
ఫేస్‌బుక్‌తో కోటక్ జిఫీ అకౌంటు
జిఫీ అకౌంటు పేరిట ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా కూడా బ్యాంకు అకౌంట్లను తెరిచే అవకాశం ఇస్తోంది కోటక్ మహీంద్రా బ్యాంక్. ఇందులో మినిమం బ్యాలెన్స్ బాదరబందీ ఉండదు.
జిఫీ అకౌంటు పేరిట ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా కూడా బ్యాంకు అకౌంట్లను తెరిచే అవకాశం ఇస్తోంది కోటక్ మహీంద్రా బ్యాంక్. ఇందులో మినిమం బ్యాలెన్స్ బాదరబందీ ఉండదు. దీనికోసం కోటక్‌జిఫీడాట్‌కామ్‌లో మన ఫేస్‌బుక్ లేదా మెయిల్ అకౌంటును రిజిస్టర్ చేసుకుంటే బ్యాంకు ఇన్విటేషన్ పంపిస్తుంది.
ప్రారంభంలో కనీసం రూ. 5,000తో అకౌంటు ప్రారంభించాలి. ఈ అమౌంటును కూడా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ బ్యాలె న్స్ రూ. 25,000కు మించి ఉంటే అదనపు మొత్తం ఆటోమేటిక్‌గా టర్మ్ డిపాజిట్ కింద మారి, అధిక వడ్డీ తెచ్చిపెడుతుంది. ట్విటర్ అకౌంటు ద్వారా కూడా జిఫి అకౌంటును ఆపరేట్ చేయొచ్చు. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, చెక్ బుక్కుల కోసం దరఖాస్తులు చేసుకోవడం వంటివి చేయొచ్చు.