'సోషల్ మీడియాతో ఆ పోలీసులకు తిప్పలు' | police always in trouble with social media news | Sakshi
Sakshi News home page

'సోషల్ మీడియాతో ఆ పోలీసులకు తిప్పలు'

Published Wed, Nov 18 2015 9:21 PM | Last Updated on Mon, Oct 22 2018 6:35 PM

police always in trouble with social media news

అబిడ్స్: నగరం నడిబొడ్డున ఉన్న అబిడ్స్‌లో ఓ ప్రేమజంటపై సినిమా థియేటర్ వద్ద కొంతమంది పోకిరీలు దాడిచేశారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. బుధవారం మధ్యాహ్నం నుంచే వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఈ వార్త సంచలనం రేపింది. కానీ ఏ థియేటర్ వద్ద జరిగిందో, ఎవరిపై జరిగిందో వివరాలు మాత్రం పూర్తిగా లేకపోవడంతో అబిడ్స్ పోలీసులు సైతం తలపట్టుకున్నారు.

అబిడ్స్ ఇన్‌స్పెక్టర్ కె శ్రీనివాస్, అదనపు ఇన్‌స్పెక్టర్ పులి యాదగిరి ఈ సోషల్ మీడియా సంచలన వార్తతో పలు థియేటర్‌ల వద్ద కూడా విచారణ జరిపారు. ఏ థియేటర్ వద్ద ఈ సంఘటన జరగలేదని పలువురు థియేటర్ యాజమానులు పోలీసులకు వివరించడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. అంతేగాక కొన్ని నెలల క్రితం అబిడ్స్ సంతోష్-స్వప్న థియేటర్ వద్ద ఒక ప్రేమజంటపై గుర్తుతెలియని పోకిరీలు దాడిచేసినట్లు సమాచారం. కానీ ఆ సంఘటనపై కూడా నేటి వరకు పోలీసులకు లిఖితపూర్వకంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఇలా సోషల్ మీడియా హాట్ న్యూస్ పోలీసులకే తలనొప్పిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement