► కమలంకు జై
► సోషల్ మీడియాల్లో ముందంజ
► వ్యక్తుల్లో స్టాలిన్ హవా
సాక్షి, చెన్నై: సోషల్ మీడియాల్లో కమలం హల్ చల్ చేస్తున్నది. ఆ పార్టీ వెబ్ పేజీలకు లైక్‌లు కొట్టే వారి సంఖ్య పెరిగి ంది. డీఎంకే, అన్నాడీఎంకేల కన్నా, కమలానికి పెద్ద ఎత్తున ఫేస్‌బుక్‌లో ఖాతాలు కల్గిన వాళ్లు జై కొట్టి ఉన్నారు. ఇదే లైక్‌లు ట్విట్టర్లోను సాగింది. ఇక, వ్యక్తుల పరంగా డీఎంకే దళపతి స్టాలిన్ హవా సాగుతున్నది.
టెక్నాలజీ విస్తరించే కొద్ది సరికొత్త సమాచార వ్యవస్థలు పుట్టుకొస్తున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి వాటిని ఉపయోగించే వాళ్లు అధికం అయ్యారు. అదే సమయంలో రాజకీయ పక్షాలు ఈ సోషల్ మీడియాల్ని తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడ్డారు. ఓట్లను రాబట్టేందుకు ఈ సోషల్ మీడియా ప్రచారాలు సైతం వేగవంతం చేసి ఉన్నారు. ఆ దిశగా ఆయా పార్టీలు వెబ్‌సైట్లను, బ్లాగ్, ఫేస్‌బుక్, ట్విటర్లలో ఖాతాల్ని కల్గి ఉన్నాయి. ఇందులో డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకే, తదితర పార్టీలు ఉన్నాయి. ఇక, జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఆయా రాష్ట్ర పార్టీలు సైతం ప్రత్యేకంగా సోషల్ మీడియాల్లో ఖాతాల్ని కల్గి ఉన్నాయి. ఇందులో ఆయా రాష్ట్ర పార్టీలకు చెందిన కార్యక్రమాలు, ఫొటోలు, నేతల సందేశాలు తదితర వివరాల్ని పొందు పరిచి ఉన్నారు. ఆ దిశగా రాష్ట్ర బీజేపీకి, కాంగ్రెస్‌లకు కూడా ఫేస్‌బుక్‌లో పేజీలు ఉన్నాయి.
ఇక, డీఎంకే, అన్నాడీఎంకే, డీఎంకేలు అయితే, రోజు వారి పార్టీల కార్యక్రమాల వివరాలు, నేతల ప్రచారాలు , ప్రకటనలు, రేపటి కార్యక్రమాల వివరాలు తదితర అంశాల్ని తమ తమ సోషల్ మీడియాల్లో పొందు పరుస్తూ వస్తున్నాయి. ఎన్నికల వేళ వీటి ద్వారా ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఆదిశగా లైక్‌లు కొట్టే వాళ్లు పెరిగి ఉన్నారు. ఈ సోషల్ మీడియాల్లో యువతరం అత్యధికమే. అందుకే కాబోలు యువత ప్రధాని మోదీ వైపుగా చూస్తున్నట్టు లైక్‌లు కొట్టిన సంఖ్యలో వారే అధికం. రాష్ట్రంలో కొత్తగా చేరిన యువత ఓటర్ల సంఖ్య కోటిన్నర వరకు ఉండడం గమనించాల్సిన విషయమే.
లైక్ కొట్టు గురూ : రాష్ట్ర బిజేపీ ఫేస్‌బుక్‌కు తొమ్మిది లక్షల 17 వేల 23 మంది లైక్‌లు కొట్టి ఉన్నారు. ఇక, ఆ పార్టీ ట్విటర్ పేజీని ఫాలో అవుతున్న వాళ్లు 34 వేల మంది ఉండడం గమనార్హం. ఇక, రాష్ట్ర పార్టీలు డీఎంకే ఫేస్‌బుక్‌కు లైక్‌లు 32 వేలు మాత్రమే, అన్నాడీఎంకేకు రెండు లక్షల పది వేల 858 మంది. డీఎండీకేకు 16 వేల మంది వరకు, రాష్ర్ట కాంగ్రెస్ ఫేస్‌బుక్‌కు 37 వేల మంది లైక్‌లు కొట్టి ఉన్నారు. ఇక, డీఎంకే ట్విట్టర్ పేజీని 13 వేల మంది, అన్నాడీఎంకే ట్విట్టర్‌ను 19 వేలు, బీజేపీ ట్విట్టర్‌ను 34 వేల మంది ఫాలో అవుతుండడం విశేషం.
ఇక, వ్యక్తుల పరంగా తీసుకుంటే, డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ముందంజలో ఉన్నారు. ఆయన హవా సాగుతూనే ఉన్నది. ఆయన వ్యక్తిగత ఫేస్‌బుక్‌కు కోటి 75 లక్షల 5 వేల 461 మంది లైక్ కొట్టడం విశేషం. తదుపరి స్థానంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఉన్నారు. ఆయన ఫేస్‌బుక్‌కు ఐదు లక్షల 68 వేల 588 మంది, అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ఫెస్‌బుక్‌కు 74 లక్షల 787, డీఎండీకే అధినేత విజయకాంత్ ఫేస్‌బుక్‌కు ఏడు వేల మంది వరకు లైక్‌లు కొట్టి ఉన్నారు.
లైక్ కొట్టు గురూ..
Published Wed, May 11 2016 2:21 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM
Advertisement
Advertisement