చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్రంలో 2013-14 విద్యాసంవత్సరం టెన్త్ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యూరుు. 500కు 499 మార్కులు సాధించడం ద్వారా 19 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రథమర్యాంకు సాధించారు. వీరిలో 18 మంది బాలికలు కాగా ఒక్క బాలుడు ఉన్నారు. 498 మార్కులతో 125 మంది ద్వితీయ స్థానంలో, 497 మార్కులతో 321 మంది తృతీయస్థానంలో ఉత్తీర్ణత సాధించారు.
పదోతరగతి పరీక్షలు ఈ మార్చి 26 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు జరిగాయి. తమిళనాడు, పుదుచ్చేరి కలుపుకుని 10,20,749 మంది పరీక్షలు రాశారు. వీరిలో 5,18,639 మంది విద్యార్థులు, 5,2,110 మంది విద్యార్థినులు ఉన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉన్నత విద్యాశాఖ పరీక్షల విభాగం సంచాలకులు దేవరాజన్ ఫలితాలను విడుదల చేశారు. పదోతరగతిలో 90.7 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన ప్రకటించారు. విద్యార్థుల్లో 88 శాతం, విద్యార్థినుల్లో 93.6 శాతం ఉత్తీర్ణత పొందారని ఆయన చెప్పారు. 7,10,010 మంది 60 శాతం పైగా మార్కులతో ఉత్తీర్ణులయ్యూరు. ఉత్తీర్ణత శాతంతోపాటూ ప్రథమశ్రేణిలోనూ బాలికలే పైచేయిగా నిలిచారు.
ఒకే ఒక్కడు
ప్రథమ ర్యాంకు సాధించిన వరుసలో బాలుడు ఒకే ఒక్కడుగా నిలిచాడు. మిగతా 18 మంది బాలికలే ఉన్నారు. పట్టుకోట్టైకి చెందిన మహేష్‌లక్కీరు 499 మార్కులుసాధించాడు. మహేష్ తండ్రి సాధారణ రైతు, తల్లి గృహిణి. వీరికి మహేష్ ఒక్కడే సంతానం. తన విజయంపై మహేష్ మాట్లాడుతూ, పదోతరగతిలో రికార్డు ఫలితాలను రాబట్టేందుకు విద్యాసంవత్సరంలో టీవీ చూడలేదు, ఆడుకోలేదు, అందువల్లే తన కలసాకారమైందని అన్నాడు. భవిష్యత్తులో హృద్రోగ వైద్యనిపుణునిగా ఎదగాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు.
చెన్నై 93.42 శాతం
చెన్నై జిల్లా పదోతర గతి ఫలితాల్లో 93.42 శాతాన్ని సాధించింది. 27,601 మంది బాలురు, 28,348 మంది బాలికలు మొత్తం 55,949 మంది పరీక్షలు రాశారు. వీరిలో 52,269 మంది ఉత్తీర్ణులయ్యూరు. గత ఏడాది చెన్నై జిల్లా 94.61 శాతం సాధించగా ఈ ఏడాది 93.42 శాతం మాత్రమే సాధించింది. చెన్నై కార్పొరేషన్ పాఠశాలలు 91 శాతం ఉత్తీర్ణత సాధించాయి. కార్పొరేషన్ పరిధిలో 70 పాఠశాలల నుంచి 3,653 మంది బాలురు, 4,329 మంది బాలికలు పరీక్షలు రాశారు. 87.16 శాతం బాలురు, 93.76 శాతం బాలికలు పాసయ్యారు. చెన్నైలోని ఉన్నత, మహోన్నత విద్యాలయాలు నూరుశాతం ఫలితాలు సాధించాయి.
ప్రత్యేక ప్రతిభాశాలి విజయం
విజయసాధనలో సాధారణ విద్యార్థులకు ఏమాత్రం తీసిపోనని ఒక ప్రత్యేక ప్రతిభాశాలి (అంధుడు) నిరూపించాడు. అంబత్తూరు సేతుభాస్కర పాఠశాలకు చెదిన రాబిట్సన్ 409 మార్కులతో ఉత్తీర్ణుడయ్యూడు. కూలీ కుమారుడైన రాబిట్సన్ సాధారణ విద్యార్థులతోనే కలసి పదోతరగతి చదువుకున్నాడు. జ్యోతి అనే ఉపాధ్యాయిని ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. ఇదే పాఠశాలకు చెందిన మీనాప్రియ అనే విద్యార్థిని 497 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మూడోస్థానాన్ని పొందారు.
పది ఫలితాలు విడుదల
Published Fri, May 23 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM
Advertisement