ఫేస్‌బుక్ సర్వీసులకు అంతరాయం | Facebook widespread service outage was self-inflicted | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ సర్వీసులకు అంతరాయం

Published Wed, Jan 28 2015 3:08 AM | Last Updated on Mon, Oct 22 2018 6:35 PM

ఫేస్‌బుక్ సర్వీసులకు అంతరాయం - Sakshi

ఫేస్‌బుక్ సర్వీసులకు అంతరాయం

 సియోల్: ప్రపంచవ్యాప్తంగా సామాజిక నెట్‌వర్క్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ వినియోగదారులు మంగళవారం కొద్దిసేపు ఇబ్బందిపడ్డారు. అమెరికా, ఆసియా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో సుమారు 40 నిమిషాలపాటు ఫేస్‌బుక్ వెబ్‌సైట్ సరిగా పనిచేయలేదు. సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ సర్వీసులకు కూడా కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కృషిచేస్తున్నామని తన ట్వీటర్ ఖాతాలో ఇన్‌స్టాగ్రామ్ వెల్లడించగా, ఫేస్‌బుక్ మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఫేస్‌బుక్ సరిగా పనిచేయలేదని ఆసియాలోని కొంతమంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు 125 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌కు 3 కోట్ల మంది వినియోగదారులున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement