
సాక్షి, చెన్నై : పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి సీఎం ఇంట్లో బాంబులు పెట్టామంటూ పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నారాయణ స్వామి ఇంటిని అడుగడుగున క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనుమానాస్పందంగా ఏమీలేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు ఆకతాయిలు చేసిన బెదిరింపులుగా గుర్తించారు. అంతేకాకుండ ఫోన్ చేసిన ఆకతాయిలను పట్టుకొనేందుకు గాలింపులు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment