కాజల్‌కే కిరీటం | Kajal Aggarwal is the most ‘liked’ tollywood actress on facebook | Sakshi
Sakshi News home page

కాజల్‌కే కిరీటం

Published Sat, May 10 2014 11:46 PM | Last Updated on Mon, Oct 22 2018 6:35 PM

కాజల్‌కే కిరీటం - Sakshi

కాజల్‌కే కిరీటం

 అందానికి అందం కాజల్. అందరూ అభిమానించేది ఈ క్రేజీ భామనే. హీరోయిన్‌గా విజయకేతనం ఎగురవేస్తున్న కాజల్ అగర్వాల్‌ను తాజాగా అరుదైన రికార్డు వరించిం ది. ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటివి ప్రస్తుతం యువతను చాలా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సోషల్ నెట్‌వర్కులు హీరో హీరోయిన్లకు అపార క్రేజ్‌ను తెచ్చి పెడుతున్నాయి. ఆ విధంగా నటి కాజల్ అగర్వాల్ ఇప్పుడు వార్తల్లో కెక్కారు. ఫేస్‌బుక్‌లో అత్యధిక అభిమానులు గల దక్షిణాది నటిగా కాజల్ రికార్డుకెక్కారు. అలాగే మన దేశంలోనే అత్యధికంగా అభిమానులుండే హీరోయిన్లలో ఈమె నాలు గో స్థానంలో నిలిచారు.
 
 ఒకటి, రెండు, మూడు స్థానాల్లో దీపికా పదుకునే, ప్రియాంక చోప్రా, మాధురి దీక్షిత్‌లు అత్యం త అభిమానులు గల హీరోయిన్లుగా నమోదయ్యారని సోషల్ నెట్‌వర్కు ఇటీవల వెల్లడించింది. ఒకప్పుడు కోలీవుడ్‌లో ఐరన్‌లెగ్ ముద్ర వేయిం చుకున్న కాజల్ అగర్వాల్ భరత్ సరసన నటించిన పళని తరువాత కోలీవుడ్‌ను వదిలి టాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు. అక్కడ చందమామ వంటి చిన్న చిత్రాలు విజయానందాన్ని కలిగించినా, కాజల్‌ను స్టార్ హీరోయిన్ చేసిన చిత్రం మాత్రం మగధీరనే. ఆ తరువాత మరికొన్ని విజయాలతో కాజల్ టాప్ హీరోయిన్ అయిపోయారు.
 
 దీంతో ఈ బ్యూటీపై కోలీవుడ్ కన్ను పడింది. విజయ్ సరసన నటించిన తుపాకీ ఈ ముద్దుగుమ్మకు కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అలాగే కార్తీతో నటించిన నాన్ మహన్ అల్ల, సూర్యకు జంటగా మాట్రాన్, ఇటీవల మరోసారి ఇళయదళపతితో రొమాన్స్ చేసిన జిల్లా, చిత్రాలు అభిమానుల ఆదరణకు గురి చేశాయి. దక్షిణాదిలో అత్యధిక అభిమానులు ఇష్టపడే హీరోయిన్‌ని రికార్డు కెక్కిన కాజల్ సంతోషంతో సంబరాలు జరుపుకుంటోందట. ఈ విషయాన్ని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తూ త్వరలోనే ఒక పెద్ద సర్‌ప్రైజ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement