వాటికన్ సిటి: మతాధికారులు, గురువులు, ప్రీస్ట్‌లకు కొన్ని పరిమితులు ఉంటాయి. సామాన్యుల మాదిరిగా ప్రవర్తించకూడదు. బంధాలు, బాహ్య సుఖాలకు దూరంగా ఉండాలి. వాంఛలు లేకుండా బతకాలి. అలా కాదని హద్దు దాటితే ఇదిగో ఇలానే విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. తాజాగా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు పోప్ ఫ్రాన్సిస్. ‘మీకిది తగునా.. దీనికి మీ సమాధానం ఏంటి’ అని ప్రశ్నిస్తున్నారు నెటిజనులు. ఇంత ఆగ్రహం దేనికి అంటే పోప్ ఇన్‌స్టాగ్రామ్ అధికారక అకౌంట్ నుంచి.. బికినీ ధరించిన ఓ బ్రేజిలియన్ మోడల్ ఫోటోని లైక్ చేశారు. దాంతో ఈ విమర్శలు. వివరాలు.. మోడల్ నటాలియో గారిబోట్టో గత నెల ఐదో తారీఖున బికినీ ధరించి ఓ స్కూల్ లాకర్ వద్ద నిలబడి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘నేను మీకు ఒకటి, రెండు విషయాలు నేర్పించగలను’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫోటోకి 1.5 మిలియన్లకి పైగా లైక్స్ వచ్చాయి. ఈ ఫోటోని పోప్ ఫ్రాన్సిన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఈ నెల 13న ‘లైక్’ చేసినట్లు ఉంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. అనుహ్యంగా మరుసటి రోజే ‘డిస్‌లైక్’ అని కనిపించింది. దాంతో కాస్త గందరగోళం తలెత్తింది.
ఈ లోపు నటాలియా మానేజ్‌మెంట్ కంపెనీ సీఓవై.కో ఈ విషయాన్ని తన పబ్లిసిటీకి వాడుకోవాలని భావించింది. పోప్ ఫ్రాన్సిస్ లైక్ చేసిన స్క్రీన్ షాట్‌ని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ‘సీఓవై.కోకి పోప్ నుంచి ఆశీర్వాదాలు లభించాయి. మా ఐకానికిక్ క్వీన్ నటాలియాకు ధన్యవాదాలు’ అంటూ స్క్రీన్ షాట్‌ని షేర్ చేసింది. దాంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. అది కాస్తా ముదరడంతో హోలీ సీ ఈ వార్తల్ని ఖండించింది. సిబ్బంది ఎవరో మోడల్ ఫోటోని లైక్ చేసి ఉండవచ్చు. దీని గురించి విచారణ చేస్తున్నాం అని తెలిపారు. వాటికన్ ప్రతినిధి గార్డియన్‌తో మాట్లాడుతూ, "హోలీ సీ నుంచి" లైక్ "వచ్చిందని భావిస్తున్నాం. వివరణ ఇవ్వాల్సిందిగా ఇన్‌స్టాగ్రామ్‌ని కోరాం" అని తెలిపారు. (నన్ను కొరకనంటేనే ముద్దిస్తాను: పోప్)
పోప్ ఫ్రాన్సిస్ సోషల్ మీడియాలో అధిక ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫ్రాన్సిస్కస్‌కు 7.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీనిలో 971 పోస్టులు ఉన్నాయి. వేరే అకౌంట్‌లని ఫాలో అవ్వరు.
Comments
Please login to add a commentAdd a comment