
ఫేస్‌బుక్, వాట్స్‌యాప్‌లే టాప్
న్యూఢిల్లీ: దేశంలో ప్రజలు ఎక్కువగా ఫేస్‌బుక్, వాట్స్‌యాప్ లను వినియోగిస్తున్నారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో ఫేస్‌బుక్, ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్స్‌లో వాట్స్‌యాప్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ విషయం గ్లోబల్ రీసెర్చ్ కన్సల్టెన్సీ సంస్థ టీఎన్‌ఎస్ నివేదికలో వెల్లడైంది. నివేదిక ప్రకారం.. భారత్‌లో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌ను వినియోగిస్తున్న వారిలో 51 శాతం మంది ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్నారు. అలాగే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్స్ వినియోగించే వారిలో 56 శాతం మంది వాట్స్‌యాప్‌ను వినియోగిస్తున్నారు.
భారత్‌లో ఫేస్‌బుక్ వినియోగం 51 శాతంగా నమోదైంది. ఇది థాయ్‌లాండ్‌లో 78 శాతంగా, తైవాన్‌లో 75 శాతంగా, హాంగ్‌కాంగ్‌లో 72 శాతంగా ఉంది. కాగా ఫేస్‌బుక్ వినియోగదారులను కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో, భారత్ రెండో స్థానంలో (12.5 కోట్ల మంది) ఉన్నాయి. అంతర్జాతీయంగా ఫేస్‌బుక్ యూజర్లు 149 కోట్లుగా ఉన్నారు.