
ట్విట్టర్‌లో ఖాతా
సినిమా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలాగైతే ఉపయోగించుకుంటూ అభివృద్ధి పథంలో సాగుతుందో అదే టెక్నాలజీతో తారలు
సినిమా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలాగైతే ఉపయోగించుకుంటూ అభివృద్ధి పథంలో సాగుతుందో అదే టెక్నాలజీతో తారలు తమ ప్రచారాన్ని పెంచుకోవడానికి సిద్ధమయ్యారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లాంటి సాధనాలను ఇందుకు వాడుకుంటున్నారు. కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి పవర్‌స్టార్ శ్రీనివాసన్ వరకు ఈ సోషల్ నెట్ వర్క్‌ను వాడుకుంటున్నారు. అయితే నటుడు సూర్యలాంటి కొందరు ఇప్పటి వరకు ట్విట్టర్ల జోలికి పోలేదు. దీంతో వారి పేర్లతో కొన్ని నకిలీ ట్విట్టర్లు వెలసి అసత్య ప్రచారాలను సాగిస్తున్నాయి.
ఈ విషయం వెలుగు చూడడంతో సూర్య ఆ మధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కూడా స్వయంగా ట్విట్టర్‌ను ప్రారంభించడం విశేషం. శనివారం ఆయన సూర్యా ఆఫ్ సూర్య శివకుమార్ పేరుతో ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. కొన్ని నిమిషాల్లోనే 27 వేల మంది అభిమానులు సూర్య ట్విట్టర్‌కు స్వాగతం సూర్య అంటూ ఆహ్వాన వ్యాఖ్యలతో పలకరించడం విశేషం. ఇకపై ఈ ట్విట్టర్‌లో సూర్య తన చిత్రాలకు సంబంధించిన కొత్త విషయాలను, ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను సంతోష పరచనున్నట్టు తెలిపారు.