పుదుచ్చేరి మాజీ సీఎం మృతి | Pondicherry Former CM janakiRaman Died | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరి మాజీ సీఎం కన్నుమూత

Published Mon, Jun 10 2019 10:04 AM | Last Updated on Mon, Jun 10 2019 10:14 AM

Pondicherry Former CM janakiRaman Died - Sakshi

పాండిచ్చేరి:  డీఎంకే నాయకుడు, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ఆర్వీ జానకిరామన్‌ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం మృతిచెందినట్ల ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదుసార్లు పుదుచ్చేరి శాసనసభకు ఎన్నికైన జానకీరామన్‌.. 1996-2000 మధ్య కాలంలో సీఎంగా వ్యవహరించారు.  అనంతరం 2001 నుంచి 2006 వరకు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. పుదుచ్చేరి డీఎంకే కన్వీనర్‌గా కూడా పదవులు చేపట్టారు. చివరిగా 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవిచూశారు. ఈ తరువాత ఎన్నికలకు దూరంగా ఉన్నారు.  1941 జనవరి 8న పుదుచ్చేరిలో జన్మించిన రామన్‌.. రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్నారు. ఆయన మృతిపట్ల డీఎంకే నేతలు, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement