఏఐఏడీఎంకేకు నలుగురు సభ్యులు ఉన్నారు. బీజేపీకి చెందిన ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో ఒకరు మృతి చెందడంతో ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. వీరిద్దరి రాజీనామాతో ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వచ్చి ఇబ్బందేం లేదు. కాకపోతే ఇలాంటి అసంతృప్తులు ఇంకా ఉన్నారని.. వారు రాజీనామా చేస్తే మాత్రం ప్రభుత్వం ఇరకాటంలో పడే అవకాశం ఉంది. -
తీరని అవమానం.. గోల్డ్‌మెడల్ నాకొద్దు!
-
తీరని అవమానం.. గోల్డ్‌మెడల్ నాకొద్దు!
పుదుచ్చేరి విశ్వవిద్యాలయంలో బంగారు పతక విజేత రుబీహాకు చేదు అనుభవం ఎందురైంది. 2018 మాస్ కమ్యూనికేషన్ (ఎంఏ) విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన రుబీహా కాన్వొకేషన్ కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ వేదిక నుంచి వెళ్లేంత వరకు తనను తిరిగి హాల్లోకి అనుమతించలేదని రుబీహా ఆరోపించారు. రాష్ట్రపతి విశ్వవిద్యాలయం నుండి బయలుదేరే వరకు దాదాపు 20 నిమిషాలు బయటనే వేచి ఉండాల్సి వచ్చిందని వాపోయారు. స్నాతకోత్సవం ముగిసిన తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి వచ్చినప్పుడు, తను హాలు నుంచి బయటికి (బలవంతం చేయనప్పటికీ) రావాలని కోరారని తెలిపారు. ఇది తనకు తీరని అవమానమని కేరళకు చెందిన రుబీహా కంట తడి పెట్టారు. సీఏఏకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయవచ్చనే అనుమానంతోనే తనను కాన్వొకేషన్ హాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. దీనికి నిరసనగా తన సర్టిఫికెట్‌ను మాత్రమే తీసుకుని, గోల్డ్‌మెడల్‌ను తిరస్కరిస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీకి, సీఏఏకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రతీ ఒక్కరికీ సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దారుణానికి వ్యతిరేకంగా తన బంగారు పతకాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్టు చెప్పారు. దీనిపై విద్యావంతులైన యువతగా తాము బలమైన వైఖరి తీసుకోవాలన్నారు. అయితే ఈ ఆరోపణలను విశ్వవిద్యాలయ అధికారులు ఖండించారు. కాగా, విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ర్యాలీలలో రుబీహా క్రమం తప్పకుండా పాల్గొనేవారని తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో బీజేపీ నాయకుడు తరుణ్ విజయ్ క్యాంపస్ పర్యటనకు వ్యతిరేకంగా ఆమె నిరసనలకు నాయకత్వం వహించినట్టుగా సమాచారం. మరోవైపు బంగారు పతకాలను గెల్చుకున్న ఇతర విద్యార్థులు ఈ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించారట. ఇందులో భాగంగా కొంతమంది కేవలం సర్టిఫికెట్లను మాత్రమే స్వీకరించారు. -
పుదుచ్చేరి మాజీ సీఎం మృతి
పాండిచ్చేరి: డీఎంకే నాయకుడు, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ఆర్వీ జానకిరామన్ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం మృతిచెందినట్ల ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదుసార్లు పుదుచ్చేరి శాసనసభకు ఎన్నికైన జానకీరామన్.. 1996-2000 మధ్య కాలంలో సీఎంగా వ్యవహరించారు. అనంతరం 2001 నుంచి 2006 వరకు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. పుదుచ్చేరి డీఎంకే కన్వీనర్‌గా కూడా పదవులు చేపట్టారు. చివరిగా 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవిచూశారు. ఈ తరువాత ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 1941 జనవరి 8న పుదుచ్చేరిలో జన్మించిన రామన్.. రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్నారు. ఆయన మృతిపట్ల డీఎంకే నేతలు, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
ముఖ్యమంత్రి ఇంటికి బాంబు బెదిరింపు
సాక్షి, చెన్నై : పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి సీఎం ఇంట్లో బాంబులు పెట్టామంటూ పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నారాయణ స్వామి ఇంటిని అడుగడుగున క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనుమానాస్పందంగా ఏమీలేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు ఆకతాయిలు చేసిన బెదిరింపులుగా గుర్తించారు. అంతేకాకుండ ఫోన్ చేసిన ఆకతాయిలను పట్టుకొనేందుకు గాలింపులు చేపట్టారు. -
ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్తత
-
హల్చల్ చేస్తున్న వీడియో!
పాండిచ్చేరిలో బిజీ సెంటర్... అక్కడున్న ఓ మద్యం దుకాణంలోకి ఓ అందమైన అమ్మాయి ఎంటరైంది. ‘బీరు కావాలి?’ అనడిగేసరికి, అందరూ షాక్. డబ్బున్న అమ్మాయిలు కొంతమంది పబ్‌లకెళ్లి, బీరు తాగుతారని తెలుసు కానీ, మరీ ఇలా బహిరంగంగా షాపుకొచ్చి కొనడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకూ ఆ అందమైన అమ్మాయి ఎవరంటే నయనతార. ఇది మళ్లీ షాక్ కదూ. నయనతార ఓ మద్యం దుకాణంలో బీరు కొంటున్న వీడియో యూ ట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. కొంతమంది ఈ వీడియోను పదే పదే చూసి, ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం సంప్రదాయబద్ధంగా ఉండేవాళ్లు మాత్రం ‘హవ్వ. ఎంతకు తెగించింది. మరీ ఇంత విచ్చలవిడితనమా..’ అని నోటికొచ్చినట్లు మాట్లాడుకున్నారు. కానీ, నయనతార మాత్రం హాయిగా నవ్వుకున్నారు. ఎందుకంటే, అసలు విషయం ఏంటో ఆమెకే తెలుసు కనుక. ఇంతకీ ఏంటా విషయం అనుకుంటున్నారా? నయన్ బీరు బాటిల్ కొనడం ఒక నటన. ప్రస్తుతం ‘నానుమ్ రౌడీదాన్’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారామె. ఈ చిత్రంలో నయన్ బీరు సీసా కొనే సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించారు. ఈ సన్నివేశాలను ఎవరో చిత్రీకరించి, ఆ వీడియోను బయటపెట్టారు. ఫలితంగా నలుగరి నోళ్లలోనూ నయన్ నానారు. ఈ నెగటివ్ పబ్లిసిటీ కారణంగా నయన్ అనవసరంగా నిందలకు గురయ్యారు కానీ, ఆ సినిమాకి మాత్రం బోల్డంత పబ్లిసిటీ వచ్చింది. -
ప్రతిష్టాత్మకంగా జలరవాణా పనులు
ప్రతిష్టాత్మకంగా జలరవాణా పనులు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో చేపట్టే అంతర్గత జలరవాణా పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సకాలంలో పూర్తిచేయాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. జాతీయ జలరవాణా సంస్థ చేపట్టే కాల్వల ఆధునీకరణ పనులు వేగంగా జరిగేందుకు ఎంపీలు, అధికారులు సహకరించాలని కోరారు. కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు చేపట్టే జలరవాణా పనులపై కేంద్ర అంతర్గత జలరవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కాకినాడ-పుదుచ్చేరి మధ్య బకింగ్‌హాం కాలువ ద్వారా జలరవాణాను అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించిందని చెప్పారు. కేంద్ర ఉపరితల రవాణాశాఖ సహాయమంత్రి పొన్ను రాధాకృష్ణ మాట్లాడుతూ గడువులోగా ఈ జలమార్గం పనులను పూర్తి చేస్తామన్నారు. తోటలు తగులబెట్టిన వారిని ఉరితీయాలి: కొత్త రాజధాని ప్రాంతంలో తోటలను తగులబెట్టడం దారుణమని, అలాంటి వారిని ఉరి తీయాలని కేంద్రమంత్రి వెంకయ్య వ్యాఖ్యానించారు.ఆదివారం నగరంలో హడ్కో ప్రాం తీయ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. విభజన హామీల గురించి కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తనను రాజీనామా చేయమంటున్నారని మండిపడ్డారు. అలాంటి చిల్లర వ్యక్తుల విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. -
పదకొండేళ్ల తబలా విద్వాంసుడు
ప్రతిభా కిరణం పాండిచ్చేరిలోని ఆరోవిల్‌లో పదకొండేళ్లక్రితం పుట్టిన కేశవ్ తబలా వాద్యకారుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. కేశవ్ రెండు సంవత్సరాల వయసు నుండి తబలా నేర్చుకోవడం మొదలు పెట్టి ఏడు సంవత్సరాల వయసులో న్యూఢిల్లీలోని కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవంలో ప్రదర్శన ఇచ్చాడు. అది అతని మొదటి ప్రదర్శన. ఎలాంటి అవరోధం లేకుండా పూర్తయిన ఆ ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కేశవ్లోని ప్రతిభను మొదటగా గుర్తించింది చిత్రకారిణి అయిన అతని అమ్మమ్మ ప్రఫుల్ల దహనుకర్. మొదటి పాఠాలు అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాడు. తరువాత ప్రజాప్రదర్శలను ఇచ్చే తబలా వాద్యకారుడు గణేశ్ బసవరాజుగారి చేతి కదలికలు నిశితంగా పరిశీలించేవాడు. తరువాత ఇంటికి వచ్చి ఆయన చేతి కదలికలను అనుకరిస్తూ తబలా వాయించేవాడు. కేశవలోని ఆసక్తిని తెలుసుకున్న బసవరాజు తనకు తీరిక దొరికినప్పుడల్లా తబలాలో తర్ఫీదు ఇచ్చాడు. కేశవ్ గిటార్‌ను కూడా అద్భుతంగా ప్లే చేయగలడు. మిగతా పిల్లల్లాగే సైకిల్ తొక్కడం, చెట్లు ఎక్కడం, చందమామ కథలు చదవడం కేశవ్‌కి ఎంతో ఇష్టం. ఈ బుడతడిని ఆదర్శంగా తీసుకుంటే, ఒక పక్క చదువుకుంటూనే నచ్చిన రంగంలోనూ రాణించవచ్చు. -
పది ఫలితాలు విడుదల
చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్రంలో 2013-14 విద్యాసంవత్సరం టెన్త్ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యూరుు. 500కు 499 మార్కులు సాధించడం ద్వారా 19 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రథమర్యాంకు సాధించారు. వీరిలో 18 మంది బాలికలు కాగా ఒక్క బాలుడు ఉన్నారు. 498 మార్కులతో 125 మంది ద్వితీయ స్థానంలో, 497 మార్కులతో 321 మంది తృతీయస్థానంలో ఉత్తీర్ణత సాధించారు. పదోతరగతి పరీక్షలు ఈ మార్చి 26 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు జరిగాయి. తమిళనాడు, పుదుచ్చేరి కలుపుకుని 10,20,749 మంది పరీక్షలు రాశారు. వీరిలో 5,18,639 మంది విద్యార్థులు, 5,2,110 మంది విద్యార్థినులు ఉన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉన్నత విద్యాశాఖ పరీక్షల విభాగం సంచాలకులు దేవరాజన్ ఫలితాలను విడుదల చేశారు. పదోతరగతిలో 90.7 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన ప్రకటించారు. విద్యార్థుల్లో 88 శాతం, విద్యార్థినుల్లో 93.6 శాతం ఉత్తీర్ణత పొందారని ఆయన చెప్పారు. 7,10,010 మంది 60 శాతం పైగా మార్కులతో ఉత్తీర్ణులయ్యూరు. ఉత్తీర్ణత శాతంతోపాటూ ప్రథమశ్రేణిలోనూ బాలికలే పైచేయిగా నిలిచారు. ఒకే ఒక్కడు ప్రథమ ర్యాంకు సాధించిన వరుసలో బాలుడు ఒకే ఒక్కడుగా నిలిచాడు. మిగతా 18 మంది బాలికలే ఉన్నారు. పట్టుకోట్టైకి చెందిన మహేష్లక్కీరు 499 మార్కులుసాధించాడు. మహేష్ తండ్రి సాధారణ రైతు, తల్లి గృహిణి. వీరికి మహేష్ ఒక్కడే సంతానం. తన విజయంపై మహేష్ మాట్లాడుతూ, పదోతరగతిలో రికార్డు ఫలితాలను రాబట్టేందుకు విద్యాసంవత్సరంలో టీవీ చూడలేదు, ఆడుకోలేదు, అందువల్లే తన కలసాకారమైందని అన్నాడు. భవిష్యత్తులో హృద్రోగ వైద్యనిపుణునిగా ఎదగాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. చెన్నై 93.42 శాతం చెన్నై జిల్లా పదోతర గతి ఫలితాల్లో 93.42 శాతాన్ని సాధించింది. 27,601 మంది బాలురు, 28,348 మంది బాలికలు మొత్తం 55,949 మంది పరీక్షలు రాశారు. వీరిలో 52,269 మంది ఉత్తీర్ణులయ్యూరు. గత ఏడాది చెన్నై జిల్లా 94.61 శాతం సాధించగా ఈ ఏడాది 93.42 శాతం మాత్రమే సాధించింది. చెన్నై కార్పొరేషన్ పాఠశాలలు 91 శాతం ఉత్తీర్ణత సాధించాయి. కార్పొరేషన్ పరిధిలో 70 పాఠశాలల నుంచి 3,653 మంది బాలురు, 4,329 మంది బాలికలు పరీక్షలు రాశారు. 87.16 శాతం బాలురు, 93.76 శాతం బాలికలు పాసయ్యారు. చెన్నైలోని ఉన్నత, మహోన్నత విద్యాలయాలు నూరుశాతం ఫలితాలు సాధించాయి. ప్రత్యేక ప్రతిభాశాలి విజయం విజయసాధనలో సాధారణ విద్యార్థులకు ఏమాత్రం తీసిపోనని ఒక ప్రత్యేక ప్రతిభాశాలి (అంధుడు) నిరూపించాడు. అంబత్తూరు సేతుభాస్కర పాఠశాలకు చెదిన రాబిట్సన్ 409 మార్కులతో ఉత్తీర్ణుడయ్యూడు. కూలీ కుమారుడైన రాబిట్సన్ సాధారణ విద్యార్థులతోనే కలసి పదోతరగతి చదువుకున్నాడు. జ్యోతి అనే ఉపాధ్యాయిని ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. ఇదే పాఠశాలకు చెందిన మీనాప్రియ అనే విద్యార్థిని 497 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మూడోస్థానాన్ని పొందారు. -
యోగ విన్యాసిని
వార్థక్యం ఆమె దగ్గరికి రానంటుంది. యవ్వనం ఆమెను వదిలి పోనంటుంది. ఉత్సాహం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఉల్లాసం ఆమెను తన చిరునామాగా చెబుతుంది. తొంభై అయిదేళ్ల వయసులో కూడా శరీరాన్ని విల్లులా వంచుతూ ఆమె చేసే విన్యాసాలకి ప్రపంచమే హ్యాట్సాఫ్ చెబుతోంది. ఆమె పేరును తనలో లిఖించుకోవడం తన అదృష్టమంటూ గిన్నిస్‌బుక్ సైతం గర్వపడుతోంది. ఆమె ఎవరో తెలుసా... తావ్ పోర్షోన్ లించ్. ప్రపంచంలోనే అత్యధిక వయసు గల యోగా టీచర్, డ్యాన్సర్! వయసులో ఉండీ ఏదీ చేయకుండా కాలం గడుపుతుంటారు కొందరు. శక్తి ఉండి కూడా ఏమి చేయాలన్నా బద్దకిస్తుంటారు ఇంకొందరు. అలాంటివాళ్లందరికీ ఓ పాఠం... తావ్ పోర్షోన్ లించ్. న్యూయార్క్‌లో నివసించే 95 యేళ్ల పోర్షోన్కి వయసు ఉడిగిపోవడం, శక్తి తగ్గిపోవడం అంటే ఏమిటో తెలియదు. ఎందుకంటే... ఆమె వయసు తొంభై దాటినా, మనసు మాత్రం ఇరవైల్లోనే ఆగిపోయింది! కళ్లు తెరిచింది ఇక్కడే! పోర్షోన్ని అందరూ అమెరికన్ అంటారు. నిజానికి ఆమె మూలాలు మనదేశంలోనే ఉన్నాయి. భారతీయురాలైన తల్లికి, ఫ్రెంచ్ తండ్రికి 1918, ఆగస్ట్ 13న పాండిచ్చేరిలో పుట్టింది పోర్షోన్. పుడుతూనే పుట్టెడు దుఃఖాన్ని మోసుకొచ్చింది. ఆమెకు జన్మనిస్తూ తల్లి మరణించింది. దాంతో కూతురిని సాకలేనంత విషాదంలో మునిగిపోయాడు తండ్రి. పసిగుడ్డుగా ఉన్న పోర్షోన్ని తన సోదరికి, ఆమె భర్తకి అప్పగించి కెనడా వెళిపోయాడు. దాంతో ఊహ తెలిసేనాటికి తల్లిదండ్రులిద్దరికీ దూరమైంది పోర్షోన్. ఆ బాధ ఆమెను కుంగదీస్తుందనుకున్నారంతా. కానీ లేనివాళ్ల గురించి, కాదనుకున్నవాళ్ల గురించి బాధపడటం కంటే... ఉన్న వాళ్లతో సంతోషంగా ఉండటమే మంచిదనుకుంది పోర్షోన్. ఆంటీ, అంకుల్‌నే అమ్మానాన్నలుగా భావించి, వాళ్ల ప్రోత్సాహంతో భవిష్యత్తును మలచుకుంది. మూడు దేశాల్లో మెరిసింది... ‘‘మీది ఏ దేశం అని ఎవరైనా అడిగితే నేను మూడు దేశాల పేర్లు చెప్పాలి’’ అంటుంది పోర్షోన్ నవ్వుతూ. ఎందుకంటే, ఇండియాలో మొదలైన ఆమె ప్రయాణం... యూకే మీదుగా సాగి ఆమెరికా దగ్గర ఆగింది. ఎనిమిదో యేట పాండిచ్చేరి బీచ్‌లో ఒక వ్యక్తి యోగా నేర్పించడం చూసిన పోర్షోన్కి యోగా పట్ల ఆసక్తి కలిగింది. ఆంటీతో చెబితే ‘అవన్నీ మగాళ్లకి, నీకెందుకు’ అంది. దాంతో రహస్యంగా సాధన చేయసాగింది. అది చూసి మనసు మార్చుకున్న ఆమె ఆంటీ... పోర్షోన్ కోరుకున్నట్టుగా యోగా, భరతనాట్యం నేర్పించింది. పెద్దయ్యాక మోడల్ అవ్వాలనుకుంది పోర్షోన్. కానీ అంతలో రెండో ప్రపంచయుద్ధం మొదలయ్యింది. దేశంలో పరిస్థితులు మారసాగాయి. దాంతో ఆమె కుటుంబం యూకే వెళ్లిపోయింది. అక్కడ మోడల్‌గా బిజీ అయ్యింది. బాల్రూమ్ డ్యాన్స్ కూడా నేర్చుకుని, ప్రదర్శనలిచ్చింది. స్థిరపడ్డాం అనుకునేలోగా వారి కుటుంబం ఉత్తర అమెరికాకి మరలింది. అయితే ఎక్కడికెళ్లినా కొత్త గుర్తింపును తెచ్చుకోవడానికే ప్రయత్నించింది పోర్షోన్. అమెరికా వచ్చాక నటిగా కూడా మారింది. నృత్యప్రదర్శనలు ఇచ్చేది. యోగా టీచర్ కూడా అయ్యింది. వయసు పెరిగేకొద్దీ నటనకు దూరమైంది కానీ యోగా, డ్యాన్స్‌లను వదిలి పెట్టలేదు. పెద్ద పెద్ద సెలెబ్రిటీలు కూడా ఆమె దగ్గర యోగా నేర్చుకున్నారు. ఆమె శిష్యుల్లో బాలీవుడ్ తారలు కూడా ఉన్నారు. దేవానంద్ అయితే ఆమెకి అత్యంత సన్నిహితులు. తాను చనిపోయేవరకూ కూడా పోర్షోన్తో స్నేహాన్ని కొనసాగించారాయన. గిన్నిస్‌బుక్ ఆమెని ‘ఓల్డెస్ట్ యోగా టీచర్ ఆఫ్ ద వరల్డ్’ గా గుర్తించి గౌరవించింది. ఈ వయసులో ఇంత ఓపిక ఎలా వస్తోంది, మీ ఆరోగ్యం రహస్యం ఏమిటి అంటే నవ్వేస్తుంది పోర్షోన్. ‘‘యోగా నా శరీరాన్ని బలపరిస్తే, ధ్యానం నా మనసును బలపర్చింది. శాకాహారం తీసుకుంటాను. ఏదో ఒక పని చేస్తుంటాను. అంతకుమించి ఏం చేయను’’ అంటుంది సింపుల్‌గా. ఆమె ప్రతిభకు, కీర్తికి... ఈ సింప్లిసిటీ మరింత అందాన్ని అద్దుతుంది. హ్యాట్సాఫ్ పోర్షోన్! - సమీర నేలపూడి 1962లో బిల్ లించ్ని పెళ్లాడింది పోర్షోన్. లించ్‌కు వైన్యార్డ్స్ ఉండేవి. ఇద్దరూ కలిసి ‘అమెరికన్ వైన్ సొసైటీ’ అనే సంస్థను స్థాపించారు. తర్వాత అదిఅనేక శాఖలుగా విడిపోయింది. న్యూయార్క్ వైన్ సొసైటీకి 1970లో వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైంది పోర్షోన్. ‘ద బేవెరేజ్ కమ్యునికేటర్’ అనే పత్రికను స్థాపించి విజయవంతంగా నడిపింది. ఇప్పటికీ పలు వైన్ కాంపిటీషన్లకు జడ్జిగా వ్యవహరిస్తుంది. 1982లో లించ్ అనారోగ్యంతో కన్నుమూశారు. పిల్లలు కూడా లేకపోవడంతో... భర్త మరణం తనకు పెద్ద వెలితిని మిగిల్చింది అంటుందామె! -
ఇద్దరు విద్యార్థినులపై పదిమంది అత్యాచారం
సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో ఇద్దరు కళాశాల విద్యార్థినులపై పది మందికి పైగా యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమిళనాడులోని తిరువారూరు జిల్లా సన్నిలం సమీపంలోని సన్నానల్లూరుకు చెందిన ఇద్దరు విద్యార్థినులు స్నేహితులు. వీరిలో ఒక యువతికి పుదుచ్చేరి రాష్ట్రం కారాక్కాల్‌కు చెందిన అధికార పార్టీ నాయకుడు ఒకరిని కొంతకాలంగా ప్రేమిస్తోంది. ఈ క్రమంలో ఆ నేత మంగళవారం ఆమెను కారాక్కాల్‌కు పిలవడంతో ఒక స్నేహితురాలిని వెంట తీసుకుని ఆమె అక్కడకు వెళ్లింది. ఇద్దరినీ అతను ఒక ఇంట్లో ఉంచి బయటకు వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన పదిమందికి పైగా యువకులు ఆ ఇంట్లోకి చొరబడి ఇద్దరు యువతులపై అత్యాచారానికి పాల్పడి పారిపోయారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు మొత్తం 10 మంది నిందితులను అరెస్టు చేశారు.